Monday, 4 May 2026

Blog

నిర్మల్

వానల్ పహాడ్‌లో విజయదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

భైంసా రూరల్, సెప్టెంబర్ 30: భైంసా మండలంలోని వానల్ పహాడ్ గ్రామం పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంగా మరోసారి ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. చింతచెట్టు కాండంపై స్వయంభువుగా వెలసిన శ్రీ సింహ సహిత విజయ దుర్గామాత ఆలయంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిసరాలు భక్తి గీతాల మ్రోగింపులతో, కొలువైన అమ్మవారి జయజయధ్వానాలతో క్షణాల్లోనే ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారిని ఆలయ ద్వారపాలకుల వద్ద ఘనంగా ఆహ్వానించి, శాలువాతో సన్మానించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు అమ్మవారి దర్శనం చేసి, గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. తదనంతరం, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలో విజయవంతమై డీఎస్పీ హోదా పొందిన యువకుడు K. సంపత్ రెడ్డి (s/o శ్రీనివాస్ రెడ్డి) గారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఆయన విజయాన్ని గ్రామ ప్రజలు, నాయకులు గర్వకారణంగా భావిస్తూ కీర్తించారు. సంపత్ రెడ్డి వంటి ప్రతిభావంతులు గ్రామాల నుండి వెలుగులోకి రావడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయి, శోభాయమాన వాతావరణాన్ని సృష్టించింది. ప్రత్యేక పూజలు, సన్మానాలు, శుభాకాంక్షలతో వానల్ పహాడ్ ఆలయం ఆధ్యాత్మిక–సాంస్కృతిక వేడుకలకు కేంద్ర బిందువుగా నిలిచింది.

నిర్మల్

బాసర–మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆదేశాలు

నిర్మల్ జిల్లా-బాసర–మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆదేశాలు ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ ప్రతిపాదనకు స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి బాసర నుండి మహోర్ (హిమాయత్‌నగర్) వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రహదారి ద్వారా రెండు జాతీయ రహదారులు అనుసంధానం కానున్నాయి. దీనిపై సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత మే 5న ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ న్యూఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలుసుకొని, ఈ రహదారి అవసరాన్ని వివరించారు. బాసర అమ్మ వారి ఆలయం నుండి మహోర్‌లోని రేణుక మాత ఆలయానికి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి కేంద్రం స్పందించగా, మంత్రి నితిన్ గడ్కరి ఈ విషయాన్ని అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు. కేంద్రం ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పౌష్టికాహారం పంపిణీ

పొదలకూరురోడ్డులో ఉన్న హరిత ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు అరటి పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే వృద్ధులకు ఇవ్వడం జరిగింది. వెల్ వాకర్స్ వింగ్ అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ రాబోవు కాలంలో వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి మంచి డాక్టర్ల చేత పరీక్షలు చేస్తామని అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇదొక అంశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ ప్రతినిధి రాజేశ్వరి సభ్యులు శేషమ్మ, నిసార్ ఆలీ, మరియు రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ, ఎంపిటిసి,జడ్పిటిసి ఎన్నికలను ఆషామాషగా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమావేశమైనారు. ఎన్నికల నిర్వహణ విధులకు నియమించబడిన ఉద్యోగుల పూర్తి డేటాను తక్షణమే సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డి ఈ ఓ బిక్షపతి ని ఆదేశించారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్ పి సి ఈ ఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, నోడల్ అధికారులు హాజరైనారు.

తెలంగాణ

*తెలంగాణలో పోలీసు తనిఖీలు షురూ!*

*50 వేల రూపాయల వరకే అనుమతి!* పున్నమి ప్రతినిధి, హైదరాబాద్:సెప్టెంబర్ 30 తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సులోను పోలీసులు తనిఖీలు చేపట్టనున్నారు.నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర జిల్లా రహ దారులపై వాహనాలను సోదాలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50,000 నగదు మాత్రమే తీసుకువెళ్ళేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండాలంటే సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు.తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు.అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను జీఎస్టి అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు..అత్యవసరమైన వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తల్లో నగదు తీసుకువెళ్ళేవారు సరైన ఆధారాలు దగ్గరుంచుకొని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్

నగర పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్, పదవి బాధ్యతలు*

*చివరి రోజున ఆర్టీసీ బస్సులో తిరిగిన సజ్జనార్!* పున్నమి ప్రతినిధి: హైదరాబాద్:సెప్టెంబర్ 30 హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్, బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉదయం కమాండో,అండ్ కంట్రోల్ యూనిట్ లో సీవీ ఆనంద్, నుండి సజ్జనార్, బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు టీజీ ఆర్టీసీ ఎండిగా ఉన్న ఆయనను ప్రభుత్వం పోలీస్ కమిషనర్ గా బదిలీ చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ఐపీఎస్ ప్రజా రవాణాపై తన అనుబం ధాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిం చారు. సాధారణ ప్రయాణికుడిలా బస్టాప్లో బస్సెక్కి లక్డీకాపుల్ – టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్‌భవన్ వరకు 113 I/M మెహదీపట్నం రూట్ బస్సులో ప్రయాణిం చారు.స్వయంగా ఆయనే తన మొబైల్ ఫోన్తో యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద సొంత ఖర్చు తో టికెట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ ఆర్టీసీలో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం, ఇప్పుడు బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా ప్రభుత్వం నియమించింది.. ప్రయాణాలు ఆగిపోవచ్చు, కానీ ప్రయాణికులు ముందుకు సాగుతూనే ఉంటారని, ఇప్పుడు తనకు బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం వచ్చింది అని సజ్జనార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లు జీవనాడి అని అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి, ప్రయాణికుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వీసీ సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన అదనపు డీజీపీ హోదాలో టీజీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సెప్టెంబరు 29 వరకు పని చేశారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. 2008లో వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్ విషయంలో కీలకంగా వ్యవహారించారు. 2019 శంషాబాద్ దిశ ఎన్కౌంటర్‌లో సజ్జనార్‌ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అప్పుడు సజ్జనార్పై ప్రజలు పూల వర్షం కురిపించారు.

ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా : వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందుల కు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు

కృష్ణా జిల్లా : కృష్ణా నది లో రోజు రోజు కి పెరుగుతున్న వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు. గడచిన మూడు రోజులుగా వరద వల్ల ఆ గ్రామానికి చుట్టు ప్రక్కన ఊర్లతో సంబందాలు తెగిపోవటంతో ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు.

తిరుపతి

ముక్కంటి సేవలో ఒంగోలు శాంతి భద్రతల అదనపు ఎస్పీ నాగేశ్వరరావు

శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు అదనపు ఎస్పి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ముందుగా వారికి టీడీపీ సీనియర్ నేత లక్కమనేని మధు బాబు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం,స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించడం జరిగింది.

E-పేపర్

*ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి అన్నదానం ప్రారంభించిన ఎంపీ.*

విజయవాడ, సెప్టెంబర్ 30 : పున్నమి ప్రతినిధి సురేష్ విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో శ్రీ సత్యనారాయణ స్వామి కూరగాయాల చిల్లర వర్తక సంఘం మరియు వర్తక సంఘాల ఐక్యత కమిటి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం కనకదుర్గాదేవి అలంకరణలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎంపీ కేశినేని శివనాథ్ కు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గజమాలతో సత్కరించి, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి మైలవరపు కృష్ణ, ఉపాధ్యక్షుడు ఆకుల రాజు, కోశాధికారి ఏ.గంగాధర్, పైడి కృష్ణ, ఎల్.అప్పారావు, ఎస్.తారక రామ్, మాత శివ, ఆకుల శ్రీను, అల్లం గణేష్, కోలా శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేలి ఆర్టీసీ బస్టాండ్ సేవలు త్వరలో సంపూర్ణంగా రావాలని కోరుకుందాం

చిట్వేల్, సెప్టెంబర్ 30 (మీ స్పందన) చిట్వేలి ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బస్టాండులో కంట్రోలర్ ప్రత్యేకంగా బుక్కు పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. నెల్లూరు ఎక్స్ప్రెస్ సహా అన్ని ఆర్టీసీ బస్సులు బస్టాండులోకి ప్రవేశించి, కంట్రోలర్ దగ్గర సంతకాలు చేసి తిరిగి ప్రయాణం కొనసాగిస్తున్నాయి.బస్టాండు కాంపౌండ్ అంతా శుభ్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆడపడుచులకు, డయాబెటిక్ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాష్‌రూమ్స్ సిద్ధం చేశారు. వాటి సంరక్షణ కోసం శాశ్వతంగా ఒక సిబ్బందిని నియమించనున్నారు.స్థానిక వ్యాపారస్తులకు పిలుపునిచ్చి అక్కడ చిన్నచిన్న అంగళ్లు పెట్టుకునే విధంగా టెండర్ వేసి వారికి పరిశుభ్రత అప్పగిస్తే ఇంకా బాగుంటుందని స్వచ్ఛంద సేవకులు కోరుకుంటున్నారు.త్వరలోనే అన్ని సౌకర్యాలతో చిట్వేలి ఆర్టీసీ బస్టాండు ప్రయాణికుల వినియోగానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఆర్టీసీ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.