Monday, 4 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి కావ్వాలని ప్రత్యేక పూజలు… గన్నవరపు శ్రీనివాసరావు

అంబేద్కర్ కోనసీమ: సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) పి.గన్నవరం నియోజకవర్గం తాటికాయల వారిపాలెం గ్రామంలోని శ్రీ దుర్గామల్లేశ్వరి ఆలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టాలని, ఎంపీ మిధున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు కావాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 450 మంది భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ పీసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్క చిన్న వెంకటేశ్వరరావు, కుమార రాజు, చింతపల్లి నరసింహారావు తదితరులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

తెలంగాణ

*కొత్త బోర్డు వచ్చేసింది*

పున్నమి తెలంగాణ బ్యూరో: ట్యాంక్‌బండ్‌ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సమావేశంలోనూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా ట్యాంక్‌బండ్‌ సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పేరును ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌’గా మార్చారు.

తెలంగాణ

పొంగులేటి నీ తీరు మార్చుకో….

– అయ్యో పాపం అంటే కుక్క పెత్తనం తగదు. – ఏజెన్సీ ప్రాంతంలో నీ రుబాబు కుదరదు. – దుమ్ముగూడెం, టేకులపల్లి జనరల్ సీట్లా… జెడ్పీ చైర్మన్ జనరలా… – మీరు ప్రజా ప్రతినిధులా లేక బానిసలా… – నీ వల్ల కాంగ్రెస్ హటావో, ఏజెన్సీ బచావో నినాదం మొదలవుతుంది. – అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాము. – మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఆదివాసి పూనెం ప్రదీప్ కుమార్ పున్నమి తెలంగాణ బ్యూరో: ఎన్నడూ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకున్నట్లు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఆదివాసి నాయకులు పూనెం ప్రదీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్, ఏజెన్సీ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నదని, ఈ ప్రాంతంలో సర్వహక్కులు గిరిజనులకే చెందుతాయని రాజ్యాంగం చెపుతుంటే, ఎన్నడూ లేని విధంగా దుమ్మగూడెం, టేకులపల్లి మండలాల జడ్ పి టి సి స్థానాలను జనరల్ స్థానంలా కేటాయించడం వెనుక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని, తన అనుచరులైన ఓసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని జడ్ పి చైర్మన్ ను చేసేందుకు గిరిజన ప్రజల హక్కులను, అస్తిత్వం, మనోభావాలతో చెలగాటమాడుతున్నాడని తక్షణమే ఇటువంటి ఒంటెద్దు పోకడలు మానుకోకపోతే గిరిజనుల ప్రతాపానికి నువ్వు, నీ ప్రభుత్వం కుప్పకూలేపోయే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు గిరిజన నియోజక వర్గాలు ఉన్నాయని, పార్లమెంట్ స్థానం కూడా గిరిజనులదేనని, అటువంటి ప్రాంతంలో నువ్వు చక్రంతిప్పి గిరిజనుల నోట్లో మట్టికొట్టి, మోసం చేయడంతో నీ పతనానికి నాంది పలికావని, ఇంత జరుగుతున్న శాసన, పార్లమెంట్ సభ్యులు నోరు మెదపడం లేదని, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బానిసలుగా ఉండి జాతికి ద్రోహం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, తక్షణమే ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గతంలో లాగానే రిజర్వ్ స్థానాలుగా ఉంచేందుకు ఉద్యమించాలని, లేకపోతే వచ్చే ఎన్నికలలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంత తేడా కూడా ఈయనకు తెలియక పోవడం, అధికారులు కూడా దానిని అంచనా వేయకుండా ఆయన చెప్పినట్లు చేస్తున్నారనే మాటలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయని, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం గిరిజన ప్రజలను, చట్టాలను అపహాస్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని, అందుకు తగు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉన్నదని ఆయన అన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి తగు బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.

తిరుపతి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా చింత రాజేంద్ర నియామకం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా చింతా రాజేంద్ర నియామకం కావడంతో వారు శ్రీకాళహస్తి పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన చింత రాజేంద్ర ను మాజీ శాసనసభ్యులు సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం,కప్పల మురళి,వీరేంద్ర,కిరణ్,నాగరాజు, డేనియల్,సుబ్రమణ్యం,వెంకట సుబ్బయ్య,బాలగురవయ్య,ఆనంద్,అంకయ్య, పూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిజామాబాద్

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి,30 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి : ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహిం చినట్లు సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలోని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో బతుక మ్మలను పేర్చి, సాంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ,నృత్యాలు చేస్తూ ఉత్సవాలను నిర్వహించారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొ ని, పండుగ శోభను పెంచారు. సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి గారు పండుగ ప్రాముఖ్యత గురించి మాట్లాడి, అందరికీ బతుకమ్మ శుభాకాం క్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంకరి రాజ లింగం, ఆకుల సిద్దిరాములు, ఆకుల శివదినం, పయ్యావు ల గంగాధర్, సంకరి నారాయణ, దయాకర్, కొండ ల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగుదేశం పార్టీలో చేరిన పలసాని ఈశ్వర్ రెడ్డి

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెరుమాళ్ళ పాడు గ్రామానికి చెందిన పలసాని ఈశ్వర్ రెడ్డి మంగళవారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు సహకారంతో తెలుగుదేశం పార్టీలో చేరారు.తెలుగుదేశం పార్టీలోకి పలసాని ఈశ్వర్ రెడ్డిని మంత్రి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు.టిడిపి పార్టీలో చేరిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానివ్వడం జరిగినది.అలాగే పలసాని ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.అలాగే ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి చేస్తున్నటువంటి నిరంతర కృషికి ఆయన పనితీరు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

బేషజాలు వీడి, కలిసికట్టుగా పనిచేయండి: కాంగ్రెస్ శ్రేణులకు నా రెడ్డి మోహన్ రెడ్డి పిలుపు

​ – మద్దికుంట లో సమీక్ష సమావేశం కామారెడ్డి, 30 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి : ​స్థానిక సంస్థల ఎన్నికల్లో భేషజాలు పక్కన పెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు గట్టి పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కృషి చేయాల ని ఆయన సూచించారు. రామారెడ్డి మండలం లోని మద్దికుంట గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ, అందరూ పోటీ పడటం మానుకుని, ప్రత్యర్థిపై గెలిచే అవకాశాలు ఉన్న సమర్థులైన అభ్యర్థులను ఎంచుకోవాలన్నారు. వారి గెలుపు కోసం ఏకతాటిపై నిలబడి పనిచేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, బండి ప్రవీణ్, పెండ్యాల నర్సారెడ్డి, దుంపల బాలరాజు, గజ్జల చిన్నరాజు, రేకులపల్లి కిష్టారెడ్డి, కామిల్ల నరేందర్, బండి రవి, దుంపల ప్రేమ్, శ్రీకాంత్, తోటలింగం, భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

బెయిల్ పై విడుదలైన మిథున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేడపాటి షర్మిళ రెడ్డి.

బెయిల్ పై విడుదలైన మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంటర్ జైలు దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ శివ పార్వతి, మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కుట్రలకు అన్యాయంగా తప్పుడు కేసులులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి మిధున రెడ్డి బెయిల్ పై విడుదలైన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. మిధున రెడ్డి పై ఆరోపణలు కేవలం నిరాధారమని, ఈ 71 రోజులుగా వైయస్సార్ సిపి కుటుంబ సభ్యులు గా ఆయనకు అండగా నిలబడ్డామని, నిరపరాధి గనుకనే ఆయన ధైర్యంగా దీన్ని ఎదుర్కొన్నారని మేడపాటి షర్మిల అన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మానుకొని ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టి సాధించాలని హితవు పలికారు.

నిర్మల్

మహిష నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

నిర్మల్ జిల్లా: మహిష నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభం మహిష నగరంలోని ఎ.పి. నగర్ – నగర్ బస్తిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు విశేషంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక స్వయంసేవకులు, సాంఘిక సంస్థల ప్రతినిధులు, విశాల సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉత్సాహం నింపారు. ప్రధాన వక్తగా హాజరైన శ్రీ మంతెన ప్రవీణ్ జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ – “సంఘం శతాబ్ద కాలం పాటు దేశవ్యాప్తంగా చేసిన సేవలు, త్యాగాలు, కృషి ప్రతి భారతీయునికి గర్వకారణం. రాబోయే దశాబ్దాల్లో ప్రతి ఇంటికీ సేవా దృక్పథం, సాంస్కృతిక విలువలు చేరేటట్లు ప్రతి స్వయంసేవకుడు అంకితభావంతో పనిచేయాలి” అన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వయంసేవకులు ఆకర్షణీయమైన శారీరక ప్రదర్శనలు చేసి సభలో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. అలాగే దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేదికను అలరించాయి. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని, సమాజంలో ఐక్యత – సాంఘిక సమరసత విలువలను మరింత బలపరిచే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. మహిష నగరం అంతటా శతాబ్ది ఉత్సవాల వాతావరణం నెలకొని ప్రజలు జాతీయతా భావంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

తెలంగాణ

అక్టోబర్ 2న మాంసం దుకాణాలు బంద్

దసరా పండుగ, గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబర్ 2న మాంసం దుకాణాలు బంద్ అక్టోబర్ 2న మాంసం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.