Sunday, 3 May 2026

Blog

తిరుపతి

సూపర్ జీయస్టీ – ఆర్థిక ప్రగతికి ఊతం:డా ఉమేష్ రావు

ఎన్డీయే ప్రభుత్వ సూపర్ జీఎస్టి వలన పేద,మధ్య తరగతి కుటుంబాలకు రూ.15,000 వరకు నెలవారీ ఖర్చు తగ్గుతూ ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం జీయస్టీ సంస్కరణల ఫలితంగా పేద,మధ్యతరగతి కుటుంబాల వారికి చేకూరే లబ్దిని తెలపడాని చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బుధవారం స్థానిక పూసల వీధి కూడలిలో బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.గతంలో 4 శ్లాబుల్లో ఉన్న జీఎస్టీని రెండే శ్లాబులకు కుదిండం వస్తువులపై 18,12 శాతం పన్నును ఏకంగా 5 శాతానికి తగ్గించడం తో ధరలు దిగిరావడం,మరోవైపు పండుగల సీజన్ కావడంతో సామాన్యులు తమ ఇంటికి పెద్ద స్క్రీన్ గల టీవీలు,ఏసీ లను ఆనందోత్సాహాలతో కొనుక్కుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడానికే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ -డాక్టర్ గూడూరి శ్రీనివాస్.

* ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలి * రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు * వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు కష్టనష్టాలు కలగకుండా, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆ దుర్గామాత కాపాడాలని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని వివరించారు. మెడికల్ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని వివరించారు. సుమారు 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయి ఒక్కో కాలేజీ 150 సీట్లు తో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదంటూ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా దరాతత్తం చేసేందుకే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలు 40 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాజకీయ కక్షలు లేవు అంటూనే లిక్కర్ స్కాం చేశారంటూ ఆరోపణ చేసి ఎంపీ మిధున్ రెడ్డిని ఎందుకు అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైవేపై, బడి గుడి ఉన్న ప్రాంతాలలో మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

తిరుపతి

దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు

శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ని,శ్రీకాళహస్తి,తిరుపతి,సత్యవేడు, సూళ్లూరు పేట, వెంకట గిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఉమ్మడి కూటమి పార్టీల నాయకులకు మరియు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఒక్కరికి ఆ దుర్గాదేవి కరుణ కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.

E-పేపర్

వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు మేడా

వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు మేడా అన్నమయ్య జిల్లా, అక్టోబర్1( పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని బుధవారం రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు ఎం.పీ మేడా రఘునాథ రెడ్డి మరియు నందలూరు ఎం.పీ.పీ మేడా విజయ భాస్కర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని ఆలయ నిర్వహకులు స్వాగతం పలికారు. అనంతరం చండీ హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆ వాసవి మాత ఆశీస్సులతో ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా ఆయన కోరు కున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు యంబలూరు నరసింహ స్వామి, ఉపాధ్యక్షులు మాకం వెంకట కుమార్, చలపాటి నరసింహ శ్రేష్టి, సెక్రెటరీ గెలివి నాగ సురేంద్ర కుమార్, యంబలూరు నరసింహ ప్రసాద్, వల్లంకొండు చంద్రశేఖర్, పరిటాల ప్రసాద్, ఎంబలూరు ప్రదీప్, మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి, సోమిశెట్టి ప్రభాకర్, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, కరిముల్లా ఖాన్, ముమ్మడిశెట్టి సుధాకర్, కాకి చంద్ర, పాలగిరి సుధాకర్ రెడ్డి, మోదుగుల చంద్రశేఖర్, రాజశేఖర్ రెడ్డి, శ్రీవాణి, లక్ష్మీదేవి ముఖ్య నాయకులు తదితరులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాటిపాకలో ఓ.యన్.జి.సి రేఫినిరీ ప్రాంగణంలో దసరా సంబరాలు

డా బి ఆర్ అంబేద్కర్ కొనసీమ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఈరోజు దసరా పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో ఉన్న (ONGC) ఓ.యన్.జి.సి రేఫినిరీ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ శుభాకాంక్షల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మేక పోతు బలి ఇచ్చి, నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భజనలు, మంగళవాయిద్యాలు, సంప్రదాయ కార్యక్రమాలు అలరించాయి. పండుగను పురస్కరించుకుని ఉద్యోగుల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన ఏర్పాట్లు చేశారు. పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ కార్యాలయం ప్రత్యేకంగా అలంకరించబడింది. ఈ కార్యాచరణలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సంస్థ అభివృద్ధి, దేశ సమృద్ధి కోసం దేవిని ప్రార్థించారు. సంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుకలు జరుపుకోవడం హర్షణీయమని అధికారులు పేర్కొన్నారు. దసరా పండుగతో కార్యాలయం ఆనందభరితంగా మారింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల ఎంపీడీఓగా అలీషా బాబు బాధ్యతలు స్వీకారం

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల కొత్త ఎంపీడీఓగా ఎ. అలీషా బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా బాపట్ల నుండి చేజర్ల మండలానికి బదిలీ అయిన ఆయన, అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అలీషా బాబు మాట్లాడుతూ, మండల పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పదవీ స్వీకార కార్యక్రమంలో మండల పరిధిలోని సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్త ఎంపీడీఓని అభినందించారు. అలీషా బాబు అనుభవజ్ఞుడైన అధికారి కావడంతో, ఆయన రాకతో మండల అభివృద్ధి మరింత పురోగతి సాధిస్తుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ చేజర్లలో ట్రాక్టర్లతో ర్యాలీ

సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు మరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతులు మరియు కూటమి నాయకులు ట్రాక్టర్లతో అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని సూపర్ సిక్స్ సూపర్ గా అమలు చేశారని జిఎస్టి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని జీఎస్టీ ని భారీ స్థాయిలో తగ్గించి ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా చేసిన నారా చంద్రబాబు నాయుడును ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు రైతులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ల ఆనందాన్ని తెలియజేశారని తెలిపారు. రైతులకు 12 శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించినందుకు గాను రైతులందరూ చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉండాలని దసరా దీపావళి కన్నా ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ తగ్గించినందువల్ల రెండు రోజులు ముందుగానే పండుగ వాతావరణం నెలకొల్పారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అగ్రికల్చర్ ఏ.వో హిమబిందు,నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య,సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్దుల నాయుడు,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతుల నాయుడు, టిడిపి జిల్లా బీసీ సెల్ నాయకులు చీర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ మస్తానయ్య, భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్వి గుంట బాబు, కోనంకి బాబు, మల్లెం కొండారెడ్డి ఐ.టీడీపీ మండల ఉపాధ్యక్షులు షేక్.లతీఫ్, ఆర్యవైశ్య నాయకులు దేవతి రమేష్,కమలేష్ నాయుడు రైతులు మరియు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

పార్టీ బలోపేతమే అందరి లక్ష్యం కావాలి: తాతంశెట్టి నాగేంద్ర ……..ప్రతి బూత్‌లో ఏజెంట్ నిలబెట్టే స్థాయికి ఎదగాలని పిలుపు …….బూత్ స్థాయినుండి బలపడితేనే, అసెంబ్లీ గెలుపు దూరం కాదు

రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలంలో జనసేన బలోపేతమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన రాజుకుంట యువ నాయకులు ఆనాల సునీల్‌కుమార్, మాదినేని కనకరాజ, మాదినేని లోకేష్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో బుధవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేంద్ర మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ, ప్రజా ఆమోదం మేరకు పరిపాలన సాగించే లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం తప్పనిసరి. ప్రతి పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌ను నిలబెట్టే స్థాయికి ఎదగాలి. చిట్వేలి మండలం, రైల్వే కోడూరులో తిరుగులేని శక్తిగా నిలవాలి” అని పిలుపునిచ్చారు. అలాగే పార్టీకి చేరిన సునీల్, కనకరాజ, లోకేష్ మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం, కార్యకర్తల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, ఏనుగుల జగన్మోహన్ రాయల్, పగడాల శివ, శివరాం, తేజ, పగడాల వెంకటేష్, సాదు కిషోర్‌తో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

టవర్ ఉంది : సిగ్నల్ లేదు. చిట్వేలిలో మూగబోయిన బి.ఎస్.ఎన్.ఎల్

ప్రపంచం 5G, 6Gలు అంటూ ముందుకు దూసుకెళ్తుంటే… చిట్వేలి మాత్రం నెట్ సిగ్నల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అతి పెద్ద టవర్, కార్యాలయం ఉన్నా అక్కడ సిబ్బంది లేక బి.ఎస్.ఎన్.ఎల్ టవర్ మూగబోయింది. ప్రభుత్వ సంస్థే ఇంత నిర్లక్ష్యం చేస్తే, ప్రైవేటు సంస్థలపై ఏమని చెప్పాలి? ఇంటర్నెట్ లేక ప్రభుత్వ కార్యాలయాలు పనులు నిలిచిపోగా, అధికారులు తమ వ్యక్తిగత డేటాతోనే సేవలు అందిస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్ పనిచేయదు కానీ బిల్లు మాత్రం వస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలే కాదు, అధికారులకే ‘ఓటిపి’ రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజల్లో బి.ఎస్.ఎన్.ఎల్ అంటే ఇప్పుడు “బిల్, సిగ్నల్ లేని సంస్థ” అనే వ్యంగ్యం వినిపిస్తోంది. మండల ప్రజలు ఒకటే కోరుతున్నారు – చిట్వేలి టవర్ మళ్లీ పనిచేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని.

అన్నమయ్య

టవర్ ఉంది : సిగ్నల్ లేదు. చిట్వేలిలో మూగబోయిన బి.ఎస్.ఎన్.ఎల్

ప్రపంచం 5G, 6Gలు అంటూ ముందుకు దూసుకెళ్తుంటే… చిట్వేలి మాత్రం నెట్ సిగ్నల్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అతి పెద్ద టవర్, కార్యాలయం ఉన్నా అక్కడ సిబ్బంది లేక బి.ఎస్.ఎన్.ఎల్ టవర్ మూగబోయింది. ప్రభుత్వ సంస్థే ఇంత నిర్లక్ష్యం చేస్తే, ప్రైవేటు సంస్థలపై ఏమని చెప్పాలి? ఇంటర్నెట్ లేక ప్రభుత్వ కార్యాలయాలు పనులు నిలిచిపోగా, అధికారులు తమ వ్యక్తిగత డేటాతోనే సేవలు అందిస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్ పనిచేయదు కానీ బిల్లు మాత్రం వస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలే కాదు, అధికారులకే ‘ఓటిపి’ రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజల్లో బి.ఎస్.ఎన్.ఎల్ అంటే ఇప్పుడు “బిల్, సిగ్నల్ లేని సంస్థ” అనే వ్యంగ్యం వినిపిస్తోంది. మండల ప్రజలు ఒకటే కోరుతున్నారు – చిట్వేలి టవర్ మళ్లీ పనిచేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.