Sunday, 3 May 2026

Blog

అన్నమయ్య

ఇంటి స్థలాల కోసం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దరఖాస్తుల సమర్పణ

పుల్లంపేట, అక్టోబర్ 2(పున్నమి ప్రతినిధి) నిరుపేదలకు ఇంటి స్థలాల కేటాయింపుపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జాగువారిపల్లి గ్రామ సచివాలయంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ మాట్లాడుతూ – “ఉడుమువారి పల్లి గ్రామంలోని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఆ వాగ్దానం నెరవేరలేదు. అందుకే మళ్లీ ఈరోజు గ్రామ సచివాలయంలో దరఖాస్తులు సమర్పించాము” అని తెలిపారు.పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ – “నిరుపేదల నుండి అందిన దరఖాస్తులను నాలుగు రోజుల్లో ఆన్లైన్ చేస్తాము” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు పి.లక్ష్మీదేవి, లక్ష్మీ నరసమ్మ, గంగాదేవి, ఈశ్వరమ్మ, దేవి, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన బలోపేతమే లక్ష్యం

చిట్వేలి, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే ప్రతి కార్యకర్త ధ్యేయంగా తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఇటీవల జనసేనలో చేరిన రాజుకుంట యువ నాయకులు ఆనాల సునీల్‌కుమార్, మాదినేని కనకరాజ, మాదినేని లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జనసేన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేంద్ర మాట్లాడుతూ “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్న నీతి, నిజాయితీ, ప్రజా ఆమోదం మేరకు పాలన సాగించాలంటే గ్రామ స్థాయి వరకు పార్టీని బలపరచడం అత్యవసరం. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ ఏజెంట్ నిలబడే స్థాయికి చేరుకోవాలి. ముఖ్యంగా చిట్వేలి మండలం, రైల్వే కోడూరు ప్రాంతంలో జనసేన తిరుగులేని శక్తిగా నిలవాలి. ఈ లక్ష్యం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.అలాగే పార్టీలో చేరిన సునీల్, కనకరాజ, లోకేష్ మాట్లాడుతూ“జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం, కార్యకర్తల సహకారంతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, ఏనుగుల జగన్మోహన్ రాయల్, పగడాల శివ, శివరాం, తేజ, పగడాల వెంకటేష్, సాదు కిషోర్‌తో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అన్నమయ్య

చిట్వేల్ లో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో దుస్తుల పంపిణీ

చిట్వేల్, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి ప్రతినిధి) చిట్వేల్ పట్టణంలోని భువనేశ్వరి శ్యామలాంబ సమేత శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమంగా దుస్తుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యారు. ఆలయ ఆవరణలో పెంచలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూపానంద రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన స్వయంగా పలు కుటుంబాలకు దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ముక్కా రూపానంద రెడ్డి “ఇలాంటి కార్యక్రమాలు అవసరంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాయి. సమాజంలో బలహీన వర్గాలకు తోడ్పాటు అందించే దిశగా దుస్తుల పంపిణీ ఎంతో ఉపయోగకరం. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన పెంచలయ్యకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కోనసీమలో రైలు కూత వినబడాలి అదే బాలయోగికి ఘనమైన నివాళి, జయంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో నివాళులు.

కోనసీమలో రైలు కోత వినబడినప్పుడే బాలయోగి నిజమైన ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు.దివంగత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 74వ జయంతి సందర్భంగా గన్ని కృష్ణ ఆధ్వర్యంలో కంబాలచెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలలో ఎన్నాళ్ళు ఉన్నామన్నది ముఖ్యం కాదని,ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామనేది ముఖ్యమని అన్నారు.బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమం,జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు.విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన రోల్ మోడల్ అని,ఎంత ఎదిగిన ఒదగి ఉండే నైజం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.కోనసీమ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.ఆయన బతికి ఉంటే కోనసీమలో రైలు కూత వినిపించేదన్నారు. ఇప్పటికైనా ఆయన ఆశయ‌సాధనలో భాగంగా కోనసీమలో రైలుకూత వినిపించేలా కృషిచేస్తేనే ఆయనకు నిజమైన ఘన నివాళి అని అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు స్టాంపు తీసుకురావడంలో బాలయోగి చేసిన కృషి మరువలేమన్నారు. వైశ్యుల కోరికను నెరవేర్చడానికి ఆయన చొరవచూపి స్టాంప్ వచ్చేలా కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్,తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు,మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, తలారి ఉమాదేవి, జవ్వాది మురళీకృష్ణ, కప్పల వెలుగు కుమారి, షేక్ చాన్ బాషా,బొమ్మనమైన శ్రీనివాస్,కొయ్యల రమణ, యిన్నమూరి రాంబాబు,సింహా నాగమణి,కోరుమెల్లి విజయశేఖర్,తంగెళ్ళ బాబీ,మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అప్సరీ,నాయకులు నిమ్మలపూడి గోవింద్,ఉప్పులూరి జానకిరామయ్య, పెనుగొండ రామకృష్ణ సంసాని ప్రసాద్, బెజవాడ వెంకటస్వామి,మరుకుర్తి రవియాదవ్, ఎం బ్రహ్మయ్య,కేదారశెట్టి రమణ, పేపర్ మిల్ శేఖర్, బుడ్డిగ గోపాలకృష్ణ,మళ్ళ వెంకట్రాజు, రామినేని మస్తాన్ చౌదరి,సూరంపూడి శ్రీహరి, రాయి అప్పన్న, కంచిపాటి గోవింద్, జమ్మి సత్యనారాయణ,కట్టా సత్యనారాయణ, కేవీ శ్రీనివాస్, సింహాద్రి సతీష్,వారాది నాగబాబు, తలారి భగవాన్, కవులూరి వెంకటరావు, మ వానపల్లి శ్రీనివాస్, రాయి అప్పన్న, మహబూబ్ ఖాన్,దాస్యం ప్రసాద్,కొత్తల కిషోర్,విజయలక్ష్మి,బొర్రా చినబాబు,ఆర్.సుబ్బారావు,పైలా రాంబాబు,ఆడారి లక్ష్మీనారాయణ, మోతా నాగలక్ష్మి,తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర అధ్యక్షుడు కొమ్మర్తి బాబ్జి, నూకల శ్రీనివాస్,పుట్రేవు ప్రసాద్,కార్యనిర్వాహక కార్యదర్శిసునీల్ నయనాల్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అనిల్ బాబు,మెంబర్స్ తోట నాగేంద్ర,మొగ్గ శ్రీను,విడిఎల్ సూర్యనారాయణ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల టౌన్ 19 వ వార్డు పొన్నాపురం కాలనీ నందు 19 వార్డ్ టిడిపి ఇంచార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు . 200 రూపాయలు ఉన్న పెన్షన్ వేయి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు కే దక్కిందని అన్నారు అదే విధంగా 1000/- రూపాయలు ఉన్న పెన్షన్ 2000/- చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అన్నారు గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ఏట 250/-రు పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని టిడిపి అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం 3000/- రు పెన్షన్ ని 4000 పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతినెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒకటవ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 1 అక్టోబర్ 2025 వ తేదీన నంద్యాల పోన్నాపురం కాలనీలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనంతరం పింఛన్ లబ్ధిదారులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు జిల్లెల్ల శ్రీరాములు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి ,మున్సిపల్ కమిషనర్ శేషన్న ,వెంకట దాసు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది పోన్నాపురం కాలనీ పోన్నాపురం టిడిపి నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సత్యసాయి

జీఎస్టీ పై రైతులకు అవగాహన ర్యాలీ.

అమడగూరు: జీఎస్టీ పన్నులు తగ్గింపుపై సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌పై ట్రాక్టర్ ర్యాలీ,అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి వెంకటరమణాచారి నిర్వహించారు.మండల స్థానిక కేంద్రంలో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమాన్ని బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించినట్లు వెంకటరమణచారి తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ…వ్యవసాయ టాక్టర్లు,యంత్ర పరికరాలు,12 రకాల బయో పురుగుల మందులపై గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీని 7 శాతం వరకు తగ్గించారని అన్నారు.అలాగే వ్యవసాయ డ్రోన్ లపై గతంలో 18 శాతం ఉన్న జీఎస్టీని 13 శాతం తగ్గించారని తెలియజేశారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అలాగే మండల పరిధిలోని చినగానిపల్లిలో పంచాయతీ కార్యదర్శి నరేంద్ర ఆధ్వర్యంలో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌పై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బిజెపి మండల కన్వీనర్ రామిశెట్టి వేమనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బిరెడ్డి,సీనియర్ నాయకులు ఇందుకూరి సురేందర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ హైదర్ వలి,టిడిపి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డప్ప,నజ్జిరెడ్డి,బిజెపి ఉపాధ్యక్షుడు వెంకటనారాయణ,కార్యవర్గ సభ్యులు గంగులప్ప,ప్రజాప్రతినిధులు,రైతులు,ఏఈఓ రమేష్ నాయక్,ఏపీసియన్ యాఫ్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

పొన్నాపురం కాలనీలో ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల టౌన్ 19 వార్డ్ నందు ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇకనుండి నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల వద్ద పొందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని జూన్ 1 నుండి రేషన్ బియ్యంతో పాటు నిత్యవసరాలకు సంబంధించిన సరుకులు కూడా తక్కువ ధరకు అందించనుందని . ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్లు ముందుకు సాగాలన్నారుల. అనంతరం 60 సంవత్సరాలు పైబడిన వారికీ ఇంటి దగ్గరికి వెళ్లి సరుకులను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో 19 వార్డ్ టిడిపి ఇంచార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ,టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు జిల్లెల్ల శ్రీరాములు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి , ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి , ఖాజా శంకర్ , మున్సిపల్ కమిషనర్ శేషన్న , వెంకట దాసు , మున్సిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Blog

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఎన్టీఆర్ షాది ఖానా నందు నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల మతలకు అతీతంగా సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తున్నామని, అదేవిధంగా ‘క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయిని . దీంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం.’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ , నంద్యాల ఆర్డీవో , మున్సిపల్ కమిషనర్ , ప్రజా పంపిణీ అధికారులు , ప్రభుత్వ అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Blog

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఎన్టీఆర్ షాది ఖానా నందు నిర్వహించిన కార్యక్రమంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల మతలకు అతీతంగా సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందజేస్తున్నామని, అదేవిధంగా ‘క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయిని . దీంతో పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం.’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ , నంద్యాల ఆర్డీవో , మున్సిపల్ కమిషనర్ , ప్రజా పంపిణీ అధికారులు , ప్రభుత్వ అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Blog

గిరి బలిజ తొలగించి జీవో నెంబర్ 5ను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల బలిజ సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతిపత్రం ఇచ్చిన బలిజ సంగీయులు

నంద్యాల జీవో నెంబర్ 5 వలన బలిజలు మరియు గిరి బలిజలు నష్టపోతారని భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి బలిజ సంఘం పెద్దలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే సంబంధిత శాఖ మంత్రి సవిత తో ఫోన్లో మాట్లాడి జీవో నెంబర్ 5 విషయం గురించి చర్చించడం దీని వలన భవిష్యత్తులో సమస్య ఉత్పన్నమయ్య అవకాశముందని వివరించడం తో మంత్రి సవిత మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ జీవోను తటస్థంగా ఉంచామని అమలు చేయడం లేదని రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకుంటామని ఆమె భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం కాకముందే సరైన సమయంలో పరిష్కరించుకుంటే బాగుంటుందని మంత్రి ఫరూక్ మంత్రి సవిత కు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని ఇరువురికి నష్టం జరగకుండా చూస్తాననిసంఘీయులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శెట్టి విజయ్ కుమార్ , ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం , తోట రామయ్య , చలం బాబు , గాలి చంద్రశేఖర్ , కొమ్ము శ్రీహరి , గుద్దేటి వెంకటేశ్వర్లు , పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.