Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహనకార్యక్రమంలో యం.ఎల్.ఏ ముప్పిడి

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(02) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో చిరు వ్యాపారులను, రైతులను కలిసి, గ్రామంలో ఇంటింకి తిరిగి జి.ఎస్.టి. వివరాలను ఆ గ్రామ రైతులు, ప్రజలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు,ఎన్. డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు

రండి! కదలి రండి!! విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇప్పుడు సమయమైంది. ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు ఇస్తోంది. 2025 అక్టోబరు 7న రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించబడుతుంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం కొనసాగుతోంది. అన్ని జిల్లాల నుండి ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనకు చేరండి. మన హక్కుల కోసం మన గొంతును వినిపిద్దాం! ఫ్యాప్టో పోరుబాటలో ప్రతి ఒక్కరిమీ భాగస్వామ్యం అవసరం. షబ్బీర్ హుస్సేన్ ఫ్యాప్టో! ఫ్యాప్టో! విజయం మనదే!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_*వరప్రసాద్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం

_*వరప్రసాద్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం*_ పొదలకూరు పున్నమి ప్రతినిధి : రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశీస్సులతో వారి అనుచురులు పొదలకూరు నరసారెడ్డి కాలనీలో వెన్నెముక, న్యూరో సమస్య గత ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన కూచిపాటి. వరప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ 50,000/- ఆర్థిక సాయం అందించారు. గురువారం పొదలకూరులోని వరప్రసాద్ నివాసానికి విచ్చేసిన నెల్లూరు హరినాధపురం ఫోర్త్ లైన్ కి చెందిన వినాయక ఉత్సవ కమిటీ నిర్వహకులు, వేమిరెడ్డి దంపతుల అనుచరులైన డేవిడ్ జాన్, మౌళి, రాజేష్ రెడ్డి, శ్యామ్, పవన్ అనే ఐదుగురు యువ నాయకులు రూ 50 వేల నగదును వరప్రసాద్ భార్య రేవతికి అందజేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు .అలాగే వర ప్రసాద్ కి 90% అంగవైకల్యం కలిగిన వారికి ప్రభుత్వం అందించే రూ 15 వేల రూపాయల పెన్షన్ కూడా అందేలాగా చూస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. విజయదశమి పర్వదినాన గోమసాని వేణు ద్వారా తాము ఈ సమాచారం తెలుసుకుని వచ్చామని,ఆర్థిక సాయం తో ఒక మంచి పని చేసిన సంతృప్తి తమకు కలిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరస్తు షాపింగ్ మాల్ అధినేత గోమసాని వేణు, స్థానికులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_పొదలకూరు లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు_

_పొదలకూరు లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు_ పొదలకూరు పున్నమి ప్రతినిధి :  జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణంలోని ఆర్& బీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.నివాళి అర్పించిన వారిలో పొదలకూరు సి.ఐ శివరామ కృష్ణా రెడ్డి , పీఏసీఎస్ అధ్యక్షులు, మండల టీడీపీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు ,టౌన్ అధ్యక్షులు బొద్దులూరు మల్లిఖార్జున నాయుడు , నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అమర్తలూరు చెంచయ్య ,ఏఎంసీ డైరెక్టర్ పిన్నెల ప్రభాకర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుఱ్ఱం మీరామధు, ఆకులూరు విజయ్ కుమార్, పొట్టి సుధాకర్, మణిస్వామి, సురేష్ బాబు, సురేష్ కుమార్, కృష్ణం రమణయ్య, డా.బ్రహ్మయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు నడవాలన్నారు.  శాంతియుత మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చన్నారు. పొదలకూరులో తొలిసారిగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని , ఆయన జయంతిని నిర్వహించడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. అనంతరం బిస్కట్ ప్యాకెట్స్ పంచి పెట్టారు.

ఆంధ్రప్రదేశ్

కె.జగన్నాధపురం లో ఘనంగా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనయర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం లో మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు మండల బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విదేశీ వస్తువుల వాడకం తగ్గించి, స్వదేశీ వస్తువులు వాడదాం, భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బుట్టే సత్యనారాయణ, నల్లా సత్తిబాబు, నల్లా మణికంఠ మరియు జనసేన యువత పాల్గొన్నారు.

ఎలూరు

నూజివీడు పట్టణంలో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు

ఏలూరు జిల్లా, నూజివీడు: పున్నమి ప్రతినిధి (అక్టోబర్02) *చికెన్, మటన్, పంది మాంసం* *విక్రయాలు యధేచ్చగా* *జరుగుతున్నప్పటికీ అటువైపు* కన్నెత్తి చూడని మున్సిపల్ అధికారులు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెబ్లీ సైతం గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. కానీ ఇక్కడ మాత్రం గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు జరగడాన్ని చూస్తే జాతి పితకు దేశంలో ఎంత ప్రాధాన్యత, గౌరవం ఉందో తెలుస్తోంది. నూజివీడు పట్టణంలో బహిరంగంగానే మాంసం విక్రయాలు జరగడాన్ని ఖండిస్తున్న సామాజిక సేవా సంస్థలు. మున్సిపల్ అధికారులు మౌనం వెనక రహస్యం ఏమిటో తెలియట్లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. మున్సిపల్ అధికారులు కనుసైగలలోనే మాంసం విక్రయాలు ప్రోత్సహిస్తున్నారని జరుగుతున్న ప్రచారం.

ఆంధ్రప్రదేశ్

బీజేపీ ఆద్వర్యంలో ఘనంగా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ మరియు భారత దేశ రెండవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు అమలాపురం పట్టణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి ఇరువురు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ స్వదేశీ మంత్రం చరకా యంత్రం దేశ ప్రజలకు నేర్పించి బ్రిటిష్ వాళ్ళని గడగల్లాడించిన ఘనత మహాత్మా గాంధీ ది అని అన్నారు, శాస్త్రి 1964లో జవహర్‌లాల్ నెహ్రూ మరణం తరువాత, ప్రధానమంత్రి అయ్యారని ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించిన కాలంలో దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొందని, వ్యవసాయ విప్లవాన్ని (Green Revolution) ప్రోత్సహించారన్నారు. 1965 ఇంద్ర–పాకిస్తాన్ యుద్ధ సమయంలో “జై జవాన్, జై కిసాన్” నినాదాన్ని ఇచ్చి దేశాన్ని ఐక్యంగా చేర్చగలిగారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి, నిజాయితీ, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమ విజ్ఞానానికి ప్రతిరూపంగా నిలిచిన ప్రముఖ నేత అనీ, ఆయన 1904 అక్టోబర్ 2 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొఘల్సరాయిలో జన్మించారని అన్నారు. అంతేకాకుండా శాస్త్రి మహాత్మా గాంధీ ప్రభావంతో భారత స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని, తొమ్మిది సంవత్సరాలు వరకు జైలు శిక్ష అనుభవించారన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారత దేశ ప్రజలను ఉత్తేజపరిచిన భారతదేశ ముద్దుబిడ్డ లాల్ బహుదూర్ శాస్త్రి అని అన్నారు. అనంతరం ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకరమెల్లి శ్రీనివాసరావు, సలాది వీరబాబు, కొపనాతి దత్తాత్రేయ, సీనియర్ నాయకులు ఇళ్ళ సత్యనారాయణ,సీనియర్ నాయకులు సంసాని రత్నకుమార్, పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి డివిఎస్ రాజు, గొల్లకోటి వెంకటరెడ్డి, రేకాడి వర్మ, సంసు సాద్విక్, పసుపులేటి మహాలక్ష్మిరావు, బొంతు శివాజీ, మోకాఆదిలక్ష్మి, కొండేటి జయలక్ష్మి, మాకిరెడ్డి మనోజ్, పట్టణ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము

పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం నందు గల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 63 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి,నాదెండ్ల రాజేష్,నవీన్,మహేష్,ముని చంద్ర,రాజా,చందు,చెంబేటి జానీ,యాసిన్ భాష,రమేష్,శీను,వీర మహిళ బత్తెమ్మ,తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ లో ఘనంగా దుర్గా దేవి జైత్రయాత్ర

నిర్మల్ జిల్లాలో నేడు ఘనంగా దుర్గాదేవి శిరన్నావరాత్రుల శోభయాత్ర కనుల పండుగగా నిర్వహించారు తెలంగాణ బిడ్డలైన ఆడపడుచులు యుక్త వయసుకుని అమ్మాయిలు చిన్నపిల్లలు ఆనందంతో కోలాటం మాటలతో నిమజ్జనానికి దుర్గాదేవిని సాగనంపుతున్నారు ఈరోజు నిర్మల్ లో విగ్రహాలను నిమర్జనానికి శోభాయమానంగా వినాయక సాగర్ బంగల్పేట చెరువు లోనికి తీసుకురావడం జరిగింది ప్రతి వాడలో నుంచి ఒక్కొక్క దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి కనుల విందుగా శోభాయాత్రను నిర్వహించడం జరిగింది లోకాలనేలే అమ్మ ఆదిపరాశక్తి ధర్మరక్షణార్థం ఎత్తినటువంటి అవతారాలని ఈ దుర్గాదేవి శరన్నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బుధవారపేటకు చెందినటువంటి కుల పెద్దలు ముమ్మాయిల ముత్తన్న తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Video: https://youtube.com/shorts/oVS-nNXiVws?si=TYUf4AuwhViDwwtQ

E-పేపర్

ఆఫ్షియల్ కాలనీ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ఆఫ్షియల్ కాలనీ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు విశాఖ గాజువాక అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ 72 వార్డ్ ఆఫ్షియల్ కాలనీ లో LG ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మవారి నవరాత్రి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జనసేన సీనియర్ నాయకులు ఎర్ర నాగేశ్వరావు ముఖ్య అధితి గా విచ్చేసి మండపం లో ఏర్పాటు చేసిన లోక రక్ష హోమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎర్ర నాగేశ్వరావు మాట్లాడుతూ శక్తీ స్వరూపిణి ఇంద్ర కీలాద్రి పై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు ఉత్సవల్లో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు. లోక రక్షణ, శిష్ట రక్షణ లో భాగంగా ఈ మండపం లో నిర్వహించిన హోమం లో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం శుభపరిణామన్నారు. హిందూ బంధువులు చేసుకునే అతి పెద్ద పండగల్లో దసరా ఒకటి అని లోకమాత దుర్గాదేవి వల్లే మన అందరం సుఖసంతోషాలతో ఉన్నామన్నారు. దసరా ఉత్సవాలు ల్లో భాగంగా LG ఉత్సవ కమిటీ దిలీప్, జగదీశ్, ఆహ్వానం మేరకు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నానన్నారు.ఈ కార్యక్రమం లో శ్రీనివాస్ వర్మ, ప్రసాద్,లాయర్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు,మధుసూదన్ రావు,తేజ,లోకేష్,సంతోష్, సంపత్, సుబ్బు,గణేష్ మరియు మహిళ లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.