Monday, 4 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రధాని జన్మదిన సందర్భంగా చేజర్లలో రక్తదానం

సెప్టెంబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75 వ జన్మదినోత్సవం సందర్బంగా చేజర్ల మండలం కేంద్రం నందు చేజర్ల బీజేపీ మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని 75 వ జన్మదినం సందర్భంగా 75 మంది తో రక్తదానం చేయడం జరిగింది.రెడ్ క్రాస్ వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా చేజర్ల మండలంలో 75 మంది రక్తం ఇవ్వడం ఇదే మొదటి సారి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల బీజేపీ ఇంచార్జ్ భరత్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు శివారెడ్డి, సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, కోటేశ్వరెడ్డి, భద్రయ్య పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకోవాలీ

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి భువనగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు బోనగిరి బ్రాహ్మణ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సమితి జిల్లా సంఘం తరఫున తెలియజేయునది ఏమనగా భువనగిరి పట్టణ ప్రజలు దివి 30వ తేదీ మంగళవారం రోజు సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోగలరు అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకోగలరని బోనగిరి పట్టణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కప్పగంతుల నాగరాజ్ శర్మగారు గౌరవాధ్యక్షులు గంగు జగదీశ్వర్ శర్మ గారు నేరెళ్లపల్లి శ్రీనివాస్ శర్మగారు నేరేళ్లపల్లి మనీ శర్మ గారు రామగిరి కోటేశ్వర శర్మ గారు మరియు బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఆకవరం రమేష్ గారు చందుపట్ల విశ్వేశ్వరరావు గారు నిర్ణయించి పండగలు ఈ తేదీల్లోనే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది…

తిరుపతి

శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము

*శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమము* శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 62 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి తొట్టంబేడు మండలం ఉపాధ్యక్షులు తేజ ,లక్ష్మణ్,ప్రదీప్ కుమార్, మనీ, ముని చంద్ర,యాసీన్ భాష, రాజా, నాగరాజు వీర మహిళలు బత్తెమ్మ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి- జంబూ సూర్య నారాయణ

ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నందలూరు ఎంపీడీవో రాధాకృష్ణ మరియు నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణలు పేర్కొన్నారు. బుధవారం స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోని ప్రధాన రహదారులను అధికారులు నాయకులు కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు . అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఇంటి తోపాటు చుట్టుపక్కల పరిశోధన పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోడ్లపైకి మురికినీటిని వదలరాదని చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదనిచెత్త బండ్ల లోనే వేయాలి అన్నారు. పరిశుభ్రత ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్. సచివాలయం టు కార్య దర్శి రమణ కార్మికులు అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్

*మొదటిగా అ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను.*

పెడన్ నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) కృత్తివెన్ను మండలం జడ్పిటిసి గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అంతటి ఘన విజయాన్ని అందించి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,మాజీ మంత్రి వర్యులు జోగి రమేష్ ,జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక , పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నకు మరియు నా సహచర ప్రజాప్రతినిధులకు, నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన క్రమంలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటున్నాను. పదవి అలంకరణ కాదు బాధ్యత తో కూడిన సేవ అని నేను భావిస్తాను ఈ నాలుగు సంవత్సరాలు నా వెన్నంటే ఉన్న నా భర్త మరియు కుటుంబ సభ్యులు , శ్రేయోభిలాషులకు సదా రుణపడి ఉంటాను. ఇట్లు మైల రత్నకుమారి జడ్పిటిసి, కృత్తివెన్ను.

తిరుపతి

దగ్గోలు వేణు రెడ్డి మృతికి నివాళులర్పించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని రెడ్డి(సాయి లతా మెడికల్స్)తమ్ముడు దగ్గోలు వేణు రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.కావున గురువారం శ్రీకాళహస్తి పట్టణం 19వ వార్డు లోని వారి స్వగృహానికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వెళ్లి వేణు రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నివాళులర్పించిన వారిలో గోరా,కంట ఉదయ్ కుమార్,ఫజల్,ముని కృష్ణారెడ్డి,జీవీకే రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉప్పరపల్లిలో ఓజి సినిమా సంబరాలు

సిద్దవటం సెప్టెంబర్ (పున్నమి ) ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల సందర్భంగా సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో గురువారం సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం,కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఓజీ చిత్రం విడుదల సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మహోత్త రమైన వ్యక్తి అని గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలను విడుదల అయ్యే సమయంలో ఎన్నో కుట్రలు,కుతంత్రులు చేశారన్నారు.ఎంతమంది అడ్డు తగిలిన అభిమానాన్ని మాత్రం వేరు చేయలేరని తెలిపారు.ఓజి సినిమా విజయవంతం కావాలని రామయ్య ఆకాంక్షించారు.అవ్వారు రవిశంకర్ మాట్లాడుతూ పార్లమెంటు సమన్వయకర్త కృష్ణ ఆదేశాలతో ఓజి,సినిమా విడుదల సందర్భంగా వేడుకలు వైభవంగా జరిగాయన్నారు.అభిమానుల కోసం మరెన్నో సినీ చిత్రాలు డిప్యూటీ సీఎం నటించాలని స్వచ్ఛందంగా వేడుకల్లో వీర మహిళలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువనేత డేరంగుల శ్రీకాంత్ వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

E-పేపర్

*వృద్ధులకు కొండంత ఆదర్శంగా బీకేఆర్ వృద్ధాశ్రమం*

గన్నవరం, నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25 కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, గన్నవరం పట్టణంలో బస్టాండ్ సమీపంలో రీచ్ ప్రాంగణం నందు బీకేర్ వృద్ధాశ్రమం 3వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి దంపతులు విచ్చేసి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ వృద్ధులే కుటుంబ చారిత్రక ఆనవాళ్లు, వారి సంరక్షణ ఎంతో ముఖ్యం. గత 10 సంవత్సరాల నుండి వృద్ధుల సంరక్షణకు కట్టుబడి, వారికి బాసటగా నిలుస్తూ నేడు సకల హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం 3 వ బ్రాంచ్ ను గన్నవరంలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. వృద్ధాశ్రమంలో కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ వృద్ధుల సేవే పరమావధిగా అకుంఠిత దీక్షతో ఆశ్రమాన్ని 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కానూరి శేషు మాధవి సేవలు ఆదర్శవంతమని అన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ చైర్మన్ కానూరి శేషు మాధవి మాట్లాడుతూ ఆశ్రమంలో వృద్ధులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎల్లపుడూ ఆరోగ్య సేవలు అందుబాటు లో ఉంచుతూ పరిశుభ్రమైన ఆహారం, నీరు, శుభ్రమైన వాతావరణంలో ఇతర సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం కార్యదర్శి శ్రీ సత్య వేద కుమార్ (ఖన్నా) ,సమరసత సేవా సంస్థ అధ్యక్షుడు పాకాల త్రినాథ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదిండ్ల మోహన్, నీటి సంఘాల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ గన్నవరం మండల అధ్యక్షుడు నీలం అశోక్, పోలవరపు అనిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు ఆహ్వానితులకు ఆశ్రమ వైస్ చైర్మన్ బొకినాల అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి

పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరలు పంపిణీ:డా.చంద్రప్ప

శ్రీకాళహస్తి:భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డా.చంద్రప్ప ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని సేవా పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ నగర్ కాలనీ 109వ పోలింగ్ బూత్ నందు మున్సిపల్ పారిశుద్ధ్య మహిళ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా,పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మహిళ ఉచిత బస్ పథకం… ఆర్టీసీ కి పెరిగిన మహిళ ఆదరణ

పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఆగష్టు 15 నుండి ప్రతిష్టత్మాకముగా ప్రవేశ పెట్టిన మహిళ ఉచిత బస్ పథకం వల్ల మహిళలు ఆర్టీసీ బస్ ల పట్ల ఆదరణ కనబరుస్తున్నారాని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు. అందులో ప్రస్తుతం దసరా సెలవులు, విజయవాడ దేవి నవరాత్రులు నేపథ్యంలో మహిళా, భక్తులు ఎక్కువ ఆర్టీసీ బస్ లలో ప్రయాణం చేసెందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.