Sunday, 3 May 2026

Blog

అన్నమయ్య

చిట్వేలి మండలంలో గ్రామసభల ప్రారంభం – ప్రజలే ప్రణాళికల శిల్పులు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు. సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు. మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

తూర్పు గోదావరి

గోకులం షెడ్స్ శంకుస్థాపనలు చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి.

పున్నమి న్యూస్ ప్రతినిధి (అక్టోబర్1) తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో యం.జి. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా మంజూరు కాబడిన రెండు గోకులం షెడ్స్ (ఒక్కో షెడ్ అంచనా విలువ రూ. 2 లక్షలు) కి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న టుమెన్ కమిటీ సభ్యులు, ఏ.యం.సి చైర్మన్,ఎన్.డి ఏ కూటమి నాయకులు.

సినిమా

సినిమాల రిలీజ్ ను డిసైడ్ చేస్తున్న ఓటీటీ.. స్టార్ హీరో సినిమా రైట్స్ ఇప్పటికి పెండింగ్

అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) రీసెంట్‌గా ఓటీటీ వేదికలు సినిమాల విడుదల తేదీలను నిర్ణయించే స్థాయికి చేరుకున్నాయి. థియేటర్ల కన్నా ఓటీటీలో రిలీజ్ వాయిదా వేయకుండానే అందించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక స్టార్ హీరో కొత్త సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇంకా ఆ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ఒప్పందం పూర్తవ్వలేదు. అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాకు ఆసక్తి చూపుతున్నప్పటికీ, మేకర్స్ ఇప్పటివరకు ఏ సంస్థతో డీల్ ఫైనలైజ్ చేయలేదు. దీంతో విడుదల తేదీ కూడా ఖరారు కావడం లేదు. ఓటీటీనే రిలీజ్ డేట్‌ను నిర్ణయించే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో, రైట్స్ విషయంలో ఆలస్యం మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.

కామారెడ్డి

యువజన సమాఖ్య నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక పూజలతో వైభవం

కామారెడ్డి,01 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు 18 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తి పారవశ్యాన్ని చాటుతున్నారు.నిత్య పూజలు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీ దుర్గామా తకు ప్రత్యేక అభిషేకాలు, అష్టోత్తర శత నామార్చ న సహస్ర నామార్చన వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నారు. అలంకరణ వైభవం ప్రతి రోజు అమ్మవారిని ఒక ప్రత్యేక నవదుర్గ అవతారంలో అలంకరించి, ఆ రూపానికి తగిన పూజలను, నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఈ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటు న్నాయి.ముగింపు వేడుకల సంధర్భంగా ఉత్సవా ల చివరి రోజున మహిషాసురమర్దని అలంకరణ, సామూహిక యజ్ఞాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. ఈ యజ్ఞంలో 20 మంది దంపతులు జంటగా పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్నా రు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇకపై జీరో బ్యాలెన్స్‌ ఖాతాలకూ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు

అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) ఇకపై జీరో బ్యాలెన్స్‌ ఖాతాలకూ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు లభ్యమవనున్నాయి. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (BSBD) ఖాతాలకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ ఖాతాలకు పరిమిత సేవలు మాత్రమే లభ్యమయ్యే విధంగా నిబంధనలు ఉండగా, తాజా మార్గదర్శకాలతో డిజిటల్‌ లావాదేవీలు, మొబైల్‌/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది డిజిటల్‌ ఆర్థిక సమగ్రతను పెంచడంలో మైలురాయిగా భావిస్తున్నారు. దేశంలోని తక్కువ ఆదాయ వర్గాలకూ ఆధునిక బ్యాంకింగ్‌ సేవలు చేరవేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

చిత్తూరు

పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ డి టి సుధారాణి ఈరోజు పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, వివిధ రకాల ఆరోగ్య సేవలపై రికార్డుల పరిశీలన, స్వస్థానారీ సశక్తు పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాలలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్, గర్భాసయ్య కాన్, తల్లి బిడ్డల సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలిక ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, ఆయుష్ సేవలు, టీకాల కార్యక్రమం, మరియు మానసిక వైద్య సేవలపై పరీక్షలు మొదలగు వారికి ఇస్తున్న సేవలో అన్ని రకాల యాప్స్ నందు అప్డేట్ చేయడం, ఆసుపత్రి కాన్పులను పెంచడం, పరిసరాలు పరిశుభ్రత మొదలగువాటిపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

*శరన్నవరాత్రుల్లో అమ్మవారి అంశగా మెరిసిన చిన్నారులు: లిఖిత నాట్య వైభవం!*

గన్నవరం:అక్టోబర్ 1 ( పున్నమి ప్రతినిధి సురేష్) ​సాక్షాత్తు అమ్మవారి దర్శనం ముందుగానే కలిగింది అనే అనుభూతినిచ్చిన నాట్య ప్రదర్శన! ​శరన్నవరాత్రులు అంటేనే అమ్మవారి పండగ. ఈ 11 రాత్రులు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు లక్షలాది మంది ఆలయాలకు క్యూ కడతారు. అయితే, ఈ సంవత్సరం పలు దేవాలయాల్లో అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు, అమ్మవారిని చూసే కన్నా ముందే అపురూపమైన కళాదర్శనం చేసుకుని పులకించిపోయారు. ఆ కళాకారిణి మరెవరో కాదు, చిన్నారి లిఖిత. ​శరన్నవరాత్రులను పురస్కరించుకుని పలు దేవాలయాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో లిఖిత ఇచ్చిన నాట్య ప్రదర్శన భక్తుల మనసులను దోచుకుంది. ఆమె నృత్యంలో ఒలికిన భక్తిభావం, అద్భుతమైన హావభావాలు, లయబద్ధమైన నర్తనం చూసిన వారందరూ సాక్షాత్తు ఆ చిన్నారి దేవి రూపంలో అమ్మవారే తమకు దర్శనమిచ్చిందా అనేంతగా మైమరిచిపోయారు. ​అమ్మవారి రూపాలను, ఘట్టాలను కళ్లకు కట్టినట్టుగా, ప్రతి భంగిమలోనూ అమ్మవారి దివ్య తేజస్సు ఉట్టిపడేలా లిఖిత ప్రదర్శన ఇచ్చింది. ఆమె నాట్యం చూసి భక్తులు “ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అనుకున్నాము, కానీ ఈ చిన్నారి నృత్యంలోనే మాకు ముందుగా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది” అంటూ ప్రశంసించారు. ​చిన్నారి లిఖిత ఇచ్చిన ఈ అపూర్వ నాట్య ప్రదర్శన శరన్నవరాత్రి ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చి, వేలాది మంది భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

తిరుపతి

ఉపాధ్యాయ పోరుబాట.పోస్టర్ ఆవిష్కరణ

బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో ని బాబు అగ్రహారం పురపాలక ఉన్నత పాఠశాల నందు విజయవాడ లో జరుగు ధర్నా మరియు పోరుబాటకు సంబంధించి డివిజన్ స్థాయి సన్నాహక కార్యక్రమము నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డివిజన్ ఫ్యాప్టో ఇంచార్జి బి మురళీకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 7వ తేదీన ఫ్యాప్టో,రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నందు గల ధర్నా చౌక్ నందు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం జరిగే రాష్ట్రస్థాయి ధర్నా మరియు పోరుబాటను ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ధర్నా కు సంబంధించి కరపత్రాలను నేతలు ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఫ్యాప్టో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

*దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.*

నిర్మల్ పట్టణంలో దసరా ఉత్సవ ఏర్పాట్లను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పరిశీలించారు. ముందుగా బంగల్ పేట్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లను, దుర్గా నిమజ్జన శోభయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ , మేడిసెమ్మ రాజు, సత్యనారాయణ గౌడ్, తో పాటు పట్టణ అధ్యక్షులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

మహా శక్తి అమ్మ వారిని దర్శించుకున్న ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) కరీంనగర్ లోని మహా శక్తి అమ్మ వారి ని బుధవారం నాడు ఖమ్మం జిల్లా కి చెందిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి దర్సించుకున్నారు. ఈ సందర్భముగా బండి సంజయ్ వారితో మాట్లాడుతు ఖమ్మం జిల్లా ప్రజలకి మహా శక్తి అమ్మ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూన్నాను అని, అలాగె విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బండి సంజయ్ వారితో అన్నారు. చావా కిరణ్, భూక్యా శ్యాం సుందర్ నాయక్, సంతోష్ రెడ్డి, తదితరులు మహా శక్తి అమ్మ వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.