Monday, 4 May 2026

Blog

E-పేపర్

*సి.బి.ఎన్ బ్రాండ్, లోకేష్ బాబు కృషితో ఏపీ కి దిగ్గజ ఐటీ సంస్థలు*

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను పునరుద్ధరించే విధంగా పారిశ్రామిక పాలసీ రూపకల్పన ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గ పున్నమి ప్రతినిధి గన్నవరం నియోజకవర్గానికి రెండు యం.ఎస్.యం.ఈ లు కేటాయించినందుకు ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జరిగిన ఏపి శాసనసభ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ గా అభివర్ణించారు. ప్రస్తుతం ఏపీ లో పరిశ్రమల అభివృద్ధికి అమలు చేస్తున్న స్ట్రాటజీ 4.o మరియు పారిశ్రామిక ప్రోత్సాహకాలు బ్రాండ్ ఆంధ్రాను పునరుద్ధరించే విధంగా ఉన్నాయని తెలిపారు. బ్రాండ్ సి.బి.ఎన్, లోకేష్ బాబు కృషితో దిగ్గజ ఐటీ సంస్థలైనా టి.సి.ఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో అశోక్ లేలాండ్ కంపెనీని వెనక్కి తీసుకొచ్చామని, ముఖ్యమంత్రి సహకారంతో పాత ధరలకే పరిశ్రమలకు భూములను కేటాయించామని గుర్తు చేశారు. మల్లవల్లి ఎస్.ఈ.జెడ్ ను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టామని తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో 31% ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని దానికి అనుగుణంగా విమానాశ్రయ విస్తరణ పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడ లో 2024 కి ముందు 2800 గా ఉన్న ఎంప్లాయిమెంట్ సంఖ్య ప్రస్తుతం 6000 కు చేరిందని తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడ లో పరిపాలన భవనం, 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ మరియు నీటి సౌకర్యం తదితర అంశాలను త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీరపనేనిగూడెంలో ఎం.ఎస్.ఎం.ఈ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి 30 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అమర్ రాజా బ్యాటరీస్, లూలూ గ్రూప్, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని, గన్నవరం నియోజకవర్గ పరిధిలో అశోక్ లేలాండ్ సంస్థను సైతం వెనక్కి పంపి నిరుద్యోగ శాతాన్ని పెంచారని విమర్శించారు. ప్రస్తుతం ఏపి లో పరిశ్రమల స్థాపనకు ఇన్స్టంట్ అప్రూవల్స్, డీమ్డ్ అప్రూవల్స్ వంటి సంస్కరణలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం

మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు…

పున్నమి Daily న్యూస్ T.Ravinder ప్రతినిథి ఖమ్మం మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు… మణుగూరు పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ అద్వర్యం లో దాడులు నిర్వహించి ఎస్ ఐ బత్తిని రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై బత్తిని రంజిత్ కుమార్, నాలుగు కార్ల పంచాయతీ కేసులో ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వారి వద్ద నుండి 40,000 డిమాండ్ చేయడంతో, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. ఈ రోజు మణుగూరు పోలీసుస్టేషన్ లో ఏసీబీ అధికారులు బాధితుల సమాచారం మేరకు ఎస్సై రంజిత్ కుమార్ ను విచారించారు. ఎస్సై నిందితులతో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై బత్తిని రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకొని అతని పై క్రైమ్ నెంబర్ 292 /25 , 7B సెక్షన్ నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఏసిబి డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు. బైట్ : విజయ్ కుమార్ ( ఏసీబీ డీఎస్పీ కరీంనగర్ )

జయశంకర్ భూపాలపల్లి

అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రెస్క్యూ మైన్ లో దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక భూపాలపల్లి పట్టణ ప్రజలు ముఖ్యంగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు విచ్చేసి ఆ అమ్మవారి ప్రసాదించినటువంటి ప్రసాదాన్ని ఆరగించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రసాదం దొరకడం కూడా చాలా అదృష్టకరమైన విషయం అని అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు. Video: https://youtube.com/shorts/4l1pNUOAIT8?si=wzqxFes86J523hqc

E-పేపర్

శుభవార్త:* *తగ్గిన సిమెంట్ ధరలు.*

తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సిమెంట్ పై 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. దీంతో ఒక బస్తాపై రూ.30 వరకు తగ్గింది. బ్రాండును బట్టి గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260 అయింది. రూ.370 ఉన్న ధర రూ.330కి చేరింది. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టేవారికి కాస్త ఉపషమనం లభించినట్టైంది. కాగా ఏపీ, తెలంగాణలో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

E-పేపర్

ప్రచుర్ణార్ధం ! భగత్ సింగ్ స్పూర్తితో మట్టుపదార్దాలపై ఉద్యమిద్దాం. AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు.

పున్నమి ప్రతినిధి స్వతంత్ర యువజన ఉద్యమ ధృవ భగత్ సింగ్ స్పూర్తితో నవయువ భారత నిర్మాణములో యువత పాత్ర ఎంతో కీలకమైనది. అటువంటి యువత నేడు మాదక ద్రవ్యాలకు బానిసలై యువ శక్తి నిర్వీర్యం అవ్వడం దేశ ప్రగతికి విఘాతం. ఇటువంటి తరుణంలో భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన చైతన్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చెప్పటనునము అని ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన గోడప్రతిక ఆవిష్కరణ కార్యక్రమంలో గోవిందరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది అని ఈ సంస్కృతి నేడు కళాశాల స్థాయి నుంచి పాఠశాల స్థాయికి వచ్చిందంటే ఇందులో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలియజేశారు. నేడు యువతకు విద్య, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు అందని ద్రాక్షగా ఉన్నప్పటికీ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్దాలు మాత్రం విచ్చలవిడిగా పట్టణాల నుండి గ్రామాల వరకు అందుబాటులోకి రావడం ఆందోళనకరం. ప్రభుత్వం మాదక ద్రవ్యాలను కట్టడి చేయడంలో మరింత శ్రద్ధ తీసుకోసుకోని యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా వారిలోని నైపుణ్యాలను, క్రీడా పెంపొందించే విధముగా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్ బాలల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం. సాయి కుమార్, గంటా మమత, సింగంశేట్టి మోహన్ కుమార్, రంజిత్,జగదీష్, సుదీర్ లు పాల్గొన్నారు.

అమరావతి

*’ఆడబిడ్డ నిధి’ పథకంపై ప్రభుత్వం కసరత్తు*

అమరావతి :(పున్నమి ప్రతినిధి) ఏపీలో కూటమి ప్రభుత్వం తమ “సూపర్ సిక్స్” హామీలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళల ఆర్థిక సమస్యలను తగ్గించి, వారికి సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. మరోవైపు ప్రభుత్వంఈ పథకం కోసం రూ.3,300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్

నీరుకొండ కొండపై 300 అడుగుల ఎత్తులో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) ఏపీ ప్రభుత్వం అమరావతి సమీపంలోని నీరుకొండ కొండపై 300 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నది. మొత్తం 600 అడుగుల ఎత్తుకు గల ఈ ప్రాజెక్టులో, 100 అడుగుల బేస్‌పై 200 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బేస్‌లో మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్‌లు నిర్మించనున్నారని అధికారులు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించి విశదమైన ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయడానికి టెండర్లను ఇప్పటికే ఆహ్వానించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విగ్రహం భవిష్యత్తులో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా మారనుంది.

పిల్లలకు

మీ పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకండి.

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) మీ పిల్లలను ఒంటరిగా బయటకు పంపకండి. పిల్లల సురక్ష్యత మన బాధ్యత. రాత్రి లేదా ఒంటరిగా వాకింగ్/ఆట సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళేముందు ఇంటిపరిచయానికి సమాచారం ఇవ్వండి, మొబైల్ ఛార్జ్ చేసి వెంటుండేలా చూసుకోండి. అనుమానాస్పద వ్యక్తులు లేదా విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళను చూసినట్లయితే వెంటనే పరిసరాల పార్కు అధికారులకు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయండి. ప్రతి వీధిలో అప్రమత్తత, కమ్యూనిటీ పహర్య్ మరియు రోడ్ సేఫ్టీ నియమాలు పాటించాలి. పిల్లలపై ప్రేమతో చూపు ఉంచండి, అప్రమత్తంగా ఉండండి, పాఠశాలలకు మరియు స్థానిక సంఘాలకు కలిసి పిల్లల భద్రతను బలోపేతం చేయండి. పిల్లలకు బడిలో మరియు ఇంటిలో అత్యవసర నెంబరులను నేర్పించండి, ఈడీలు మరియు కనీసం ఒక గుర్తింపు కార్డు ప్రతిసారిగా తీసుకొనిపోవడం అలవాటు పరచండి. ఒంటరిగా ప్రయాణించవద్దని, ఎల్లప్పుడూ పెద్దవారి అనుమతి తీసుకోవాలని వెంటనే గుర్తుదరిపించండి. ఏ సందర్భంలోనైనా వెంటనే పోలీసులకు తెలియచేయండి. భద్రత మీ గుర్తింపు బాధ్యత.

తెలంగాణ

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సవ్యంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా,శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో కోరారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికలపై స్టేజి 1, స్టేజి 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఎన్నికలలో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలలో తప్పులు జరితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటినుండి ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుందని, అందువల్ల తప్పులు జరగకుండా ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను, ఇతర నియమ, నిబంధనలను పూర్తిగా చదవడమే కాకుండా ముఖ్యమైన అంశాలను మార్క్ చేసుకోవాలన్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో రీపోల్ అన్నది లేకుండా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో మాలిక వసతులను కల్పించడం పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు.జిల్లా యంత్రాంగం తరఫున ఎన్నికల విధులలో నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఏ,డీఏలు సైతం చెల్లించడం జరుగుతుందని అధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని పునరుద్గార్డించారు.

క్రైమ్

ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ వేసి.. గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ ముఠా.

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల్ని చూస్తూ టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం కలకలం రేపింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆ వాహనంపై “ఆన్ గవర్నమెంట్ డ్యూటీ” అని వ్రాయగా, పోలీసులు గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్నారు. విజయనగరం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న కారులో పోలీస్ యూనిఫారం ఉండడంతో, అది పోలీస్ అధికారికి చెందిన వాహనమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. టోల్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి ప్రయత్నాన్ని తప్పించుకుని వాహనం పారిపోయింది. దీనిపై ఏపీ పోలీసులు గాలింపు చేపట్టి దర్యాప్తు వేగవంతం చేశారు. వాహనంలోని వ్యక్తుల గురించిన సమాచారం సేకరణ కొనసాగుతోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.