Tuesday, 5 May 2026

Blog

భక్తి

అమ్మవారి ఆలయంలో అపచారం

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ : ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులతో ప్రవేశించారు. అయితే, అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పులతో ఆలయంలోకి ఎలా ప్రవేశించారని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై.. క్లారిటీ

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. ప్లాంటు ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని, కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేశారు. ప్లాంట్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, త్వరలోనే ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.

సినిమా

అఖండ-2 సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @సినిమా : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కొత్త సినిమా ‘అఖండ 2′ విడుదల తేదీని ప్రకటించారు. ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 డిసెంబర్ 5న విడుదలవుతోందని తెలిపారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఇక ఆ కుటుంబాలకు కూడా తల్లికి వందనం అమలు ప్రభుత్వం తాజా నిర్ణయం

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అమ్మ ఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ పథకం అమలు చేసారు. ముందుగానే జాబితా లను ప్రకటించి.. అర్హత ఉండీ, రాని వారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. కాగా.. ఇప్పుడు ఆశా వర్కర్లు… అంగన్ వాడీల్లో పని చేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచన తో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించింది. ఈ మేరకు వివరాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలపై శాసనమండలిలో జరిగిన చర్చలో పథకం అమలు గురించి వివరించారు. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పామని. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించినట్లు వెల్లడించారు. గతంలో వైసీపీ పెట్టిన నిబంధనలనే తాము అమలుచేస్తున్నామని, 300 యూనిట్లు, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధన, భూమి నిబంధనలు వైసీపీ హయాంలోనే విధించారని లోకేష్ గుర్తు చేసారు. అర్హులందరికీ తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కుటుంబాలకు కూడా తల్లికి వందనం పథకం వర్తింపు విషయాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించినట్లు వివరించారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు చేసిన తర్వాత తల్లికి వందనం అందజేస్తామని చెప్పామన్నారు. ఇంటర్ మొదటి ఏడాదిలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తామని చెప్పామని వివరించారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం కూడా నగదు అందజేస్తోంది. రెండింటిని జోడించి నగదు జమచేస్తామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేశామని… ఎవరైనా అర్హులు ఉంటే తల్లికి వందనం తప్పకుండా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్

మహిళల ఆరోగ్యమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు అధ్యక్షతన స్వస్త్ నారీ- స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ క్యాన్సర్ , మరియు క్యాన్సర్ సంబంధిత వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి , వైద్య సేవలు ఉచితంగా చేయుదరని , అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వైద్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి సామాన్యుడికి ఉచితంగా కార్పొరేటడ్ వైద్య సేవలు అందుతుందని , ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం సామాన్యుల దగ్గరికి ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా చేయుచున్నదని , అంగన్వాడి కేంద్రముల ద్వారా పిల్లలకు పౌష్టికాహారము అందించుతున్నదని , గర్భిణీ స్త్రీ గర్భం ధరించి దగ్గర నుండి ఉచితంగా వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తుందని తెలిపినారు. అదేవిధంగా ముసలివారికి పీఎంజేవై పథకం ఉపయోగించుకోవాలని, ఈ వైద్య శిబిరాలు మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం ఇచ్చారన్నారు. క్యాన్సర్ మరియు ఇతర ప్రాణాంతక రోగాలకు సంబంధించిన మందులు సున్నా శాతం కి తగ్గించి ఉపశమనం చేశారన్నారు. అనంతరం అంగనవాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు. పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. ఉచితంగా మందులను ఇచ్చిన అడపా నాగేంద్ర స్వామి, సలాది నేతి కొండకు పెద్దలు అభినందించినారు. ఈ వైద్య శిబిరమునకు హాజరైన అందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించి నరేంద్ర మోడీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపినారు. ఆశ వర్కర్లకు, గ్రామపంచాయతీ శానిటేషన్ వర్కర్లకు ఘనంగా సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సలాది బుచ్చిరాజు, వైస్ ఎంపీపీ అడపా నాగభూషణం, వైద్యాధికారి సౌజన్య, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకటరమణ, రాష్ట్ర బిజెపి నాయకులు చీకురుమల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్య నాయుడు, సొసైటీ అధ్యక్షులు ముద్రగెడ వెంకట సత్య సుబ్బారావు, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మేడిశెట్టి అంజిబాబు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి సత్తిబాబు, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పురం శెట్టి అరుణ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ మేడిశెట్టి రాంబాబు, జనసేన పార్టీ నాయకుడు జినిపే శ్రీనివాసరావు, బిజెపి నాయకులు అడప వీరేశ్వర రావు, ముద్రగెడ రామకృష్ణ, అడప స్వామి, ముద్రగెడ నాగేంద్రప్రసాద్, ముద్రగెడ శ్రీ సీతారామ వెంకట్రావు, సలాది నేతి కొండ, పోతుల వెంకట్రావు ,గ్రామ పెద్దలు, ఆసుపత్రి సిబ్బంది, రామారావు, జయలక్ష్మి, నరేష్, పంచాయతీ కార్యదర్శి బుల్లి వీరన్న ,ముద్రగడ నరసింహారావు , ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,ఇతర వైద్య సిబ్బంది,మహిళలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వైద్య శిబిరములకు తరలివచ్చి వైద్య సేవలు పొందినారు.

ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ తగ్గింపు పేద, మధ్య తరగతి ప్రజలకు వరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుండి గడియార స్తంభం వరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యతరగతి, సామాన్య ప్రజలకు వరంగా అందించిన జీఎస్టీ సదుపాయాలని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి జీఎస్టీ కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. పేద మధ్యతరగతి వర్గాలు ఉదయాన్నే ఉపయోగించే సబ్బు, టూత్ పేస్టు, పలు నిత్యవసర వస్తువులు కూడా జీఎస్టీ లో తగ్గించడం జరిగిందన్నారు. పాలు, పన్నీరు లాంటి మీద పూర్తిగా జీఎస్టీ రద్దు చేయడం జరిగింది. వ్యవసాయం కి సంబంధించి ట్రాక్టర్లు, విడి పరికరాలు, వ్యవసాయ పనిముట్లకు సంబంధించి 18 శాతం ఉన్న జీఎస్టీ ని 5 శాతం కి తీసుకురావడం జరిగింది అలాగే వైద్య రంగంలో క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందులకు జీఎస్టీ పూర్తిగా సున్నా శాతం కి తగ్గించడం చాలా మంచి పరిణామం అన్నారు. జీవిత బీమా, వైద్య బీమా లకు జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది, దీని ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు చాలా వరకు ఆదా అవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు కొనేవారికి 10 నుంచి 13 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని, కారు అనేవారికి సుమారు లక్ష రూపాయల వరకు తగ్గుతుందని, నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారికి సిమెంటు ధరలు తగ్గించడం జరిగింది, ఇలా ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి కూడా లబ్ధి చేరే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అయ్యల భాష, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు, కొప్పనాతి దత్తాత్రేయ, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, ఏఎంసీ డైరెక్టర్ కుడిపూడి సత్యవతి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు రమావర్మ ,అనంతలక్ష్మి,గనిశెటి అరవింద్, ఈబీ స్వామి, కొండేటి జయలక్ష్మి, పావులూరి వెంకట్, సంసాని రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పలు ప్రాంతాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. నక్కవానిపాలెం లక్కీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరుపుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలో పాల్గొన్న మధుర మీనాక్షి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయా అసోసియేషన్ ప్రతినిధులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం చైతన్య నగర్ లోని హిమాయత్ గౌరీ కనకదుర్గ ఆలయంలో పూజలు చేశారు. కే ఆర్ ఎం కాలనీ లో యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించే పూజల్లో, రమా టాకిస్ వద్ద యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్, సీతంపేట వినాయకుని ఆలయం వెనుక సీతంపేట బాయ్స్, దొండపర్తి సంపత్ వినాయక అసోసియేషన్ వద్ద జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయా కమిటీ ప్రతినిధులు వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ని సత్కరించి, ప్రసాదం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్

వీధి వ్యాపారులపై కూటమి సర్కార్ కక్షసాధింపు – వైయస్సార్సీపీ ఆగ్రహం

వీధి వ్యాపారుల జీవనోపాధిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మండిపడ్డారు. జీవీఎంసీ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తోపుడు బండ్లు, బడ్డీలు, చిరు వ్యాపార దుకాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా, వైయస్సార్సీపీ శ్రేణులు వాటిని అధిగమించి జీవీఎంసీ వద్ద ఆందోళన కొనసాగించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ,జీవీఎంసీ అధికారులు గతంలో హాకర్ జోన్లు ఏర్పాటు చేసి ట్రేడ్ లైసెన్సులు, విద్యుత్ మీటర్లు కేటాయించినా, ఇప్పుడు రాజకీయ కక్షలతో షాపులు కూల్చివేస్తున్నారనిమహిళల స్వయం ఉపాధిని దారుణంగా దెబ్బతీస్తున్నారనిమేయర్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు వీధి వ్యాపారులకు క్షమాపణలు చెప్పాలనిబాధితులందరికీ తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిర్ణయం కారణంగా దాదాపు 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కె.కె.రాజు ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు ముద్ర లోన్స్, వైయస్సార్ చేయూత వంటి పథకాల ద్వారా అప్పులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీ ధ్వంసమవ్వడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుకాణాల్లోని ఫ్రిజ్‌లు, గ్రైండర్లు, మిక్సీలు వంటి సామగ్రి కూడా ధ్వంసమైందన్నారుఅంతేకాకుండాఅమరావతిని అభివృద్ధి చేసుకోవడానికే విశాఖ అభివృద్ధిని పణంగా పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో ఇక్కడి భూములను కాజేసి, అమరావతికి తరలించే కుట్ర కూటమి ప్రభుత్వమిదేనని విమర్శించారు. పేదలు స్వయం ఉపాధితో నిలబడటం కూటమి నాయకులు భరించలేరని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళలు, చిరు వ్యాపారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నాం

దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. హోం మంత్రి అనిత. అసెంబ్లీ, శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. దేవీ నవరాత్రులు సందర్భంగా కూటమి మహిళా నేతలు ఎర్ర దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో కలర్ కోడ్ డ్రెస్‌తో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గాయత్రీదేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ కోడ్ దుస్తుల్లో కూటమి పార్టీల మహిళ సభ్యులు సభకు వచ్చారు. నేటి ఉదయం దుర్గమ్మ గుడికి వెళ్లిన కూటమి మహిళా నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం వెళ్లాలనే డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని చెప్పారు. అందరు గాయత్రీ దేవి అలంకారానికి అనుగుణంగా రెడీ శారీస్‌తో వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామన్నారు. దుర్గా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అందరికి హోం మంత్రి అనిత నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

ఉప ముఖ్యమంత్రి ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మంగళవారం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం పవన్ కళ్యాణ్ ని శాలువాతో సత్కరించి,శ్రీకాళహస్తిలోని గుడిమల్లం ఆలయం యొక్క చారిత్రక నేపథ్యం గురించి రూపొందించిన పుస్తకం అందించి ఆలయ విశిష్టత గురించి వివరించి,పురాతన గుడిమల్లం శివాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.