Monday, 4 May 2026

Blog

నాగర్‌కర్నూల్

వైభవంగా రాఘవేంద్ర కాలనీ 2 లలో దేవి శరన్నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణ మాతకు ప్రత్యేక పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 3రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా బుధవారం నాడు నిర్వహించారు. శ్రీ అన్నపూర్ణ దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య వావిరాల లక్ష్మయ్య రేనమ్మ దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యువత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాలనీ మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి బతకమ్మ ఆటలు పాటలు సంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా భక్తీశ్రద్ధలతో చాటారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, పాలమూరు శివ, సాయి తేజ, శ్యామల, శారద, సువర్ణ ,రాధికగౌడ్, కవిత, నాగమణి ,యాదమ్మ, ఇందిరమ్మ, కందికొండ గీత, ఎల్ వేణుగౌడ్, ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు, చిన్నయ్య మహిళలు చిన్నారులు భక్తులు, తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

నారా బ్రాహ్మణి కి స్వాగతం పలికిన బొజ్జల రిషితా రెడ్డి

తిరుపతి పర్యటన నిమిత్తం గురువారం తిరుపతి ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి స్వాగతం పలకడం జరిగింది.అనంతరం శాలువతో సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

కాకినాడ

టిడిఆర్ బాండ్ల కుంభకోణం చేపట్టిన వారిపై చర్యలు చేపట్టాలి *శాసనసభలో ప్రస్తావించిన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు*

గత వైసిపి ప్రభుత్వ పాలనలో కాకినాడ నగరం నందు ప్రభుత్వ భూములపై టిడిఆర్ బాండ్ల మంజూరు చేయించి దోచుకున్న వారిపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు బుధవారం శాసనసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనలో అప్పటి పాలకులు కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములపై టిడిఆర్ బాండ్లు మంజూరు చేయించుకుని కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేశారని, టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి వైసిపి ప్రభుత్వం అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీలు చేయడం జరిగింది తప్ప టిడిఆర్ బాండ్లు మంజూరు చేయించుకున్న వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై విజిలెన్స్ దర్యాప్తు కూడా చేయడం జరిగిందని, కానీ నేటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్న టిడిఆర్ బాండ్ల కుంభకోణం దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ పై అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో నూతనంగా నియమితులైన గ్రామ పాలన అధికారులు మరియు లైసెన్స్ సర్వేలకు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ బాధావత్ సంతోష్ మరియు అదనపు కలెక్టర్ పి అమరేందర్ విధివిధానాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రెవెన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతూ గ్రామస్థాయి నుంచి అవినీతి రహితంగా పని చేయాలని అధికారులకు దిశానియా దేశం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత బాధ్యతను కట్టుబడి విధంగా కొనసాగించాలని వారికి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం వివిధ మండలాల సర్వేలు, గ్రామ పాలనాధికారులు, లైసెన్సుడు సర్వేర్లు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తెను ఆశీర్వదించిన అచ్చిబాబు,యం.ఎల్.ఏ ముప్పిడి.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్24) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు : పాలకొల్లులో జరుగుతున్న నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రాషుగర్స్ జే. ఎమ్.డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెండ్యాల అచ్చిబాబు, కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆయన తో పాటు కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ , సూర్యదేవర రంజిత్ , గెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

సంతు సేవాలాల్ గుడి నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఈరోజు గిరిజన నాయకులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ ఆదేశాలతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంతు సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి మూడు కోట్ల రూపాయలు గుడి నిర్మాణం కోసం మంజు రు చేయించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గుడి నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టర్ గారికి లంబాడి నాయకులు కలవడం జరిగిందీ వారు స్పందిస్తూ వారం రోజుల్లో స్థలం కేటాయిస్తారని చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాన్యా నాయక్ కిషన్ నాయక్ గోవిందు నాయక్ చందులాల్ నాయక్ వాలియా నాయక్ రామచందర్ నాయక్ కృష్ణా నాయక్ పులియ నాయక్ శ్రీను నాయక్ దసరత్ నాయక్ సక్రు గోపాల్ నాయక్ రాముడు నాయక్ రెడ్డి రామ్ నాయక్ హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

దుర్గమ్మకు శివయ్య సారె

విజయవాడలో వెలసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఇ.ఓ బాపిరెడ్డి పాల్గొని దుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.

తిరుపతి

దుర్గమ్మకు శివయ్య సారె*

**విజయవాడలో వెలసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు* *అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*

E-పేపర్

అర్బన్ సచివాలయాల లోనూ.. రీడింగ్ రూమ్స్ కల్పించాలి* లైబ్రరీబకాయిలు పెరగకుండా సెస్ నేరుగా జమయ్యే వికేంద్రీకరణ చేపట్టాలి.. మంత్రి లోకేష్ కు పౌరసంఘం సూచనలు

ఏపి లో ప్రతి భవనం పైన విథించే మునిసిపల్ ఆస్తి పన్ను మీద అదనంగా రేట్ పేయర్ నుండి 8శాతం గ్రంథాలయం పన్ను వసూలు చేయిస్తున్న ప్రభుత్వం వాటిని నేరుగా గ్రంథాలయ సంస్థలకు బదిలీ లేకుండా వహిస్తున్న విధానం వలన గ్రంధాలయాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని పౌర సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఇటీవల మంత్రి లొకేష్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని తెలపడం ముదావహం కాగా గ్రంధాలయం సెస్ నేరుగా జమ చేసే ప్రభుత్వం చర్యలు జరగాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా 3 జిల్లాలుగా వేరయినా గ్రంథాలయం సంస్థ మాత్రం అతి గతి లేకుండా వికేంద్రీకరణ కాలేదన్నారు. కాకినాడ కేంద్ర గ్రంథాలయంతో ఉమ్మడి జిల్లాగా 102 శాఖా గ్రంథాలయాలు 14 గ్రామీణ గ్రంథాలయాలు 145 పుస్తక నిక్షిప్త కేంద్రాలుండగా వసతి సమస్యలతో కాకినాడ శ్రీనగర్‌ శాఖా గ్రంథాలయం జగన్నాథపురం బాలల గ్రంథాలయం మూతపడ్డాయన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థతో బాటుగా జిల్లాలోని పురపాలక సంఘాలు గ్రామ పంచాయితీల నుంచి 50కోట్ల పై మేరకు గ్రంథాలయ బకాయిలున్నా యన్నారు. జిల్లా సంస్థలో 142 ఉద్యోగ ఖాళీలున్నాయ న్నారు. ఔట్‌ సోర్సింగ్‌ అదనపు సిబ్బంది 50 పోస్టులు భర్తీ కాలేదన్నారు . జిల్లా భవనం శిథిలమై అంచనా పనులు రూపొందినా నిథుల లేమితో అభివృద్ది జరగడం లేదన్నారు. గ్రంథాలయం సెస్ ను నేరుగా రేట్ పేయర్ చెల్లించిన వెంటనే జిల్లా గ్రంథాలయ సంస్థ ఖజానా కు జమయ్యే విథానాలు చట్ట పరంగా రూపొందించాలని పార సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు కోరారు. బకాయిలు విడుదల చేయలని కాకినాడ సిటీ లో కూడా సచివాలయం వారీగా రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయించాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రత్యామ్నాయ పంటగా సైలేజ్ మొక్కజొన్న సాగు : ఎడిఎ సత్యవాణి

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం వావిలేరు, పాడేరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి రైతులను ఉద్దేశించి మాట్లతూ, ప్రత్యామ్నాయ పంటగా సైలేజ్ మొక్క జొన్న పంటను సాగు చేసి 75 రోజులలో తక్కువ ఖర్చు తో అధిక ఆదాయము పొందవచ్చునని తెలియజేశారు.దీనికి సంబంధించి జిల్లాలో ట్రూ మీల్ కంపెనీ వారు ఒప్పంద ప్రాతిపదికన రైతుల దగ్గర టన్ను ఒక్కింటికి రూ.2250/- చొప్పున ఇస్తున్నారని, సగటున ఒక ఎకరాకు సాగు ఖర్చు పోను రూ.20000/- నికర ఆదాయము వస్తుందని తెలియచేసారు.కాబట్టి జిల్లాలోని రైతాంగం సైలేజి మొక్కజొన్న సాగుపై దృష్టి సారించాలని ఆమె తెలిపారు. అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా ఎడిఎ నర్సోజి మాట్లాతు అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోతుందని తెలిపారు. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు.ఎఓ హిమ బిందు రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వం పథకాలు రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్సీ కార్డు పొందాలని ఆమె సూచించారు.సైలేజి మొక్కజొన్న సాగుపై సందేహాలు ఉన్నచో విశ్రాంత సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్(9490247908)ను సంప్రదించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నెల్లూరు ఎడిఎ బి. శ్రీదేవి, గ్రామ సర్పంచ్ జి.రాంబాబు విఎఎ సూర్య నారాయణ, హజరత్తయ్య మరియు రైతులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.