Monday, 4 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వెనక్కి వెళ్లిన అంతర్వేది సముద్రం తీరం..సునామి వచ్చే సూచనలు

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లో నిర్మానుష్యంగా మారి 500 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆందోళన చెందుతున్న స్థానికులు. అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో నిండి పోవడంతో సముద్రం స్నానానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్న పర్యాటకులు, భక్తులు. మునుపెన్నడు ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని సునామి వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు… ఎడారిని తలపించే విధంగా సముద్రం విశాలంగా వెనక్కి వెళ్లిపోవడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో స్థానికులు.. గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లిన సముద్రం… ఇప్పుడు ఒండ్రు మట్టి ముందుకు వచ్చి సముద్ర వెనక్కి వెళ్లడంతో భయాందోళనలో చుట్టుపక్కల గ్రామస్తులు.

జాతీయ అంతర్జాతీయ

రూ.334 కోట్ల అవినీతి.. చైనా మాజీ మంత్రికి మరణశిక్ష!

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చైనా మాజీ మంత్రి టాంగ్ రెన్‌జియాన్‌కు అవినీతి ఆరోపణలపై దేశ దర్యాప్తు సంస్థలు మరణశిక్ష విధించాయి. రూ.334 కోట్ల విలువైన లంచాలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో జిలిన్ ప్రావిన్స్ కోర్టు టాంగ్‌పై జీవితకాల రాజకీయ నిషేధాన్ని ప్రకటించింది. ఆయన ఆస్తులను జప్తు చేయాలని, అవినీతి ద్వారా సంపాదించిన మొత్తం సొమ్మును ప్రభుత్వ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది. టాంగ్ రెన్‌జియాన్ ప్రభుత్వ పదవుల్లో ఉన్నప్పుడు తన హోదాను దుర్వినియోగం చేసి అధిక మొత్తంలో లాభాలు పొందినట్లు న్యాయస్థానం పేర్కొంది. చైనా అవినీతిపై తీసుకుంటున్న కఠిన చర్యలలో ఇది తాజా ఉదాహరణగా నిలిచింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టు విలీనం

సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టు ఇకపై స్పీడ్ పోస్టు కింద వాల్యూయాడెడ్ సర్వీసుగా అందుబాటులో ఉంటుంది. అలాగే, దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి తీసుకువచ్చారు. డెలివరీ సురక్షితంగా జరిగేందుకు OTP ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నిర్ణయంతో సేవల వేగం, విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. తపాలా వ్యవస్థను ఆధునీకరించేందుకు తీసుకున్న ఈ చర్య ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా అధికారులు పేర్కొన్నారు.

తిరుపతి

వైయస్సార్సీపీ కి కార్యకర్తకు అండగా డిజిటల్ బుక్: మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి వైసీపి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.వైసిపి కార్యకర్తలు నాయకులకు అండగా ఉండే విధంగా డిజిటల్ బుక్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకుల పైన 257అక్రమ కేసులు పెట్టారన్నారు.ప్రతి వైసీపీ కార్యకర్త,నాయకుడు క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి మీకు జరిగే అన్యాయాలను వెంటనే డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు.మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ మాట్లాడుతూ సమైక్యంగా ఏ సమస్యపైనైనా పోరాడితే పరిస్కారం దొరుకుతుందని,ప్రతి కార్యకర్త,నాయకుడు ఏకతాటిపై ఉండాలని తెలియజేసారు

నాగర్‌కర్నూల్

ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

పున్నమి ప్రతినిధి నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 29 బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన ఏటవాళీ రవి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈనెల 26 తారీఖున తన సొంత పనిమీద వనపర్తికి స్కూటీపై వెళ్తున్న సమయంలో తాడ్పర్తి దగ్గర అదుపుతప్పి చెట్టుకు గుద్దుకొని ప్రమాదానికి గురి కావడం జరిగింది. వెంటనే వనపర్తి ఏరియా హాస్పిటల్ తరలించడం చికిత్స పొందుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న శెట్టి రాజేష్ కుమార్ జనపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్య లక్ష్మి కి 5000 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారం రోజుల క్రితం ఆ కుటుంబంలోని తండ్రి అనారోగ్యంతో మరణించారు. కుటుంబం పూర్తి పేదరికంలో ఉన్నందున, తండ్రి మరణించడం, ప్రమాదంలో కొడుకు మరణించడం దీంతో ఆ కుటుంబం పని చేసుకుంటే తప్ప పూట గడవదు, దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని శెట్టి రాజేష్ కుమార్ జనంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మానవత్వంతో తనకు తోచినంత ఆకుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఇలా సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేసే వాళ్ళు ముందుకు రావాలని శెట్టి రాజేష్ కుమార్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పిగంటి యాదయ్య జెనగ చిన్నయ్య జక్కి వీరస్వామి కారుకొండ వెంకటేష్ ఏటావలి చంద్రశేఖర్ పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తెలుగోడు దెబ్బకి పాక్ గజాగజా లా డిపోయింది – ఓడుపోయింది

ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే….. పాక్ ను మట్టికరిపించిన భారత్ ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆసియ కప్ ఫైనల్ లో భారత్ ఘన విజయం – తిలక్ వర్మ చెలరేగి ఆడటంతో

సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) ఆసియా కప్ లో లీగ్ దశలో పాటు ఫైనల్ మ్యాచ్ లోను విజయం సాధించిన భరత్. ఈ ఆసియ కప్ లో రెండు సార్లు లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసి ఫైనల్ తో సహా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై భరత్ విజకేతనం ఎగారావేసింది దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించినా, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. కుల్స్టాప్ 4 వికెట్లు, బుమ్రా, వరుణ్, అక్షర్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేసి, దూబే 33 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయం భారత్‌కు మరో ఆసియా కప్ కిరీటాన్ని అందించింది.

తూర్పు గోదావరి

ప్రభుత్వ కార్యాలయంలో ఆంగ్లభాషను రద్దు చేయాలి మేడ శ్రీనివాస్ డిమాండ్

మోసానికి చిరునామాగా ఆంగ్ల బాష కీర్తి గడించింది ప్రభుత్వ కార్యాలయంల్లో ఆంగ్ల బాషను రద్దు చేయాలి . ఎక్కువగా మోసాలు – కుంభ కోణాలు ఆంగ్ల బాష తోనే జరుగుతున్నాయి . ప్రభుత్వ కార్యాలయాలన్ని బోర్డులు , ఇతర కార్యకలాపాలన్ని మాతృ బాష లోనే జరగాలి . మేడా శ్రీనివాస్ , డిమాండ్ , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ .. న్యాయస్థానాల్లో సైతం మాతృ బాష లోనే తీర్పులు అమలు చేస్తేనే ఆంగ్ల నేరాలు తగ్గుముఖం పడతాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు .. మోసాలకు , అక్రమాకలకు, అధికార దుర్వినియోగ చర్యలకు ఆంగ్ల బాష ప్రసిద్ధి చెందింది . అత్యధిక మోసాలు అన్ని ఆంగ్ల బాష లోనే జరుగుతుండటం విశేషం . ఆంగ్ల దేశాల వలే ఆంగ్ల బాషకు కూడా ఒక రకమైన ఆధిపత్య ధోరణికి మార్గం ఉంటుంది . ఆంగ్ల బాష పుట్టుకలోనే మోసం, దగా, ఆధిపత్యంతో కూడిన మూలాలు బలంగా ఉంటాయి . బలవంతంగా ఆంగ్ల బాషను యావత్ భారతీయులపై రుద్దుతున్నారు . ఆంగ్ల బాష భారతీయులకు శత్రు బాష అని ప్రతి భారతీయుడు విశ్వసిస్తాడు. ఆంగ్ల బాష , ఆంగ్ల దేశాలు భారతీయుల చెడు కోరేవి , ఆ బాష , ఆ దేశాల స్వభావం విష పాములను పెంచి పోషిస్తున్నట్టే నని భారతీయులు భావిస్తారు . ఆంగ్ల బాష , ఆంగ్ల దేశ సంప్రదాయాలకు బానిసలుగా మారుతున్న మన కార్పొరేట్ పాలకులు ఆ భాషతో అనేక కుంబకోణాలు , అనేక నేరాలకు కేంద్ర బిందువుగా చారిత్రిక స్థానం కైవసం చేసుకుంటుంన్నారు . ప్రపంచం మొత్తంగా జరిగే ప్రతి మోసం కు ప్రధాన చిరునామాగా ఆంగ్ల బాష కీర్తింప బడుతుందని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు .. అనేక కార్పొరేట్ నేరగాళ్లు ఆంగ్ల బాషను అస్త్రంగా మార్చుకుని లక్షల కోట్లు ఆర్ధిక నేరాలకు మార్గం చేసుకుంటున్నారు . ప్రతి అధికారిక మోసం , కుట్ర, దగా లకు ఆంగ్ల భాష వెన్నంటే ఉంటుంది . ప్రతి మోసానికి ఆంగ్ల బాష ఒక ఆయుధం వలే ఉంటుంది . ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార దుర్వినియోగ కార్యకలాపాలాన్ని ఆంగ్ల బాషను ప్రోత్సహించేదిగానే ఉంటుందని ఇందుకు అనేక బలమైన కారణంగా సైతం ఉంటాయి . మాతృ బాషలో పాలనా సంస్కారణలను అమలు చేస్తే మోసం చేయటం, మోసపోవటం అంత సులువైనది కాదు అని గుర్తించాలి . ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంగ్ల బాషను రద్దు చేసి మాతృ బాషలను ప్రోత్సహించే విధంగా చట్టాలను సవరించాలని ఆయన కోరారు . ఆంగ్ల బాష మోసాలకు, కుంభకోణాలకు కేంద్ర బిందువుగా మారింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు . ఆంగ్ల బాష కు ఒక శాప్రదాయం , సంస్కృతి , ఒక గౌరవ ప్రతిష్ట ఆ బాషకు గల పుట్టుక లోనే లేదని , ఆంగ్ల బాష ఎందుకో నేడు మోసాలను శాసించే స్థాయిలో కూర్చుంది . ప్రతి నేరం వెనుక ఆంగ్ల బాష ప్రమేయం , తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. నేరస్తుడుకి ఒక ముడి సరుకు వలే ఆంగ్ల బాష అండగా నిలుస్తుంది . సామాన్యులకు , నిజాయితీగా బ్రతకటానికి ఏ మాత్రం పనికిరాని బాష ఆంగ్లం అని తెలిసి కూడా పాలకులు ఆంగ్ల బాష ను నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు . అన్ని రకాల నేరాలకు ఒక భూతం వలే ఆంగ్ల బాష నడుస్తుంది .మాతృ బాషలో నిజాయితీ, గౌరవం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్వచ్ఛత, మమతానురాగాలు నిలువెత్తున కనపడుతుంటాయి . కసాయి తనంకు , ఆధిపత్యాల తోను ప్రపంచ వినాశనాన్ని కోరుకునే ఆంగ్ల బాషకు భారతీయులు పాతరేయాలని ఆయన తెలిపారు .. ప్రభుత్వ కార్యాలయాల బోర్థులు అన్ని మాతృ బాష లోనే వుండే విధంగా ప్రభుత్వాలు చర్యలకు ఆదేశించాలి . ప్రభుత్వ కార్యకలాపాల అన్నింట ప్రతి చర్య కూడా మాతృ బాషను ప్రేమించే విధంగా ఉండాలి . ఆంగ్ల బాషను ఒక టీష్యు పేపర్ వలే వినియోగించుకోవాలి తప్ప నెత్తిన పెట్టుకుని పూజించరాదు . న్యాయస్థానాల్లో సైతం మాతృ భాషల్లోనే మొత్తం పూర్తి ప్రక్రియ జరిగే విధంగా సంస్కరణలు అమలు జరగాలి . అత్యున్నత భారతదేశ ప్రధాన న్యాయమూర్తులు సైతం అనేక సందర్భాల్లో మాతృ భాష ల్లోనే తీర్పులు వెలువడే విధంగా ప్రణాళికలు అమలు చేయటంపై ఉన్నత న్యాయస్థానం దృష్టి సారిస్తుందని చెప్పిన ఘటనలు వున్నాయి . భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లోను, న్యాయస్థానాల్లోను ఆంగ్ల బాష ను పూర్తిగా రద్దు చేసి మాతృ బాషలను అమలు చేసే విధంగా విప్లవాత్మాక తిరుగుబాటు వస్తుందని , ఆంగ్లం వద్దు , మాతృ బాష ముద్దు అనే నినాదాన్ని దేశ వ్యాప్తంగా రగిలించాలి . ఆంగ్లం మాట్లాడటం అవమానం అనే రోజులు భారత్ లో మొదలవుతాయి. ముందు ముందు రోజులు ఆంగ్లం మాట్లాడటం అవమాన కరం అనే పరిస్థితులు భవిష్యత్ సమాజం నిర్దేశిస్తుంది . ముందు ముందు అఖండ భారత్ లో యావత్ ప్రజలు ఆలోచన చేస్తారు . యావత్ అఖండ భారతీయులు అందరు స్వదేశీ మాతృ బాష ఉద్యమాల్లో పాల్గొనాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు . ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాద్ , వర్ధనపు శరత్ కుమార్ , వల్లి శ్రీనివాసరావు , గుడ్ల దుర్గా ప్రసాద్ , చల్లా సాంబశివరావు , బసా సోనియా , కాకర ప్రసాద్ , రెడ్డి స్వర్ణలత , కోట సుశీల , చల్లా దుర్గారావు , కందివలస రమణ , కందివలస హైమావతి , యర్రా బాల మురళి కృష్ణ , ముగ్గుల రాజేష్ , అల్లాడ రమేష్, సుంకర వెంకట భాస్కర రంగారావు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కొట్టే సాయి ని సత్కరించిన ఏర్పేడు మండల జనసేన నాయకులు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన కొట్టేసాయిని ఏర్పేడు మండల జనసేన నాయకులు ఆదివారం కలిసి దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య జన సైనికుడికి ఇంతటి కీలకమైన పదవిని అప్పగించడం పట్ల పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పాలకమండలి చైర్మన్గ్ గా కొట్టేసాయి దేవాలయ అభివృద్ధికి అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

తెలంగాణ క్రికెట్ కు ఎంపిక అయినా క్రాంతి

ఈ రోజు భువనగిరి పట్టణం లోని గణేష్ క్రికెట్ అకాడమీ నుండి రాష్ట్ర ప్రాబబుల్స్ కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన పల్లె పాటి క్రాంతి గారి కి BKT ప్రజ పతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రాంతి కి 20, 000 రూపాయలు క్రికెట్ కిట్ ను అందజేశారు ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా డీసీపీ ఆకాంక్ష యాదవ్ గారు పాల్గున్నారు ఈ సందర్బంగా వారు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రానున్న రోజులు నేషనల్ కి సెలక్ట్ కావాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉమ్మడి నల్లగొండ జిల్లా సెక్రటరీ అమీన్ బాబా గారు BKTఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ.NA స్పోర్ట్స్ చింగిచర్ల కోర కమిటీ సభ్యులు BRS పట్టణ అధ్యక్షులు AV కిరణ్. AV కేతన్. R సతీష్ కోచ్ తదితరులు పాల్గున్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.