Monday, 4 May 2026

Blog

నాగర్‌కర్నూల్

పాలెం గ్రామంలో చాకలి ఐలమ్మ 130 జయంతి

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26 నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ విప్లవకారిణి ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని కిస్టాపురంలో జన్మించిన ఆమె విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వాముల దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలిచింది. నిజాం పాలనలో ఉన్న భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి కిరంకుశ పాలనపై దండే ఎత్తింది ఆమె పోరాట పటిమ ధీరత్వం తెలంగాణ నేలకు ప్రతికాగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గోవింద శేఖర్ కాశన్న శ్రీనివాసులు యాదగిరి మహేష్ కృష్ణయ్య శ్రీనివాసులు ఖిజర్ డప్పు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

*కుక్క కాటు.. ఈ లక్షణాలు కనిపిస్తే బతకడం కష్టమే!*

పున్నమి ప్రతినిధి కుక్క కాటుతో సంభవించే రేబీస్ వ్యాధి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు (జ్వరం, తలనొప్పి, బలహీనత, నీటిని చూసి భయపడటం) కనిపిస్తే రక్షించడం అసాధ్యమని పేర్కొంటున్నారు. కుక్క కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయాలని సూచిస్తున్నారు. కుక్క గోరు గుచ్చుకున్నా నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఉచిత మరుగుదొడ్లు మూసివేత-భక్తుల ఇబ్బంది

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు గల రాఘవేంద్ర స్వామి దేవాలయం పక్కన ఉన్న ఉచిత మరుగుదొడ్ల వద్ద కరెంటు లేదు,నీళ్లు లేవు అని శుక్రవారం అక్కడ పనిచేయు సిబ్బంది తలుపులు మూసి వేయడం జరిగింది.దీనితో దేవాలయానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా మహిళా భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని వాపోతున్నారు.కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భక్తులకు కరెంటు సౌకర్యం,నీటి సౌకర్యం ఏర్పాటు చేయగలరని హిందూ ధార్మిక మండలి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు కోరారు.

గుంటూరు

శీర్షిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు – డా. మంజుల గుడిమెళ్ళకు గుంటూరులో ఘన సత్కారం!

వివరాలు: గుంటూరులో జరిగిన APBSSS రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డా. మంజుల గుదిమెళ్ళ గారు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డును అందుకున్నారు. విద్యారంగంలో వారు అందించిన విశేష సేవలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం చేసిన కృషి ఈ అవార్డు సాధనకు కారణమయ్యాయి. ఈ సందర్భంగా డా. మంజుల గారు మాట్లాడుతూ – “ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను కలిగించింది. విద్యార్థుల భవిష్యత్‌ కోసం మరింత కృషి చేస్తాను” అని తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యావేత్తలు, అధికారులు, ప్రముఖులు హాజరై డా. మంజుల గారికి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగరంలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమం ఘనంగా సాగింది.

ఖమ్మం

ఖమ్మం to దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కీలక మైలు రాయి గా నిలుస్తుంది. మంత్రి పొంగులేటి.

ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం నాడు సత్తుపల్లి శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగామయి తో కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులని పరిశీలించి న అనంతరం సమావేశం లో మాట్లాడుతూ.. హైవే ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోయే రైతుల బాధను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోంది. రైతుల భూ హక్కులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద హైవే పనులను, ఎంట్రీ–ఎగ్జిట్ ప్రాంతాలను ఎమ్మెల్యేలు మట్టా రాగమయి గారు, రాం దాస్ నాయక్ గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు, NHAI అధికారులు, స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగిందని తెలియజేసారు. భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికే ఇచ్చిన ధరకు అదనంగా రైతుల డిమాండ్‌ ప్రకారం 12 శాతం నష్టపరిహారం చెల్లించాలని NHAI అధికారులను ఆదేశించామని అన్నారు హైవే నిర్మాణంలో ముక్కలుగా మిగిలిన రైతు భూములకు కూడా నష్టపరిహారం అందించేలా చూస్తామన్నారు రైతుల సాగుకు ఇబ్బంది కలగకుండా సర్వీస్ రోడ్లను నిర్మించాలని, అవసరమైన మేర డ్రెయిన్‌లను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని తెలియజేసారు.

అన్నమయ్య

16,347 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు – మెగా డీఎస్సీ ఉత్సవ్‌లో పాల్గొన్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

చిట్వేలి, సెప్టెంబర్: 26 (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అంగరంగ వైభవంగా మెగా డీఎస్సీ ఉత్సవ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ నుండి సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా 7 బస్సులు కేటాయించగా, ప్రజల ఉత్సాహ నినాదాల మధ్య కార్యక్రమం ప్రారంభమైంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,347 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలను అందజేసి, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి, వాగ్దానాన్ని నెరవేర్చారని కూటమి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా పాల్గొని, చిట్వేలు మండలానికి చెందిన పలువురికి నియామక పత్రాలను అందజేశారు. సభా ప్రాంగణం ఆనందోత్సాహాలతో మార్మోగింది

ఆంధ్రప్రదేశ్

ఘనంగా దద్దాల నిషితా పుట్టినరోజు వేడుకలు

కనిగిరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ ఇన్చార్జి దిద్దాల నారాయణ యాదవ్| చిన్న కుమార్తె దద్దాల నిషిత పుట్టిన రోజు వేడుకలు’ ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు దిద్దాల నిషిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని దీవించారు. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని దద్దాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 8 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కనిగిరి మండలం గురువాజీపేట, విశ్వనాథపురం గ్రామాలకు చెందిన కుమ్మరికుంట కొండయ్య, ఎండ్లూరి నవమ్మ, పీసీపల్లి మండలం చింతలపాలెం, పిల్లివారిపల్లి గ్రామాలకు చెందిన మాగులూరి ప్రతాప్, సిద్ధమూర్తి చిన్న తిరుపాలు రెడ్డి, పామూరు మండలం చిలంకూరు, పామూరు టౌన్ కు చెందిన గంధం ప్రేమ్ కుమార్, వంకదారి మనోజ్ కుమార్, వెలిగండ్ల మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన నాగం చిన్న అంజయ్య, సీఎసపురం మండలం డీజీపేటకు చెందిన ఆలూరి చిన్న కొండయ్యలు లబ్దిదారులుగా నిలిచారు. పార్టీనాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు తోడుగా నిలుస్తూ మానవత్వానికి ప్రతీకగా ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ కొనసాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఓకేరెడ్డి, మున్సి పల్ వైస్ చైర్మన్ వులి శాంతి, భువనగిరి వెంకటయ్య, మితికాల గురవయ్య, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, రాచపూడి మాణిక్యరావు, గూడూరి అబ్రహం లింకన్, రామనబోయిన శ్రీనివాసులు, తడికమల్ల వెంకటేశ్వర్లు, దరిశి వెంకటసుబ్రహ్మణ్యం, సిరుపగోవర్ధన్రెడ్డి, గుజ్జుల వెంకటరెడ్డి, తాతపూడి సురేష్, తాతపూడి నాని, మితికాల వెంకట్, ఈర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కు ఘన స్వాగతం

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ ని, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం. పరుశురాంరాజు, సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు మరియు మురళీనగర్, మాధవధార వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు పాసెల సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వెన్నెల సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించి, పుష్పగుచ్చిం ఇచ్చి స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్

దసరా సందర్భంగా ఆపరేషన్ లంగ్స్ ఆక్రమణల తొలగింపులకు తాత్కాలిక విరామం. –జీవిఎంసి చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకర రావు.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: దసరా పండుగ సందర్భంగా ఆపరేషన్ లంగ్స్ 2.0 ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌కు తాత్కాలిక విరామం ఇవ్వడమైనదని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు పత్రికా ప్రకటన ద్వారా గురువారం తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధి దిశగా జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 2.0 కొనసాగుతోందని, అయితే దసరా వేడుకల దృష్ట్యా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆక్రమణదారులు స్వయంగా వారి ఆక్రమణలను తొలగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో పలువురు వ్యాపారులు బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు పాటించకుండా టిఫిన్ సెంటర్లు, ఫుడ్ స్టాల్స్, తినుబండారాలు నడుపుతూ, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నారని, హోటల్స్, రెస్టారెంట్లలో జీవీఎంసీ “షీ” టీమ్స్ ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తూ, ఆహార పదార్థాలలో కార్సినోజెన్స్ ఉన్నట్లు తేలడంతో చట్టపరమైన చర్యలు ప్రారంభించడం జరిగినదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ఇంకా, కొన్నిచోట్ల తొలగించిన ఆక్రమణల వద్ద మరలా వ్యాపారులు ఆక్రమణలను ప్రారంభించినట్లు గుర్తించామని, ఇలాంటి ఆక్రమణలను వెంటనే, స్వచ్ఛందంగా తొలగించాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమం అర్హులైన వీధి విక్రయదారుల జీవనోపాధిని, సంక్షేమాన్ని కాపాడుతూ, వారి ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి, అలాగే నగరంలోని ఫుట్‌పాత్‌లు, రహదారులు, జంక్షన్లను అందంగా, ప్రజలకు మరియు వాహనదారులకు అనుకూలంగా మార్చేందుకు చేపడుతున్నామని తెలిపారు .వెండర్ జోన్లు ఏర్పాటు చేసి, అర్హులైన విక్రయదారులను గుర్తించి, నిర్దేశిత ప్రదేశాల్లో అవసరమైన అనుమతులతో వ్యాపారం చేయడానికి అవకాశం కల్పించబడుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం పొందిన :నల్గొండ జిల్లా

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జల సంరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యం (జల్ సంచాయ్ జౌర్ జన్ బాగేదార్ జె ఎస్ జె బి)విభాగంలో తెలంగాణలోని నల్గొండ,ఆదిలాబాద్, మరియు మంచిర్యాల జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీపడిన జిల్లాల్లో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలే దక్కించుకోగా అందులో నల్గొండ జిల్లా ఈ పురస్కారం క్రింద రెండు కోట్ల రూపాయలు పురస్కారం పొందింది ఈ అద్భుతమైన గుర్తింపు సాధించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని, జిల్లా అధికారులను, ప్రజలను అభినందించారు.జల సంరక్షణలో జిల్లాకు అవార్డు రావడం పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ నల్గొండ జిల్లాకు ఇటువంటి అవార్డు రావడం మొదటి సారి అని ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికి దక్కుతుందని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.