Monday, 4 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు!

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) గుడ్‌ న్యూస్‌.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు! వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపెనీకి మార్చుకోవడానికి అనుమతించే “LPG ఇంటర్‌ఆపరబిలిటీ”పై పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీనిపై వినియోగదారులు, పంపిణీదారుల నుండి సూచనలు కోరింది. 2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం, అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది. ఇప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

తూర్పు గోదావరి

పుష్కర ఘాట్ లో భవాని భక్తులు మరణానికి కారకులైన రెవిన్యూ, మునిసిపల్

పుష్కర ఘాట్ లో భవానీ భక్తుల మరణానికి కారకులైన రాజమండ్రి రెవిన్యూ – మున్సిపల్ కార్పొరేషన్ ల పై చట్ట పరమైన చర్యలు , శాఖా పరమైన చర్యలకు ఆదేశించాలి . ఈ రెండు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను తూర్పుగోదావరి జిల్లా నుండి వేరే ప్రాంతాలకు బదిలి చేసి రాజమండ్రి కి ఉత్తమ ఉద్యోగులను ఆపాయింట్ చేయండి. ఈ రెండు విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే రాబోవు పుష్కరాల్లో పెద్ద ప్రమాదాలే సంబవిస్తాయి . భవాని భక్తుల మరణానికి ఖచ్చితమైన బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టండి .. –మేడా శ్రీనివాస్ , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..

ఆంధ్రప్రదేశ్

క్రాప లో స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ వైద్య శిబిరం

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం క్రాప గ్రామ పంచాయితీ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ బొబ్బిలి సీతా దేవి అయ్యప్ప అధ్యక్షతన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అయినవిల్లి మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో కో ఇంచార్జి గనిశెట్టి వెంకటేశ్వరరావు సందర్శించారు. మొదటగా వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు మహిళలకు ఆరోగ్యమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెంకటరమణ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం ఇచ్చారన్నారు. జీఎస్టీ పై ప్రజలకు ఉన్న అపోహలకు సమాధానం చెప్పారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని అన్నారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా బాలింతలకు పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది అన్నారు. అనంతరం సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి వారు చేసిన పౌష్టికాహార పిండి వంటలు రుచి చూశారు. ఈ కార్యక్రమంలో క్రాప శంకరాయ గూడెం సర్పంచ్ బొక్క కామేశ్వరరావు, ఎంపీటీసీ సానబోయిన శ్రీనివాసరావు, బొబ్బిలి రాంబాబు, సూరిబాబు, సచివాలయ ఉద్యోగులు, కూటమి నేతలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సోమేశ్వరంలో విద్యార్ధులకు ఘనంగా సరస్వతీ పూజ

పున్నమి న్యూస్ (కోనసీమ) సీనియర్ జర్నలిస్ట్ రమణ: రాయవరం మండలం సోమేశ్వరం గ్రామం, రెడ్డి కృష్ణమ్మ పేట లో వేయించేసి వున్న శ్రీ గోవింద మాంబా సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పార్వతీ పరమేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రుల 8వ రోజు సరస్వతి దేవి అవతారం మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తో అమ్మవారి సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారుగా 500 మంది విద్యార్థులు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం సరస్వతి అమ్మ వారి పూజ గణంగా జరుగుతుంది అని వివరించారు., అలాగే పిల్లలు అందరికీ కమిటీ వారు పాలు, కోవా, వాటర్ బాటిల్, ఎగ్జామ్ ప్యాడ్ లు, పుస్తకాలు, స్కెచ్ లు, బాక్స్ లు, ఎక్కాల పుస్తకాలు. అమ్మవారి ఫోటోలు, తీర్థ ప్రసాదాలు తో పిల్లలను ఆశీర్వదించడం జరిగింది.

తూర్పు గోదావరి

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలకోసం కృషి – గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ వేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ గతంలో 20శాతం సిబ్బంది ఉండేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక వైద్యులను, సిబ్బందిని పెంచుకుంటూ రావడం వలన ఇంకా 40శాతం లోటు ఉందని తెలిపారు. కొన్ని స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఇక్కడ జాయిన్ కావడం లేదని ఆయన తెలిపారు. ఇవన్నీ పరిశీలించి పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వాసు చెప్పారు. రక్తం శాంపిల్స్ ఒకటికి రెండు సార్లు తీసుకుంటున్నారని పిర్యాదులు రావడంతో అకస్మాత్తుగా వచ్చి తనిఖీ చేసి, వివరణ కోరామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. థైరాయిడ్ తదితర కారణాల వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. థైరాయిడ్ టెస్టింగ్ మిషన్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చెన్నె నుంచి టెక్నీషియన్స్ కూడా వచ్చారని, సరిచేయడానికి నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు. అందుకే ఫ్రెష్ గా శాంపిల్స్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకునైనా సరే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వాసు స్పష్టంచేశారు. మొదటినుంచీ ఇక్కడకి రావడం, సమస్యలు తెలుసుకోవడం, అవగాహన చేసుకుని పరిష్కరించడంతో చిన్నపాటి సమస్య ఉన్నా ప్రజలు నేరుగా తమ దృష్టికి తెస్తున్నారని ఆయన తెలిపారు. ఇది మంచి సంప్రదాయమన్నారు. సక్రమమైన పద్దతిలో సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే వాసు స్పష్టంచేసారు.ప్రజలు నేరుగా తమకు చెప్పడం వలన తమకు వాస్తవ పరిస్థితులు తెల్సి పరిష్కరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. రోజూ 1600నుంచి 1800ఒపి రావడం, యాక్సిడెంట్ కేసులు రావడం జరుగుతోందని, ఇంతపెద్ద వ్యవస్థలో లోపాలు సహజమని ఆయన అన్నారు. అయితే చిన్నపాటి లోపాలు తరచూ జరిగితే నేరుగా తెలియజేయాలని ప్రజలకు ఎమ్మెల్యే వాసు సూచించారు. సిటీ స్కానింగ్ విషయమై అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే వాసు స్పందిస్తూ, రేడియాలజిస్ట్ వచ్చారని తెలిపారు. జిఎస్ఎల్ కాలేజీ వాళ్ళు , ఐ ఎం ఏ నుంచి కూడా కొంతమంది పిజి స్టూడెంట్స్ ని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లు పనిచేసే విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. వాతావరణ మార్పుల వలన వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఎమ్మెల్యే వాసు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హెల్త్ డిపార్ట్ మెంట్ వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారని, ఎక్కడికక్కడ సచివాలయ ద్వారా సమీక్షించి, వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని ఆయన చెప్పారు. అర్బన్ హెల్త్ సెంటర్లు నగరంలో 8ఉన్నాయని, అక్కడ కూడా ఒపి రోజుకి 80వరకు కేసులు వస్తున్నాయని, ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిపై వత్తిడి తగ్గుతుందని ఆయన చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్గించగలిగామని అందుకే కూటమి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్స్ లో ఒపి పెరగడమే కాకుండా జీజీహెచ్ లో కూడా ఒపి పెరిగిందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ప్రయివేటు హాస్పిటల్స్ కన్నా ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంకా మంచి వైద్యం అందుతుందన్న భరోసా కల్గించగలిగామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి

మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో సహస్ర కుంకుమార్చన, పడిపూజ -హాజరైన వైసిపి మాజీ ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు.

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 29: భవాని మాలధారణలో ఉన్న మాజీ ఎంపీ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ లో సహస్ర కుంకుమార్చన, పడిపూజ, భవాని భజన జరిగాయి. భరత్ దంపతులు, కుమార్తెలు అలాగే రాష్ట్ర బిసి సంఘాల జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు దంపతులు పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పడిపూజ నిర్వహించారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్బంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసిపి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు , పురప్రముఖులు,వైసిపి శ్రేణులు, భవానీలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం వచ్చినవారందరికీ అల్పాహారం అందజేసారు.

జోగులాంబ గద్వాల

మంత్రి కొండా సురేఖ 4 పర్యయాలు వచ్చి కనీసం 4రూపాయలు కూడా ఇవ్వలేదు.

అలంపూర్ : అక్టోబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, అలంపూర్ ఆలయానికి 4 పర్యయాలు వచ్చి కనీసం 4రూపాయలు కూడా ఇవ్వలేదు, అలంపూర్ లో నిత్యఅన్నదానం ఒకపూటకే పరిమితమైంది, కనీసం భక్తులకు టాయిలెట్స్, సరైన బస్సుసదుపాయం, రోడ్లు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. కాని మీరు ఇన్ని సార్లు వచ్చి ఏమైనా పట్టించుకున్నారా అని ఏద్దేవ చేశారు. కేద్రం ప్రభుత్వం ప్రసాద్ స్కీం నుండి 70 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం సరైన వసతులు చూపించక 22 కోట్లకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమ్మక్క సారక్క ఆలయాలకు ఎంతైనా ఇస్తాను అన్నారు. సంతోషం, కాని జోగులాంబ ఆలయానికి మాత్రం ఒక్కరూపాయి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. కావున రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా అధికార పార్టీకి ప్రజలు బుద్దిచెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, ఉప అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, ఖుషి తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన.

గోదావరి నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందున గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) హెచ్చరించారు. నిన్న రాత్రి పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు యువకులు గల్లంతైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు నగర పాలక సంస్థ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు, టీడీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నీటి ప్రవాహం తగ్గే వరకు ఎవరినీ పుష్కరాల రేవులోనికి అనుమతించవద్దని, ఆ మేరకు రేవు బయట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్, నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అలాగే స్నానాలు నిమిత్తం రేవుకు వచ్చే భక్తులను నియంత్రించేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిత్యం పోలీసులు పహారా కాయాలని త్రీ టౌన్ పోలీసులను ఆదేశించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

భారీ వర్షాలకు కూలిపోయిన గుడిసే.

అలంపూర్ : అక్టోబర్ 29 ( ఉన్నది ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పల్ గ్రామానికి చెందిన G.ఆశీర్వాదం గత కొన్ని సంవత్సరాలుగా పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కానీ నిన్న పడిన బారి వర్షo కారణంగా పూరి గుడిసె కుప్ప కూలిపోయింది. కటిక పేదరికంలో ఉన్న ఆశీర్వాదం తన గుడిసె కూలిపోవడంతో ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయింది దీంతో బాధితుడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో భార్యా పిల్లలతో కలిసి తలదాచుకున్నాడు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తనకు సహాయం చేయవలసిందిగా బాధితుడు కోరుతున్నాడు.

తిరుపతి

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా ముని కృష్ణారెడ్డి నియామకం

శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా ముని కృష్ణారెడ్డి నియమించడం జరిగింది.ఈ సందర్భంగా సోమవారం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకమైన మునికృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ప్రజా సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరితో కలిసి పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి పగడాల రాజు,సిరాజ్ భాష,ఉత్తరాజి శరవణ,పట్టణ వైసిపి నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.