Monday, 4 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం

సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ఆసియా కప్లో భారత్ మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ శర్మ 75 రన్స్తో మెరిశాడు. హార్దిక్ పాండ్యా 38, శుభ్మన్ గిల్ 29 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్ ఘనవిజయం సాధించి టోర్నీలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

28 రోజులేనా మొబైల్ రీఛార్జ్ అంటే! మిగతా 2-3 రోజులు ఏమైయినాయి!

సెప్టెంబర్ 25 పున్నమి ప్రతినిధి @ ప్రపంచ వ్యాప్తంగా నెల అంటే 30 లేదా 31 రోజులుగా లెక్కిస్తారు. కానీ భారతీయ టెలికాం కంపెనీలు మాత్రం నెలను 28 రోజులు గణన చేస్తూ రీఛార్జీలు, ప్లాన్లను అమలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలలో 2-3 రోజులు తగ్గించడం ద్వారా సంవత్సరానికి 13 రీఛార్జీలు చేయాల్సి వస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. టెలికాం బిల్లింగ్ విధానంపై పారదర్శకత కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిరు వ్యాపారస్తుల ప్రాణాలను కాపాడిన కాంగ్రెస్ నాయకులు

నెల్లూరు నగర రోడ్డుమార్జిన్‌లో చిరు వ్యాపారస్తుడు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో, ప్రాణత్యాగం వరకు వెళ్లే స్థితికి వచ్చిన ఘటనను కాంగ్రెస్ నాయకులు క్షణాల్లో గమనించి, అతని ప్రాణం నిలిపారు. ఈ సమాచారం, తన బాధలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డుమార్జిన్ వ్యాపారస్తులు దళారుల చేతుల్లో నలిగిపోతున్నారని, వారి కుటుంబాలు అత్యంత క్లేశంలో ఉన్నారని తెలిపారు. కమిషనర్ గారు వెంటనే స్పందించి, ముత్తుకూరు గేట్ నుండి అపోలో హాస్పిటల్ వరకు వివిధ షాపులను, పండ్ల బండ్లను పరిశీలించారు. వ్యాపారస్తులకు స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన మద్దతు ఇస్తానని కమిషనర్ స్పష్టంగా హామీ ఇచ్చారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సిరివెళ్ల నరేష్ గారు లిఖితపూర్వకంగా సమస్యలు అందజేశారని, ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, ఓబీసీ రూరల్ ఇంచార్జ్ గిరీష్, గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డ పండుగ అన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) బతుకమ్మ సంబరాలలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రాల్లోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అంతేగాక బతుకమ్మలకు పూజ చేసే ఆడి పాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అత్యంత ప్రధాన్యత ఇచ్చి ఉత్సవాలలో భాగంగా ఆయా జిల్లాలలోని పర్యాటక ప్రాంతాలలో ఒకరోజు బతుకమ్మను ప్రత్యేకంగా నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నాగార్జున్ సాగర్ దగ్గర ఉన్న బుద్దవనంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 21 నుండి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నదని,బుధవారం ఐ సి డి స్, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, హ్యాండ్లూమ్స్ తదితర శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.

తెలంగాణ

పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలన్న: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) చందంపేట మండలం గగిలి పురంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. ఆమె నల్గొండ జిల్లా చందంపేట మండలం గగిలిపురంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. గ్రామానికి 25 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా దాదాపు అన్ని ఇల్లు పూర్తి అయ్యాయని గృహ నిర్మాణ శాఖ పిడి, జిల్లా కలెక్టర్ గారికి వివరించగా, తక్షణమే వాటిని లబ్ధిదారులకు కేటాయించి గృహప్రవేశాలు చేసెలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్

అన్నపూర్ణ అవతారంలో శ్రీ కనకదుర్గ

చోడవరం పాత బస్టాండ్‌లో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాల మూడవ రోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల పండ్లతో అలంకరణ చేసి, ఉదయం నుండి శ్రీ సూక్త సహిత సహస్ర కుంకుమార్చన, పంచామృత అభిషేకం, అన్నపూర్ణాదేవి హోమం నిర్వహించబడింది అని ఆలయ అర్చకులు శివకుమార్ శర్మ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను మోటార్ వర్కర్స్ యూనియన్ ఉత్సవ కమిటీ చూసుకుంది. మండలం ప్రాంతంలోని దామునాపల్లి, మైచర్లపాలెం, లక్ష్మీపురం, వెంకన్నపాలెం సాయిబాబా గుడి పక్కన దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లోనూ, ఇతర గ్రామాల్లోనూ భక్తులు శ్రీ సూక్త విధానంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారని గ్రామ పెద్దలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ జిల్లా నేతలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో విశాఖ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె. రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖ డెయిరీకి రూ.1755 కోట్ల టర్నోవర్ – రూ.8.51 కోట్ల లాభం

విశాఖ డెయిరీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1755 కోట్ల టర్నోవర్‌తో రూ.8.51 కోట్ల నికర లాభాన్ని సాధించినట్టు చైర్మన్ ఎ. ఆనంద్‌కుమార్ ప్రకటించారు. బుధవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం డెయిరీ 19.28 కోట్ల లీటర్ల పాలు, 5.84 కోట్ల కిలోల పెరుగును విక్రయించింది. బిగ్‌బాస్కెట్, వాల్‌మార్ట్, మెట్రో, రిలయన్స్, డి-మార్ట్ తదితర సంస్థలతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డెయిరీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆర్మీకి 31.5 లక్షల లీటర్ల టెట్రా పాక్ పాలను సరఫరా చేశారు. విజయనగరం సోలార్ ప్లాంట్ 17.64 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సరఫరా చేసింది. 3,700 సేకరణ కేంద్రాల ద్వారా 3 లక్షల మంది రైతుల నుండి 28 కోట్ల లీటర్లకు పైగా పాలు సేకరించారు. కొత్త ప్రాజెక్టులు, విస్తరణ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 7 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు లీజుపై తీసుకున్నారు. 45 సొసైటీలకు మౌలిక వసతుల బలోపేతం కోసం NDDB రుణం, గ్రాంట్ మంజూరు చేసింది. కొత్త పశువుల దాణా ప్లాంట్ కోసం రూ.22.74 కోట్లు కేటాయించారు. బ్రాండ్ విజిబిలిటీ కోసం 300 ప్రత్యేక పార్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. 23,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం రూ.3.11 కోట్ల నిధులు 100% గ్రాంట్‌గా మంజూరు చేసింది. 2025-26 అంచనాకొత్త మార్కెట్లు, గ్రామీణ విస్తరణతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.2000 కోట్ల టర్నోవర్, రూ.20 కోట్ల లాభం సాధిస్తామని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్టీ తగ్గింపుఈ నెల 22 నుండి 100 కంటే ఎక్కువ ఉత్పత్తులపై జిఎస్టీ తగ్గింపును అమలు చేసినట్టు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్‌ను కలిసిన వాసుపల్లి గణేష్ కుమార్వైసీపీతో ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం – పంచలోహాల శ్రీవారి విగ్రహం సమర్పణ

వైఎస్ఆర్సీపీతో ఐదేళ్ల రాజకీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి శ్రీవారి పంచలోహాల విగ్రహాన్ని సమర్పించారు. జగన్ నాయకత్వం ప్రజల గుండెల్లో మార్మోగుతుందని, ఆయనతో కలసి చేసిన రాజకీయ ప్రయాణం సంతృప్తినిచ్చిందని వాసుపల్లి అన్నారు. పేద విద్యార్థుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడం దురదృష్టకరమని విమర్శించారు. చిరు వ్యాపారుల కోసం పోరాటం కొనసాగుతుందిచిన్న వ్యాపారులపై అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన బడా బాబులను వదిలేసి హాకర్లను మాత్రమే వేధించడం తగదని వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ వెండర్లకు ప్రత్యేక హాకర్స్ జోన్లు ఏర్పాటు చేసి, నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్

ప్రజల సురక్ష, శాంతి, క్రమశిక్షణ కోసం బార్, వైన్ షాప్ నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలి

బుధవారం (24-09-2025) పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నముషిడివాడ రాజ్యలక్ష్మి కళ్యాణమండపంలో, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బార్ యజమానులు, వైన్ షాప్ నిర్వాహకులతో అవగాహన సమావేశం జరిగింది. ప్రజల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ – 2013 ప్రకారం ప్రతి బార్, వైన్ షాప్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి సక్రమంగా నిర్వహించాల్సిందిగా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ముఖ్య మార్గదర్శకాలు: ప్రవేశద్వారం, కౌంటర్, హాల్స్, బయట ప్రాంగణంలో సీసీటీవీలు తప్పనిసరి. రికార్డింగ్స్‌ను కనీసం 30 రోజులు భద్రపరచాలి. పోలీస్ శాఖ కోరినపుడు రికార్డింగ్స్ తక్షణం అందించాలి. కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో నిరంతరం పర్యవేక్షించాలి. “ప్రజల సురక్ష, శాంతి, క్రమశిక్షణ కోసం బార్, వైన్ షాప్ నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలి. వ్యాపార బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిబద్ధతతో నిర్వర్తించాలి. ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం మనందరి కర్తవ్యం” అని ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.