Monday, 4 May 2026

Blog

E-పేపర్

*విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు…. స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*

విజయవాడ, సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి)) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దర్శనం, విజయవాడ ఉత్సవ్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొను నిమిత్తం…. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు…. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ముందుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు… గవర్నర్ ను స్వాగతించారు. ఎమ్మెల్యే రాముతో పాటుగా ఏపీలోని మంత్రులు, ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విమానాశ్రయంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన భద్రత బలగాల నడుమ ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన్న విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

నంద్యాల

5 రోజులుగా కొనసాగుతున్న స్థానిక లారీ ఓనర్స్ & డ్రైవర్స్ సొసైటీ రిలే నిరాహార దీక్షలు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి) డాక్టర్ ఎన్‌టి టి పి ఎస్ బూడిద రవాణా టెండర్ వ్యతిరేకంగా స్థానిక లారీ ఓనర్స్ & డ్రైవర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. సభ్యులు తమ డిమాండ్లు పరిష్కారం జరిగే వరకు పోరాటాన్ని ఆపదని స్పష్టం చేశారు. కాలుష్య బాధలో ఉన్న తమపై బూడిద కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేయించడం అన్యాయం అని చెప్పారు. 12 కోట్ల రూపాయల కాంట్రాక్టును కేటాయించడం దుర్మార్గమని విమర్శించారు. స్థానికులకు లాభం లేకుండా తీసే నిర్ణయాలపై డాక్టర్ ఎన్‌టి టి పి ఎస్ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు.తమ సమస్యపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసెంబ్లీలో ప్రస్తావించినందుకు హర్షం వ్యక్తం చేశారు. లారీ, డ్రైవర్, ఓనర్లు మరియు స్థానిక ప్రజలు తమ పోరాటంలో న్యాయం ఉందని, అవసరమైతే నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

తిరుపతి

జీఎస్టీ సంస్కరణలు పేద-మధ్య తరగతి ప్రజల అభ్యదయానికి శ్రీరామ రక్షా*

*జీఎస్టీ సంస్కరణలు పేద-మధ్య తరగతి ప్రజల అభ్యదయానికి శ్రీరామ రక్షా* *ప్రజారోగ్య రంగంలో 18% నుంచి 0% శాతానికి జీఎస్టీ సంస్కరణలు* *అంగరంగ వైభవంగా మోదీ,నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ* *-కోలా ఆనంద్,సామంచి శ్రీనివాస్,బీజేపీ నేతలు* శ్రీకాళహస్తి,సెప్టెంబర్(పున్నమి ప్రతినిధి): శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాడవాడలా ప్రధాని నరేంద్ర మోదీకీ,ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.మోదీ, నిర్మలా సీతారామన్,చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపి,జీఎస్టీ తగ్గింపు పేదలకు – వరం అని విదేశీవస్తువులు వద్దువద్దు-స్వదేశీవస్తువులు ముద్దుముద్దే అనే నినాదాలుతో ఎన్డీయే కూటమి బీజేపీ,టీడీపీ,జనసేన నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో మారుమ్రోగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో నాలుగు స్లాబ్లుగా ఉన్న 5% 12% 18% 28% వాటిని రెండు స్లాబ్లుగా అంటే పేదల నిత్యవసర సరుకులుపై 0%, 5% 18%గా మరియు పాపం వస్తువులైనా ప్రజలకు హాని కలిగించే పోవ్వకు ఉత్పత్తులపై 40% జీఎస్టీగా సంస్కరణలు ప్రవేశ పెట్టిన నరేంద్ర మోదీ,నిర్మలా సీతారామన్,చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూ కోలా ఆనంద్,సామంచి శ్రీనివాస్ మార్కెట్ వర్తకులు మరియు వినియోగదారులుతో ధన్యవాద తీర్మానాలు చేయడం జరిగినది. తదుపరి తల్లి పేరుతో ఒక చెట్టుముఖ్య అతిథి సామంచి శ్రీనివాస్,కోలా ఆనంద్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్,జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి,టీడీపీ నేతలు మహబూబ్భాషా,పుష్పనాథ్,కొరియర్ రవి,నెల్లూరు సుబ్రమణ్యం,అడపాల శ్రీనివాసులు,నవాబ్,బీజేపీ నాయకులు జాన్ మధుకర్,శ్యాంచంద్ గెహ్లాట్,అన్నపూర్ణమ్మ,రాజా రాయల్,భీమవరం నరేష్తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారము వెండి పై జిఎస్టి ఎత్తివేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిపిఐ ఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద నిరసన తెలియజేయడం జరిగింది పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ* కేంద్ర ప్రభుత్వం 350 పై చీలుకు వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తారని గొప్పలు చెప్తున్నా పెట్రోల్ డీజిల్ గ్యాస్ బంగారం వెండి పై జీఎస్టీ ని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తేనే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయని సిపిఐ ఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ అన్నారు. సెప్టెంబర్ 22 నుండి 350 పై వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తున్నామని సంబరాలు చేసుకుంటున్న బిజెపి నాయకులు హిందువులు ప్రతి పెళ్లిలలో ధనిక పేదలలో కనీసం తులము తో మంగళసూత్రాన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ తులం బంగారం ఒక లక్ష 18 వేల పైన మార్కెట్లో పలుకుతున్నది. జిఎస్టిని 2017లో తెచ్చింది బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల నుండి చిన్న పసి పిల్లల పాల నుంచి మొదలుకుంటే పెద్ద కార్ల వరకు జీఎస్టీ ని విధించి ప్రజలను పీల్చి పిప్పి చేసి రక్తం తాగింది. జీఎస్టీ వచ్చిన తర్వాత చిన్న కంపెనీలు సంస్థలను దేశంలో వేలాది కంపెనీలు మూతపడినవి కంపెనీల్లో పని చేసేవారు పెద్దపెద్ద చదువుకున్న వారు నిరుద్యోగులుగా మారి రోడ్లపైకి వచ్చి లేబర్ అడ్డాలపై రోజు కూలిగా మారినారు. ఈ మూడు నాలుగు సంవత్సరాల లో నిత్యవసర బాగా పెరిగి ప్రజలలో కొనుగోలు శక్తి పడిపోయిందని నిపుణులు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా బీహార్లో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తర్వాత మిగతా అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందాలని ప్రజలతో మెప్పు పొందాలని జీఎస్టీ ని తగ్గిస్తున్నానని గొప్పలు చెబుతున్నారు. జిఎస్టి తెచ్చింది ఎవరు దిన్చేదెవరు ప్రజలు నరేంద్ర మోడీ చేసే పనులు దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు స్వీకరించరు ఆయన అన్నారు పేరుకే జిఎస్టి అని చెప్పి తగ్గిందని చెప్పి వ్యాపారులు మాత్రం ఉన్న స్టాకు అమ్మిన తర్వాతనే కొత్త స్టాక్ వచ్చిన తర్వాతనే జీఎస్టీ వర్తిస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు ధరలు పెరుగుతే మాత్రం అర్ధరాత్రి నుంచే ఉన్న స్టాక్ పై పెంచడానికి అమలు చేస్తారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుల జీవనం చిన్న భిన్నమైనది ప్రజలకు కష్టమొచ్చినప్పుడు వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితులు లేవు పెద్దపెద్ద కార్లకు జీఎస్టీ తగ్గించడం వలన లాభాలని పెత్తందారులకే లాభం చేకూరుస్తుంది కార్పొరేట్ కంపెనీలు దివాలా తీస్తున్న సందర్భాల్లో జీఎస్టీ ని తగ్గిస్తున్నానని వారి మెప్పు కోసమే తగ్గిస్తుంది సామాన్యులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది చదువుకున్న వారికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మాట ఇచ్చి ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తూ ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పజెప్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు గా మారుతున్నారు ఉద్యోగాలకు పని భారం పెంచి 12 గంటలు పనిచేసిన వర్క్ పూర్తి కాకుండా ఉంటుంది అవసరమైతే 15 గంటలు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య పట్టణ కమిటీ నాయకులు వల్దాస్ అంజయ్య దండు గిరి కొత్త లక్ష్మయ్య బురుగు పద్మ తదితరులు పాల్గొన్నారు…

E-పేపర్

పోలవరం – ఏలూరు కాలువ అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలి : యార్లగడ్డ

గన్నవరం : నియోజవర్గం (పున్నమి ప్రతినిధి) పోలవరం కుడికాలువ ను ఏలూరు కాలువతో అనుసంధానానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ పోలవరం కుడి కాలువ నీరు ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్లి తిరిగి ఏలూరు కాలువ ద్వారా బాపులపాడు మండలానికి రావడానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఈ రెండు కాలువలను బాపులపాడు మండలంలో ని అంపాపురం వద్ద అనుసంధానం చేస్తే కాలువ చివరి గ్రామాలకు సాగునీటి కొరత తీరుతుందన్నారు. ఈ అనుసంధానానికి గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.15.60 కోట్ల నిధులు మంజూరు చేసినా వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా బుడమేరు కు 39 చోట్ల గండ్లు పడితే వాటిని పూడ్చేందుకు రూ. 9 కోట్లు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 2008వ సంవత్సరం నున్న గ్రామంలో 3.50 ఎకరాల భూమిని జర్నలిస్ట్ కాలనీ కి కేటాయించగా ఆక్రమణలపాలై ప్రస్తుతం 2.50 ఎకరాలు మాత్రమే ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలనీ లో జర్నలిస్టులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని జర్నలిస్టులకు ఒక సెంటు అదనంగా ఇవ్వాలని గత అసెంబ్లీ సమావేశాల్లో తన కోరగా స్పందించిన మంత్రి పార్థసారథి కమిటీని ఏర్పాటు చేశారని సాధ్యమైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ లో ప్రస్తావిస్తున్న అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు తిరుగు సమాచారం ఇవ్వటం లేదని దీనివల్ల తాము ప్రస్తావించిన అంశాలు ఏ స్టేజిలో ఉన్నాయో తెలుసుకునేందుకు వీలు లేకకుండాపోతుందన్నారు. జీరో వరకు తగిన ప్రాముఖ్యత నివ్వాలని ఎమ్మెల్యే లు లేవనెత్తిన సమస్యలపై అధికారులు సంబంధిత ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చే విధంగా ఆదేశించాలని వెంకట్రావు సభాపతి స్థానంలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ ను కోరారు.

తిరుపతి

నందమూరి బాలకృష్ణ గారితో బొజ్జల సుధీర్ గారు

ఈరోజు విజయవాడలోని అసెంబ్లీలో విరామ సమయంలో మన నందమూరి బాలయ్య తో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు. ఎం సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహమండల సభ్యులు

ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్ ఆనంద్ కలిసి నూతనంగా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించి కొన్ని సమస్యల మీద వినతి పత్రాలను అందజేసిన సమాచారకు జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్ మరియు కమిటీ సభ్యులు*

*జిల్లా కలెక్టర్ ఆనంద్ కలిసి నూతనంగా వచ్చినందుకు శుభాకా అనంతపురం(పున్నమి ప్రతినిధి) అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు హోన్నూరప్ప ఉపాధ్యక్షుడు కోటేగంటి నబి రసూల్ మరియు కమిటీ సభ్యులు నూతనంగా జిల్లాకు వచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించి అనంతరం కలెక్టర్ శాలువాతో సన్మానించడం జరిగినది అనంతపురం జిల్లాలో సమాచార హక్కు చట్టం పైన పనిచేస్తున్న సంఘం ఉండడం చాలా ఆనందంగా ఉందా అని. నెల్లూరు జిల్లాలో ఎటువంటి సంఘాలు లేవు అని కలెక్టర్ తెలియ చేయడం జరిగింది కేరళ రాష్ట్రం అందులోనూ అభివృద్ధి చెందిన మల్లాపురం జిల్లా నుండి మా జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉంది దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లాను కూడా మీ సొంత జిల్లా మాదిరి అభివృద్ధి చేయాలని ఆ వైపుగా మీరు కృషి చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేయడం జరిగింది అందులకు కలెక్టర్ అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అంకె రామలింగమయ్య, బి అనంత కుమారి, హుస్సేన్ పీరా,జాయింట్ సెక్రెటరీ మనోజ్ కుమార్, కల్చరల్ సెక్రెటరీ రషీద్, సింగనమల మండలం కన్వీనర్ రాజ కుల్లాయప్ప మరియు కళ్యాణదుర్గం కన్వీనర్ గోవిందరాజులు పాల్గొనడం జరిగింది

ఆంధ్రప్రదేశ్

వీధి విక్రయదారుల మేలు దిశగా ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం.

అర్హులైన వీధి విక్రయదారుల గుర్తింపుకు జీవీఎంసీ చర్యలు అపోహలు, వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అర్హులైన వీధి విక్రయదారుల గుర్తింపుకు జీవీఎంసీ చర్యలు. అపోహలు, వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దు. – యూ.సీ.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం. సత్యవేణి . విశాఖపట్నం: విశాఖపట్నం నగరపాలక సంస్థ ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పాదచార మార్గాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలోని తాత్కాలిక ఆక్రమణలను తొలగించి ప్రజల రక్షణ, సౌకర్యాలను కల్పించడం ఒక వైపు జరుగుతుండగా, మరోవైపు వీధి విక్రయదారుల సంక్షేమం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేపడుతోందని, జీవీఎంసీ అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి వారికి వ్యాపార అవకాశాలు, జీవనోపాధి ప్రయోజనాలు కల్పించే చర్యలు తీసుకుంటోందని ,ఈ కార్యక్రమంపై ఎటువంటి అపోహలు, వదంతులు, అసత్య ప్రచారం నమ్మవద్దని  యూ.సీ.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం. సత్యవేణి వీధి విక్రయదారులు, ప్రజలకు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్లు ఇప్పటికే జోనల్ కార్యాలయాలలో వీధి విక్రయదారుల కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారన్నారు. ఆపరేషన్ లంగ్స్ ముఖ్య ఉద్దేశ్యం నగర పరిశుభ్రత, రక్షణతో పాటు ప్రజలు, పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించడం, అలాగే వీధి విక్రయదారుల వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆమె తెలిపారు.  ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీధి విక్రయదారుల చట్టం మరియు వీధి విక్రయ విధాన మార్గదర్శకాల్లో అర్హులుగా గుర్తింపు పొందిన వారికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పిస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటికే నగరంలో 21 విక్రయ జోన్లను టౌన్ ప్లానింగ్ శాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదించిందని, అదనంగా మరిన్ని విక్రయ జోన్లను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా ఆక్రమణల తొలగింపు విషయమై ఎటువంటి అపోహలు, వదంతులు, అసత్య ప్రచారం నమ్మవద్దని ప్రజలు, వీధి విక్రయదారులకు ప్రాజెక్ట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వ్యాపారులకు తిరిగి స్టాల్స్ ఏర్పాటుఅసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సమస్య పరిష్కారంచిరు వ్యాపారులకు వెండర్ కార్డులతో వ్యాపారాల పునరుద్ధరణకూటమి ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్‌కు అండగా ఉంటుంది

దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం:నగరంలో తొలగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆపరేషన్ లంగ్స్-2.0 ద్వారా వీధి వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా వెండర్ కార్డులు జారీ చేసి, వ్యాపారాలను చట్టబద్ధంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. చిరు వర్తకులకు వ్యతిరేకం కాని కూటమి ప్రభుత్వం, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్-2014 ప్రకారం వ్యాపారాలకు రక్షణ కల్పిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న పేదల బ్రతుకులు రోడ్డున పడకుండా కాపాడే బాధ్యత తనదేనని ఆయన ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసిన ఆయన, ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. “వీధి వ్యాపారస్తులు ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ఉండాలి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వెండర్ కార్డులు పంపిణీ చేసి వ్యాపారాలను యధావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటాం” అని వంశీకృష్ణ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్.ఎస్.ఎస్. దినోత్సవం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి@ గూడూరు స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి, గూడూరు పట్టణానికి చెందిన GST ప్రాక్టీషనర్ మరియు ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అడ్వకేట్ అయిన కోట సునీల్ కుమార్ పాల్గొని విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని నైతిక విలువలు పెంపొందించుకొని జీవనోపాధికి కావలసిన జ్ఞానాన్ని అర్జించాలని సూచిస్తూ కళాశాల అభివృద్ధికి తన వంతుగా 50వేల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక బాధ్యత, సమాజ సేవ, వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించారని విద్యార్థిని విద్యార్థులు సేవా భావాన్ని పెంపొందించుకుని సమాజంలో ఆదర్శవంతంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, ఎన్.సి.సి. కోఆర్డినేటర్ శ్రీమతి మైమూన్, డాక్టర్ శైలజ, కిరణ్మయి, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, రవి రాజు, గోపాల్, జనార్దన్, శైలజ తదితర అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.