Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక – జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

రేపు (సోమవారం ) ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ లో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీ దారుల అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం గూర్చి తెలుసుకోవాలంటే 1100 (డబల్ వన్ డబల్ జీరో)కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజ్యసభ సభ్యులు శ్రీపా కా సత్యనారాయణ ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు

న్యూస్ సెప్టెంబర్ 28 నానాజీ కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు కవి కోకిల శ్రీ గుర్రం జాషువా జన్మదిన ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యులు శ్రీ పా కా సత్యనారాయణ ను ముమ్మిడివరం అసెంబ్లీ కార్యకర్తలు ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం ప్రధానమంత్రి మనకి భారత్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి చెక్క అజయ్ వర్మ రాయపురెడ్డి భైరవమూర్తి పెనమండ్ర విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు గనిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ జీకేడీ ప్రసాద్ కి జాషువా రాష్ట్ర పురస్కారం

న్యూస్ సెప్టెంబర్ 27 కాట్రేనికోన (నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోన : మండలంలోని నడవపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ జీకేడీ ప్రసాదరావుకి 2024 సంవత్సరం గుర్రం జాషువా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురస్కారం లభించింది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింగళి వెంకయ్య సభావేదికలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ పురస్కారంలో రూ.50,000 నగదు, ప్రశంసా పత్రం, శాలువా, పుష్పగుచ్ఛం అందించారు. డాక్టర్ జీకేడీ ప్రసాద రావు 2011లో “దళిత జర్నలిజం” గ్రంథం, దేశంలో దళిత ప్రశ్నకు సంబంధించిన వ్యాస సంపుటి “సామాజిక”ను 2015లో వెలువరించారు. ఇవిగాక దళిత సంబంధిత సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల మీద వివిధ పత్రికల్లో వందకు పైగా వ్యాసాలు రాశారు. మరికొన్ని పరిశోధన పత్రాలు ప్రచురించారు. ఈయన ప్రస్తుతం వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ముఖ్యఘట్టాల మీద వివిధ పత్రికల్లో వ్యాసాలు రాశారు. డాక్టర్ ప్రసాదరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక మరియు సృజన శాఖ కార్యనిర్వహాక సంచాలకులు ఆర్. మల్లికార్జునరావు, విజయవాడ కలెక్టర్ ఎస్పీ షా, చైర్మన్ పొడపాటి తేజస్విని ఇతర చైర్మన్లు, ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు

దేవినవరాత్రుల సందర్బంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదివారం శ్రీకాళహస్తి పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.వారితో పాటుగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ చైర్మన్ అంజూరు తారక్ శ్రీనివాసులు పాల్గొన్నారు.ముందుగా వారికి ఆలయ అధ్యక్షులు జూలగంటి మురళి మోహన్ గుప్తా గౌరవ అధ్యక్షులు M.R.V. సురేంద్ర బాబు (చిట్టి),మరియు ఆలయ పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి ని దుస్సాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎలూరు

మహా చండి దేవి గా దుర్గమ్మ

మహా చండీ దేవి గా దుర్గమ్మ ఆగిరిపల్లి: స్థానిక రుద్ర భూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయంలో అమ్మవారు మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రజక వీధులో అమ్మవారికి వారాహి దేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక క్షేత్రంలో వేంచేసియున్న కృష్ణ దుర్గాదేవి అమ్మవారిని మహా చండీ దేవిగా అలంకరించారు. క్షేత్రం వ్యవస్థాపకులు వీర కృష్ణ భవానికి భక్తులు తులాభారం నిర్వహించారు.

తిరుపతి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి పట్టణంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనితో ఆర్థిక సహాయం కొరకు అభ్యర్థించిన వారి అభ్యర్థనలను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పంపించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణం నందు 11,33,688 రూపాయల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి కృషి అభినందనీయమని,ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పార్టీలకు అతీతంగా ప్రజలకు సహాయం చేస్తున్నారని ప్రజల కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

సల్మాన్.. నీ డబ్బెక్కడ? 34 లక్షల కోసం ఊళ్లో రచ్చ! 

– పౌల్ట్రీ సప్లయర్‌ ఇంటి ముందు రైతుల దండయాత్ర!  కామారెడ్డి, 28 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి   : కామారెడ్డి జిల్లాలో పౌల్ట్రీ రైతులను నట్టేట ముంచాడు. కోడి కత్తులు కాదు, కోట్లాది ఆశలు! రైతుల కష్టార్జితాన్ని మింగేసి, అప్పుల ఊబిలోకి తోసిన ఓ పౌల్ట్రీ వ్యాపారి ఇంటి ముందు నేడు అసలు ‘మాస్’ సినిమా కనిపించింది! కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం అన్నారం గ్రామం ఉద్రిక్తతతో అట్టుడికిపోయింది. రైతులను నుంచి కోళ్లను అప్పుగా తీసుకుని, కంపెనీల నుంచి డబ్బులు వచ్చినా కక్కకుండా తిప్పుకుంటున్న సల్మాన్ అనే పౌల్ట్రీ సప్లయర్‌ ఇంటి ముందు బాధిత అన్నదాతలు ఆందోళన దిశగా కదం తొక్కారు. దొంగ-పోలీస్ ఆటలా మారిన వ్యాపా రం! వ్యాపారంలో భాగస్వాములైన భూంపల్లి గ్రామానికి చెందిన సాజిద్ పరిస్థితి మరింత దయనీయం. రైతుల నుంచి కోళ్లు తీసుకుని సల్మాన్‌కు అమ్మడం, ఆ డబ్బే చివరకు రైతుల చేతికి అందడం ఈ చైన్ సిస్టమ్. కానీ కొద్ది రోజులుగా, కంపెనీ నుంచి వచ్చిన సొమ్మును గుంజుకుంటున్న సల్మాన్, దళారి అయిన సాజిద్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదు. దీంతో కోళ్లు ఇచ్చిన సుమారు 20 మంది రైతులకు దాదాపు ₹34 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. డబ్బుల కోసం రైతులు సాజిద్ ఇంటికి క్యూ కట్టడంతో పరిస్థితి చేయి దాటింది.  కారు ఎక్కించిన కిరాతకం! తాను పడుతున్న ఇబ్బందులు పడలేక, సల్మాన్‌ను నిలదీసేందుకు ఇటీవల వెళ్లిన సాజిద్‌కు దిగ్భ్రాం తికర అనుభవం ఎదురైంది. “డబ్బులు ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకో!” అంటూ బెది రించడమే కాక… సాజిద్‌పై నుంచే కారు తీసుకెళ్లి అమానుషంగా గాయపరిచాడని బాధితుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.  రైతుల రక్షణ కవచం.. నేరుగా సల్మాన్ అడ్డాపైకే! పదిహేను రోజులుగా కామారెడ్డిలోనే ఉండి, రైతుల ఒత్తిడి తట్టుకోలేక… ఒక్కడిని వెళ్తే సల్మాన్ మళ్లీ ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమోనన్న భయంతో సాజిద్ ఏకంగా ఆ 20 మంది రైతులతో కలిసి అన్నారంలోని సల్మాన్ ఇంటికే వచ్చేశాడు. “మా డబ్బివ్వు… లేదంటే ఇక్కడి నుంచి కదలం!” అంటూ రైతు దండు సల్మాన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రైతుల ఆవేశం, కష్టార్జితాన్ని కబళించిన కోపంతో… అన్నారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌల్ట్రీ వ్యాపారి సల్మాన్ ఇప్పుడు రైతుల ఉగ్రరూపాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి!

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.2000.. ఎప్పుడంటే

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 20వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగా, ప్రస్తుతం 21వ విడత డబ్భుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా అప్డేట్ అందుతోంది. ఈ విడత నగదు అక్టోబర్ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

సినిమా

రెబల్ స్టార్కు తండ్రిగా మెగాస్టార్ !

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ కి మెగాస్టార్ తండ్రి గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్

ప్రింట్ చేసిన బిల్లులను చేత్తో ముట్టుకోవద్దని వైద్యులు ఎందుకు చెబుతున్నారు

సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) ప్రింట్ చేసిన బిల్లులు, ఏటీఎం స్లిప్లకు ఉపయోగించే థర్మల్ పేపర్లో హానికర బిస్ఫినాల్స్, బీపీఏ రసాయనాలు ఉంటాయని, ఇవి చర్మం ద్వారా సులువుగా రక్తంలోకి చేరగలవని ముంబై వోకార్ట్ ఆస్పత్రి వైద్యుడు అనికేత్ మూలే తెలిపారు. ఈ రసాయనాల్లో హార్మోన్ల సమతుల్యత, ఫెర్టిలిటీని దెబ్బతీసే గుణాలతో పాటు క్యాన్సర్ కారకాలూ ఉంటాయన్నారు. అందుకే తమ ఉత్పత్తులు బీపీఏ ఫ్రీ అని కంపెనీలు ప్రత్యేకంగా చెబుతాయన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.