Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

హైదరాబాదులో జరిగిన OG సక్సెస్ మీట్.

తూర్పుగోదావరి జిల్లా జనసేన రాజమహేంద్రవరం నగర బాధ్యతలు తిరిగి చేపట్టిన అనంతరం, అనుశ్రీ సత్యనారాయణ OG సినిమా ప్రీమియర్ షో అనంతరం చిత్రం గొప్ప సక్సెస్ను అందుకొని రికార్డులు తిరిగి రాయడం ఖాయమని పేర్కొన్న సంగతి తెలిసినదే. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా ఈరోజు హైదరాబాదులో జరిగిన OG సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా #OG చిత్రం మెమొంటో అందుకున్న అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత రాజమండ్రి జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా పంపిణీదారులు నున్న దొరబాబు, మరియు OG నిర్మాత డివివి దానయ్య , డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ కార్యక్రమంలో చిత్ర ప్రముఖులు, చిత్రానికి సంబంధించిన సాంకేతిక బృందం, మరియు మెగా అభిమానులు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

కె.జగన్నాధపురం లో పింఛన్లు పంపిణీ లో పాల్గొన్న కూటమి నేతలు

పున్నమి న్యూస్(కోనసీమ): సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో కొత్తగా పెన్షన్ మంజూరైన వారికి బుధవారం ఉదయం గ్రామ ఎన్డీయే కూటమి నేతలు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న కూటమి నేతలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలు లో పాల్గొన్న బీజేపీ నేతలు

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్: మాజీ లోక్ సభ స్పీకర్, కోనసీమ అభివృద్ధి ప్రదాత కీర్తిశేషులు జీఎంసీ బాలయోగి 74 వ జయంతి సందర్భంగా అమలాపురం బాలయోగి ఘాట్ వద్ద జరిగిన జయంతి వేడుకలలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి, ఆనాడే కోనసీమ కు రైల్వే లైన్ రావాలని శంకుస్థాపన చేయించారన్నారు. ఆయన లోక్ సభ స్పీకర్ అయి ఉండి కూడా అందరికీ అందుబాటులో ఉండేవారని అన్నారు. ఆయన బాట లోనే ఆయన తనయుడు స్థానిక ఎంపీ హరీష్ మాధుర్ నడుస్తున్నారని, కోనసీమకు రైలు కూత వినబడాలనే లక్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరిగెల నాని, అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మాకిరెడ్డి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు, ఎస్సీ యువకుడిపై కులపరమైన దాడి దారుణం, తక్షణ చర్యల కై బర్రే ఆనంద్ కుమార్ డిమాండ్.

కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రాణాలు రక్షణ లేకుండా పోయిందని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బర్రే ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ నుంచి కూటమి పార్టీలకు ఆంధ్ర రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగిన నాటి నుంచి ఎస్సీల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని అన్నారు. గాడాల గ్రామం ప్రధాన కూడలిలో స్టేట్ హైవే పై నడిరోడ్డు మీద ఎస్సీ యువకుడిని స్తంభానికి కట్టి విచక్షణారహితంగా కొట్టడం వంటి సంఘటనలతో రాష్ట్రంలో ఎస్సీలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారొ అర్థమవుతుందని తెలిపారు. వివరాల్లోకి వెళితే మధురపూడి గ్రామంలో ఉన్న ఎస్సీ యువకులకు గాడాల గ్రామంలో ఉన్న కాపు యువకులకు మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో తాము అనుకున్న ఎస్సీ యువకుడు దొరకకపోవడంతో ఆ గ్రామానికి చెందిన ఎవరో ఒక ఎస్సీ యువకుడిని చంపి మొత్తం ఎస్సీ లందరికీ భయం కల్పించాలన్న దుర్మార్గమైన కుల పరమైన ద్వేషంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మధురపూడి గ్రామానికి చెందిన పాము శ్రీను ను దారి కాచి విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా నడిరోడ్డుపై స్తంభానికి కట్టేసి ముఖంపై ఉమ్ము వేస్తూ ఇనుప రాడ్లతో ముక్కు వెంట నోటి వెంట రక్తం వచ్చేలా విపరీతంగా కొట్టారు. ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ వారికి కూడా భయపడకుండా తమ దాడిని కొనసాగించడంతో పోలీసులే భయపడి మరింత మంది పోలీసులను రక్షణ కోసం రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన తర్వాత ఒంటినిండా రక్తాలతో తీవ్రమైన గాయాలతో వచ్చినప్పటికీ కేవలం ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రిలో అడ్మిషన్ ఇవ్వకుండా బలవంతంగా బయటికి పంపి వేయడంతో రాత్రంతా నెత్తుటి గాయాలతో ఆసుపత్రి బయట చెట్టు కింద బాధితులు పడి ఉండవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ విధంగా ఎస్సీలపై కర్కసంగా వ్యవహరిస్తున అధికారులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అయితే జరిగిన సంఘటనపై వేగంగా స్పందించి కేసు నమోదు చేసిన కోరుకొండ పోలీస్ స్టేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే కేసులు నమోదు చేసి వదిలిపెట్టకుండా నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి బాధితులకు ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా కోరుకొండ సిఐకి ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరిగే దాడులను ప్రతిఘటించాలన్నా, శాశ్వత పరిష్కారం కావాలన్నా అణగారిన వర్గాల ప్రజలంతా ఏకమై తమ ఐక్యత శక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

తూర్పు గోదావరి

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జైలు సూపరింటెండెంట్.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్ సిహెచ్. వసంతకుమారి బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా, ఆమె మహిళా ఖైదీల కోసం నిర్వహిస్తున్న వివిధ పరివర్తన కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు. అలాగే, ఖైదీలలో మహిళలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల వివరాలను కూడా తెలియ చేశారు. సూపరింటెండెంట్ మహిళా ఖైదీల పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించ వలసిందిగా అభ్యర్థించారు.

తూర్పు గోదావరి

రాజమండ్రి – తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం.

వర్చువల్ ద్వారా న్యూ ఢిల్లీ ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి. మాధురపూడి లో జెండా ఊపి తొలి సర్వీస్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర నాయకులు. బుధవారం రాజమండ్రి – తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి లు వర్చువల్ గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు(మంగళ,గురు,శని వారాలు) రాజమండ్రి నుండి తిరుపతి మధ్య ఈ విమాన సర్వీసులు నడవనున్నాయనీ తెలిపారు. ఉదయం 7:40 గంటలకు తిరుపతిలో బయలుదేరి 9.25 గంటలకు రాజమండ్రి చేరుకుని.. ఉదయం 9.50 గంటలకు రాజమండ్రి లో బయలు దేరి ఉదయం 11.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.ఈ విమాన సర్వీసు ప్రారంభంతో రాజమండ్రి తిరుపతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. డిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ అర్బన్, రాజానగరం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బల రామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. “నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది రాజమండ్రి వాసులకు ఓ మంచి కానుక. గతంలో కూడా రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఢిల్లీ,ముంబై కి కూడా విమాన సర్వీసులు గతంలోనే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు అవి దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న ఎయిర్ సర్వీసులుగా నిలిచాయన్నారు. అవి ఇప్పుడు ఫుల్ అక్కూపన్సీ నడుస్తున్నాయన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు ఎంత సామర్థ్యం ఉందో ఇటువంటి వాటి వల్ల తెలుస్తోందన్నారు. ఉభయ గోదావరి జిల్లా వాసులందరికీ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నుండి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం ఒక కానుక గా ఆయన అభివర్ణించారు. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన టికెట్లు మొదలు పెట్టగానే వెంటనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. డిమాండ్ ఉన్న మార్గాల్లో టికెట్లు రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమండ్రి నుంచి తిరుపతి వరకు నడిచే విమాన సర్వీసులో మూడు నెలలపాటు మొదటి 35 సీట్లు 1999 రూపాయలు , తర్వాత 35 సీట్లు 4000 రూపాయలకే అందించడం జరుగు తుందన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్టులో 2వ టెర్మినల్ కూడా నూతనంగా నిర్మిస్తున్నాం , పనులు చురుగ్గా సాగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి షిరిడి గోవా అహ్మదాబాద్ వారణాసి ఇతర ప్రాంతాలకు కూడా ఎయిర్ సర్వీసులు ప్రారంభించాలని ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో వాటిని కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం అని హామీ ఇచ్చారు. బెంగళూరుకు ఇప్పటికే ఒక ఎయిర్ సర్వీసు నడుస్తోందనీ, వీటికి అదనంగా వేరొక సర్వీస్ ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలియ చేశారు. రాజమండ్రి నుంచి ఏ ప్రాంతానికి విమాన సర్వీసులు మొదలుపెట్టిన 100 శాతం ఆక్యుపెన్సితో నడుస్తున్నాయనీ, ఇది చాలా సంతోషించ తగ్గ పరిణామం అన్నారు. గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాజమండ్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ” అని అన్నారు. రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…” రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు..రాజమండ్రి ప్రాంత వాసుల చిరకాల కోరిక. ఆ కోరికను కార్యరూపం దాల్చేలా చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపినట్టు రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లే విమానంలో మొదటి మూడు నెలలపాటు మొదటి 35 మందికి రూ.1999 లకు, తరువాత 35 మందికి రూ.4000 లకు విమాన సర్వీసు అందించడం చాలా మందికి ఉపయోగం పడుతుందని తెలిపారు. విమాన చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులోనూ ఎయిర్ కనెక్టివిటీ ఎంతో ముఖ్యం అన్నారు. రాజమండ్రి నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెరుగుదలకు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, దేశ వ్యాప్తంగా విమాన సర్వీసుల ద్వారా వివిధ రాష్ట్రాలకు అనుసంధానిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు ” అని అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ “రాజమండ్రి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఎప్పటినుంచో తిరుపతికి ఒక విమాన సర్వీసు ఉండాలని కోరుకున్నారనీ , వారి కోరిక మేరకు తిరుపతికి ఈరోజు విమాన సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకురాగానే రెండు మూడు నెలలు గడువు ఇవ్వండి అని అడిగి అలయన్స్ సంస్థతో మాట్లాడి ఈరోజు విమాన సర్వీసును ఏర్పాటు చేశారన్నారు. రాజమండ్రి ప్రజలు ప్రజాప్రతినిధుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియ చేస్తూ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరం అన్నారు. రోడ్లు రైలు మార్గాలతో పాటు ఇప్పుడు విమాన సర్వీసులు ప్రారంభించడం రాజమండ్రి ప్రాంత మరింత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రిని దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధారణించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ , దీనితో రాజమండ్రి లో పర్యాటక అభివృద్ధి చెందు తుందన్నారు. ఇంతకు ముందే న్యూఢిల్లీకి కూడా ఒక విమాన సర్వీసును ప్రారంభించుకున్నాం” అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం చాలా సంతోషం ఇది ఈ ప్రాంత వాసులుగా ఎంతగానో ఉపయోగపడుతుందనీ , రాజమండ్రి నుంచి షిరిడి, గోవా, అహ్మదాబాద్, వారణాసి, కొచ్చిన్ లకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తదితరులు కోరారు. అనంతరం రాజమండ్రి నుంచి తిరుపతికు దేరిన విమాన సర్వీసును జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

జాతీయ అంతర్జాతీయ

భారతీయ విస్కీ బ్రాండ్ “ఇంద్రి” లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ 2025లో బెస్ట్ వరల్డ్ విస్కీ అవార్డు గెలుచుకుంది.

‘ఇంద్రి” బెస్ట్ వరల్డ్ విస్కీ, అక్టోబర్(పున్నమి ప్రతినిధి) భారతీయ విస్కీ బ్రాండ్ ఇంద్రి 2025లో లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్‌లో “బెస్ట్ వరల్డ్ విస్కీ” అవార్డును గెలుచుకుంది. ఇది భారత విస్కీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఇంద్రి బ్రాండ్ తన నాణ్యత, రుచి, విశిష్టమైన తయారీ శైలితో ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. హరియాణాలో తయారైన ఈ సింగిల్ మాల్ట్ విస్కీ, ప్రత్యేకమైన వుడ్ బారెల్ ఏజింగ్‌తో పాటు భారత సాంప్రదాయాలు మరియు ఆధునిక సాంకేతికతల మేళవింపుతో తయారైంది. ఈ గౌరవం భారత మద్యం పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయంగా చాటిచెప్పింది. ఇంద్రి విజయం దేశీయ బ్రాండ్లకు ప్రోత్సాహం కలిగించడమే కాకుండా, ప్రపంచ విస్కీ మార్కెట్లో భారత ఉనికిని బలపరిచే ఘట్టంగా నిలిచింది.

Blog

Krishna district SP

కృష్ణాజిల్లా పోలీస్ *విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్* విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ వి . విద్యాసాగర్ నాయుడు, ఐ.పి.ఎస్ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగను ప్రజలందరూ ఆనందంతో జరుపుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ కొత్త విజయాలు చేకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు దేవి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అన్ని వర్గాలవారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.

జాతీయ అంతర్జాతీయ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ₹100 నాణెం ఆవిష్కరించారు.

₹100 నాణెాo: అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రత్యేక ₹100 నాణెాన్ని ఆవిష్కరించారు. ఈ నాణెం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు ఆధ్యాత్మిక నాయకుడు శ్రీ అరవిందో 150వ జయంతిని పురస్కరించుకొని విడుదల చేయబడింది. ఈ నాణెం ప్రత్యేక డిజైన్‌తో, ఒకవైపు శ్రీ అరవిందో చిత్రంతో, మరోవైపు జాతీయ చిహ్నం మరియు నాణే వెలువు పేర్కొనబడి ఉంటుంది. ఇది సాధారణ వినిమయానికి కాకుండా, జ్ఞాపికగా ఉంచుకునే నాణెంగా రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వం మరియు నాణేల మింట్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ఈ నాణె ఆవిష్కరణ, భారత సంస్కృతి, వారసత్వం, మహానుభావుల సేవలను గుర్తు చేసేందుకు ఒక శ్రద్ధాంజలిగా భావించబడుతోంది. ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఘట్టంగా నిలిచింది.

జాతీయ అంతర్జాతీయ

ఎన్నికల కమిషన్ బీహార్ ఓటర్ల జాబితా నుండి 47 లక్షల మంది ఓటర్లను తొలగించింది

బీహార్‌: అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) ఇటీవల బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా పరిశుద్ధీకరణ ప్రక్రియలో, మొత్తం 47 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారు. వీరిని మృతులు, డుప్లికేట్లు, వలస వెళ్లినవారు లేదా అర్హతలేని వారు గా గుర్తించారు. ఈ చర్య ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా ఉంచేందుకు తీసుకున్నది. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు ఈ తొలగింపుపై సందేహాలు వ్యక్తం చేస్తూ, తగిన విచారణ కోరుతున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎన్నికల కమిషన్ మాత్రం, ఇది నిబంధనలకు అనుగుణంగా జరిగిన ప్రక్రియ అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో వారం వారీగా ఓటర్ల జాబితా నవీకరణ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటర్ వివరాలు తిరిగి తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.