Monday, 4 May 2026

Blog

నాగర్‌కర్నూల్

అచ్చంపేట కేటీఆర్ బహిరంగ సభకు బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 నగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు అచ్చంపేటలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వారి బహిరంగ సభ కు మినపల్లి మండలం నుండి భారీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బి జగదీశ్వర్ రెడ్డి, కురుమయ్య, బోట్ క చంద్రశేఖర్, తిరుపతయ్య, సాంబశివ, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

బిజినెస్

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి, సామాన్యులకు బంగారం కొనడం కష్టతరంగా మారింది. వెండి ధర కూడా కిలో రూ. 1.49 లక్షలకు చేరింది.

ఆంధ్రప్రదేశ్

రాబోయే 25 ఏళ్లలో క్యాన్సర్ మరణాలు ప్రపంచవ్యాప్తంగా 75 శాతం పెరుగుతాయి: అధ్యయనం

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ద లాన్సెట్‌లో ప్రచురితమైన తాజా విశ్లేషణ ప్రకారం, రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచ క్యాన్సర్ మరణాల రేటు 75% పెరిగి, 2050 నాటికి 1.86 కోట్లకు చేరుకోనుంది. అదే సంవత్సరం నాటికి కొత్తగా 3.05 కోట్ల మందికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులలో సగానికి పైగా, మరణాల్లో మూడింట రెండు వంతులు తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవించే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. జీవనశైలి మార్పులు, పొగతాగడం, మానవ వనరుల కొరత వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా పేర్కొనబడ్డాయి. దీనివల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది.

నాగర్‌కర్నూల్

అచ్చంపేట కేటీఆర్ బహిరంగ సభకు బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 నగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు అచ్చంపేటలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వారి బహిరంగ సభ కు మినపల్లి మండలం నుండి భారీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బి జగదీశ్వర్ రెడ్డి, కురుమయ్య, బోట్ క చంద్రశేఖర్, తిరుపతయ్య, సాంబశివ, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

పాలెం వెంకన్న దేవాలయంలో వైభవంగా దుర్గమాత పూజలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 మహా చండిదేవి గా అవతారంలో దుర్గ మాత దర్శనం బిజినెపల్లి మండలం లోని పాలెం గ్రామంలో ని శ్రీ అలెర్మెల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7వరోజు ఆదివారంనాడు శ్రీ దుర్గ మాతను శ్రీ మహాచండి దేవిగా అలంకరించారు. కొండల్, వెంకట్ దంపతులు అభిషేక, దుర్గా పూజలో పాల్గొన్నారు .సాయంత్రం కుంకుమార్చన మహిళ భక్తురాలచే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవితేజ ఆధ్వర్యంలో చిన్నారులు ధాత్రేయ, శ్రావిక, రూపిక, క్రితిక, బ్రితిక, వర్ష చిన్నారులచే శ్రీ శారాదాంబ నమోస్తుతే శ్రీసరస్వతి, శ్రీ నవ్వదుర్గల నృత్యం లు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులను సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు, జయంత్ ఆలయ సిబ్బంది ఆర్ శివకుమార్, కార్యక్రమంలో శ్రీపద్మావతి మాతృమండలి సభ్యులు,వాణి బాయి ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆనంద్, వెంకటేష్, ఆనంద్ సింగ్ ,బిళ్ళకంటి వినయ్, పోతుల శ్రీనివాస్, వినయ్, సన్నీ, శషిధర్, నీలాధర్, మురళి,నర్సింహా,అల్లోజీ, మహిళాలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ ను సన్మానించిన వాల్మీకి సంఘ నేతలు!

పలమనేరు మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన కె. రాజన్న ను, డైరెక్టర్ ఎం.శంకరప్పను ఆదివారం వాల్మీకి సంఘ నేతలు కలిసి సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఇద్దరికీ శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ నామినేటెడ్ పదవులు లభించడం హర్షదాయకమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డికి వాల్మీకి సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ రాష్ట్ర నాయకులు, పలమనేరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్. భాస్కర్, అద్దాల నాగరాజు, నియోజకవర్గ నాయకులు రొంట కుంట్ల నరసింహులు, బొమ్మనపల్లి మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేబీస్‌ లక్షణాలు ఒకసారి కనిపించిన తర్వాత 100% ప్రాణాంతకమే

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) రేబీస్ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 59,000 మంది రేబీస్ వల్ల మరణిస్తుండగా, వీరిలో చాలా మంది 15 ఏళ్ల లోపు పిల్లలే. రేబీస్‌ లక్షణాలు ఒకసారి కనిపిస్తే అది 100% ప్రాణాంతకం. 99% కేసులు కుక్కల కాటు లేదా గీతల వల్ల వస్తాయి. అయితే, ఇది నివారించదగిన వ్యాధి. కరిచిన/g గీతేసిన వెంటనే గాయం అయిన ప్రదేశాన్ని కనీసం 15 నిమిషాలు సబ్బుతో కడగాలి. వెంటనే వ్యాక్సిన్ కోర్స్ తీసుకోవాలి. అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్స్ (RIG) తీసుకోవాలి. కుక్కలకు టీకాలు వేయడం, అవగాహన పెంపొందించడం, సమయానికి చికిత్సతో రేబీస్‌ను పూర్తిగా నివారించవచ్చు.

జోగులాంబ గద్వాల

క్రికెట్ పోటీలను ప్రారంభించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్… పచ్చర్ల కుమార్.

ఆలంపూర్ అక్టోబర్ 28 : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం పచ్చర్ల గ్రామ పరిధిలోని పచ్చర్ల ప్రీమియం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రికెట్ కిట్టుకు పూజ నిర్వహించి గ్రామంలో క్రీడాకారులందరికీ తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ ఆట ఉంటుందని, అభినందిస్తూ గ్రామంలో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం అంటే చాలా ఆనందంగా ఉంటుందని విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. క్రీడలు నైపుణ్యతను వెలుకు తీసి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం వల్ల శరీరం తన పరిధిలో ఉంటుందని యువతకు పచ్చర్ల కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, తిరుమలేష్, సంధ్య కుమార్, మురళి, అచ్యుత్, నాగరాజు, జయరాం, గంగాధర్ మరియు గ్రామ క్రీడాకారులు యువత తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను స్వాధీనం

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువాన, మొత్తం 12 ఇగువానాస్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా దేశంలోకి తరలించేందుకు ప్రయత్నించాడు. స్వాధీనం చేసుకున్న వన్యప్రాణులను అధికారులు తిరిగి బ్యాంకాక్‌కు తరలించారు. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన విమానాశ్రయంలో జాగ్రత్తలతో కూడిన తనిఖీలకు నిదర్శనంగా నిలిచింది. విచారణ కొనసాగుతోంది.

తిరుపతి

కొట్టే సాయి ప్రసాద్ కి ఘన సన్మానం

శ్రీకాళహస్తి శ్రీ కృష్ణదేవరాయ బలిజ తెలగ కాపు సంఘం అధ్యక్షులు మరియు పట్టణ ప్రముఖుడు ఉప్పు కృష్ణయ్య ఆధ్వర్యంలో కోట్టే సాయి ని ఘనముగా సన్మానించారు. అతి చిన్న వయసులో ఒక సామాన్య జనసైనికుడు నిరాడంబరుడు కొట్టే సాయికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం మాకు చాలా సంతోషదాయకమని ఉప్పు కృష్ణయ్య అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు బలిజ నాయకులు పాల్గొన్నారు.కొట్టే సాయికి శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ గా అవకాశం కల్పించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కి సభా ముఖంగా ఉప్పు కిష్టయ్య ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.