Monday, 4 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు బాలాజీ నగర్‌లో గ్యాస్ పేలుడు – ఇంటికి భారీ నష్టం

నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే పేలుడు కారణంగా ఇంటిలో భారీ నష్టం జరిగింది. గోడలు, ఫర్నిచర్, గృహోపకరణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, 26 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి   : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభ వంగా కొనసాగుతున్నాయి. సమాఖ్య 18వ వార్షికో త్సవాన్ని పురస్కరించుకుని అష్టాదశ శక్తి పీఠాల ను ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో అవతారంలో ప్రత్యేక అలంకరణతో అలంకరించి, విశేష పూజలునిర్వహి స్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజున అమ్మవారిని లక్ష్మీదేవి అలంకారంలో అలంకరిం చారు. ఈ శుభ సందర్భంగా మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రతిరోజు ఉద యం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం భజన కార్యక్రమాలు, దాండియా ఆటపాటలు వంటి సాంస్కృతిక కార్యక్ర మాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాలలో మహిళా మణులు, మాల స్వా ములు, కండువా స్వాములు, బాల స్వాములు వంటి వివిధ వర్గాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ ని అమ్మవారి ఆశీస్సులు పొందు తున్నారు.ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల నిర్వహణను గాంధీ యువజ న సమాఖ్య పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తు న్నారు. భక్తి పారవశ్యంలో రామారెడ్డి మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. ఈ కార్యక్రమంలో గాంధీ సమాఖ్య మండలి సభ్యులు పాల్గొన్నారు

తిరుపతి

MGM హాస్పిటల్ ఆధ్వర్యంలో 3కె రన్

శ్రీకాళహస్తి లోని MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 వ తేదీ సోమవారం ప్రపంచహృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 28 వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు రన్ శ్రీకాళహస్తి రన్ (3కె రన్ )కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ రన్ శ్రీకాళహస్తి రన్ (3కె రన్ ) ఆదివారం ఉదయం 8 గంటలకు MGM హాస్పిటల్స్ ప్రాంగణం నుండి ప్రారంభమై 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగుతుంది.ఈ రన్ శ్రీకాళహస్తి రన్ 3(కె రన్ )లో శ్రీకాళహస్తి ప్రజలు పాల్గొని ప్రజల ఆరోగ్య విషయం పట్ల అవగాహన కల్పించడం లో భాగస్వాములు కావాలని,అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆసుపత్రి వారు కోరారు.

ఖమ్మం

బాల కృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షంచాలి. నల్లమల్ల రంజిత్ డిమాండ్

ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఆంధ్రప్రదేశ్ హిందూ పురం శాసన సభ్యులు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ , కుటుంబ సభ్యుల మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డి గూడెం కి చెందిన బిజ్జల వెంకటేశ్వరెడ్డి 9440838989 సెల్ నెంబర్ తో చేసిన అనుచిత వ్యాఖ్యలు( మెసేజ్ రూపం లో ) ని నిరసిస్తూ వెంకటేశ్వరెడ్డి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తెలుగు యువత నేత నల్లమల్ల రంజిత్ నెత్రుత్వం లో ఖమ్మం రెండవ పట్టణ సి ఐ బాలకృష్ణ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాల్లూరి శ్రీనువాసు చౌదరి, కేటీనేని హరీష్, సతీష్, మధు తారక్, కూచిపూడి జై, కృష్ణ, లక్ష్మణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవాడలోని నోవాటెల్ హోటల్ నందు జనసేన పార్టీ రాష్ ఈ సందర్భంగా ది 27.09.2025 శనివారం నాడు మధ్యాహ్నం 03:00 గం.లకు విజయవాడ, విద్యాధరపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్సీ నాగబాబు ఉదయభాను కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని నాగబాబు తెలిపారు.

E-పేపర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు.

పున్నమి ప్రతినిధి గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. జ్వరం తీవ్రత తగ్గలేదు. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈరోజు (శుక్రవారం) పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారు.

హైదరాబాద్

గ్రూప్ 1 విజేతలకి దసరా కానుక గా నియామక పత్రాలు జారీ చేయనున్నా తెలంగాణ సర్కార్

పున్నమి ప్రతి నిధి సెప్టెంబర్ గ్రూప్ 1 నియామకాల విషయం లో హై కోర్టు క్లియరన్స్ ఇవ్వడం తో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో విజయం సాధించిన అభ్యర్థులకి 27 వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ శిల్పకళ వేదిక లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులకి నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమం కు అన్ని శాఖ ల మంత్రులు హాజరయ్యేలా చుడాలని ఆదేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధార్ గ్యాంగ్! రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు. అయినవిల్లి మండల పరిధిలోని ప్రజలు ఒంటరిగా తిరగవద్దని అర్ధరాత్రుళ్లు తలుపు తడితే తీయవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేయాలని అయినవిల్లి ఎస్ఐఐ హరికోటి శాస్త్రి సూచించారు. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్ కు చెందిన ధార్ గ్యాంగ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిసరాల ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు మండల ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన ఈ థార్ గ్యాంగ్ ఆరుగురు ఉన్న ఒక రాబరీ గ్యాంగ్ ఒకటి మన ఏరియాలలో తిరుగుతున్నారని తెలిపారు. ప్రాదమిక సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ ఇప్పటికి 18/9/2025న రాత్రి నెల్లూరు జిల్లా కావాలి 2 టౌన్ ఏరియాలో ఒక HB హెచ్ బీ,23/9/2025న రాత్రి కాకినాడ జిల్లా పత్తిపాడులో ఒక గోల్డ్ షాప్ దొంగతనము, 24/9/2025 న రాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఒక ఇంట్లో రాబరీ చేశారని ఉదయం రెక్కీ… రాత్రి దొంగతనాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన పేర్కొన్నారు. వీళ్ళు 2024లో మండపేట టౌన్ లో దొంగతనాలు చేయడం జరిగిందన్నారు. ఈ గ్యాంగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో రావులపాలెం,ఆలమూరు, మండపేట. రామచంద్రాపురం అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం ఏరియాలలో దొంగతనాలు చేసే అవకాశం ఉన్నందని తెలిపారు. వీళ్లు తక్కువ రేటు ఉన్న లాడ్జ్ లలో, రిహార్సల్స్ లో ఉంటున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి పూర్తి వివరాలు తీసుకోవాలని తెలిపారు. వీళ్ళు పగలు రక్కి చేసి రాత్రులు నలుగురు లేక ఐదుగురు కలసి రోబరి చేస్తారన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా నేరం చేసే అవకాశం ఉన్నందున అన్నీ లాడ్జ్ / హెూటల్, దాబాల యాజమాన్యం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని తెలిపారు. ఈ గ్యాంగ్ ఉదయం వేళల్లో ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇక అర్ధరాత్రి కాగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడు తున్నారు. అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపై దాడుల్న చేస్తున్నారు. ఆపై ఇళ్లల్లో ఉన్న బంగారం, డబ్బు, ఇతర విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిపోతున్నారని తెలిపారు. ఒక్కో గ్యాంగులో ఐదుగురు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని… వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శాస్త్రి సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం

దీన్ దయల్ ఉపాధ్యాయ కి నివాళులు అర్పించిన కుంజా ధర్మ

పున్నమి ప్రతి నిధి భద్రాచలం, “అంత్యోదయ, ఏకాత్మ మానవవాద సిద్ధాంతాలకు రూపకర్తగా, బీజేపీకి పటిష్ట పునాదులు వేసిన మహానుభావుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా భద్రాచలంలో ఘన నివాళులు అర్పించారు.” ఈ సందర్భంగా భద్రాచలం బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయ్ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అంజలి ఘటించగా, అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ కుంజ ధర్మా మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 25 సెప్టెంబర్ 1916న జన్మించి, చిన్న వయసులోనే అనేక కష్టాలు ఎదుర్కొన్నా విద్యలో ప్రతిభ కనబర్చారు. 1942లో ఆరెస్సెస్‌లో చేరి, 1951లో డాక్టర్ శ్యామప్రసాద్ ముకర్జీతో కలిసి భారతీయ జనసంఘానికి పునాదులు వేశారన్నారు 1967లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, 1968లో తన ప్రాణాలు అర్పించే వరకు దేశసేవలో నిలిచారు.* ఏకాత్మ మానవవాదం అంత్యోదయ ఆయన చూపిన శాశ్వత సిద్ధాంతాలని. అట్టడుగు వర్గాల అభ్యున్నతే ఆయన లక్ష్యమన్నారు నేటి బీజేపీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పథకాలకూ ఇవే ప్రేరణ. యువతకు ఉపాధ్యాయ్ జీవితం స్ఫూర్తిన్నారు బీజేపీకి ఆయన సిద్ధాంతాలు శాశ్వత దారిదీపమని మనమందరం ఆయన త్యాగం, ఆలోచనలను మార్గదర్శకంగా తీసుకొని, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేయాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు చెల్లుబోయిన వెంకన్న, పి. ఉపేందర్, పార్టీ సీనియర్ నాయకులు ములిశెట్టి రాంమోహన్ రావు, దేవరపల్లి వెంకటేశ్వర్లు, అల్లాడ సుబ్బరావు, బిజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి ములిశెట్టి నిఖిల్ నాయకుడు, పాణిపూరి శ్రీనివాస్, టైలర్ శ్రీనివాస్, వాటర్ ఫిల్టర్ రామాచారి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.