Monday, 4 May 2026

Blog

తెలంగాణ

రెవెన్యూ అంశాలపై సమక్ష నిర్వహించిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) రెవెన్యూ సదస్సులు భూ భారత్ లో వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో,రెవిన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అక్టోబర్ 4న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. అసైన్డ్, ఎండోమెంట్స్, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ లు పలు అంశాలపై రెవెన్యూ అధికారులకు, సూచనలు,సలహాలు ఇచ్చారు.

E-పేపర్

యోగ డే జరుపుకుంటున్న తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ హుకుంపేటలో వీడి యుపి స్కూల్లో విద్యార్థులు యోగా డేను జరుపుకున్నారు

తెలంగాణ

సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు!

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జిల్లాలో సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కోసం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకువచ్చింది.దానిలో భాగంగా నల్గొండ జిల్లాకు 4.65 లక్షల సంచులను మండల స్థాయి గోదాములకు పంపించడం జరిగింది. ఇట్టి సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఒకటి చొప్పున ఈ నెల రేషంతో పాటు అందజేయనున్నారు. రేషన్ కార్డు సంచిపై “అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం” అనే నినాదంతో ఇట్టి సంచులు ముద్రి తమైనది.

తెలంగాణ

2025 -27 సంవత్సరానికి సంబంధించి వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు చేసినట్లు తెలిపిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) 2025 – 27 సంవత్సరానికి సంబంధించి వైన్ షాపుల నోటిఫికేషన్ రిజర్వేషన్ కేటాయింపులు లాటరీ ద్వారా పారదర్శకంగా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో నల్గొండ జిల్లాలోని (154) వైన్ షాపులకు లాటరీ ద్వారా కేటాయింపులు నిర్వహించి వాటికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మొత్తం 154 షాపులకు గాను గౌడ వర్గానికి 34, ఎస్సీలకు 14, ఎస్సీ నాలుగు షాపులను లాటరీ ద్వారా కేటాయించి నట్లు కలెక్టర్ తెలిపారు. తగ్గినవి ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో కేటాయించినట్లు వెల్లడించారు.

తిరుపతి

శీతాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతాలాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.వారికి మాజీ దేవస్థానం బోర్డు మెంబర్ పాలమంగళం రవి తదితరులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కంట ఉదయ్ కుమార్,ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె

*తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె :-* పాలేరు గ్రామానికి చెందిన *మిషన్ భగీరథ* కార్మికుడు *చందన బోయిన గాంధీ* ఐదు నెలలుగా *వేతనాలు రాక* తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం రోజున తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రూప,రోజా ఇద్దరు కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తె రూప తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నారు

తూర్పు గోదావరి

సి సి ఆర్ సి కార్డులో ఉన్న కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలి

రాజమహేంద్రవరం, తేదీ: 25.09.2025 *సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలి* *అన్ని రంగాలకు రుణ లక్ష్యాల అమలులో సమన్వయం అవసరం* – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సిసిఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. గురువారం బొమ్మూరు కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (DLCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రుణాలు మంజూరు పై బ్యాంకర్లకు కలెక్టర్ కీర్తి చేకూరి దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. రైతులకి “బ్యాంకులు రుణాల మంజూరులో పాస్‌బుక్‌లలో వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,314 కోట్ల రుణ లక్ష్యం నిర్దేశించగా, జూన్ 30 నాటికి రూ.4,047 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఎంఎస్‌ఎంఈ లకు రూ.4,588 కోట్లలో రూ.2,004 కోట్లు విడుదలయ్యాయనీ, మొత్తం జిల్లాలో అన్ని రంగాలకు రూ.23,930 కోట్ల లక్ష్యం పెట్టగా, ఇప్పటివరకు రూ.8,678 కోట్లు విడుదల చేశారన్నారు. జిల్లాలో 66,584 మంది సిసిఆర్సి కార్డుదారులు ఉండగా, 5,521 మంది కౌలు రైతులకు కేవలం రూ.20 కోట్ల రుణాలు మంజూరు అవ్వడం పై కలెక్టర్ కీర్తి చేకూరి ప్రశ్నించారు. సిసిఆర్సి కార్డులు ఉన్న రైతులకు రుణాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో బ్యాంకర్లు కారణాలు చెప్పాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమన్వయం చేసుకొని తక్షణ పరిష్కారం చూపాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పీఎం-EFME, పీఎం-EGIP, ముద్ర పథకాల ద్వారా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే దిశగా రుణాల లక్ష్యాలను పెంచాలని సూచించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్‌టాప్స్ అమలు, పీఎం విశ్వకర్మ యోజన కింద సాంప్రదాయ వృత్తుల వారికి రుణాలు అందించడం వేగవంతం చేయాలని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సమన్వయ కర్త గా ఎల్టీఎం డివి ప్రసాద్, ఆర్‌బిఐ ఎల్డిఓ బెహరా గిరిధర్, నాబార్డ్ డీడీఎం ఆర్. చక్రధర్, యూనియన్ బ్యాంక్ ఆర్ హెచ్ ఏ విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, పీడీ డిఆర్డిఏ ఎన్ వి వి ఎస్ మూర్తి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ ఈ కె. తిలక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు, బ్యాంకర్లు ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఖమ్మం బిజెపి జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర్ రావు గారు. సెప్టెంబర్ 17 నుండి చేపట్టిన సేవా పక్షంలో బిజెపి కార్యకర్తలు చురుగ్గా పాల్గొని, ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మన ప్రధాని మోదీ గారు మొదలుపెట్టిన స్వదేశీ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని సూచించారు. జిఎస్టి. వస్తు సేవల పన్ను. టాక్స్ 2 స్లాబలు పూర్తిగా రద్దు చేయడంతో పాటు సామాన్యమైన ప్రజలకు నిరుపేదలకు అందరికీ సౌలభ్యమైన విధముగా జీఎస్టీ తగ్గియడంతో ఓన్లీ 2 స్లాబ్స్ 5%,18%, దేశం మొత్తం 28 రాష్ట్రాలకు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే విధమైన Gst స్లాబులను ఏర్పాటు చేయడంతో మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ స్వదేశీ ఉత్పత్తులని వాడాలని సూచించారు.భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

రాజమండ్రిలో మొదలైన ఓజీ తుఫాన్, ఓ జి బ్లాక్ బస్టర్ అంటున్న సత్యనారాయణ (అనుశ్రీ)

రాజమండ్రిలో మొదలైన “ఓజీ”‘ హీట్ చిత్రాన్ని వీక్షించేందుకు తరలి వచ్చిన ప్రముఖులు రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా సందడి రాజమండ్రిలో మొదలైంది. రాత్రి 9 గంటలకే అభిమానులు థియేటర్ల వద్ద కిక్కిరిసిపోయారు. తమ అభిమాన నటుడి చిత్రం విజయవంతం కావాలని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. నుదుటిపై ‘ఓజీ’ పేరు ఉన్న రిబ్బన్లు కట్టుకుని ‘పవర్ స్టార్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందడితో అనుశ్రీ థియేటర్ పరిసరాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను వీక్షించడానికి ప్రముఖులు థియేటర్లకు తరలివచ్చారు. రాజమండ్రిలోని అనుశ్రీ థియేటర్ కు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్తిబాబు. జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీలు, కూటమి ప్రభుత్వ స్టేట్ డైరెక్టర్స్ గంట స్వరూప, ప్రియా సౌజన్య , జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు చల్ల లక్ష్మీ , టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు , టిడిపి నగర నాయకులు ,జనసేన నాయకులు,వీరమహిళలు భారీగా వచ్చారు. అభిమానుల సమక్షంలో సినిమా చూసేందుకు వారు రావడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెరిగింది. అభిమానులకు ఆరాధ్య దైవమైన‌ పవన్ కల్యాణ్ “OG” చిత్రం తూర్పుగోదావరి జిల్లాలోని 144 ధియేటర్లలో రేపు హౌస్ ఫుల్ అయిపోయాయని జనసేన రాజమండ్రి అర్బన్ ఇన్చార్జ్ అత్తి సత్యనారాయణ అన్నారు.వరల్డ్ వైడ్ అన్ని ధియేటర్లు ఫుల్ అయ్యాయన్నారు.చిత్రం నభూతో నా భవిష్యత్తు అన్నట్లు ఉండబోతుందని బుధవారం రాత్రి మీడియా కు చెప్పారు. మూడేళ్ళ నుండి ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూ స్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు,జనసేన నాయకులు,జన సైనికులు, పాల్గొన్నారు. కూటమి నాయకులు టిడిపి నాయకులు బిజెపి నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనుశ్రీ ధియేటర్ వద్ద అభిమానుల‌ సందడి, తీన్మార్ మోత,బాణాసంచా వెలుగులు అభిమానులు పాలాభిషేకాలు అనంతరం కేక్ కటింగ్ చేశారు.

తిరుపతి

అన్నపూర్ణా దేవిగా శ్రీ నల్ల గంగమ్మ అమ్మవారు

శ్రీకాళహస్తి పట్టణం బహదూర్ పేట లో వెలసి ఉన్న శ్రీ నల్లగంగమ్మ దేవాలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ నల్ల గంగమ్మ అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం శ్రీ శ్రీ నల్ల గంగమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంటా రమేష్,ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.