Monday, 4 May 2026

Blog

హైదరాబాద్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన సజ్జనార్

హైదరాబాద్ సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ మంగళవారం భాద్యతలు స్వీకరించారు. సోమవారం సాయంత్రం అయన ఆర్టీసీ ఏం డి గా బాధ్యతల నుండి తప్పుకున్నారు. అయన మాట్లాడుతూ నాలుగేళ్లు గా ఆర్టీసీ కి చేసిన సేవలు సంతృప్తి నిచ్చాయి అని అయన అన్నారు.

జాతీయ అంతర్జాతీయ

మహిళల ప్రపంచ కప్.. రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి మహిళల ప్రపంచ కప్.. రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ 2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో జరగనుంది. ఈసారి టోర్నమెంట్ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో బహుమతి డబ్బు లభించనుంది. మొత్తం బహుమతి డబ్బు సుమారు రూ.123 కోట్లుగా నిర్ణయించారు, ఇది గత ఎడిషన్ కంటే 297 శాతం ఎక్కువ. ఛాంపియన్ జట్టుకు సుమారు రూ.40 కోట్లు, రన్నరప్‌కు సుమారు రూ.20 కోట్లు లభిస్తాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు దాదాపు 100 మిలియన్లు, ప్రతి జట్టుకు కనీసం 25 మిలియన్లు అందుతాయి.

జోగులాంబ గద్వాల

పెళ్ళికి వెళ్లి వస్తుండగా డిసిఏం అదుపుతప్పి బోల్తా – పలువురికి గాయాలు.

అలంపూర్ : అక్టోబర్ 30 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల స్టేజి సమీపంలో సోమవారం సాయంత్రం పెళ్లి బృందంతో తిరిగి వస్తుండగా డీసీఎం 44వ జాతీయరహదారి పక్కన బోల్తా పడింది. గద్వాల మండలం జమ్మిచేడు గ్రామానికి చెందిన దాదాపుగా 50 మంది డీసీఎం లో ఉన్నారు. కర్నూలులో వివాహ వేడుకలకు జరుపుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షంలో డిసియం వేగంగా వస్తుండగా, నిలిచి ఉన్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. ఒక మహిళ, చిన్నారి డీసీఎం లో ఇరుక్కుపోయారు. కాపాడాలి అంటూ వారు రోదనలు చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలించివేసింది. డీసీఎం లో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు హైవే సిబ్బంది, స్థానిక పోలీసులు రెండు గంటలు ప్రయత్నించి బయటకు తీశారు .

నిర్మల్

మానవతావాది. మహోన్నత మాస్టర్ కు తుది వీడ్కోలు

నిర్మల్ జిల్లా గుండంపల్లి గ్రామానికి చెందిన మన గురువులు మానవతవాది దైవ స్వరుపులు. ఉపాధ్యాయ వృత్తిలో ఎందరినో మహోన్నత వ్యక్తులను తీర్చి దిద్దిన మహనీయుడు…గురుదేవో భవ 🙏🙏🙏.. గౌరవనీయులు శ్రీ మల్లారెడ్డి. సార్ ప్రధాననాచార్యులు గుండంపల్లి..గారు స్వర్గస్థులయినారు.. సార్ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుని పార్థిస్తూ వినమ్ర శ్రద్దంజలి 🙏🙏💐💐💐💐తుది వీడ్కోలు (అంత్యక్రియలు) ఈరోజు ఉదయం 10:00. గుండంపల్లి లో.అయన జీవితం అందరికి ఆదర్శం అనేక. మంది విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన గొప్ప మాస్టర్ అలుపెరగని జీవితం ఆయనది.గుణంలో విద్యలో వ్యవసాయంలో ఆదర్శం,.,..

తెలంగాణ

మండల ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) వివిధ కారణాలవల్ల విద్యకు దూరమైన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించడం ద్వారా వారు పదవ తరగతి, ఆపై విద్యకు ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. గ్రామాలలో హెడ్మాస్టర్లు, వి ఓ ఏ ద్వారా మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదవ తరగతి చదివే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు విద్యార్థులు వివిధ రకాల స్కాలర్షిప్ లు ఇతర లబ్ధి పొందే విషయంలో తాహసిల్దార్ లు రెసిడెన్స్, పుట్టిన తేదీ తదితర ధ్రువపత్రాలను జాప్యం లేకుండా జారీ చేయాలని సూచించారు. అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేషన్ కూడా వెంట వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ట్రంప్‌కు ఏమైంది! మరీ ఇంత దారుణమా

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టారీఫ్‌లతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అమెరికాలో బాగా బిజినెస్ జరిగే రంగాలను ఆయన టార్గెట్ చేస్తున్నారు. వాటిపై 100 శాతం టారీఫ్‌లు విధిస్తున్నారు. తాజాగా, అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్ విధించారు. అయితే, అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, సినిమా రంగంపై టారీఫ్‌లకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘మన సినిమా బిజినెస్‌ను అమెరికా నుంచి దొంగిలిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమాలపై పెద్దఎత్తున ప్రభావం పడనుంది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలూ అమెరికాలో రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్‌సీస్ సినిమా బిజినెస్‌తో మరీ ముఖ్యంగా అమెరికా బిజినెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండిపడినట్లు అవుతుంది..

జాతీయ అంతర్జాతీయ

సౌదీ షాక్‌: 300 ట్యాంకర్ల వాపసు

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం నేపథ్యంలో, భారత్ సత్వరంగా తీవ్ర నిర్ణయం తీసుకుంది. సౌదీ నుంచి వచ్చే 300 పెట్రోలియం ట్యాంకర్లను నిలిపివేసి వెనక్కి పంపింది. ఇది మోదీ ప్రభుత్వ గంభీర గర్జనగా మారింది. పాకిస్తాన్‌పై దాడిని తమపై దాడిగా పరిగణిస్తామని సౌదీ ప్రకటించడంతో, భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడదని స్పష్టం చేసింది. దీంతో సౌదీ ఆర్థిక వ్యవస్థలో ఒక్కరోజులోనే 10% తగ్గుదల వచ్చిందని సమాచారం. ఆహార ధాన్యాల ఎగుమతులపై కూడా భారత్ కఠిన నిర్ణయానికి సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలతో తీవ్ర కలకలం చెందిన సౌదీ ప్రిన్స్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరణ ఇచ్చుకున్నారు. భారత్‌తో బలమైన సంబంధాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ దృఢమైన చర్యతో, “ఇది పాత భారత్ కాదు, కొత్త భారత్” అని ప్రపంచానికి బలమైన సంకేతం వెళ్లింది.

హెల్త్ టిప్స్

గోళ్లపై కనిపించే మీస్ లైన్లు అంటే ఏమిటి

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చేతిగోళ్లు లేదా కాలి గోళ్లపై కనిపించే తెల్లటి గీతలను మీస్ లైన్లు అంటారు. ఇవి క్యాన్సర్, గుండె వైఫల్యం, హాడ్కిన్ లింఫోమా, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన అంతర్లీన ఆరోగ్య పరిస్థితికి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ఈ గీతలు గోళ్లపై అడ్డంగా ఒక పక్క నుంచి మరో పక్కకు విస్తరిస్తాయి. ఇవి ఒక గోరుపై లేదా అన్ని గోళ్లపై ఒకేసారి కనిపించవచ్చు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైలులో టీసీకీ ఆధార్ కార్డు చూపించిన బామ్మ

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) X ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో ఒక వృద్ధురాలి అమాయకత్వం వైరల్ అవుతోంది. రైలులో ప్రయాణిస్తున్న ఆ బామ్మ, తన దగ్గరకు వచ్చిన టికెట్ కలెక్టర్ (TC)కి టికెట్కు బదులుగా ఆధార్ కార్డును చూపించింది. బస్సులో ఆధార్ చూపిస్తే ఉచిత ప్రయాణం లభించినట్లే రైలులో కూడా లభిస్తుందని ఆమె భావించింది. దీనిని గమనించిన TC నవ్వుతూ ఆమెకు వివరించి, ఆధార్ కార్డును తిరిగి ఇచ్చేశాడు. రైలులో ఓ వృద్ధురాలి అమాయకత్వం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. X ఖాతాలో షేర్ అయిన ఈ హృదయ స్పర్శించే వీడియో నెటిజన్లను ముద్దుపడేస్తోంది.

జాతీయ అంతర్జాతీయ

రెండు గంటలు సలహా ఇచ్చి రూ. 11 కోట్లు తీసుకున్నా ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఇదీ… బీహార్ కుర్రాడి శక్తి అని వ్యాఖ్య వృత్తిపరమైన ఫీజులతోనే నిధులు సమకూర్చుకున్నానన్న ప్రశాంత్ కిశోర్ ఆదాయపు పన్ను చెల్లించి పార్టీకి విరాళం ఇచ్చినట్లు వెల్లడి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నేను ఒక రెండు గంటల పాటు సలహా ఇచ్చినందుకు రూ. 11 కోట్లు తీసుకున్నాను. ఇదీ… ఈ బీహార్ కుర్రాడి సత్తా” అని ఆయన అన్నారు. డొల్ల కంపెనీల ద్వారా తన పార్టీకి విరాళాలు వస్తున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వృత్తిపరమైన ఫీజుల ద్వారానే తాను నిధులు సమకూర్చుకున్నానని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించి తన సొమ్మును పార్టీకి విరాళంగా ఇచ్చానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 1995లో ఒక హత్య కేసులో ఆయనను దోషిగా తేలారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాను మైనర్‌ను అంటూ తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా ఆయన శిక్ష నుండి తప్పించుకున్నారని ఆరోపించారు. పదో తరగతి కూడా పూర్తి చేయని సామ్రాట్ చౌదరి డిగ్రీ పట్టా పొందడం ఆశ్చరం కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూప్రసాద్ యాదవ్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదని, కానీ బీహార్‌కు రాజును చేయాలని లాలూ ప్రసాద్ ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. సామాన్యుల పిల్లలు గ్రాడ్యుయేట్ చేసినా వారికి ఉద్యోగాలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.