Monday, 4 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పాతపట్నం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నీలమణి దుర్గమ్మవారి దివ్య దర్శనం

పాతపట్నం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నీలమణి దుర్గమ్మవారి దివ్య దర్శనం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పాతపట్నంలోని శ్రీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు సాయంత్ర వేళ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో నిండిపోగా, మంగళ వాద్యాలు, జయజయధ్వానాలతో వాతావరణం ఘనంగా మారింది. మహోత్సవాల భాగంగా ఆలయంలో ప్రత్యేక అలంకారం చేసి, చండీహోమం, కుంకుమార్చనలు, సాంప్రదాయ పూజలు నిర్వహించారు. భక్తులు గణపతిగా తరలివచ్చి, అమ్మవారి దివ్య కరుణకు సాక్ష్యమయ్యారు. అమ్మవారి ఆశీర్వాదంతో కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, సుభిక్షం కలుగుతాయని విశ్వాసంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

ఆర్డీఓ కి వినతిపత్రాన్ని ఇచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీవోలకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తూ వాలంటీర్ విధులను,జె ఎస్ డబ్ల్యు డిపార్ట్మెంట్ కేటాయించిన డోర్ టు డోర్ సర్వేలు,డాష్ బోర్డులతో నిరంతరం ఒత్తిడికి శారీరక శ్రమకు గురవుతున్నట్లు పని భారం తగ్గించమని మా సమస్యలకు పరిష్కారం చూపమని ఇదివరకే వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అయినా పట్టించుకోవడం పోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ ఇందుకు నిరసనగా ఒకటో తారీకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నల్ల బ్యాడ్జీలు ధరించి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

అన్నమయ్య

ఆచార్యదేవోభవ జాతీయ పురస్కారం గ్రహీత పసుపుల రాజశేఖర్

చిట్వేలి, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల బోధకుడిగా, ఎన్సీసీ అధికారిగా తన సేవలను అందిస్తున్న పసుపుల రాజశేఖర్ గారు, విద్యా రంగం మరియు సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గాను ఆచార్యదేవోభవ జాతీయ పురస్కారం–2025 అందుకున్నారు.ఈ అవార్డును ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెంలో యువతేజం ట్రస్ట్ – కలాం విజన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, తెలంగాణ హైకోర్టు చీఫ్ సూపరింటెండెంట్ పీవీపీ అంజలి కుమారి, సంస్థ చైర్మన్ ఎస్. కరీముల్లా, డాక్టర్ నారాయణస్వామి చేతుల మీదుగా ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ గారు మాట్లాడుతూ –“ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ బోధనతో పాటు, సమాజ సేవలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం రావడం ఆనందంగా ఉంది. ఇది భవిష్యత్‌లో మరింత బాధ్యతతో సేవ చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది” అని తెలిపారు.ఈ విజయానికి సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు ఆయనను హృదయపూర్వకంగా అభినందించారు.

చిత్తూరు

పూతలపట్టు: రైలు పట్టాలు తప్పిన ఇంజన్

పూతలపట్టు మండలం కొత్తకోట పంచాయతీ మోటకంపల్లె వద్ద రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, కేవలం ఇంజన్ మాత్రమే వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎవరికి ఎటువంటి గాయాలు లేవు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు

గణనాథుని దర్శించుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి, తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

నిర్మల్

తెంబూర్నీ యోగేశ్వర కాలనీలో అంగరంగ వైభవంగా దుర్గామాత నవరాత్రులు

నిర్మల్ జిల్లా తెంబుర్ని గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిత్యా అన్న దాన కార్యక్రమం జరుగుతుంది 🙏ఇక్కడకు అనేక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా దుర్గామాత యొక్క ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ దుర్గామాత అందరికీ కొంగుబంగారమై కోరిన కోరికలను తీరుస్తూ అందరిని సుఖసంతోషాలతో ఉండాలని దీవిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు 400 మందికి పైగా అన్నా ప్రసాదన మరియు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి…. ఇక్కడికి అనేక చుట్టూ ప్రక్కల గ్రామాలనుంచి భక్తులు వస్తారు ఇ రోజు సరస్వతి మాత అవతారం లో భాగంగా అక్షరాభ్యాసం. విద్యార్థులకు కొసరి ముత్యం పంతులు చేయించారు. కమిటీ వారు.స్వాములు మాతాస్వాములు. అనేక రకాల నైవేద్యలను మాతకు సమర్పించారు. దుర్గామాత నవరాత్రులతో తెంబూర్నీ గ్రామం అంత భక్తి ప్రమాతంగా మారిపోయింది. ఎక్కడ చూసిన అమ్మ దుర్గమ్మ అంటూ 100 పైగా మాలధారణ తీసుకున్నారు……, కమిటీ సభ్యులు దగ్గర ఉండి అన్ని కార్యాక్రమాలను పర్యవేక్షిస్తుంది……. జై దుర్గామాత……….. జై భవానీమాత..🙏🙏🙏🙏

అన్నమయ్య

హిందూ ధర్మ స్మశాన వాటిక వద్ద స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమం

చిట్వేలు, సెప్టెంబర్ 29(పున్నమి ప్రతినిధి) “వృక్షో రక్షతి రక్షితః, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” అనే భావంతో, కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్‌గా సేవా కార్యక్రమాలు చేసి చూపించాలని ముందడుగు వేసిన చిట్వేలి గ్రామానికి చెందిన పర్యావరణాభిమానులు ఆదర్శంగా నిలిచారు.సోమవారం చిట్వేలి హిందూ ధర్మ స్మశాన వాటిక వద్ద స్వచ్ఛంద సేవకులు నూతి సత్యం, గాడి ఇంతియాజ్ అహ్మద్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ – “చాలా కాలంగా స్మశాన వాటికలో టెంకాయ, రావి, కానుగ, వేప, గన్నేరు, నందివర్ధనం, మందారం వంటి పూల చెట్లు నాటాలనే ఆలోచన ఉండేది. అంత్యక్రియల సమయంలో టెంకాయ మట్టలు, పూలు అందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు వర్షాలు పడుతుండటం వల్ల ఇది సరైన సమయం అని భావించి ఈరోజు కార్యక్రమం చేపట్టాం” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నూతి సత్యం చొరవ చూపినందుకు చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.అలాగే, ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రధాన రహదారి వెంబడి, పురవీధులలో సి.హెచ్.ఎస్. సంస్థ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా పెరిగి చల్లటి నీడనిస్తున్న ఉదాహరణను గుర్తు చేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – “ప్రస్తుతం వర్షాకాలం, మొక్కలు నాటడానికి అద్భుతమైన సమయం. యువత ముందుకు వచ్చి ఇలాంటి పర్యావరణ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. పచ్చని భవిష్యత్తు కోసం మా సంస్థ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం” అని హామీ ఇచ్చారు.

తిరుపతి

వైసీపీ నాయకులు మృతికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సంతాపం

శ్రీకాళహస్తి మండలం,ఎగువవీధి పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిరామయ్య ఆకస్మిక మృతి చెందడంతో సోమవారం వారి పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు.మాజీ శాసనసభ్యులతో పాటు నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,నారాయణ,మహేష్,కోటేశ్వర రావు,గున్నయ్య,ప్రతాప్,సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

తెలంగాణ

అధికారులు! జర ఈ రోడ్డు గురించి ఆలోచించండి?

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామం వద్ద జాతీయ రహదారి నుండి ఊరిలోపలకి వెళ్లే రహ దారిలో అనేక సంవత్సరాల నుండి గుంతల మయంగా ఉన్న రోడ్డు వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డున బాగు చేయించాలని ప్రజల విజ్ఞప్తి చేసిన పట్టించుకోని అధికారులు. ఈ రోడ్డును బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

జోగులాంబ గద్వాల

జోగులాంబ దేవికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ.

అలంపూర్ : అక్టోబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్…. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో దీప్తి అధికారులకు శేష వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత. గద్వాల సంస్థాన వారసుడు కృష్ణా రాంభూపాల్. ఆలయ కమిటీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.