Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఓజీ అద్భుతం – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం సంగం శరత్ థియేటర్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అభిమానులతో కలిసి వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందని, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మతి స్థిమితం లేని వ్యక్తిని గంటలోనే కుటుంబానికి చేర్చిన మహారాణిపేట పోలీసులు

విశాఖపట్నం, మహారాణిపేట:మహారాణిపేట పోలీసులు మానవత్వాన్ని చాటారు. మతి స్థిమితం లేని వ్యక్తిని కేవలం ఒక గంటలోనే వెతికి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్ వివరాల ప్రకారం, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన లెక్కల శ్రీనుబాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం మతి స్థిమితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేయకుండానే ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్రమించి కేవలం గంట వ్యవధిలోనే శ్రీనుబాబు ఆచూకీ కనుగొని, సురక్షితంగా వారి కుటుంబానికి చేర్చారు.

ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లి లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎమ్మెల్యేలు సంబంగి చిన వెంకటప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగరావు, రాజాం పార్టీ సమన్వయకర్త తాలే రాజేష్ తదితరులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జిల్లా లోని బలవంతపు భూసేకరణ ఆపాలి

అనకాపల్లి జిల్లాలోని బల వంతపు భూసేకరణ వెంటనే ఆపాలని బుధవారం ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టి రెవెన్యూ మంత్రి అలగాని సత్యప్రసాద్ సి సి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్వవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్ రాష్ట్రఅధ్యక్షులు దడాలసుబ్బారావు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి వ్వవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాద్యాక్షులు డి వెంకన్న తోపాటు సంఘం నాయకులు పాల్గొని వినతిపత్రం సమర్పించడం జరిగింది అనకాపల్లిజిల్లాలోని బల వంతంగా రైతు కూలీలను భయ భ్రాంతులకు గురిచేస్తు దేశ సరి హద్దుల్లో సైన్యాన్ని మొహ రించినట్లు భూసే కరణ చేసి గ్రామాలలో రైతులను కూలీలను ఇళ్ల నుండి బయటకు రానీయ కుండా బంధువులను సైత ఆ,గ్రామాలలోకి రానీయకుండా అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా ప్రవర్తిస్తు.వారికి మద్దతుగా వెళ్లిన నాయకులను సైతం ముందస్తు అరెస్టులు చేస్తూ రైతు,కూలీల మనో ధైర్యాన్ని దెబ్బ తీసి భూములు లాక్కొని బయటకి మాత్రం వారి కోరిక మేరకే భూములు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం బుకాయి స్తుందనీ. తెలిపారు బల వంతంగా భూములను గుంజు కొని పర్యావరణానికి హానిచేసే కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు పెట్ట డానికి,అభివృద్ధి పేరుతో గతంలో పరవాడలో ఫార్మాసిటీ కోసం 3064 ఎకరాలు, అచ్యుతాపురంలో ఎస్ఇజెడ్ కోసం 9,174 ఎకరాలు,రాంబిల్లి, ఎస్.రాయవరంలో ఎన్ఎఒబి కోసం 5,300 ఎకరాలు, మునగపాకలో లాజిస్టిక్ హబ్ కోసం 374 ఎకరాలు, సబ్బవరంలో లామేరియన్ పెట్రోలియం యూనివర్సిటీల కోసం 272 ఎకరాలు తీసుకుని కొన్ని పరిశ్రమలు నిర్మించారని పేర్కొన్నారు ఇంకా వేల ఎకరాలు భూములు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఇక్కడ నిర్మించిన కంపెనీల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో నేటికీ మౌళిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈభూములు చాలవన్నట్లు దేవరాపల్లి మండలం లోని చింతల పూడి సమ్మేద పల్లపు కోడాబు పరివాహక ప్రాంతంలో ఆదాని హైడ్రో పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం 820 ఎకరాలు, ఎస్ఇజెడ్ల కోసం కె.కోటపాడులోని.ఆర్లే చింతపాక గరుగుబల్లి గుల్లేపల్లి ప్రాంతంలోని 1200 ఎకరాలు, బుచ్చయ్య పేట మండలం లోని 1691 ఎకరాల భూములను బలవంతంగా సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. మా భూములు ఇవ్వబోమని, కాలుష్యకరమైన పరిశ్రమలు మా ప్రాంతాల్లోపెట్టొదని.రైతులు,కూలీలు గిరిజనులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా ప్రైవేట్ వ్యక్తుల లాభాలే ద్యేయంగా బలవంతంగా భూ సేకరణ చేయడానికి పూను కుంటుందని,తెలిపారు నక్కపల్లి రాజయ్యపేటలో బల్క్ డ్రంగ్క్ వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని ఈనెల 27 మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం పబ్లిక్ హిరింగ్ జరుపుతున్నారని దీన్ని ప్రజలు పూర్తిగా వ్యతి రేఖిస్తున్నారని అయినప్పటికి బలవంతంగా పబ్లిక్ హిరింగ్ జరుపుతున్నారని దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు 2013 భూ సేకరణ చట్టాన్ని ఎక్కడా అమలు చేయడం లెదన్నారు నిర్వా సితులకు చట్ట ప్రకారం ఎక్కడా పరిహారం, ఫ్యాకేజీ ఇవ్వ లెదన్నారు.భూములు,కోల్పోయిన ఏఒక్కరైతు బిడ్డ కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వ లేదని తెలిపారు పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించ కుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఇస్తున్నారని తెలిపారు ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను, ప్రజలను మోసం చేస్తోందని దుయ్య బట్టారు మా భూములు జోలికి వస్తే ఖబడ్డార్ అని పాల కులకు తెలియ జేయడానికే ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు వెంటనే జిల్లాలోని బలవంతపు భూసేకరణ ఆపాలని వినతి పత్రంలో పేర్కొన్నారు

తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగుల ఓ.పి. ఏ.ఎన్. పి, శానిటేషన్, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక వివిధ రకాల రిజిస్టర్ల నిర్వహణను ఆమె పరిశీలించారు. ఆస్పత్రి సూపరిండెంట్ రవి ప్రకాష్ జిల్లా కలెక్టర్ కు వైద్యాశాల పనితీరును వివరించారు.

నిర్మల్

భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ తనిఖీలు – బంగారు షాపులు మూసేసిన వ్యాపారులు

భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ అధికారులు బంగారు ఆభరణాల దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న ప్రధాన బంగారు మార్కెట్‌లో అకస్మాత్తుగా అధికారులు తనిఖీలు ప్రారంభించడంతో వ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.తనిఖీల్లో భాగంగా బంగారు ఆభరణాల బరువులు, శుద్ధత, బిల్లు విధానం, హాల్‌మార్క్ నిబంధనలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో కొంతమంది దుకాణదారులు అవసరమైన పత్రాలు, బిల్లు రికార్డులు సరిగా లేవని గుర్తించినట్లు సమాచారం.తనిఖీల సమాచారం తెలిసిన వెంటనే పట్టణంలోని పలువురు బంగారు షాపులు తక్షణమే షట్టర్లు పడేసి మూసివేసి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో మార్కెట్‌లో ఒకసారిగా నిశ్శబ్దం నెలకొంది.ప్రజల మాటల్లో, ఈ తనిఖీల వలన నిజాయితీగా వ్యాపారం చేస్తున్న దుకాణదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనప్పటికీ, అక్రమ రీతిలో లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని భావన వ్యక్తమవుతోంది. వాణిజ్య శాఖ అధికారులు మాట్లాడుతూ – వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడమే తమ ముఖ్య ఉద్దేశమని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా వారిపై తగిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

E-పేపర్

బలవంతపు భూసేకరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు.రైతు, కూలీల బ్రతుకుల బుగ్గిపాలు*

*బలవంతపు భూసేకరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు.రైతు, కూలీల బ్రతుకుల బుగ్గిపాలు* విజయవాడ , సెప్టెంబర్ 24, ( పున్నమి ప్రతినిధి) అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ, (అక్విజిషన్)/ సమీకరణ (పూలింగ్) సాగుతున్నది. సాగు భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే అభివృద్ధిగా పాలకులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సేకరించిన భూముల్లో ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత అభివృద్ధి జరిగింది, తదితర వివరాల్ని ప్రభుత్వం బహిరంగపర్చకుండా గుట్టుగా ఉంటున్నది. దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఐ(యం) సహా వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు పదే పదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. అత్యధిక భూములు రియల్ ఎస్టేట్ గానో, మనీ లాండరింగ్కు సాధనంగానో మారిపోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు దీనిని కామధేనులాగా వాడుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తూ అధికారం చేపట్టగానే అదే విధానాలను అమలు చేస్తున్నారు. గతంలో వైసిపి, ప్రస్తుతం టిడిపి కూటమికి ఇందులో తేడా లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వీరికి దన్నుగా ఉంటుధని తెలియజేశారు. బలవంతపు భూసేకరణవల్ల అభివృద్ధి జరక్కపోగా దీనివల్ల లక్షలాది రైతులు, కూలీలు, వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆహారధాన్యాల కొరత రానున్నది. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అనవసరపు భూసేకరణ యత్నాలను విరమించుకోవాలి.

తిరుపతి

మీనాక్షి దేవి గా నల్ల గంగమ్మ అమ్మవారు

శ్రీకాళహస్తిలో ని బహదూర్ పేట నందు గల నల్లగంగమ్మ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారిని మీనాక్షి దేవి గా వెండి ఆభరణాలతో అలంకరించటం భక్తులను ఆకట్టుకుంది.భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది.

తూర్పు గోదావరి

మంత్రి నిమ్మల కుమార్తెను ఆశీర్వదించిన రాష్ట్ర యస్. సి.కమీషన్ చైర్మన్ జవహర్.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్24) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు : పాలకొల్లులో జరిగిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీజ మరియు పవన్ లను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్.

తిరుపతి

మంత్రులకు స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి

తిరుపతి పర్యటన నిమిత్తం బుధవారం తిరుపతి ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ కి స్వాగతం పలికిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.