Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

నగరపాలక సంస్థ ఆర్ఎంసీ కార్యాలయం నందు ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు, సిబ్బంది.. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆ మహనీయుని విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని, శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించి పెట్టారని తెలిపారు. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా.. ఇలా స్వాతంత్య్ర సముపార్జనకు ఆయన పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆ మహనీయుని ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, రెవిన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మలిక్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో నూతన విభాగం ప్రారంభం.

రాజమండ్రి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ లో నూతన విభాగాన్ని గురువారం యాజమాన్యం ప్రారంభించింది. ఆధునిక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ బ్లాక్ ని ప్రారంభించినట్టు యాజమాన్యం తెలియజేసింది. వేద మంత్రోచరణల మధ్య ప్రముఖ వైద్య నిపుణులు యాజమాన్య ప్రధాన వైద్యులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆయన సతీమణి విజయభారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్ సీఈవో రాధిక గూడూరి, తనయులు డాక్టర్ భరత్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి ప్రత్యేక పూజలు నూతన విభాగంలో నిర్వహించారు. విజయ భారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్ జనరల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య, వైద్య నిపుణులు డాక్టర్ సోమనాథ్ దాష్, డాక్టర్ అన్వేష్ క్యానామ్, డాక్టర్ హితేష్ చెరణ్, డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణరాజు, డాక్టర్ సాహితీ, డాక్టర్ భారతిరామ్ గూడూరి, డాక్టర్లు రమ్య, శ్రావణి, స్పందన, వినీత,ప్రసాద్ హేమాంజలి, విశ్రాంత ఎడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ దంపతులు, న్యాయవాది వైవిఎస్ శ్యామల, ప్రసాద్ గూడూరి దంపతులు, జవహర్ గూడూరి దంపతులు, అభిమానులు శ్రేయోభిలాషులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాలను యాజమాన్యం ప్రారంభించింది.

తూర్పు గోదావరి

అంబరాన్ని తాకిన జనసేన దసరా సంబరాలు. విజయదశమి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు.

రాజమండ్రి మందు గల జనసేన ఉభయగోదావరి జిల్లాల పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయదశమి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ , డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు , మినీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ వేగుల లీలా కృష్ణ , రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ ప్రియా సౌజన్య , రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి పూల అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిగించారు. అనంతరం జాతిపిత గాంధీ మహాత్మా ఫోటోకు పూదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాల తాలూకా విజయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హృదయాలలో ప్రత్యేక చోటును సంతరించుకున్నాయన్నారు. విశిష్ట అతిథి తంగెళ్ల ఉదయ్ మాట్లాడుతూ ఇటీవల విశాఖలో జరిగిన సమావేశం ప్రకారం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, ఇప్పటినుండి పార్టీ ముఖ్య నాయకులుగా నెలలో రెండు, మూడు సార్లు వచ్చి వెళ్తూ ఉంటామని, ప్రజలను, కార్యకర్తలను కలిసి లోటుపాట్లు తెలుసుకుని పార్టీకి చదివేస్తామన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని, నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటామన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని, అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా భాగస్వామ్యం కావడం అందరికీ ఆనందదాయకనన్నారు. పత్తిపాడు జనసేన నాయకులు కత్తిపూడి బాబీ , జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి , కాకినాడ జనసేన నాయకులు తలాటం సత్య , రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ మరియు జనసేన పార్టీ నాయకులు ఎండోమెంట్ చైర్మన్లు డైరెక్టర్లు వీర మహిళలు , అభిమానులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డీజీపీ(DGP) శివదర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి BRS నాయకులు

నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డీజీపీ(DGP) శివదర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి), శ్రీకాంత్ రెడ్డి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొర్లపాటి వారి గ్రామంలో గన్నవరపు శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకొన్నారు

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) ఈ రోజు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబాజీపేట మండలం, కొర్లపాటి వారి గ్రామంలోని శ్రీ విజయ కనకదుర్గ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. ఆయనతో పాటు నాయకులు సుదాబత్తుల రాము గారు, కొర్లపాటి కోటబాబు గారు, మేడిద సత్తిబాబు గారు, చప్పిడి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయదశమిని ఘనంగా నిర్వహించారు.

అన్నమయ్య

శ్రీశ్రీశ్రీ పరదేశి స్వామి తిరునాళ్ల మహోత్సవం

చిట్వేలి అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామంలో గురువారం (02.10.2025) శ్రీశ్రీశ్రీ పరదేశి స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.తరువాత గ్రామంలోని మదిరి మణి స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారిని, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచినేని విశ్వేశ్వర నాయుడు గారిని, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల సుబ్బరాయుడు (లారీ), బాలు రామాంజులు నాయుడు, మాజీ ఎంపీటీసీ కట్టా లోకేష్ గారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు పీకే నాయుడు, రైల్వే కోడూరు నియోజకవర్గ ఆర్టీఎస్ కో ఆర్డినేటర్ తుంగా నవీన్ కుమార్, రాజంపేట పార్లమెంట్ వాణిజ్య విభాగ కార్యదర్శి బుంగటావుల రాజశేఖర్, రైల్వే కోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బచ్చు రామచంద్రయ్య యాదవ్, యువనాయకులు ఏదోటి జ్యోతి రామ్, మదిరి యల్లయ్య, మదిరి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల శ్రీ పోలేరమ్మకు ప్రత్యేక పూజలు

అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో దక్షిణపు వీధి లో ఉన్న పోలేరమ్మ గుడిలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం అమ్మవారికి జరిగిన కుంకుమ పూజ,చేజర్ల మండల టిడిపి పార్టీ అధ్యక్షులు షేక్ సిరజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేజర్ల మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దుర్గాదేవి అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ రావి పెంచలరెడ్డి, సొసైటీ అధ్యక్షులు బూదళ్ళ వీర రాఘవరెడ్డి, జిల్లా బిజెపి నాయకులు మరియు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ బత్తల కిష్టయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీ నరసారెడ్డి,ఎంపీటీసీ మస్తానయ్య,టీడీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎన్ టి ఆర్ ట్రస్ట్ భవన్ నందు ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

156 వ గాంధీ జయంతి సందర్భంగా శ్రీ కాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తి పట్టణ పార్టీ కార్యాలయం నందు టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని స్థాపించే దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ముందుకు సాగాలని,తద్వారా భావితరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని,అదేవిధంగా స్వచ్ఛ శ్రీకాళహస్తి అనే దిశగా అడుగులు వేయాలని వారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(అక్టోబర్02) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన దేవ నారాయణరావు కు రూ. 1,62,000/-, ఉడిముడి పాపకు రూ. 37983/- లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను అందజేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న యం.ఎల్.ఏ.ముప్పిడి..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(అక్టోబర్ 02)తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో వేంచేసిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారిని విజయదశమి సందర్భంగా దర్శించుకుని,వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు, తదనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి సి.హెచ్.వెంకటలక్ష్మి మరియూ ఆలయ చైర్మన్ సుంకవల్లి వెంకటేశ్వరరావులు సుమారు1000 మందికి ఏర్పాటు చేసిన అన్నసమారాదన కార్యక్రమంలో పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.