Monday, 4 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

SBI క్రెడిట్ కార్డు ఛార్జీలు పెంపు

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు నవంబర్ 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. CRED, Cheq, MobiKwik వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లిస్తే 1% ఫీజు విధించబడుతుంది. అలాగే, వాలెట్‌లో రూ.1,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా ఈ ఫీజు వర్తిస్తుంది. అయితే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు నేరుగా చెల్లింపులపై మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. నగదు చెల్లింపులు, చెక్ ద్వారా బకాయిలు తీర్చడం, కార్డు మార్పులు వంటి సేవలపై కూడా అదనపు ఫీజులు విధించనున్నారు. వినియోగదారులు ఈ మార్పులను గమనించి తమ చెల్లింపులను తగిన రీతిలో ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది.

జాతీయ అంతర్జాతీయ

✈️విమానంలో పవర్ బ్యాంక్ బ్యాన్🔋

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) విమానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 1, 2025 నుంచి తమ విమానాల్లో పవర్ బ్యాంక్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. లిథియం బ్యాటరీల వల్ల భద్రతాపరమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉండటంతో, ఈ ఏడాది ప్రారంభంలోనే ఎమిరేట్స్ కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ చేతిలో లేదా లగేజ్‌లో పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడం ఇకపై అనుమతించబడదు. ప్రయాణానికి ముందు ఎవరైనా ఈ మార్గదర్శకాలను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రయాణాల్లో భద్రతను మెరుగుపర్చడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) విమానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 1, 2025 నుంచి తమ విమానాల్లో పవర్ బ్యాంక్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. లిథియం బ్యాటరీల వల్ల భద్రతాపరమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉండటంతో, ఈ ఏడాది ప్రారంభంలోనే ఎమిరేట్స్ కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ చేతిలో లేదా లగేజ్‌లో పవర్ బ్యాంక్‌లను తీసుకెళ్లడం ఇకపై అనుమతించబడదు. ప్రయాణానికి ముందు ఎవరైనా ఈ మార్గదర్శకాలను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. విమాన ప్రయాణాల్లో భద్రతను మెరుగుపర్చడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఎలూరు

కరుణించమ్మ దుర్గమ్మ

కరుణించమ్మ ..దుర్గమ్మ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో అమ్మవారు మంగళవారం దుర్గాదేవిగా భక్తుల దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రజక వీధిలో దుర్గ భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం నాలుగు మాడ వీధుల చుట్టూ అర్చకులు మహేంద్ర చక్రవర్తి ఆధ్వర్యంలో భవానీలు, భక్తులు దీపోత్సవం నిర్వహించారు.

జాతీయ అంతర్జాతీయ

కేరళను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చుకున్న మాఫియా🇮🇳🌎🇵🇰

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)🇮🇳🌎🇵🇰 డి-కంపెనీ కొత్త అడ్డా సౌత్ ఇండియా… కేరళ కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ దందా దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసిన దావూద్ ఇబ్రహీం సిండికేట్ కేరళను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చుకున్న మాఫియా శ్రీలంక మీదుగా సముద్ర మార్గంలో భారీగా డ్రగ్స్ సరఫరా వ్యవస్థలోని అవినీతే డ్రగ్స్ ముఠాలకు వరంగా మారిన వైనం ఉగ్రవాద కార్యకలాపాలకు డ్రగ్స్ దందా ద్వారా నిధుల సమీకరణ భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ (డి-కంపెనీ) ఇప్పుడు తన మకాంను దక్షిణ భారతానికి మార్చింది. ముఖ్యంగా కేరళను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు ప్రధాన కేంద్రంగా మార్చుకుని దేశ భద్రతకు పెను సవాల్ విసురుతోంది. నకిలీ కరెన్సీ రాకెట్‌ను భారత ఏజెన్సీలు సమర్థంగా అడ్డుకోవడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడం కోసం డి-కంపెనీ ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ వ్యాపారంపై ఆధారపడినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకు పంజాబ్ సరిహద్దుల ద్వారా డ్రగ్స్‌ను దేశంలోకి పంపిన మాఫియా, అక్కడ భద్రతా బలగాల నిఘా పెరగడంతో తమ వ్యూహాన్ని మార్చుకుంది. పాకిస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను శ్రీలంకకు చేర్చి, అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేరళ తీరానికి తరలిస్తున్నారు. కేరళకున్న సుదీర్ఘ తీరప్రాంతం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటం, స్థానిక వ్యవస్థలోని అవినీతి వంటి అంశాలు డ్రగ్స్ ముఠాలకు అనుకూలంగా మారాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నలుగురు జైలు అధికారులు ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దక్షిణ భారతంలో డి-కంపెనీ కార్యకలాపాలను దావూద్ ముఖ్య అనుచరుడైన హాజీ సలీం పర్యవేక్షిస్తున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. కేరళలో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్న సలీం, ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ముఖ్యంగా మెథాఫెటమిన్ (మెత్) అనే డ్రగ్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో కేరళను ఒక ట్రాన్సిట్ పాయింట్‌గా వాడుకుంటున్నారు. ఇక్కడికి చేరిన డ్రగ్స్‌ను రోడ్డు మార్గంలో తమిళనాడు, కర్ణాటక మీదుగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ దందా కేవలం దేశీయ సరఫరాకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ కార్టెల్స్ సహాయంతో థాయ్‌లాండ్ వంటి దేశాలకు కూడా కేరళ నుంచి డ్రగ్స్ ఎగుమతి అవుతున్నాయి. ఈ అంతర్జాతీయ ఆపరేషన్ల కోసం డి-కంపెనీ నైజీరియన్లను వాడుకుంటోంది. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో ఏకంగా రూ. 30,000 కోట్ల విలువైన మెత్ పట్టుబడటంతో ఈ మాఫియా సామ్రాజ్యం ఎంత పెద్దదో అర్థమవుతోంది. అయితే, ఈ భారీ నష్టం తర్వాత స్మగ్లర్లు తమ పద్ధతి మార్చుకుని, పట్టుబడకుండా ఉండేందుకు చిన్న చిన్న ప్యాకెట్లలో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు

జాతీయ అంతర్జాతీయ

*డ్రైవర్ లేని ఆటో వస్తుంది*

-ఎక్కడికో చెప్తే అదే తీసుకెళుతుంది. పున్నమి ప్రతినిధి: ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ తయారీ సంస్థ ఒమెగా సీకి మొబిలిటీ దేశంలో తొలి సెల్ఫ్-డ్రైవింగ్‌ ఆటోను పరిచయం చేసింది. ‘స్వయంగతి’ పేరిట ఈ ఎలక్ట్రిక్‌ ఆటోను లాంఛనంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్‌ ప్యాసింజర్‌ వెర్షన్‌ ధర రూ.4 లక్షల (ఎక్స్ షోరూమ్‌) నుంచి ప్రారంభం కాగా.. కార్గో వెర్షన్‌ రూ.4.15 లక్షలకు (ఎక్స్ షోరూమ్‌) లభించనుంది. ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, డెలివరీలు త్వరలో మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది.స్వయంగతి ఆటో.. 10.3kWh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ వాహనానికి అవసరమైన ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఇందులో కంపెనీ ఈవీ ప్లాట్‌ఫాంతో పాటు ఏఐ ఆధారిత అటానమీ సిస్టమ్‌ ఉంది. లైడార్‌ టెక్నాలజీ, జీపీఎస్‌, 6 కిలోమీటర్ల దూరం వరకు అడ్డంకులను గుర్తించే సెన్సర్లు, మల్టీ సెన్సర్‌ నావిగేషన్‌, రిమోట్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ లేకుండానే ముందుగానే మ్యాప్‌ చేసిన మార్గంలో ప్రయాణించగలదు. మొదటి దశ పరీక్షలు విజయవంతం కాగా.. రెండో దశ పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని సంస్థ చెప్పింది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో నియంత్రిత కమర్షియల్‌ ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ. గన్నవరపు శ్రీనివాసరావు

అంబేద్కర్ కోనసీమ సెప్టెంబర్(పున్నమి ప్రతినిధి) పి. గన్నవరం నియోజకవర్గం మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు నమస్కారం. పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 9:30 గంటలకు అమలాపురం ఈదరపల్లిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుబంధ విభాగాల నేతలు, దళిత సంఘాలతో కలిసి సమన్వయంగా పాల్గొనమని అభ్యర్థిస్తున్నాం. – గన్నవరపు శ్రీనివాసరావు, కోఆర్డినేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

ఆంధ్రప్రదేశ్

కవి, రచయిత, పాత్రికేయులు,జి.ఎల్.ఎన్.శాస్త్రికి “సాహితీ కిరీటి” పురస్కారం మరియు సత్కారం.

అనకాపల్లి ,కవి, రచయిత, పాత్రికేయులు, శ్రీ జి.ఎల్.ఎన్.శాస్త్రి కి మరో అరుదైన గౌరవం లభించింది. నిరాటంకంగా కార్యక్రమాల నిర్వహించుటలో 28 ప్రపంచ రికార్డులను సాధించి, ఐ.ఎస్.ఓ.గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ బతుకమ్మ దసరాసంబరాలలో భాగంగా ప్రపంచ తెలుగు అసోసియేషన్, తెలుగు రైటర్స్ అకాడమీ భాషా సాంస్కృతిక శాఖ సెప్టెంబర్ 29 న హైదరాబాద్, బిర్లా ఆడిటోరియంలో జరిగిన జాతీయ 155 సాహితీ పట్టాభిషేక.మహోత్సవ.కార్యక్రమంలో జి.ఎల్.ఎన్.శాస్త్రి “సాహితీ కిరీటి”బిరుదు,సత్కారం పొందారు. ప్రపంచంలో అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థగా నిలిచిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్, జాతీయ మహిళా అధ్యక్షులు ఈశ్వరీ భూషణం, జాతీయ అధ్యక్షులు కార్యదర్శులు విజయకుమార్, టి.పార్ధసారథి, తదితరులు శ్రీ జి.ఎల్ .ఎన్. శాస్త్రి గారిని శాలువా, జ్ఞాపిక, పూలమాల, , ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.