Monday, 4 May 2026

Blog

విశాఖపట్నం

విశాఖలో పెట్టుబడికి స్వర్గధామం*

-తిరుగులేని రిటర్న్స్ ఇచ్చే హాట్‌స్పాట్‌లు ఇవే! పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదే మెట్రో సిటీగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నం, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు సరికొత్త అవకాశాలను అందిస్తోంది. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతమైన వృద్ధిని కనబరుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, మరియు పలు బడా సాఫ్ట్‌వేర్ కంపెనీల పెట్టుబడులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. విశాఖపట్నంలో తిరుగులేని రాబడిని అందించే కొన్ని కీలక ప్రాంతాలు కింద వివరంగా ఇవ్వబడ్డాయి. *ఐటీ, విద్యా కేంద్రాలు:* మధురవాడ, యెండాడ, రుషికొండ **మధురవాడ** విశాఖపట్నంలో ఐటీ హబ్‌లు, విద్యా సంస్థలు, మరియు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, మరియు విల్లాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. రహదారుల విస్తరణ, కొత్త ఐటీ పార్కులు, మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఈ ప్రాంత ఆకర్షణను మరింత పెంచుతున్నాయి. **యెండాడ** కూడా ఐటీ హబ్‌లు మరియు విద్యా సంస్థలకు చేరువలో ఉండటంతో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు అధిక డిమాండ్‌ను చూపిస్తోంది. **రుషికొండ** ఐటీ పార్కులు, బీచ్‌ఫ్రంట్ లొకేషన్, మరియు విలాసవంతమైన గృహనిర్మాణ ఎంపికల కారణంగా హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పరిణమిస్తోంది. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలకు, అత్యంత ఆకర్షణీయంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలు: దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస ఒకప్పుడు విశాఖపట్నానికి శివారు ప్రాంతంగా ఉన్న **దువ్వాడ** ఇప్పుడు నగరం పరిధిలోకి వచ్చి రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ 2 BHK అపార్ట్‌మెంట్లు మరియు విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది. **పెందుర్తి** విశాఖపట్నం శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ సరసమైన ధరల్లో ఓపెన్ ప్లాట్లు మరియు గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. విశాఖపట్నం విస్తరణ జోన్‌లో భాగంగా ఉన్న **కొత్తవలస** ఎంఎస్‌ఎంఈ (MSME) పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ కూడా సరసమైన ధరల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు మంచి డిమాండ్ ఉంది. పారిశ్రామిక ఉద్యోగులకు అనుకూల ప్రాంతాలు: కుర్మన్నపాలెం, కొమ్మాడి పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల, **కుర్మన్నపాలెం**లో తక్కువ బడ్జెట్ ఫ్లాట్లు మరియు ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతం పారిశ్రామిక ఉద్యోగులకు అత్యంత అనుకూలంగా ఉంది. ఐటీ పరిశ్రమల అభివృద్ధి మరియు మధురవాడకు సామీప్యత కూడా ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సరసమైన రెసిడెన్షియల్ ఆప్షన్లు మరియు విశాఖపట్నంతో మెరుగైన కనెక్టివిటీ వల్ల **కొమ్మాడి**లో పెట్టుబడి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా, మధురవాడ, భీమిలి, యెండాడ, రుషికొండ, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, కుర్మన్నపాలెం, పరదేశిపాలెం, కొమ్మాడి వంటి ప్రాంతాలు విశాఖపట్నంలో పెరుగుతున్న డిమాండ్‌తో కూడిన శివారు ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాలు పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్

దశ.. దిశ మారనున్న మెట్రో

దశ.. దిశ మారనున్న మెట్రో -ఎల్‌అండ్‌టీ కథ ముగింపు – ప్రభుత్వమే ముందడుగు * పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి* హైదరాబాద్‌ మహానగరంలో ఎల్‌అండ్‌టీ మెట్రో అధ్యాయం ముగిసింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశంలోనే తొలిసారి పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) విధానంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగనుంది. 2010లో ప్రారంభమైన ప్రయాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలంలో 2010లో ఎల్‌అండ్‌టీతో మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరింది. అంతకు ముందు సత్యం అనుబంధ సంస్థ మేటాస్ ఇన్‌ఫ్రాకి ప్రాజెక్టు అప్పగించగా, సత్యం సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. దీంతో ఎల్‌అండ్‌టీ ముందుకొచ్చి, ఇది దేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద PPP ప్రాజెక్టుగా రికార్డుల్లో నిలిచింది. 2017లో ప్రజలకు అందుబాటులోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2017 నవంబర్‌ 29న మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా మూడు కారిడార్లలో 69 కి.మీ. మేరకు రైళ్లు నడపబడ్డాయి. ఉప్పల్‌, మియాపూర్‌లో డిపోలు నిర్మించబడ్డాయి. కరోనా దెబ్బ 2020లో కరోనా మహమ్మారి కారణంగా 169 రోజుల పాటు మెట్రో నిలిచిపోవడం ఎల్‌అండ్‌టీకి పెద్ద ఎదురుదెబ్బ అయింది. అప్పట్లో తీసుకున్న రుణాలు, వడ్డీ భారం, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. అప్పుల ఊబిలో నుండి బయటపడలేక సంస్థ ప్రభుత్వ సహకారం కోరినా, ఆశించిన సాయం రాకపోవడంతో చివరికి ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని అంగీకరించింది. రెండో దశకు మార్గం సుగమం ఎల్‌అండ్‌టీ తప్పుకోవడంతో రెండో దశ మెట్రో విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే మొదటి విడతలో నిర్మించిన 69.2 కి.మీ. కారిడార్లను ప్రభుత్వమే నిర్వహించనుందా? లేక ఎల్‌అండ్‌టీకి ఈక్విటీ వాటా కొనసాగుతుందా? అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైటెక్‌సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, మూసారాంబాగ్‌లో నిర్మించిన మాల్స్‌ నిర్వహణపై నిర్ణయం కీలకం కానుంది. కొత్త దిశలో మెట్రో ఇకపై ప్రభుత్వమే మెట్రో బాధ్యతలు చేపట్టనుండటంతో రెండో దశ డీపీఆర్‌ అనుమతులకు కూడా మార్గం సుగమమైంది. ప్రయాణికులకు ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. హైదరాబాద్‌ మెట్రో కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఎల్‌అండ్‌టీ ప్రయాణం ముగిసినా – మెట్రోకు కొత్త దిశ మొదలైంది. హైదరాబాద్‌ మెట్రో టైమ్‌లైన్ 2008 → మేటాస్‌ ఇన్‌ఫ్రా ప్రతిపాదన (సత్యం సంక్షోభంతో ఆగింది) 2010 సెప్టెంబర్‌ 4 → ఎల్‌అండ్‌టీతో PPP ఒప్పందం 2017 నవంబర్‌ 29 → ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో సేవలు ప్రారంభం 2017–2019 → మూడు కారిడార్లలో మొత్తం 69.2 కి.మీ. పూర్తి 2020 → కరోనా కారణంగా 169 రోజులు మెట్రో నిలిపివేత 2021–2024 → అప్పుల ఊబి, ఆర్థిక ఇబ్బందులు – ప్రభుత్వ సహాయం కోసం విజ్ఞప్తులు 2025 → ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ ఎగ్జిట్ – ప్రభుత్వమే పూర్తి బాధ్యతలు స్వీకరణ

విశాఖపట్నం

విశాఖలో పెట్టుబడికి స్వర్గధామం*

-తిరుగులేని రిటర్న్స్ ఇచ్చే హాట్‌స్పాట్‌లు ఇవే! పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదే మెట్రో సిటీగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నం, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు సరికొత్త అవకాశాలను అందిస్తోంది. నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ విపరీతమైన వృద్ధిని కనబరుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, మరియు పలు బడా సాఫ్ట్‌వేర్ కంపెనీల పెట్టుబడులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. విశాఖపట్నంలో తిరుగులేని రాబడిని అందించే కొన్ని కీలక ప్రాంతాలు కింద వివరంగా ఇవ్వబడ్డాయి. *ఐటీ, విద్యా కేంద్రాలు:* మధురవాడ, యెండాడ, రుషికొండ **మధురవాడ** విశాఖపట్నంలో ఐటీ హబ్‌లు, విద్యా సంస్థలు, మరియు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కేంద్రంగా మారింది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, మరియు విల్లాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. రహదారుల విస్తరణ, కొత్త ఐటీ పార్కులు, మరియు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఈ ప్రాంత ఆకర్షణను మరింత పెంచుతున్నాయి. **యెండాడ** కూడా ఐటీ హబ్‌లు మరియు విద్యా సంస్థలకు చేరువలో ఉండటంతో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు అధిక డిమాండ్‌ను చూపిస్తోంది. **రుషికొండ** ఐటీ పార్కులు, బీచ్‌ఫ్రంట్ లొకేషన్, మరియు విలాసవంతమైన గృహనిర్మాణ ఎంపికల కారణంగా హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పరిణమిస్తోంది. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐలకు, అత్యంత ఆకర్షణీయంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలు: దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస ఒకప్పుడు విశాఖపట్నానికి శివారు ప్రాంతంగా ఉన్న **దువ్వాడ** ఇప్పుడు నగరం పరిధిలోకి వచ్చి రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోంది. ఇక్కడ 2 BHK అపార్ట్‌మెంట్లు మరియు విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది. **పెందుర్తి** విశాఖపట్నం శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ సరసమైన ధరల్లో ఓపెన్ ప్లాట్లు మరియు గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. విశాఖపట్నం విస్తరణ జోన్‌లో భాగంగా ఉన్న **కొత్తవలస** ఎంఎస్‌ఎంఈ (MSME) పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ కూడా సరసమైన ధరల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు మంచి డిమాండ్ ఉంది. పారిశ్రామిక ఉద్యోగులకు అనుకూల ప్రాంతాలు: కుర్మన్నపాలెం, కొమ్మాడి పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల, **కుర్మన్నపాలెం**లో తక్కువ బడ్జెట్ ఫ్లాట్లు మరియు ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతం పారిశ్రామిక ఉద్యోగులకు అత్యంత అనుకూలంగా ఉంది. ఐటీ పరిశ్రమల అభివృద్ధి మరియు మధురవాడకు సామీప్యత కూడా ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సరసమైన రెసిడెన్షియల్ ఆప్షన్లు మరియు విశాఖపట్నంతో మెరుగైన కనెక్టివిటీ వల్ల **కొమ్మాడి**లో పెట్టుబడి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా, మధురవాడ, భీమిలి, యెండాడ, రుషికొండ, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, కుర్మన్నపాలెం, పరదేశిపాలెం, కొమ్మాడి వంటి ప్రాంతాలు విశాఖపట్నంలో పెరుగుతున్న డిమాండ్‌తో కూడిన శివారు ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాలు పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తిరుపతి

సుజనా చౌదరి కి స్వాగతం పలికిన కోలా ఆనంద్

తిరుపతిలో జరగనున్న గుర్రం జాషువా 130 వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు,మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) విచ్చేసారు.వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలంకారి శాలువా తో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పదాధికారులు,మండల అధ్యక్షులు,సీనియర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

హోటల్ వివేరాకు “ఉత్తమ వే సైడ్ అమినిటీస్అవార్డు

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2025 యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి హైదరాబాద్‌ శిల్పరామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైయారు. ఈ సందర్భంగా,భువనగిరి హోటల్ వివేరాకు “ఉత్తమ వే సైడ్ అమినిటీస్” అవార్డు లభించింది. పర్యాటకులకుఆధునికసదుపాయాలుఅందించడంద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి చేసిన విశేష కృషిని గుర్తించిఈఅవార్డుఅందజేయబడింది.ఈ అవార్డును పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ప్రదానం చేశారు. అలాగే, పర్యాటక & పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, IAS గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్, IPS గారు పాల్గొని పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.హోటల్ వివేరా తరఫున, చైర్మన్ శ్రీ ఎస్. వెంకట్ రెడ్డి గారు మరియు శ్రీ ఎస్. రాఘవేందర్ రెడ్డి గారు అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు తెలంగాణ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక అనుభవం మెరుగుదలలో హోటల్ వివేరా చేసిన కృషికి గర్వకారణమని భావించబడుతుంది.

నిర్మల్

నిర్మల్ జిల్లా, సమీకృత జిల్లా కార్యాలయ సముదాయము నందు ఈరోజు బతుకమ్మ సంబరాలు

ఈరోజు నిర్మల్ జిల్లా, సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టర్ ఆధ్వర్యంలో, విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా అధ్యాపకులు కలెక్టర్ భవన సముదాయ మహిళా ఉద్యోగులు భారీ ఎత్తున గుమ్మిగుడి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా డీఈవో దర్శనం భోజన్న సార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డీఈఓ సార్ మాట్లాడుతూ మన తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మ సంబరాలను ఈరోజు కలెక్టర్ భవనంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇది సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తున అద్దం పడుతుందని కొనియాడారు దీనిలో మహిళ అధ్యాపకులు ఉపాధ్యాయులు సిబ్బంది అంతా కలిసి ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉండాలని అన్నారు

హైదరాబాద్

తెలంగాణ లో భారీగా ఐ పి ఎస్ ల బదిలీలు.

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ హైదరాబాద్ తెలంగాణ లో భారీగా ఐ పి ఎస్ ల బదిలీ లు జరిగాయి. ఆ వివరాలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్ ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్‌ కుమార్ పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్ హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్ వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్ నారాయణపేట ఎస్పీగా వినీత్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా లని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది.

తిరుపతి

అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు. సీఎం చంద్రబాబు

అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు వాహన మిత్ర స్కీం కింద ఆటో డ్రైవర్లకు 15000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన ఆటో డ్రైవర్లను క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామని అసెంబ్లీలో చెప్పారు. పెండింగ్ చలాన్లు ఫిట్నెస్ సర్టిఫికెట్ క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు. మొత్తం 2.9 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15 వేలు రూపాయల చొప్పున అందిస్తామన్నారు.

కర్నూలు

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి:-గోనెగండ్ల 234 బూత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర PAC సభ్యులు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల 234 బూత్ మొట్టి విధి నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారిచేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయం సిబ్బందితో కలసి పంపిణి చేసిన గోనెగండ్ల సర్పంచ్ హైమావతి,బూత్ ఇంచార్జ్ ఐటీడీపి రాంపురం రఫీక్.కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సుభాన్,మోహన్ తదితరులు పాల్గొన్నారు…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మరణించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల సత్వర సెటిల్మెంట్

సెప్టెంబర్ 27 ( పున్నమి ప్రతినిధి) బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సులభతరం చేసింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరింది. చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని మొత్తాన్ని నామినీకి, జాయింట్ ఖాతా అయితే సర్వైవర్కు చెల్లించాలి. ఒకవేళ ఖాతాదారు ఎవరినీ నామినీగా పేర్కొనక పోయినా, డిపాజిట్ మొత్తం నిర్ణీత మొత్తానికి లోబడి ఉంటే, బ్యాంకులు ఆ మొత్తాన్ని సులభతర పద్దతిలో సెటిల్ చేయాలి. సహకార బ్యాంకులైతే రూ.5 లక్షల లోపు, ఇతర బ్యాంకులైతే రూ.15 లక్షలను గరిష్ఠ పరి మితిగా పెట్టుకోవాలి. బ్యాంకుల బోర్డులు అనుమతిస్తే ఇంతకు మించిన మొత్తాన్ని కూడా అనుమతించవచ్చు. అయితే ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడనే సర్టిఫికెట్లు తీసుకోవాలి. చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్ అందిన 15 రోజుల్లోగా సెటిల్మెంట్ పూర్తి చేయాలి. 15 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్ చేయలేకపోతే అందుకు కారణాలు ఏమిటో నామినీ, చట్ట బద్ద వారసులకు తెలియజేయాలి. సహేతుక కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై బ్యాంక్ అమలు చేస్తున్న వడ్డీకి తోడు 4% వార్షిక వడ్డీ చెల్లించాలి. లాకర్లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.