Sunday, 3 May 2026

Blog

అన్నమయ్య

చిట్వేలి ఎన్సీసీ క్యాడేట్లచే స్వచ్ఛత పక్వాడ ర్యాలీ

చిట్వేలి, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): 30వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు, చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత పక్వాడా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్, ఎన్సీసీ క్యాడేట్లు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ “మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో మనం నడవడం సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది” అని పేర్కొన్నారు.ఆ తర్వాత ఎన్సీసీ క్యాడేట్లు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి, ప్లకార్డులు పట్టుకొని “శుభ్రతే సేవ” నినాదాలతో పాఠశాల నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా చేరి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ “వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం గడపగలము” అని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ క్యాడేట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తిరుపతి

జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం నందు జన సైనికులు ఆధ్వర్యంలో గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా రేణిగుంట బస్టాండ్ కూడలి నందు సత్యం అహింస ఆయుధాలుగా,శాంతి సహనం కవచాలుగా చేసుకుని స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీజీ విగ్రహానికి,అదే విధంగా భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రధారి,జై జవాన్ జై కిసాన్ అంటూ మొదటిగా నినదించిన వ్యక్తి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జన సైనికులు, జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు

నిర్మల్

ఘనంగా బంగల్ పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర

ఈరోజు విజయదశమి పురస్కరించుకొని బంగాల్పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించుకుంటున్నారు .దీనిలో భాగంగా మాల ధరించిన మాత స్వాములు ,బాల స్వాములు ,కన్యాసాములు ,గురు స్వాములు అందరూ కలిసి గల్లి పెద్దలు తాజా మాజీ కౌన్సిలర్ బిట్లింగు నవీన్, బంగాల్పేట్ యూత్ అధ్యక్షులు పెండెం శ్రీనివాస్ తదితరులు గల్లి పెద్దలు అందరు కలిసి శోభాయామానంగా దుర్గాదేవి యాత్రలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ బిట్ లింగు నవీన్ గారు మాట్లాడుతూ దుర్గాదేవి మాత అనుగ్రహం కృపా కటాక్షాలు గల్లి లోని అందరికీ ఉండాలని కొనియాడారు.

Blog

ఓ జి చిత్ర విజయోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రం విజయవంతం సందర్భంగా స్థానిక లలిత థియేటర్ వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.ఈ కార్యక్రమంలో చిరు అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు. టిడిపి నాయకులు దెందుకూరి సత్తిబాబు రాజు. థియేటర్ మేనేజర్ త్రినాధ్ పాల్గొన్నారు.

Blog

దసరా సెలవులు లో సరదాను మరిచి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్న జగ్గయ్యచెరువు హైస్కూల్ విద్యార్థులు

అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోసం దసరా సెలవులో సెప్తేబెర్ 22 నుండి అక్టోబర్ 2 వరుకు నిర్వహించబడుతున్న దసరా ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, జగ్గయ్య చెరువు గ్రామం శ్రీ బాదాం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు ఒకేషనల్ ట్రైనర్లు అయినా A .విమలాకుమారి, DLV ప్రియాంక సహకారంతో బ్యూటీ & వెల్నెస్ ట్రేడ్ లో భాగంగా మీసేవ ఎడ్యుకేషనల్ SOCIATY వద్ద బ్యూటీ కోర్స్ నైపుణ్యాలను , అపెరల్ & మేడ్ అప్స్ ట్రేడ్ లో భాగంగా రాజేశ్వరి డిజైనింగ్స్ స్టూడియో వద్ద వృత్తి విద్య నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు, ఈ కార్యక్రామాన్ని SBMRGGHS ప్లస్ ప్రధానుపాద్యాయులు జి.శ్యాంబాబు , జిల్లా బాలికల అభివృద్ధి అధికారి శ్రీమతి ఉమామహేశ్వరి , జిల్లా ఒకేషనల్ కోఆర్డినేటర్ సయ్యద్ అహ్మద్ కరీమ్, విద్యార్థులతో నేరుగా సంభాషించి వృత్తివిద్యా కోర్స్ యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి మరియు ఇంటర్న్షిప్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనమని విద్యార్థులను ప్రోత్సహించారు,

Blog

ఘనంగా హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ సీనియర్ కోచ్ , జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కంకిపాటి పుట్టినరోజు వేడుకలు

అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ప్రముఖ సీనియర్ కోచ్ & జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ లో ఘనంగా జరిపి బాడీ బిల్డింగ్ & వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ప్రోటీన్ డైట్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిమ్ లైట్ మెంబర్ గారపాటి చంద్రశేఖర్, అశెట్టి ఆదిబాబు, పెద్దిరెడ్డి రాము, వాకపల్లి దొరబాబు, సిహెచ్. కృష్ణంరాజు, మేడిచర్ల సాయి, మోక రాహుల్, శ్రీరామ్, వర్మ, మాణిక్యాలరావు, వెంకటేశం పాల్గొని వెంకటేశ్వరరావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

“జాతిపిత మహాత్మా గాంధీ జయంతి” అప్పనపల్లిలో

పబ్లిక్ హాలిడే అయినప్పటికీ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్‌లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. హెడ్ మాస్టర్ నైనాల రఘు రామయ్యతో పాటు ఉపాధ్యాయులు బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, దేవి పాల్గొన్నారు. గాంధీ ఆశయాలను స్మరించుతూ, ప్రతి ఒక్కరూ దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అహింస, సత్యాగ్రహం మార్గాలను అందరూ అనుసరించాలని అభిప్రాయపడ్డారు.

Blog

గాంధీ జయంతి…మాంసం విక్రయాలుపై కొరడా….

అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : మున్సిపల్ కమిషనర్ నిర్మల కుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్యర్యంలో గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఈరోజు నాన్ వెజ్ మార్కెట్ లో అమ్మకాలు నిషేధించనా, అమ్మకం సాగిస్తున్న దుకాణాల నుండి మాంసం ను స్వాధీనం చేసుకుని వాటిపై ఫినాయల్ పోసిన సిబ్బంది… అమ్మకాలు సాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్.బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది.మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు యం.వెంకటముని,జనార్ధన రెడ్డి, నాగూరయ్య,పుష్ప,మస్తానయ్య,ఆర్ముగం, బాలాజీ,సురేష్ తదితర నాయకుడు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొంబతుల నిశాంత్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

డా బి ఆర్ అంబేద్కర్, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) ఈరోజు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పెదపట్నం లంకలో పుట్టినరోజు జరుపుకుంటున్న బహుజన యోధుడు, రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ కొంబొతుల నిశాంత్‌కు మామిడికుదురు మండల బహుజన సమాజ్ పార్టీ మరియు గెడ్డం లెనిన్ బాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. బహుజనుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ, సామాజిక న్యాయం సాధనలో నిశ్చలంగా నిలబడుతున్న కొంబతుల నిశాంత్ సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఆయన ఆరోగ్యం, ఆయుష్షుతో ఇంకా ఎన్నో శ్రేయోభిలాషిత కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తోడుగా ఉండాలని గెడ్డం లెనిన్ బాబు మరియు బహుజన సమాజ్ పార్టీ ఆకాంక్షిస్తోంది. అప్పనపల్లి గెడ్డంవారిపేట నుంచి కొంబతుల నిశాంత్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.