Monday, 4 May 2026

Blog

తిరుపతి

ప్రకృతి సిద్ధమైన ఆహారమే ఆరోగ్యానికి పునాది:బీజేపీ నేత డా.చంద్రప్ప

శ్రీకాళహస్తి మండలం కాపు గున్నేరి గ్రామంలో తేజోరస సంస్థ ఆధ్వర్యంలో ఆహారోగ్యం పేరుతో గ్రామ ప్రజలకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాట్లాడారు. మన సమాజం సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ,ఆరోగ్య పరంగా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.చిన్న వయసులోనే ఆహారోగ్యం ఉత్పత్తులను ప్రారంభించి, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న కీర్తి ని వారు అభినందించారు.ఇలాంటి యువత సమాజానికి మార్గదర్శకులు కావాలి అని అన్నారు.అనంతరం చంద్రప్పను తేజోరస సంస్థ వారు సన్మానించారు.

ఖమ్మం

స్థానిక సంస్థ ల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా రిజర్వేషన్ వివరాలు…

పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా లోని ఎంపీటీసి, జెడ్ పిటిసి  రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయ్. ఎంపీపీ లు రిజర్వేషన్లు ఇలా. 1) సత్తుపల్లి ST 2) కొణిజర్ల ST (W) 3) పెనుబల్లి ST 4) ముదిగొండ SC 5) తల్లాడ – SC (W) 6) చింతకాని – SC 7) తిరుమలాయపాలెం – SC (W) 8) బోనకల్ -BC 9) వైరా. – BC 10) ఖమ్మం రూరల్ – BC 11) నేలకొండపల్లి – BC 12) వేంసూరు – BC (W) 13) మధిర. – BC(W) 14) కూసుమంచి – BC (W) 15) కల్లూరు. – BC (W) 16) ఎర్రుపాలెం GEN(W) 17) రఘునాథపాలెం GEN 18) సింగరేణి. (GEN) 19) ఏన్కూరు ST (W) 20) కామేపల్లి ST(W) ZPTC రిజర్వేషన్లు ఇలా.. 1) సత్తుపల్లి ST(W) 2) కొణిజర్ల ST 3) పెనుబల్లి BC (W) 4) ముదిగొండ SC 5) తల్లాడ – SC (W) 6) చింతకాని – GEN 7) తిరుమలాయపాలెం – ST (W) 8) బోనకల్ -BC (W) 9) వైరా. – BC 10) ఖమ్మం రూరల్ – BC (W) 11) నేలకొండపల్లి – BC 12) వేంసూరు – BC 13) మధిర. – BC (W) 14) కూసుమంచి – ST 15) కల్లూరు. – SC (W) 16) ఎర్రుపాలెం SC 17) రఘునాథపాలెం BC 18) సింగరేణి. GEN (W) 19) ఏన్కూరు GEN 20) కామేపల్లి GEN(W)

తిరుపతి

శ్రీ శ్రీ శీతాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సతీమణి

దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతాలాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్స్ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి.వారితో పాటు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ముందుగా బియ్యపు శ్రీవాణి రెడ్డి కి శ్రీ శీతాలాంబ తల్లి దేవస్థానం చైర్మన్ పాలమంగళం రవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం పూజారులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ శీతాలాంబ తల్లి సమక్షంలో ప్రజలకు అన్నదానం నిర్వహించారు.

తిరుపతి

పట్టణంలోని మునిసిపాలిటీ కాలువల పై ఆక్రమిత బండలను తొలగించి పూడికలు తీయండి. షేక్ కరీముల్లా

శ్రీకాళహస్తి పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ పి.భవానీ ప్రసాద్ కి కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ కరీముల్లా వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని యం.యం.వాడ,ది స్కూల్ టర్నింగ్,జయరామరావు వీధి రామ మందిరం,రంగయ్య బడి,పూసల వీధి సచివాలయం,కుమారస్వామి తిప్ప,మసీదు ప్రాంతం,బజారు వీధి,నగిరి వీధి,లాంటి పలు ప్రాంతాలలో తేలిక పాటి వర్షానికి రోడ్లు నీట మునిగి,స్కూలు పిల్లలకు పాదచారులకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి రాబోయే వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు ఆలోచనతో కాలువలలో పేరుకుపోయిన చెత్త చెదారాలు,పూడికను తీసివేయాలని అదే విధముగా కాలువ శుభ్రపరిచేందుకు కాలువలపై ఆక్రమిత బండలను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారన్నారు.

తిరుపతి

గుర్రం జాషువా గారి జీవితం ఆదర్శప్రాయం

సమరసతా స్వరం ,జాతీయతా గళం భారతదేశం గర్వహించదగ్గ కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సావంలో భాగంగా నేడు తిరుపతి పట్టణంలోని కచ్చపి ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి),బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జి,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,ఇతర బిజెపి నాయకులు,ప్రముఖ కవులు,రచయిలతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా జీవితం గుర్తు చేస్తూ సమాజం లోని కుల అసమానతలు,అంటరానితనంపై తన కవిత్వంతో సమాజాన్ని చైతన్య పరచి జాతీయ వాద సిద్ధాంతంతో దేశ సమైక్యతను కాపాడట కోసం కృషి చేశారని కొనియాడారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మూలానక్షత్రం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహానించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. మరియు కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్.

మూలానక్షత్రం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన నేపథ్యంలో బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహానించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు. మరియు కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్.గార్లు. శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గార్లు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గార్లు ఉత్సవాలు మొదలైన మొదటి రోజు నుండి అన్నీ శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక డ్రోన్, సి.సి.కెమెరాల ద్వారా కామాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తూ ఆయా శాఖల సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సమిష్టిగా చర్చించుకుని ఎటువంటి చిన్న లోపాలు లేకుండా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ది.29.09.2025వ తేదిన మూలనక్షత్రం మరియు ఆనవాయితీ ప్రకారం రాష్ట్రప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపధ్యంలో ఈ రోజు మోడల్ గెస్ట్ హౌస్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నందు నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గారు, టెంపుల్ ఈ.ఓ.శ్రీ సినానాయక్ గారు మరియు ఇతర ఉన్నత్తాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి ముందురోజు రాత్రి నుండే అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మరియు ఆ రోజున ఆనవాయితీ ప్రకారం రాష్ట్రప్రభుత్వం తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి టెంపుల్ కి వస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్ల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ చివరి ఐదు రోజుల్లో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారని, ఈ క్రమంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాల గురించి మరియు అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేయు అవసరాలైన నీరు,పాలు, ఆహారం మొదలైనవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా చూడాలని, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మరియు భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటిస్తూ విధులు నిర్వహించేలాగా అధికారులు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని తెలియజేసారు. రొటీన్ బందొబస్త్ లా కాకుండా కొంత మనస్సు పెట్టి భక్తి శ్రద్దలతో విధులు నిర్వహిస్తే భక్తుల మన్ననలతో పాటు, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయని, భక్తి శ్రద్దలతో అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్.గారు, టెంపుల్ ఈ.ఓ.శ్రీ సినానాయక్ గారు, ఎస్.పి.లు శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్.గారు, కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్.గారు, శ్రీ ఆనంద రెడ్డి గారు, ఎస్.వి.డి.ప్రసాద్ గారు, ఏ.డి.సి.పి.లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

స్వదేశీ 4జీ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం జరిగింది..

ఈరోజు ఏ కన్వెన్షన్ వేదికగా స్వదేశీ 4జీ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మరియు బిఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది…

ఎన్ టి ఆర్ జిల్లా

𝐕𝐈𝐉𝐀𝐘𝐀𝐖𝐀𝐃𝐀 𝐔𝐓𝐒𝐀𝐕 – 𝟐𝟎𝟐𝟓 𝐎𝐍𝐄 𝐂𝐈𝐓𝐘…. 𝐎𝐍𝐄 𝐂𝐄𝐋𝐄𝐁𝐑𝐀𝐓𝐈𝐎𝐍

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ కమిటీ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది… అనంతరం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది… ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు, సొసైటీ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ గార్లతో కలిసి ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించడం జరిగింది… పుష్కరకాలం తర్వాత విజయవాడ నగరంలో ఎగ్జిబిషన్ మళ్లీ పున ప్రారంభం కావడం అది కూడా శ్రీ నందమూరి బాలకృష్ణ గారి చేతులమీదుగా ప్రారంభించడం ఎంతగానో ఆనందంగా ఉంది… నందమూరి బాలకృష్ణ గారు క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారు… అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ హాస్పిటల్ వలన పేదలకు మంచి వైద్య సేవలు అందుతాయి… ఈరోజు విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సింగర్ సునీత గారి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్రజలను ఎంతగానో అలరించాయి… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించినందుకు ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు….

సక్సెస్ స్టోరీస్

భారత తొలి మహిళా సీఎం, స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలానీ ఎవరు

సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి) సుచేతా కృపలానీ 1908లో జన్మించిన స్వాతంత్ర్య సమరయోధురాలు, గాంధేయవాది. బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ ముసాయిదా సమితిలో కీలక పాత్ర పోషించారు. 1963లో ఉత్తరప్రదేశ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా నియమితులై, భారత తొలి మహిళా సీఎం అయ్యారు. న్యాయం, సమానత్వం, మహిళా హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చారిత్రాత్మకంగా నిలిచింది. ఆమె ధైర్యం, నాయకత్వం, దేశ సమగ్రత పట్ల చూపిన అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి రాజకీయ నాయకత్వం వరకు ఆమె జీవితం ఆదర్శప్రాయమైంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నవరాత్రి సమయంలో ప్రధాని మోదీ ఎలా ఉపవాసం ఉంటారు

సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవరాత్రుల సమయంలో కఠిన ఉపవాసం పాటించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఈ తొమ్మిది రోజులు ఆయన పూర్తి ఉపవాసంలో ఉండి, వేడినీరు మాత్రమే తాగుతారు. కొన్ని సందర్భాల్లో 하루లో ఒక్కసారి పండు మాత్రమే తీసుకుంటారు. ఆయన ఇది చైత్ర నవరాత్రుల్లో పాటించగా, కొంతమంది శరన్నవరాత్రుల్లోనూ పాటిస్తారని చెబుతారు. నరేంద్ర మోదీ ఈ ఉపవాసాన్ని ఆధ్యాత్మిక సాధనగా భావించి, శరీర శుద్ధి, మనశ్శాంతి కోసం పాటిస్తారు. దీని ద్వారా ఆయన నియమిత జీవనశైలిని ప్రతిఫలించవచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.