Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం: ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా గెలిపించాలి 

– కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  కామారెడ్డి, 28 సెప్టెంబర్,  పున్నమి ప్రతినిధి   :  కామారెడ్డి జిల్లాలో జిల్లాలో జెడ్పిటిసి, ఎంపిటిసి,  సర్పంచ్, వార్డు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కృషి చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జన తా పార్టీ (బీజేపీ) పూర్తిస్థాయిలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కామారెడ్డి శాసన సభ్యులు  కాటి పల్లి వెంకట రమణ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికలను కార్యకర్తలను ప్రజాప్రతిని ధులుగా చేసే ఎన్నికలుగా అభివర్ణించారు.స్థానిక సంస్థల ఎన్నికలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయిన నేప థ్యంలో, రాబోయే ఎన్నికల సన్నద్ధత పై బీజేపీ జిల్లా కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షత వహించారు.ముఖ్య అతి థిగా హాజరైన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి నాయకుల నుండి మొదలుకొని జిల్లా, మండల, బూత్ స్థాయి నాయకుల వరకు ప్రతి బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.ఆయన మరింతగా మాట్లాడు తూ, ఈ ఎన్నికలు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్య కర్తను ప్రజాప్రతినిధిగా చేసే అవకాశం కల్పిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఏకతాటిపై నిలబడి పనిచేయాలి. పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, స్థానిక సంస్థల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలి,” అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక ఆలస్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో సన్నద్ధత ప్రారంభించాలని సూచించారు.

నాగర్‌కర్నూల్

సాతాపూర్ గ్రామంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….!

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండల సాతాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఈరోజు 1994 – నుంచి 2018 సంవత్సరం వరకు పదవ తరగతి పూర్తి చేసిన వారందరూ కూడా ఈరోజు అనగా 28వ తేదీ ఆదివారం రోజు సాతాపూర్ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని విజయవంతం గా జరుపుకోవడం జరిగింది…* ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో 30 సంవత్సరాల తర్వాత గ్రామంలోని ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పలువురు విద్యార్థులు మాట్లాడడం మరియు ఒక్కొక్కరి అనుభవాలు జీవితంలో చేదు మరియు మంచి జ్ఞాపకాలు ఒకరినొకరు చెప్పుకోవడం లాటింవి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఒక వేదిక అవుతుంది అని అలాగే మరికొందరు మాట్లాడుతూ అసలు ఇలా గ్రామంలో 25 బ్యాచులకు సంబంధించిన పూర్వ విద్యార్థుల అందరూ కూడా ఓకే వేదికపై కలవడం అంటే ఇది చాలా అంటే చాలా అద్భుతం ఇలాంటి ఆలోచనలు రావడం అందరినీ కలపడం కూడా చాలా గొప్ప విషయం….* అలాగే మరికొందరు కూడా మాట్లాడుతూ గ్రామంలో ఇలా ఈ విధంగా అన్ని బ్యాచుల పూర్వ విద్యార్థుల ఓకే వేదికపై ఇలా 25 సంవత్సరాల SSC బ్యాచుల వారు కలుసుకోవడం అనేది ఆ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్రగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా అందరూ అన్ని బ్యాచుల పూర్వ విద్యార్థుల ఓకే వేదికపై కలుసుకోవడం అనేది ఎక్కడా చూడలేదు వినలేదు అని వారు చెప్పారు. మరికొందరు మాట్లాడుతూ అన్ని కుల మత భేదాలకు రాజకీయాలకు అతీతంగా అందర్నీ సమానంగా చూస్తూ సమాన విద్యను అందిస్తూ విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే ఘనత కేవలం దేవాలయం లాంటి పాఠశాల దేవుణ్ణి లాంటి గురువులకు మాత్రమే ఉంటుంది….* మరికొందరు పూర్వ విద్యార్థుల మాట్లాడుతూ ఇది ఈనాటి బంధం కాదు ఎందుకంటే ఇది రక్త సంబంధం కాదు పేగు బంధం కాదు ముడి వేయకున్న ముడి వేసుకున్న స్నేహ బంధం కాబట్టి ఒకరి ఇద్దరి ఆలోచనలు మేరకు మరియు ఒకరి ఆలోచన మరియు కొంతమంది సముహ నిర్ణయం పిలుపు మేరకు ఈరోజు ఇంతమంది ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం విజయవంతం చేశారంటే అది కేవలం స్నేహ బంధం ద్వారానే సాధ్యమని వారు చెప్పారు.ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం యొక్క కార్యక్రమంలో మరికొంతమంది మాట్లాడుతూ మనం మన గ్రామంలో ఇదే యూనిట్ గా ఇదే ఉత్సాహంతో ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని అందరం అన్నదమ్ముల వలె కలిసిమెలిసి మనలో ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఒకరినొకరం సహాయం చేసుకుంటూ తోడ్పాటుగా ఉండాలి అంటే అది ఒక సొసైటీగా ఏర్పాటు చేసి మనమంతా కూడా కొంత డబ్బును పొదుపు రూపంలో జమ చేస్తే అది మనకి మన పిల్లలకి మరియు మన కుటుంబానికి కావచ్చు మరియు మన గ్రామ అభివృద్ధికి కావచ్చు ఇంకా ఇతర విషయాలకు కావచ్చు మనం వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కొంతమంది చెప్పారు……* కాబట్టి ఈ సందర్భంగా సబాద్యక్షుల వారు మాట్లాడుతూ ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సాతాపూర్ గ్రామంలోని పూర్వ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా పేరుపేరునా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము. ఈ కార్యక్రమంలో సాతాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థినులు మరియు తదితరులు పాల్గొన్నారు……!!!!!*

తిరుపతి

పవన్ కళ్యాణ్ పై మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అంజూరు చక్రధర్

జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్వరంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ హైదరాబాద్ వెళ్ళిన సందర్భాన్ని కూడా వక్రీకరిస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ని విమర్శించడాన్ని,జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ,ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం తో పాటు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైద్య రంగానికి 19,265 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు.మీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ల ను ఏ విధంగా అవమానించారో,ప్రజలకు తెలుసు అని,సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని విషయాలకు కచ్చితంగా సమాధానం చెప్తారన్నారు.

ఆంధ్రప్రదేశ్

గాండ్లతెలికుల కుల అభివృద్ధి కోసం తిరుపతిలో ఘనంగా ఏజిటియుపిఎస్ఎస్ అంతర్ముఖ సమావేశం

** గాండ్లతెలికుల కుల అభివృద్ధి కోసం తిరుపతిలో ఘనంగా ఏజిటియుపిఎస్ఎస్ అంతర్ముఖ సమావేశం** **కుల ఐక్యతే అభివృద్ధికి మార్గం – రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ సదస్సుల నిర్వహణకు సంఘం నిశ్చయము** —-వాకాటి *హరికృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు* తిరుపతిలోని ఎన్జీవో హోం ప్రాంగణంలో ఆదివారం **అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సంక్షేమ సంఘం (AGTU-PSS) ఆధ్వర్యంలో ఒక విశిష్ట అంతర్ముఖ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ ముఖ్యఅతిథులుగా హాజరై, సంఘ సభ్యులకు చైతన్యం కలిగించే సందేశాలను అందించారు.ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుండి గాండ్ల కులానికి చెందిన అనేకమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, యువత, పెద్దలు పాల్గొన్నారు. గాండ్ల కులానికి జరుగుతున్న అపేక్ష, వివక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, తక్షణమే కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేయడం*ముఖ్య ఎజెండాగా ఈ సమావేశం జరిగింది.వక్తలు తమ ప్రసంగాల్లో గాండ్ల కులానికి సమాజంలో తగిన గుర్తింపు రావడంలో ఇప్పటికీ జాప్యం జరుగుతోందని, పలు నైతిక, రాజకీయ, పరిపాలన రంగాల్లో గాండ్ల కులానికి తగిన ప్రాతినిధ్యం లేదని పేర్కొన్నారు. కుల అభివృద్ధి కొరకు ఐక్యత, చైతన్యం, చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గాండ్ల కుల సోదరులందరిని చైతన్యవంతం చేయడానికి ఆత్మగౌరవ సదస్సుల నిర్వహణకు సంస్ధ కార్యాచరణ రూపొందించనుంది. మొదటి ఆత్మగౌరవ సదస్సును తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించనుంది.ఈ సమావేశం కుల ఐక్యతకు, చైతన్యానికి బలమైన బాటను వేస్తుందని, సమాజంలో గాండ్ల కులస్థుల అభివృద్ధికి ఇది ఒక మలుపు కావచ్చని పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడారు.మన కులవర్గానికి న్యాయం జరగాలంటే మనం సంఘటితంగా ఉండాలి, గళమెత్తాలి. సంక్షేమం కోసం సంఘర్షించాలి” అని నాయకులు స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక సమావేశం కాదు ఒక ఉద్యమం మొదటి మెట్టు అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పద్మాకర్, బద్రి, సత్యనారాయణ, శోలింగర్ గిరి(శ్రీనివాస్)బాబు,మురళి మనోజ్, దేవరకొండ భాస్కర్, చెరుకుపల్లి ఈశ్వరయ్య*,చెంచు కృష్ణయ్య, రెడ్డి శేఖర్, బాలనారాయణస్వామి , సుధీర్, ఆనందబాబు పచ్చార్ల సుధాకర్, దేవ సుబ్రహ్మణ్యం,మధు, లెజెండ్ రామచంద్ర, రెడ్డి రమేష్, గాండ్ల కన్నయ్య,అశోక్, రుద్ర గోపి, వెంకటయ్య, చంద్రశేఖర్ ఉదయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 28 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలెం గ్రామానికి చెందిన రైతు జాంగిర్ పాషా పొలంలో వైరు తగిలి ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

నాగర్‌కర్నూల్

సీఎం సొంత గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం అయిన అచ్చంపేట నియోజకవర్గం లోని వంగుర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో రూ. 91.71 కోట్లతో వివిధ శాఖల 18 అభివృద్ధి పనులు.. నూతనంగా నిర్మించినట్టువంటి నేషనల్ హైవే రోడ్డు ప్రారంభోత్సవం, పాల శితిలీకరణ కేంద్రం భవనము ప్రారంభోత్సవం, గ్రామంలో వైర్ లెస్ C.C కెమెరా TV ల ప్రారంభోత్సవం, గ్రామంలోనీ ప్రతి ఇంటికి నూతన సోలార్ యూనిట్ ప్రారంభోత్సవం, నూతన యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభోత్సవం, నూతన మిషన్ భగీరథ {ఇంట్రా} పైప్ లైన్ కనెక్షన్ ప్రారంభోత్సవం, గ్రామంలో చిల్డ్రన్స్ పార్క్ & ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం, కొండారెడ్డి పల్లి గ్రామం నుంచి పోల్కం పల్లి గ్రామానికి నూతన రోడ్డు పనులకు ప్రారంభించిన.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు, స్థానిక అచ్చంపేట శాసనసభ్యులు నల్లమల ముద్దుబిడ్డ TPCC ఉపాధ్యకులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు..* నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి గారు, *నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు*, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు కృష్ణ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ గారు, జిల్లా SP వైభవ్ గైక్వాడ్ గారు మరియు ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

తిరుపతి

ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరియు భారత యువజన సమాఖ్య మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. రామానాయుడు,సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి పిలుపు మేరకు షహీద్ భగత్ సింగ్ 118 వ జయంతి పురస్కరించుకొని ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి,ఏఐఎస్ఎఫ్ బండి చలపతి మాట్లాడుతూ 12 ఏళ్ళ అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి 23 ఏళ్లకే సహచరులు రాజ్ గురు సుఖ దేవ్ లతో కలిపి ఉరితీయబడ్డ ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ అగ్రగణ్యులు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏఐటియూసి నాయకులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

శ్రీ మహాలక్ష్మి దుర్గామాతకు ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్1 మరియు 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 7 రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా అదివారం నాడు నిర్వహించారు. శ్రీ మహా చండి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమటం విజయ్ కుమార్ శాస్త్రి లు శాస్త్రోక్తంగా వేదమంత్రాలమధ్య రోడ్ నెంబర్ 2 లో ఆగారం సునీల్ కుమార్ ,మాలతి దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో నరసింహ రత్న దంపతులతో ప్రత్యేక పూజలు జరిగియాయి. ప్రదోషవేల లో మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక విశేష నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాధిక సాయి తేజ, నాగమణి, రేనమ్మ , అలివేల, మహేశ్వరి, రామేశ్వరి సువర్ణ , యాదమ్మ, ఇందిరమ్మ,కందికొండ గీత, వెంకటమ్మ, పద్మ,ఎల్ వేణు గౌడ్,ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు,చిన్నయ్య, నారాయణ, బాలస్వామి , కురుమయ్య,మహిళలు ,చిన్నారులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

తిరుపతి

గుమ్మిడిపూడి దశరదాచారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం ఎక్సలెంట్ అవార్డ్

శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ గుమ్మిడిపూడి దశరథాచారి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం ఎక్సలెంట్ అవార్డు వరించింది.విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంట్ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిధిలో ఎక్సలెంట్ అవార్డు -2024-2025 ను దశరథాచారి కి అందించారు.గత 40 సంవత్సరాలుగా హస్తకళల అభివృద్ధికి ఆయన చేసిన సేవకు ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం.

నాగర్‌కర్నూల్

అచ్చంపేట కేటీఆర్ బహిరంగ సభకు బయలుదేరిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 నగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు అచ్చంపేటలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వారి బహిరంగ సభ కు మినపల్లి మండలం నుండి భారీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బి జగదీశ్వర్ రెడ్డి, కురుమయ్య, బోట్ క చంద్రశేఖర్, తిరుపతయ్య, సాంబశివ, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.