Monday, 4 May 2026

Blog

తూర్పు గోదావరి

చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్

చంద్రబాబు వి డైవర్షన్ పాలిటిక్స్ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, కులాల, మేరుగ రాజమహేంద్రవరం: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్న మేరుగ నాగార్జున కలిశారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్న , బాబు మీడియాతో మాట్లాడుతూ చంద్ర బాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాల నుకునే కుటుంబాల్లో మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైఎస్ఆర్సిపి నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలకంటే అది . కంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. వీటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్ర బాబు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సిపిలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. వైయస్ జగన్ ఇప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్సిపి నేతలతో పాటు బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చునన్నారు. అసలు మీ గురించి, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారని విమర్శించారు. కనీనం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? ఇది కాదు వరిపా లన… తప్పుదారిలో వెళుతున్నామని మీ నేతలే మాట్లాడుకుంటున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధవడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన జరుగుతుందని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పగ్గాలను కొడుకు చేతిలో పెట్టి నడిపిస్తున్నారని అన్నారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారంటారని, కాని ఈ కేసులో ఎలుక కూడా లేదన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేదని వివరణ ఇచ్చారు. మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుందని నాగర్జున అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్దంగా నడిచిందన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుడు ధైర్యంగా ఉన్నారని, రానున్న రోజుల్లో మద్యం కేసు కూటమి మేము నాయకులకు చెంపపెట్టు కానుందని అన్నారు. ఎకౌంటబులిటీతో పని చేసామని అదే తమకు శ్రీరామరక్ష. అని మేరుగ నాగర్జున స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి

సూపర్ సెక్స్ సూపర్ ఫైన్ రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు విజయోత్సవాలు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు

25-09-2025 తాడేపల్లి. సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్, రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు విజయోత్సవాలు, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు : కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ మాజీ ఎంపీ మార్గాని భరత్. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్. సంక్షేమ పథకాల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో బలవంతపు సంబరాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం అక్రమ అరెస్టులు పేరుతో గొంతునొక్కే ప్రయత్నం ఏడాదిలో 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు కూటమి పాలనలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం శాసనసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ భాష సంస్కారహీనం వైయస్. జగన్ పై ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం కనీస సభా మర్యాద పాటించని బాలకృష్ణ బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ తాడేపల్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ఇవాళ సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తోందని వైయస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తేల్చి చెప్పారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… హామీల అమల్లో వైఫల్యాల పై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏడాది కాలంలో ఏకంగా 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వీటన్నింటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు పవిత్రమైన శాసనసభ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను భరత్ తీవ్రంగా ఖండించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు… కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు సంక్షేమ పథకాలపై అనేక హామీలిచ్చిన కూటమి నేతలు.. వాటి అమల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల పై ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేని ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేస్తూ ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది కాలంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాదాపు 282 అక్రమ కేసులు, 822 మందికి నోటీసీలు జారీ చేయడంతో పాటు 86 మందిని అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ స్ధానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గతంలో పచ్చి బూతులు మాట్లాడారు. గుంటూరులో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. వాక్ స్వాతంత్ర్యం హరించే విధంగా ఆయనపై నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసే వారిపై నమోదు చేసే బీఎన్ ఎస్ 196, 353, 111 / 3,4,5, 143 ఆర్ / 61 / 2 సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. ఇవి ముమ్మాటికీ అక్రమ కేసులు. పూర్తిస్థాయి విచారణ చేయకుండా కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు మెట్టికాయలు వేసినా దాన్ని కూడా బేఖాతరు చేస్తూ.. అర్నష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్, సవీంద్రరెడ్డిపైనా అక్రమ కేసులు నమోదు చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన భరత్ చంద్ర అనే సోషల్ మీడియా యాక్టివిస్టును కూడా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు ఆయన ఆచూకీ చెప్పాలని.. భరత్ చంద్ర సోదరి ప్రీతిని ఆత్మకూరు పోలీసులు పది రోజుల క్రితం నిర్బంధించారు. అంతటితో ఆగకుండా భరత్ తల్లి ఇతర కుటుంబసభ్యుల ఫోన్లను కూడా సీజ్ చేసి ఇబ్బంది పెట్టారు. ఇక రాజమండ్రిలో వర్షం వల్ల ముంపునకు గురైందని పోస్టు పెడితే… సోషల్ మీడియా యాక్టివిస్టు దళిత సామాజిక వర్గానికి చెందిన పులిసాగర్ ను స్టేషన్ కు తీసుకెళ్లి ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతూ .. అర్ధనగ్నంగా సెల్ లో పెట్టారు. వాటిపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే.. కలెక్టర్ ని, డీజీపీని వివరణ ఇమ్మని నోటీసులు ఇచ్చారు. దానికి అత్యంత దారుణంగా రెండు నెలల నుంచి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ..కూటమి పెద్దలు రాక్షసానందం పొందుతున్నారు. బాలకృష్ణది దిగజారుడు భాష అసెంబ్లీ వేదికగా మా నాయకుడు వైయస్.జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. నిండు సభలో జేబులో చేతులు పెట్టుకుని సభామర్యాదలు పాటించకుండా మాట్లాడుతూ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు. సభలో బాలకృష్ణ ఉపయోగించిన భాష అభ్యంతకరం. మీ హావభావాలు, భాష చూస్తుంటే అసెంబ్లీలో వచ్చినప్పుడు కూడా మీకు బ్రీత్ ఎనలైజర్ పెట్టాలేమో అనిపించేలా ఉంది. ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. సాధారణంగా బాలకృష్ణ మాట్లాడే విధానం, ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట తీరుకు మధ్య తేడాచూస్తే మీకే అర్ధం అవుతుంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం- కార్యకర్తల్లా పోలీసులు.. రెడ్ బుక్ పేరుతో గతంలో లోకేష్ చెప్పినదాన్నే ఇప్పుడు అమలు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిస్తే.. వైయస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్న 10 మంది క్రియాశీలక కార్యకర్తల ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లి పార్టీలో చురుగ్గా ఉన్నారు జాగ్రత్త అని కుటుంబ సభ్యులను హెచ్చరిస్తున్నారు. పోలీసులను ఈ రకంగా తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. పది రోజుల క్రితం రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ కు చెందిన రౌడీషీటర్లు పోలీసులను కొట్టిన వీడియో హల్ చల్ చేసింది. ఇంత దారుణంగా రాష్ట్రంలో రౌడీయిజం పేట్రోగిపోతుంది. వీళ్లంతా అధికార పార్టీకి చెందినవాళ్లే. తిరుపతికి చెందిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అమరావతి ముంపునకు గురవుతుందని.. ఫేస్ బుక్ లో షేర్ చేస్తే.. ఆయన్ను సస్పెండ్ చేశారు. నిజంగా వరదతో ముంపునకు గురైంది కాబట్టే.. ఆయన పోస్ట్ చేశారు. ఇటీవల జంగారెడ్డి గూడెంలో కుసుమ కుమారి అనే మహిళా కండక్టర్ … పల్లె వెలుగు బస్సులో ఫ్రీ బస్సు వల్ల 150 మందికి పైగా జనాలతో అత్యంత రద్దీగా ఉంది.. ఊపిరి కూడా ఆడడం లేదు, విధి నిర్వహణ కష్టంగా ఉందని సోషల్ మీడియాలో చెబితే ఆమెను విధుల నుంచి తప్పించారు. ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశా? తాలిబాన్ రాజ్యమా ? ఇంత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడుతున్నారు. మీ అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదు… ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను నేరుగా సైకో అని అత్యంత సంస్కార హీనంగా మాట్లాడాడు. ఆ రోజు లోకేష్ పై మేం ఎన్ని కేసులు పెట్టాలి? కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఇప్పటికే డిజిటల్ బుక్ లాంఛ్ చేశాం. మేం ఎవ్వరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయబోము. అన్యాయానికి గురైన మా కార్యకర్తలు, పార్టీ నేతలు వివరాలు డాక్యుమెంట్ చేసి, డిజిటల్ బుక్ లో అప్ లోడ్ చేస్తాం. ఎన్ని లక్షల కేసులు ఉన్నా.. వాటన్నింటినీ స్క్రూటినీ చేస్తాం. రాబోయే రోజుల్లో జగనన్న 2.0 వచ్చిన తర్వాత వీటన్నింటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు తగిన మూల్యం చెల్లించకతప్పదని మార్గాని భరత్ హెచ్చరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో స్వచ్ఛ ఆంధ్ర- ఏక్ దిన్ ఏక్ గంటా,ఏక్ సాత్ కార్యక్రమం

శ్రీకాళహస్తి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వర్ణముఖి నది,రివర్ వ్యూ నుండి రామసేతువు వంతెన వరకు క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతని,వ్యక్తిగత శుభ్రతతోనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

టైటల్::గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో .

*పున్నమిప్రతినిధిగుడివాడ ప్రతినిధి.సెప్టెంబర్.26* గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంటుమిల్లి రోడ్డు లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల ఐదో రోజు శుక్రవారం శ్రీ గజలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దేవస్థానం ఈఓ కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్టపు చిన్నా తెలియజేశారు. 26వ తేదీ శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో శ్రీ చండీ హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో గోపాలరావు తెలియచేశారు.

ఎలూరు

వైభవంగా దేవి శరన్నవరాత్రులు

వైభవంగా దేవి శరన్నవరాత్రులు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారంఆగిరిపల్లి లోని రుద్రభూమి వద్ద కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక రజక వీధిలో,వేద పాఠశాలలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెం లో వైయస్సార్ సిపి నాయకులు ఈలప్రోలు సుబ్బయ్య, నండూరి భాస్కర్ ప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వట్టిగుడిపాడు లో భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. గోపాల సుందరీ దేవి గా దర్శనమిచ్చినా అమ్మవారు.. చిన్నాగిరి పల్లి గొల్లగూడెం లోని రేణుక క్షేత్రంలోని కృష్ణదుర్గా అమ్మవారు గోపాల సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్రం వ్యవస్థాపకులు వీర కృష్ణ భవాని భక్తులు అందించిన పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించారు.

జనగాం

విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఐటీఐటీఇస్ వృత్తి విద్య పై అవగాహనవిద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఐటీఐటీఇస్ వృత్తి విద్య పై అవగాహన ————————————— జనగామ,

సెప్టెంబరు24,పున్నమి న్యూస్: జనగామ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల అండ్ కళాశాల విద్యార్థులకు ధరణి కమ్యూనికేషన్స్ కేంద్రంలో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. వృత్తివిద్య ఐటిఐటిఇస్. లో భాగంగా ఇంటర్నె షిప్ అవగాహన ఆన్లైన్ సేవలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆధార్ ఇన్కమ్ క్యాస్ట్ వంటి సర్టిఫికెట్లపై ఆన్లైన్లో ఎలా చేయాలనే విధంగా పిల్లలకు అవగాహన వంటి అంశాలపై విద్యార్థులకు పది రోజులపాటు అవగాహన కల్పిస్తున్నామని ఉపాధ్యాయుడు రాములుతెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే సుధీర్ రెడ్డి, ఒకేషనల్ కోఆర్డినేటర్ సాంబశివరావు ఆ కేంద్రం నిర్వాహకుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

పరిశుభ్రత పాటించండి పరిసరాలను శుభ్రంగా ఉంచండి:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్

—————————————– జనగామ, సెప్టెంబరు25,పున్నమి ‌న్యూస్: ఈరోజు జనగామ మండలం శామీర్ పేట గ్రామం స్వచ్ఛత హి సేవ పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ, ర్యాలీ, స్వచ్ఛ రంగోలి, స్వచ్ఛ బతుకమ్మ, “EK DIN,EK GANTA,EK SAATH” శ్రమదానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ జనగామ పింకేష్ కుమార్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ జిల్లా పంచాయతీ అధికారి జనగామ స్వరూప, అడిషనల్ DRDO జనగామ,DC-SBM కరుణాకర్, ఎంపిడిఓ & ఎంపీఓ సంపత్ కుమార్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి జిల్లా కలెక్టర్ స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని. ప్రతి ఒక్కరూ పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పినారు, గ్రామ పంచాయతీ సిబ్బందిని సత్కరించారు. గ్రామ పంచాయతీ మరియు గ్రామ మహిళా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో కలెక్టర్ శాల్వ, బొకే లతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న,జనగామ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చడగొండ కృష్ణ రెడ్డి,గ్రామ సీనియర్ నాయకులు కడ కంచి వీరమల్లు,తాండ్ర రాములు,బత్తుల లక్ష్మీనారాయణ ,గద్ద లక్మణ్, కంసాని భాస్కర్ రెడ్డి,సాదం మధు, సాదం జంపన్న,పత్తి నరేందర్,తాండ్ర ప్రవీణ్, sk బషీర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు,vo లు అబ్జల్ బీ, వహీదా, అంగడి వాడి టీచర్లు,మహిళా కాంగ్రెస్ నేతలు లక్ష్మీ, కౌసల్య,స్వరూప,స్వప్న, స్వర్ణ ,యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,పాషా,రాజు,అరవింద్ గౌడ్,శ్రీను,గ్రామ పంచాయతీ సిబ్బంది,మహిళలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

తిరుపతి

ముక్కంటిని దర్శించుకున్న నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మరియు కుమారుడు దేవాన్ష్

శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మరియు కుమారుడు నారా దేవాన్ష్ విచ్చేశారు.వారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి మరియు బొజ్జల బృందమ్మ ఘన స్వాగతం పలికి రాహుకేతు పూజ ఏర్పాట్లు మరియు దర్శన ఏర్పాట్లు చేయించారు.అనంతరం నారా బ్రాహ్మణి మరియు నారా దేవాన్ష్ కి వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందించడం జరిగింది.

అమరావతి

*ఏపీలో వాహన మిత్ర రూ.15వేలు.. అక్టోబర్ 2వ తేదినే!!*

అమరావతి : పున్నమి ప్రతినిధి ఏపీ రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించేందుకు మొత్తం 3,10,385 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు.ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్ గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

సెప్టెంబర్ 25 పున్నమి ప్రతినిధి @ ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న శ్రీ రాముడి విగ్రహం.. ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు. ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.