Monday, 4 May 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీ లో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా

కొండపల్లి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కొండపల్లి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మున్సిపాలిటీ చైర్మన్‌గా మొట్టమొదటిసారిగా ఎన్నికైన తర్వాత, స్థానిక ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా చైతన్యాన్ని నింపారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో జరిగే ఈ ఉత్సవాలు, పరిసర ప్రజలను ఆకట్టుకుంటూ హర్షం పంచాయి. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. సందర్శకులు ఉత్సాహంగా పాల్గొని స్థానిక సాంస్కృతిక వైభవాన్ని పొగడ్తలు చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

స్వస్థ్‌ నారీ–సశక్తి అభియాన్‌లో మైలవరం ప్రత్యేక వైద్య శిబిరం

మైలవరం, , సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) మైలవరం పట్టణంలో బుధవారం స్వస్థ్‌ నారీ–సశక్తి అభియాన్‌ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో శిబిరం జరిగింది. మహిళల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా, గైనకాలజీ, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి, గుండె, మధుమేహం, నోటి క్యాన్సర్, మానసిక వైద్య పరీక్షలు అందజేశారు. కూటమి నాయకులు, అంగన్వాడీ, పీహెచ్‌సీ సిబ్బంది, టాటా ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

దుర్గమ్మ సేవలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ – “అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి” అని ఆకాంక్షించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేను సాదరంగా స్వాగతించి, వేదపండితులు ఆశీర్వదించి, అమ్మవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందజేశారు.

విశాఖపట్నం

వీధి వ్యాపారుల హక్కులు & ఫుడ్ కోర్ట్ సమస్యపై బొలిశెట్టి సత్య స్పందన

విశాఖపట్నం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) సౌత్ జైల్ రోడ్డులో షాపులు తొలగించడంపై వ్యాపారులు నిరసనలు తెలిపారు. Street Vendors Act, 2014 ప్రకారం వ్యాపారులకు Certificate of Vending, PM SVANidhi రుణాలు, సామాజిక భద్రత హక్కులు ఉన్నాయి. వీధి వ్యాపారులు శుభ్రత పాటించాలి, ఫుట్‌పాత్ ఆక్రమించకూడదు.మధ్యవర్తులు అధిక వసూలు చేసి లైసెన్స్ ఇవ్వకపోవడం, జీవీఎంసీ, సంబంధిత మంత్రుల బాధ్యతలపై బొలిశెట్టి సత్య విమర్శించారు. 240+ షాపుల నుండి వసూలు చేసిన కోట్లు ఎవరు తీసారో బహిరంగ విచారణ, కోట్లు తిరిగి రాబట్టాలని సూచించారు. విజయవాడ #EatStreet మోడల్ అమలు చేసి పేదలకు ఉపాధి, వినియోగదారులకు శుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించాలని చెప్పారు.

తిరుపతి

స్థానిక పరిశ్రమలలో స్థానికులకు 30% రిజర్వేషన్ కల్పించాలి-ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు 30% రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తన గళాన్ని బలంగా వినిపించారు.స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థానికుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమలలోనూ ఏర్పాటుచేసి ఉత్పత్తిని కొనసాగిస్తున్న పరిశ్రమలలోనూ స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలనే అంశాన్ని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకొని తమ భూములు ఇచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సహకరించిన స్థానికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

యాదాద్రి భువనగిరి

జగ్దేవ్ పూర్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) భువనగిరి పట్టణం జగ్దేవ్ పూర్ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమీషనర్ రామలింగం, మున్సిపల్ డిఈ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి విస్తరణ అవసరం ఉందని చెప్పారు. షాప్‌లు నిర్మాణం కోసం అంగీకారం, జీవనోపాధి కోల్పోకుండా ప్రస్తుత షాప్‌లు అలాగే ఉంచుతామని తెలిపారు. కాంక్రీటింగ్, బీటీ, డ్రెయిన్, ఫుట్ పాత్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భువనగిరి సుందరీకరణ కోసం ప్రతి రోడ్డు విస్తరణ ముఖ్యమని గుర్తించారు.

యాదాద్రి భువనగిరి

గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు శ్రీ ఎండి అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి గారి అధ్యక్షతన ఉద్యోగులతో సర్వసభ్య సమావేశం జరిగింది.ఉద్యోగులు సమయ పాలన, సెస్సు వసూలు, మెంబర్షిప్ డిపాజిట్, ఆవరణ పరిశుభ్రత, పాఠకులకు ఆన్ డిమాండ్ పుస్తకాల పంపిణీ, బిల్డింగ్ రిపేర్లు, సమస్య పరిష్కారం వంటి అంశాలను చర్చించారు.జిల్లా కార్యదర్శి శ్రీ ఎం సుధీర్ గారు మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.సహకారం, సమయపాలన, సేవా నిబద్ధత గ్రంథాలయ అభివృద్ధికి కీలకం అని తెలిపారు.

చిత్తూరు

మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు తక్షణం జమ చేయాలి: సంఘం హెచ్చరిక

చిత్తూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి చిత్తూరు జిల్లా 35 వేల మంది మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు జమ చేయకపోవడం దుర్మార్గమని మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి మూడు నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, రైతులను ఆందోళనకు గురిచేయడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ లో ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్

పెదచెర్లో పల్లి ఎంపీడీవోను ఘనంగా సత్కరించాం

పెదచెర్లో, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి) ఈరోజు పెద్ద చెర్లో పల్లి ఎంపీడీవో కార్యాలయంలో, నూతనంగా ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జీ.వి. కృష్ణారావు గారిని జనసేన పెదచెర్లోపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బండారు రాజు గారు మరియు నాయకులు శాలువులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బత్తుల రామకృష్ణ, బత్తుల అజయ్ కుమార్, బత్తుల మోహన్ కృష్ణ, కార్తీక్, చింటు (మోహన్ కుమార్), బి. ఆది తదితర నాయకులు పాల్గొన్నారు.

కడప

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 10వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా

రైల్వే కోడూరు, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు 10వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించి, ఆయుర్వేదం ప్రాచీన వైద్య పద్ధతి, మానవ ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలియజేశారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకుడు డాక్టర్ కె. రమేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, రసాయనశాస్త్ర ఉపన్యాసకుడు కె. పి. కృష్ణమూర్తి వన మూలికల, రోగనిరోధక శక్తి, ఆయుర్వేద ప్రయోజనాలపై వివరణ ఇచ్చారు. ఎన్.యస్.యస్. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని అవగాహన పెంపొందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.