Monday, 4 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి లో న్యాయ విజ్ఞాన సదస్సు

శ్రీకాళహస్తి పట్టణం 32 వ వార్డులోని సచివాలయం నందు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో జాగృతి అనే అంశంపై ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ అలాగే టోల్ ప్రీ నెం.15100 న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఉచిత న్యాయం గురించి మరియు బాల్యవివాహాల నిర్మూలన చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగిందని,అదేవిధంగా ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.ప్రజలకు భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చిన ఎవ్వరు ఏ ఇబ్బందులు పడకుండా న్యాయస్థానం ద్వారా ఉచిత న్యాయం పొందే విధంగా అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలియజేసారు.

ఖమ్మం

స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ సత్తా చాటాలి. మాజీ మంత్రి పువ్వాడ

పున్నమి ప్రతినిధి ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. స్థానిక ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ కార్యాలయం లో జరిగిన ఖమ్మం అసెంబ్లీ కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలంటే భయపడుతుందని ఇచ్చిన అబద్దపు హామీలు నెరవేర్చలేక కాలం గడుపుతూ కేసీఆర్ పై నిందలు వేస్తుంది అని దుయ్య బట్టారు. ఖమ్మం నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినవారి లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు లు ఉన్నారు. వారు మాట్లాడుతూ రైతులను యూరియా కోసం చిత్ర హింసలు పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్ ని నిందిస్తున్నారు కాళేశ్వరం కూలిపోయింది అంటూనే కాలేశ్వరం నుండి వచ్చే నీళ్ళకోసం శంకుస్థాపణలు చేస్తున్నారన్నారు రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, నిరుద్యోగ భృతి లేదు, నాలుగు వేల పెంక్షన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు, ఆడపిల్లలకు స్కూటీలు లేవు ఇవ్వన్నీ చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు ప్రజలు మళ్ళీ కేసీఆర్ సియం చేయడానికి ఎదురు చూస్తున్నారన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తగ్గిన సిమెంట్ ధరలు

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్‌పై 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించారు. దీనివల్ల ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర తగ్గింది. బ్రాండ్‌ను బట్టి రూ.290గా ఉన్న బస్తా ఇప్పుడు రూ.260కి, రూ.370గా ఉన్నది రూ.330కి లభిస్తోంది. ఈ తగ్గుదలతో ఇంటి నిర్మాణం ప్రారంభించనున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. వ్యాపారుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ విక్రయం జరుగుతోంది. ధరల తగ్గుదలతో కొనుగోలు ఉత్సాహం పెరిగే అవకాశముంది. పరిశ్రమలో ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

నిర్మల్

హద్గాంలో పంటలు నీటమునిగి నష్టం

హద్గాంలో పంటలు నీటమునిగి నష్టం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హద్గాం గ్రామ శివారులో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో సోయా, పత్తి, వరి పంటలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏవో గిరిరాజ్, ఏఈఓ సంగీత రైతులతో కలిసి పంటలను పరిశీలించి, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో వికాస్ పటేల్, ప్రకాష్ పటేల్, విజయ్, సంజీవ్, ప్రవీణ్, భోజన్న, సంతు, ఇంద్రకాంత్ పటేల్, ప్రశాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్

స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ పై ఏసీబీ కేసు

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని 40 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు 40 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ

కేంద్ర ఎన్నికల కమీషన్ ఇక పై నుంచి కొత్త నిబంధన

పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాకే ఈవీఎంల చివరి రెండోరౌండ్ లెక్కింపు సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) న్యూ ఢిల్లీ : పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. చివరి నుంచి రెండో రౌండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. నవంబరులో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నూతన విధానాన్ని తొలిసారి అమలు చేయనుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉండే చోట్ల టేబుళ్లు, సిబ్బందిని సరిపడా ఏర్పాటు చేసుకుని లెక్కింపులో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఎలక్షన్ కమీషన్ ఆదేశించింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీలంకలోని జాఫ్నా జైలులో 52 రోజుల నిర్బంధం తర్వాత స్వదేశానికి చేరుకోనున్న మత్య్సకారులు

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు — కె. శ్రీను వెంకటేశ్వర్, కరినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు మరియు బ్రన్మంథం శ్రీలంకలోని జాఫ్నా జైలులో 52 రోజుల నిర్బంధం తర్వాత, 2025 సెప్టెంబర్ 26న ఎంపీ సానా సతీష్ బాబు గారి నిరంతర కృషి ఫలితంగా సురక్షితంగా భారతదేశానికి తిరిగి రానున్నారు. ఈ మత్స్యకారులు ఒక ఫిషింగ్ ట్రాలర్ కొనుగోలు చేయడానికి నాగపట్నంకు వెళ్లి వస్తుండగా, నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు. దీనితో, వారిని శ్రీలంక నావికాదళం ఆగస్టు 4న అదుపులోకి తీసుకుని, జాఫ్నా జైలులో నిర్బంధించింది. వారిని విడుదల చేయించేందుకు భారత కాన్సులేట్ అధికారి రాజీవ్ నేతృత్వంలో నిరంతర చర్చలు జరిపినప్పటికీ, భారత ఏజెన్సీలతో సమన్వయం లోపం మరియు విధానపరమైన అడ్డంకుల వల్ల సెప్టెంబర్ 25న జరగాల్సిన తరలింపు నిలిచిపోయింది. ఎంపీ సానా సతీష్ బాబు జోక్యం – ఆపై సత్వర చర్యలు ఈ పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎంపీ సానా సతీష్ బాబు ఈ అంశాన్ని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డాక్టర్ శ్రీకాంత్, స్వయంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పంకజ్ వర్మను తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్ 26న, శ్రీలంక కోస్ట్ గార్డ్ కమాండర్ దినేష్ జేతో సమన్వయం చేస్తూ వర్మ అత్యవసర చర్యలు ప్రారంభించారు. కోర్టు అనుమతులు వచ్చిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు మత్స్యకారులను విడుదల చేసి, IMBL వరకు తీసుకువచ్చారు. సాయంత్రం 6 గంటలకు రామేశ్వరంలోని మండపం బేస్ సమీపంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ వారిని అధికారికంగా స్వాధీనం చేసుకోనుంది. అనంతరం వారు తమ స్వస్థలమైన కాకినాడకు చేరుకోనున్నారు. ఈ ఆపరేషన్ త్వరితంగా పూర్తి కావడంలో రాజ్యసభ ఎంపీ సాసా సతీష్ పాత్ర కీలకంగా నిలచింది. మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారనే వార్త వారి కుటుంబాలకు అపారమైన ఉపశమనం కలిగించింది. ఈ ఘటన, మత్స్యకారులకు అన్ని విధాల అండగా నిలిచే కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని మరొకసారి రుజువు చేసింది.

నిర్మల్

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర శాంతినగర్ నిర్మల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర శాంతినగర్ నిర్మల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. గౌరవ డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఆదేశాల ప్రకారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి పెద్ద ఎత్తున స్పందన వచ్చి సుమారుగా 150 తల్లిదండ్రులు హాజరయ్యారు మొదట హాజరైన తల్లిదండ్రులకు అధ్యాపకులు పుష్పగుచ్చాముతో స్వాగతం పలికారు అనంతరం కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జి తుకారాం మాట్లాడుతూ పిల్లలను ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యేలా చూడాలని ఇంటివద్ద చదివే విధంగా చూడాలని కోరారు ఏజీఎంసీ కన్వీనర్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ కళాశాలలోని వసతులు అధ్యాపకుల అర్హతలు సమయసారిని వివరించారు అనంతరం తల్లిదండ్రులకు వారి ప్రగతి నివేదికను అందజేయడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు చివరగా కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలను వచ్చిన తల్లిదండ్రులతో కలిపి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ కుమార్ అధ్యాపకులు సత్యపాల్ రెడ్డి ఓం ప్రకాష్ అంజుమ్ ఫర్హాన గీతాదేవి షబానా బేగం ముఫాసిర్ సాజిద్ శంకర్ నుస్రత్ ఫాతిమా గంగరాజు నాగరాజు రాజేందర్ రంజిత్ రెడ్డి నందిని కృష్ణ పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

వైభవంగా రాఘవేంద్ర కాలనీ 1, 2 లలో దేవి శరన్నవరాత్రులలో శ్రీమహాలక్ష్మి దుర్గా మాతకు ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్1 మరియు 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 5 రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా శుక్రవారం నాడు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమటం విజయ్ కుమార్ శాస్త్రి లు శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పాలమూరు శ్రీనివాసులు యాదమ్మ దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో దాస్, వెంకటమ్మ దంపతులతో ప్రత్యేక పూజలు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక విశేష నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాలమూరు రాకేష్ ,మౌనిక, సాయి తేజ, నాగమణి, సువర్ణ , శారద, యాదమ్మ, ఇందిరమ్మ, రేణమ్మ ,లక్ష్మీ, అలివేల, కవిత ,కందికొండ గీత, అంజమ్మ, పద్మ,ఎల్ వేణు గౌడ్,ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు,చిన్నయ్య, బాలస్వామి , కురుమయ్య మహిళలు ,చిన్నారులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు బాలాజీ నగర్‌లో గ్యాస్ పేలుడు – ఇంటికి భారీ నష్టం

నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే పేలుడు కారణంగా ఇంటిలో భారీ నష్టం జరిగింది. గోడలు, ఫర్నిచర్, గృహోపకరణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.