Monday, 4 May 2026

Blog

జోగులాంబ గద్వాల

జోగులాంబ ఆలయాలను దర్శించిన సీఎం కుటుంబ సభ్యులు.

అలంపూర్, సెప్టెంబర్ 27 ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ–బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కుమార్తె, అల్లుడు శనివారం దర్శించుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్‌కుమార్–మహాలక్ష్మి దంపతులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆలయ పాలకమండలి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. ముందుగా గణపతిని ప్రార్థించిన సీఎం కుటుంబ సభ్యులు, అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామివారికి నమక–చమకాలతో రుద్రాభిషేకం చేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఖడ్గమాల, త్రిశతి అర్చనలు నిర్వహించి, అమ్మవారికి ఒడిబియ్యం, మంగళద్రవ్యాలు, చీర, సారే సమర్పించారు. శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఆరవ రోజు కాత్యాయిని రూపంగా జోగులాంబ దేవిని వారు ఆరాధించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ దంపతులు, పాలకమండలి సభ్యులు, దేవస్థానం తరఫున శేష వస్త్రాలు సీఎం కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల తాలూకా ఇన్చార్జి సరిత తిరుపతయ్య, గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర టెలికం మెంబర్ ఇస్మాయిల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఓబిసి చైర్మన్ నల్లారెడ్డి, సెల్ అధ్యక్షులు ఎనుముల నాగరాజు, లక్ష్మీనారాయణ రెడ్డి, అలంపూర్ తాలూకా ఆయా మండలాల అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అభిమానులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

*గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అతిథి అధ్యాపకుల విన్నపం నిర్మల్ జిల్లా అధ్యాపకులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యాపకులు అందరూ మేనిఫెస్టోలో సూచించిన విధంగా 50 వేల రూపాయలు వేతన మందివ్వాలని అలాగే కన్సాల్డేటెడ్ పే చేయాలని అది 12 నెలలు ఇవ్వాలని వినతి పత్రాలను ఈరోజు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ సుధాకర్ సార్ మరియు జిల్లా అధ్యక్షుడు సురేందర్ సార్ ,జిల్లా సెక్రటరీ డాక్టర్ బి రామ్మోహన్ సార్ ,కోశాధికారి డాక్టర్ మాతంగి రాజయ్య గారు, అధ్యాపకులు కిషన్ సార్, రాజ్ కుమార్ సార్ ,ప్రవీణ్ గారు సార్ ,దిలీప్ సార్, దివ్య మేడం ,సంజీవ్ సార్ నరేష్ సార్ తదితరులు అందరు పాల్గొన్నారు.

నిర్మల్

*గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అతిథి అధ్యాపకుల విన్నపం*

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు గా పనిచేస్తున్న 1940 మంది అధ్యాపకుల కు సంబంధించిన సమస్య ల పట్ల ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో మానిఫెస్టో ప్రకటించినట్లు గా గెస్ట్ లెక్చరర్ అందరికి సమాన పనికి సమాన వేతనం కల్పించి వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులు గా గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా మాయొక్క సమస్యల ను విన్నవించతున్నాము ఈ కార్యక్రమంలో గెస్ట్ అధ్యాపకులు డాక్టర్ రంజిత్ కుమార్ గారు శ్రీనివాస్ సార్ నరేందర్ సార్ కిషన్ సార్ మురారి సార్ మున్నార్ సార్ రాజశేఖర్ సార్ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కాలభైరవ సన్నిధిలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు

కాలభైరవ సన్నిధిలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు  కామారెడ్డి, 27 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి  : ఇసన్నపల్లి కాలభైరవ స్వామి సన్నిధిలో హైకోర్టు, జిల్లా జడ్జిల ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ఈఓ ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం ఇసన్నపల్లి – రామారెడ్డి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని శనివారం  హైకోర్టు జడ్జి శ్రీ నర్సింగ్ రావు, జిల్లా జడ్జిలు  దర్శించుకున్నారు.ఆలయంలో స్వామి వారికి అభిషేకము నిర్వహించి, ప్రత్యేక మొక్కు బడులు చెల్లించుకున్నారు. వారి వెంట  జిల్లా జడ్జి వరప్రసాద్   స్వామివారి దర్శనంలో పాల్గొన్నారు. దర్శనా అనంతరం ఆలయం తరపున హైకోర్టు జడ్జి శ్రీ నర్సింగ్ రావు, జిల్లా జడ్జి లకు ఆలయ అధికారులు ఘనంగా సన్మానించి మెమోంటోలను అంధజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు, పూజారి శ్రీనివాస్ శర్మ, క్లర్క్ సిహెచ్ లక్ష్మణ్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఖమ్మం

మహా అన్నదాన కార్యక్రమం ని జయ ప్రదం చేయండి.

ఖమ్మం సెప్టెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరము లోని ఎన్ ఎస్టీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన దుర్గమ్మ వారి మండపం ప్రాంగానం లో 28వ తేది ఆదివారం నాడు మహా అన్న దానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గా నిర్వాహకులు భద్రయ్య, లింగ రాజు మరియు కమిటీ భాద్యులు తెలియజేశారు.

యాదాద్రి భువనగిరి

ఎంపిటిసి, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లుఖరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపిటిసి, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు. భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి లాటరీ పద్ధతిన రిజర్వేషన్లను ప్రకటిస్తున్నారు.ఇప్పటికే తుర్కపల్లి, భువనగిరి మండలాల ఎంపిటిసి సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

తిరుపతి

కూటమి ప్రభుత్వ సమిష్టి విజయం మెగా డిఎస్సి -అంజూరు చక్రధర్

శ్రీకాళహస్తి :ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ని విజయవంతంగా నిర్వహించి కేవలం 150 రోజులలోనే నియామక పత్రాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నదని,ఇది హామీల అమలులో కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ పేర్కొన్నారు.గత వైసిపి ప్రభుత్వం జాబ్ కాలెండర్ పేరుతో నిరుద్యోగులను మభ్య పెట్టినది అని కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ధి నెలల్లోనే మాట నిలబెట్టుకున్నదని,మెగా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువత కుటుంబాలలో చిరునవ్వులు నింపిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందని వారు అన్నారు.ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని నియామక పత్రాలు పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా నిబద్ధతతో పని చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం

ఎసిబి వల లో ఎస్ ఐ రంజిత్

పున్నమి ప్రతి నిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టేషన్ బెయిల్ కోసం 40 వేలు అడిగిన ఎస్ఐ ని అదుపులో కి తీసుకోని అయన పై ఏసీబీ కేసునమోదు చేసిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో జరిగింది వివరాల్లోకి వెళితే భాద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని 40 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు 40 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

తెలంగాణ

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు,సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, పాలనాధికారి మోతిలాల్ మరియు కలెక్టర్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

‘పువ్వుల దొంగలు’ వస్తున్నారు… జాగ్రత్త!!

‘పువ్వుల దొంగలు’ వస్తున్నారు… జాగ్రత్త!  – పండుగ వేళ పరాయి పూలపై పడుతున్న కన్ను బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ,  పువ్వుల కొరతతో పాటు వాటిని దొంగిలించేవారి బెడద కూడా పెరిగిపోతోంది. ‘పువ్వుల దొంగల’ గురించి ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండాలనే సందేశం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. తమ ఇంటి ముందు కనీసం ఒక్క పూల మొక్క  పెంచకుండా, పక్కవారి శ్రమను దోచుకోవడానికి సిద్ధమవుతున్న వారిపై తీవ్ర నిరసన వ్యక్తమవు తోంది. పరాయి పూలకు ముట్టే అర్హత ఏదీ?  కామారెడ్డి, 27 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి    : భారతీయ సంస్కృతిలో పూలకు, పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తితో భగవంతుడిని అలంకరించడానికి, అనేక శుభకార్యాలకు పూలను ఉపయోగిస్తాం. అందుకే చాలామంది తమ ఇంటి ముందు రకరకాల పూల మొక్కలను ఎంతో శ్రద్ధగా పెంచుకుంటారు. అయితే, కొందరు మాత్రం ఇందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.తమ ఇంటి ఆవరణలో ఒక్క మొక్క  నాటకుండా, ఇతరులు కష్టపడి పెంచిన మొక్కల నుండి పువ్వులను దొంగ లించడం అలవాటు చేసుకుంటున్నారు. “కనీసం ఒక పూల మొక్క నీ ఇంటిముందు ఎందుకు నాటలేదు?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  పూల మొక్కలు పెంచుకునే యజమానులు. ఎటువంటి శ్రమ లేకుండా, పరాయి ఇంటి వద్ద ఉన్న మొక్కల నుండి పూలను కోసుకుపోవడం అర్హత లేని పనిగా పరిగణించబడుతోంది. పక్క ఇంటి మొక్కలను ముట్టుకునే హక్కు ఎవరికీ లేదు. ఈ విధమైన దొంగతనం చేసే వ్యక్తులు, దేవుడి పూజ కోసం ఆ పువ్వులు వాడినా కూడా, ఆ పూజకు పనికిరారనే అభిప్రాయం బలంగా ఉంది. బతుకమ్మ పండుగ వేళ మరింత కష్టం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు పువ్వులు అత్యంత కీలకం. ఈ సమయంలోనే పువ్వులకు డిమాండ్ పెరిగి, అవి దొరకడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి కీలక సమయంలో, సొంత మొక్కలు లేనివారు పక్కవారి మొక్కల పువ్వులను దొంగిలించడం మరింత బాధాకరం. తమ ఇంటి బతుకమ్మకు కావాల్సిన పూలను పక్కవారి మొక్కల నుండి కోసుకోవడం కేవలం దొంగతనం మాత్రమే కాదు, ఇతరుల భక్తి భావనను, శ్రమను అవమానించడమే అవుతుంది.ఇంటి యజమాను లు తమ మొక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తమ కష్టాన్ని దోచుకుపోకుండా, ‘పువ్వుల దొంగల’ పట్ల అప్రమత్తంగా ఉండాల ని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యపై మీ అభిప్రాయం ఏమిటి? ఇటువంటి దొంగతనా లను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుం టు న్నారు? పువ్వుల దొంగలకు అడ్డుకట్ట: పండుగ వేళ పూల రక్షణకు తీసుకోవా ల్సిన చర్యలు బతుకమ్మ వంటి పండుగల సమ యంలో పూలకు పెరిగే డిమాండ్‌ను అదనుగా తీసుకుని, పువ్వుల దొంగలు పక్కవారి శ్రమను దోచుకోవడానికి ప్రయ త్నిస్తున్నారు. తమ ఇంటి ముందు ఒక్క మొక్క కూడా నాటకుండా, పొరుగిం టి యజమానులు కష్టపడి పెంచిన పువ్వులను కోసుకుపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.తాము పెంచిన మొక్కల నుండి పూలు దొంగిలించ బడకుండా ఉండాలంటే, యజమానులు అప్రమత్త త పెంచడం ఉదయం, సాయంత్రం వేళల్లొ ముఖ్యం గా పువ్వులు కోసే సమయాల్లో మొక్కల దగ్గర మరింత అప్రమత్తంగా ఉండాలి. అనుమానా స్పద వ్యక్తులు సంచరిస్తు న్నట్లు కనిపిస్తే, సున్నితం గా వారిని ప్రశ్నించాలి. మొక్కలు చిన్నవిగా ఉన్నా లేదా విలువైన పువ్వు లు పూసే మొక్కలు ఉన్నా, వాటి చుట్టూ చిన్న కంచె (ఫెన్సింగ్) లేదా మెష్‌ను ఏర్పాటు చేయడం వలన బయటి వ్యక్తులు మొక్క లను సులభంగా తాకలేరు. ఇది భౌతిక అడ్డంకిని సృష్టిస్తుంది. మొక్కల దగ్గర స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు: “పువ్వులు కోయరాదు. ఇది ప్రైవేటు ఆస్తి.” అని రాయడం వలన దొంగతనం చేయబోయేవారు ఒకసారి వెనక్కి తగ్గుతారు. ఇంటి ముందు భాగం లో (ముఖ్యంగా మొక్కలు కనిపించే ప్రాంతంలో) సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం వలన దొంగల కదలికలను రికార్డు చేయవచ్చు. ఇది దొంగతనా నికి పాల్పడేవారిలో భయాన్ని కలిగిస్తుంది.నిరోధక చర్యలు పువ్వుల దొంగతనం ఒక వ్యక్తి సమస్య కాదు, సామాజిక సమస్య. కాబట్టి కాలనీ లేదా అపార్ట్‌మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు: పొరుగువారితో సమన్వయం పొరుగు ఇళ్ల యజ మానులతో మాట్లాడి, తమ మొక్కల విషయంలో ఒకరికొకరు అండగా ఉండాలి. ఎవరి ఇంట్లోనైనా పువ్వుల దొంగతనం జరుగుతున్నట్లు గమనిస్తే, వెంటనే వారికి తెలియజేయాలి.కాలనీ వాసులు పువ్వుల దొంగతనం సమస్యపై కాలనీ సంక్షేమ సంఘం తరఫున ఒక సమావేశం ఏర్పాటు చేసి, సమస్య యొక్క తీవ్రతను, దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరించాలి. “నీ ఇంటి ముందు మొక్క నాటు” ప్రచారంతోని పువ్వులు కోసుకుపో తున్న వారిని విమర్శించడంతో పాటు, “ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం ఒక పూల మొక్కను నాటాలి” అనే సానుకూల ప్రచారాన్ని చేపట్టాలి. దీని ద్వారా సొంతంగా పెంచుకోవాలనే స్ఫూర్తి పెరుగుతుంది. దొంగతనం రుజువైతే తీసు కోవాల్సిన చర్య! తొలిసారిగా దొంగతనానికి పాల్ప డిన వ్యక్తిని మర్యాదగా పిలిచి, వారి చర్య తప్పు అని, అది ఇతరుల శ్రమను అవమానించడం అవు తుందని గట్టిగా హెచ్చరించాలి.పదే పదే దొంగత నాలకు పాల్పడే వారి వివరాలను కాలనీ వాట్సాప్ గ్రూపుల్లో లేదా నోటీస్ బోర్డులపై పెట్టి సామాజిక నింద పడేలా చేయాలి. ఇది తీవ్రమైన చర్య అయి నప్పటికీ, దొంగతనాన్ని అరికట్టడానికి ఉపయోగ పడుతుంది.సొంత మొక్కలు పెంచుకోవడానికి బద్ధకించి, పక్కవారి పూలను దొంగిలించే ఈ ‘పువ్వుల దొంగలు’ మారేలా చేయాలంటే, వ్యక్తిగత రక్షణతో పాటు సామాజిక అవగాహన, కఠిన వైఖరి రెండూ అవసరం. పండుగ వాతావరణంలో దొంగ తనాలు జరగకుండా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటు న్నారు.ఈ చర్యలతో పువ్వుల దొంగల బెడద తగ్గుతుందని నిపుణులు చెపుతున్నారు.   

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.