Monday, 4 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

రైల్వేలో 2,570 ఉద్యోగాలు.. అక్టోబర్‌లో దరఖాస్తులు ప్రారంభం

పున్నమి ప్రతినిధి: రైల్వేలో 2,570 ఉద్యోగాలు.. అక్టోబర్‌లో దరఖాస్తులు ప్రారంభం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 31న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, IT లేదా సంబంధిత రంగంలో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. CMA పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నేపథ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు అర్హులు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలకు RRB అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

తెలంగాణ

దసరా ఎఫెక్ట్: ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్

పున్నమి ప్రతినిధి: దసరా ఎఫెక్ట్ ఒక్క రోజులోనే రూ. 300 కోట్ల లిక్కర్ సేల్ దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సోమవారం ఒక్క రోజులోనే రూ. 278.66 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం రూ. 300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. వరుస సెలవులు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు మద్యం విక్రయాల ద్వారా రూ. 2,715 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయనున్నప్పటికీ, గ్రామాల్లో అమ్మకాలు ఆపడం కష్టమని అధికారులు తెలిపారు.

జాతీయ అంతర్జాతీయ

పెరిగిన సిలిండర్ ధరలు

పున్నమి ప్రతినిధి: Oct 01, 2025, పెరిగిన సిలిండర్ ధరలు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.15 పెరిగింది. అయితే, 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధర రూ.850-రూ.960 వరకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో రూ.905, వరంగల్‌లో రూ.924, విశాఖపట్నంలో రూ.861, విజయవాడలో రూ.875గా ఉంది. పండుగ సీజన్‌లో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగినా, గృహ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కోట్లాది మంది మహిళలకు ఉచిత సిలిండర్లు, కొత్త కనెక్షన్లు అందిస్తోన్న విషయం తెలిసిందే.

జాతీయ అంతర్జాతీయ

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో నమోదైయింది

అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) ఫిలిప్పీన్స్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు సెబు ద్వీపాన్ని కేంద్రంగా చేసుకున్నాయి. భూకంప ప్రభావంతో అనేక ఇళ్లు, కార్యాలయాలు కూలిపోగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పటి వరకు 22 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రోడ్లు పగిలిపోవడంతో రవాణా తీవ్రంగా దెబ్బతింది. సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడటంతో సునామీ ముప్పు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రక్షణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఖమ్మం

బి ఆర్ ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న తప్పుడు కేసులు ఆపాలి : రాజ్యసభ సభ్యులు వద్ది రాజు

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులని ఆపాలని అలాగే అధికార పార్టీ కి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బి ఆర్ ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బి ఆర్బీ ఎస్ఆ ప్రతి నిధి బృందం మంగళవారం నాడు సీపీ సునీల్ర్ దత్ కి వినతి పత్రం సమర్పించారు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఏం ఎల్ సి తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానోత్ చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.

క్రైమ్

కోటి రూపాయిలా విలువ గల గంజాయి పట్టివేత

పున్నమి ప్రతినిధి SI మేడ ప్రసాద్ ని అభినందించిన పోలీస్ బాస్ లు, గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర సమీపంలో బూర్గంపహాడ్ SI మేడ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ రవాణాపై విశ్వనియత సమాచారం మేరకు సోమవారం నాడు చాటుగా మాటు వేసి మెరుపు దాడులు నిర్వహించారు, చింతూరు నుండి హర్యానాకు చెందిన HR 33B 6330 కారుతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, మంగళవారం పాల్వంచ CI సతీష్ సమక్షంలో మీడియా సమావేశంలో ఓ ప్రకటన విడుదల చేసారు, ఇట్టి గంజాయి సుమారు 204.930 కిలోలుగా దీని విలువ సుమారు కోటి రూపాయల పైగా అక్షరాల Rs1,02,46,500/- లుగా వెల్లడించారు, నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ తన కార్ ఓనర్ అయిన ప్రిన్స్ కుమార్ ఆదేశాల ప్రకారం చింతూరు వైపు వెళ్లి అక్కడ ప్రధాన్ ఖారా,లఖన్ హంతాల్ వద్ద గంజాయి లోడ్ చేసుకొని తిరిగి హర్యానా వెళుతుండగా పట్టు పడడం జరిగిందని తెలిపారు,ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు.

జాతీయ అంతర్జాతీయ

టీమ్‌ ఇండియాకు రూ.21 కోట్ల ప్రైజ్‌మనీ

అక్టోబర్ 01 (పున్నమి ప్రతినిధి) ఆసియా కప్‌ 2025 విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని బీసీసీఐ ప్రకటించింది. ఈ నగదు మొత్తాన్ని ఆటగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌కి కూడా అందజేస్తామని తెలిపింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ అద్భుతంగా ఆడి, 69 నాటౌట్‌ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో భారత్‌ను 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయవంతం చేశాడు. భారత్‌ ఇది తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకోవడం విశేషం. ఈ టోర్నీలో టీమ్‌ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం గర్వకారణంగా మారింది. మొత్తం ప్రదర్శనలో టీమ్‌ ఇండియా ప్రాబల్యాన్ని స్పష్టంగా చూపింది.

భక్తి

సోమవారం నల్లజర్ల మండలం మరెళ్లమూడి లో శ్రీ విజయ దుర్గమ్మ గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం పాల్గొన్న జనసేన నాయకులు

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 సోమవారం నల్లజర్ల మండలం మరెళ్లమూడి లో శ్రీ విజయ దుర్గమ్మ గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ దొడ్డిగర్ల సువర్ణరాజు గారు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అచ్యుత సత్యనారాయణ గారు, సింగరాజుపాలెం గ్రామ సర్పంచ్ గద్దె బాలగంగాధర్ తిలక్ గారు, ప్రగడ శ్రీనివాస్ (పప్పుల మిల్లు శ్రీను) గారు మార్లమూడి జనసేన అధ్యక్షులు ప్రభాకర్ గారు, కొత్తపల్లి హరిబాబు గారు అచ్యుత సాయి గారు, అచ్చుత ధనుష్ గారు జనసేన నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తరువాత ఎం. నాగులపల్లి లో ప్రమాదంలో గాయపడిన జనసేన అధ్యక్షులు శివరామకృష్ణ గారిని పరామర్శించినారు. తరువాయి ద్వారకాతిరుమలలోని కండిగళ్ళమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈ కార్యక్రమంలో ద్వారక తిరుమల జనసేన మండల అధ్యక్షులు దాకరపు నరసింహమూర్తి గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిలుకూరి ఫణి గారు, తరగల్ల శ్రీనివాసరావు గారు, రామన్నగూడెం సొసైటీ చైర్మన్ శేఖర్ గారు, కొత్తపల్లి సొసైటీ సభ్యులు మహంకాళి గారు, తోటకూర నాగేశ్వరావు గారు, అంబటి రాజేష్ గారు, గున్నంపల్లి మురళీకృష్ణ గారు, జానికిరామ్‌ గారు, ప్రతాప్ గారు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పద్మభూషణ్ కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి పురస్కరించుకొని, ఆనందోబ్రహ్మ వారు ధ్యానం, గానం, నాట్యం.

ఈరోజు విక్రమ హాల్ నందు పద్మభూషణ్ కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతి ని పురస్కరించుకొని, ఆనందోబ్రహ్మ వారు ధ్యానం, గానం, నాట్యం మేలవించి చక్కటి కార్యక్రమమును ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రోటేరియన్ తీగెలరాజా పాల్గొన్నారు. తీగెలరాజా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆనందోబ్రహ్మ సంస్థవారిని ముఖ్యంగా డాక్టర్ గోపాలకృష్ణ వారి కమిటీ వారిని అభినందిస్తూ ఇటువంటి ఈ సమాజానికి చాలా అవసరం అని ధ్యానం ద్వారా మన ఆరోగ్యాన్ని చక్కభరచుకోవచ్చని మందులకి కూడా లొంగని మొండి వ్యాధులను కూడా ధ్యానంతో తగ్గించవచ్చని తెలుపుతూ చిన్నతనం నుండి పిల్లల్లో కూడా ఈ ధ్యానం చేసుకున్న నేర్పించను వారి జీవన ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ శేఖర్, నందిని వారి గానామృతం వినిపించినారు, విజయనగరవాసి అనేక దేశాల్లో ప్రదర్శన ఇచ్చిన భరతనాట్యం కళాకారుని కుమారి యామిని చక్కటి తన నాట్యముతో కార్యక్రమంలో రక్తి కట్టించి నారు, గాయకుడు సిద్ధార్థ కుమార్తె నాట్యం ఎంతో ఆనందం కలిగించింది పోస్ట్ మాస్టర్ ప్రసాద్ స్నేహమేరా జీవితం అనే పాట పాడి పరవశింపజేసినారు. బుచ్చిబాబు తమ మిమిక్రీ కళ ను అద్భుతం గా వున్నది, కార్యక్రమమును ఉపాధ్యాయులు రత్న కుమారి ముందుండి నడిపించినారు. కార్యక్రమమునకు డాక్టర్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించినారు. అధిక సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి శ్వాస తీసుకునుటలో సాధన చేసినారు.

తూర్పు గోదావరి

దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మేడపాటి షర్మిళ రెడ్డి.

రాజమహేంద్రవరం స్థానిక దేవిచౌక్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా రాజమండ్రి దేవిచౌక్ లో అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.