Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పై జనసేన అనుశ్రీ సత్యనారాయణ కామెంట్స్..

ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో విజయదశమి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని. నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటాను అని తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క నాయకునికి అర్థం అయి ఉంటుందని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని విషయాన్ని మీడియా ద్వారా ప్రజలతో ప్రజలతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావడం ఆయన అడుగుజాడల్లో నడవడం మా అందరికీ ఆనందదాయకమైన అని ప్రజలందరికీ న్యాయం జరగాలని లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారని గతంలో ఆయన ఓడిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే విధంగా వైఎస్ఆర్సిపి కు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని లక్ష్యం నెరవేరేందుకు ఒంటరిగా పోరాడిన ఆయన మనోధైర్యానికి మరియు దృఢ సంకల్పానికి తలవంచుతు రాజమండ్రి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నేను ఆయన మార్గంలోని నడుస్తానని నా చివరి శ్వాస వరకు జనసేన ను వదిలిపెట్టనని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వచ్చిన జనసేన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

E-పేపర్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ 156 జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య

మహాత్మా గాంధీ 156వ జన్మ దిన సందర్భంగా గాంధీ చౌక్ నందు మహాత్మా గాంధీ విగ్రహని కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయనదేశస్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక సత్యాగ్రహలు ఉద్యమాలు చేసి ఆనాటి పెద్దలు పండితే జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ లాంటి నేతలు కలుపుకొని మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని ఆయన అన్నారు ఈ సందర్భంగా పట్టణ ఉపాధ్యక్షులు శ్రీని వాసులు మాట్లాడుతూ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో జన్మంచిఅనేక సంస్కరణలు చేపట్టిమనదేశంలో పేద ప్రజలకు మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు అని తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి అబ్రాహాము సలాం, హమీద్ టౌన్ ఉపాధ్యక్షుడు శ్రీని వాసులుమాజీ సేవాదళ్ నాయకుడు మస్తాన్ మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

E-పేపర్

“మన వార్డు – మన బాధ్యత” పోస్టర్ ఆవిష్కరించిన SDPI రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్

నంద్యాలలో “మన వార్డు – మన బాధ్యత” కార్యక్రమం SDPI ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా SDPI రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ – “ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం SDPI ఈ సర్వే చేపట్టింది. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే అవి నేరుగా మా పార్టీ వార్డు ఇంచార్జి ద్వారా పరిష్కార దిశగా తీసుకెళ్లబడతాయి SDPI ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి న్యాయం సాధన కోసం పోరాటం చేస్తుంది. సామాన్య ప్రజల సమస్యలే మా ప్రధాన అజెండా” అని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ గని మాట్లాడుతూ –”ప్రతి కుటుంబం అభివృద్ధి చెందడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో SDPI ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తోంది. గాంధీజీ చూపిన అహింసా మార్గం, సమానత్వ భావనలను అనుసరిస్తూ మేము ప్రజలతో కలిసి నడుస్తున్నాం. మా పార్టీ కేవలం విమర్శలు చేయడం కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది” అని అన్నారు SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ మాట్లాడుతూ –”నంద్యాల SDPI కార్యాలయం నుండి బయలుదేరి గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశాము. ఆ తర్వాత నడిగడ్డ వార్డుల్లో ‘మన వార్డు – మన బాధ్యత’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నాం. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను గుర్తించి అధికారులకు తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చేలా కృషి చేయడం SDPI ప్రధాన కర్తవ్యం” అన్నారు రాష్ట్ర కార్యదర్శి తాహిర్ హుస్సేన్ మాట్లాడుతూ –”ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకపోతే, వాటిని బయటపెట్టి తగిన చర్యలు తీసుకునేలా మేము కృషి చేస్తాము. ప్రతి వార్డులో మా పార్టీ ఇంచార్జీలు ఉన్నారు. ప్రజలు తమ సమస్యలను వారితో పంచుకుంటే అవి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తీసుకెళ్లి పరిష్కరించబడతాయి. SDPI ఎప్పుడూ ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుంది” అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో SDPI రాష్ట్ర కమిటీ సభ్యులు , జిల్లా అసెంబ్లీ నాయకులు, పంచాయతీ నాయకులు,వార్డు నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో కలసి నడవడం, వారి సమస్యలను వినడం, పరిష్కారం చూపడం SDPI పార్టీ ధ్యేయం అని వారు పునరుద్ఘాటించారు.

తిరుపతి

2029 నాటికి..అందరికీ ఇళ్లు- CM.చంద్రబాబు*

*2029 నాటికి..అందరికీ ఇళ్లు- CM.చంద్రబాబు* మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు. పట్టణాల్లో ప్రతి కుటుంబానికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని కేటాయిస్తామని తెలిపారు. దీపావళికి ముందుగానే ఈ నెలలో 3 లక్షల ఇతర గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మరో 6 ఇళ్లను వచ్చే ఏడాది జూన్ లోపల పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన చెప్పారు. గృహనిర్మాణంలో చారిత్రాత్మకమైన నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మైలురాయిగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహనిర్మాణం మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు పింఛన్లతో పాటు గృహనిర్మాణం కల్పించడం వల్ల సామ• సమానత్వం, జీవనోపాధి భద్రత కలుగుతుందని చెప్పారు. ఈ చర్యలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానాలు రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని సీఎం స్పష్టం చేశారు.

E-పేపర్

ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో నివాళి

నంద్యాల లో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి, దీపప్రజ్వలన చేసి, నివాళులర్పించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ నాగేంద్రప్ప “మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలు భావితరాలకు మార్గదర్శకాలు. ఆయన ఆచరించిన సత్యం, అహింస మానవజాతికి శాశ్వత శక్తి మూలాలు. గాంధీజీ చూపిన మార్గం నేటికీ సమకాలీనమే. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటంలో ఆయన సత్యాగ్రహం అనే అహింసా ఆయుధంతో విజయాన్ని సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యత నినాదాన్ని మనమందరం ఆచరించి, స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఫకృద్ధిన్, సిటీ సహ అధ్యక్షులు వెంకట శివన్న, సిటీ సంయుక్త కార్యదర్శి యేసురత్నం, సభ్యులు బుల్లెట్ భాష, గంగాధర్ గౌడ్, గుండంపాడు రాముడు, ఎన్.యం.ఆర్./టైమ్ స్కేల్ రాష్ట్ర అధ్యక్షులు సురేష్, సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

జయశంకర్ భూపాలపల్లి

డ్రగ్స్ ముఠాలపై యుద్ధం: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం

అమెరికా డ్రగ్స్ ముఠాలపై యుద్ధం ప్రకటించింది. ఇవి దేశ సరిహద్దులు దాటి అమెరికాపై నిరంతర దాడులకు పాల్పడుతున్నాయంటూ, వాటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించినట్టు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ చర్యపై దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చ మొదలైంది. గత నెల కెరిబియన్ సముద్రంలో వెనిజులా నుంచి వస్తున్నట్లు అనుమానితమైన మూడు పడవలను అమెరికా దళాలు ముంచివేశాయి. ఈ దాడిలో 17 మంది మరణించారు. వారిని “చట్టవిరుద్ధ పోరాట యోధులు”గా పేర్కొంటూ, తమ చర్యలను ఆత్మరక్షణగా అమెరికా సమర్థించుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన మెమోలో డ్రగ్స్ ముఠాలను విదేశీ శత్రువులుగా పేర్కొనడంతో, ఈ చర్యలను ట్రంప్ ప్రభుత్వం సైనిక స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఏ ముఠాలపై దాడులు జరుగుతున్నాయో, మృతులతో వాటికి సంబంధమేమిటో వెల్లడించలేదు. ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన డెమొక్రాట్లు, ట్రంప్ రహస్య యుద్ధాలు చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సుమారు 6,500 సైనికులు ఈ ప్రాంతంలో మోహరించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. వెనిజులా అధ్యక్షుడు మదురో, ఇది అమెరికా సైనిక జోక్యం కోసం పన్నిన కుట్ర అని ఆరోపించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

2029 నాటికి..అందరికీ ఇళ్లు- CM.చంద్రబాబు

మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు. పట్టణాల్లో ప్రతి కుటుంబానికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని కేటాయిస్తామని తెలిపారు. దీపావళికి ముందుగానే ఈ నెలలో 3 లక్షల ఇతర గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మరో 6 ఇళ్లను వచ్చే ఏడాది జూన్ లోపల పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన చెప్పారు. గృహనిర్మాణంలో చారిత్రాత్మకమైన నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మైలురాయిగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహనిర్మాణం మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు పింఛన్లతో పాటు గృహనిర్మాణం కల్పించడం వల్ల సామ• సమానత్వం, జీవనోపాధి భద్రత కలుగుతుందని చెప్పారు. ఈ చర్యలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానాలు రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని సీఎం స్పష్టం చేశారు.

జయశంకర్ భూపాలపల్లి

లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని మరచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్

స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గాంధీ జయంతి తో పాటు దేశానికి ప్రధానమంత్రిగా చేసి నిస్వార్థంతో సేవలందించినటువంటి వ్యక్తి గత 60 సంవత్సరాల కిందటనే రైతు సేవలను గుర్తించి “జై జవాన్ జై కిసాన్” అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మహాత్ముడు మన లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకోక పోవడం చాలా బాధాకరం అలాంటి మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఇది. దీనిని గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని కూడా అక్టోబర్ 2 న అధికారికంగా జరపాలని రామప్ప టీవీ యాజమాన్యం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.

తిరుపతి

క్యాష్ అన్న కొట్టు…లేదా ఫోన్ పే అన్న వెయ్యి

*క్యాష్ అన్న కొట్టు…లేదా ఫోన్ పే అన్న వెయ్యి * లంచం ఇవ్వకపోతే నీ ఫోన్ తీసుకుంటా * లారీ డ్రైవర్ పై వాగ్వాదానికి దిగిన ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది *లారీ డ్రైవర్ ను బెదిరించి లంచం వసూలు చేస్తున్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది తొట్టంబేడు : శ్రీకాళహస్తి అటవీశాఖ పరిధిలో తొట్టంబేడు మండలంలోని బసవయ్య పాలెం ఫారెస్ట్ చెక్ పోస్ట్ పూతలపట్టు -నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో ఉన్నది. అయితే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది తీరు రోజు రోజుకి దారుణంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పరిధిలో ఎర్రచందనం, కలప, అటవీ సంపద దొంగతనం జరగకుండా చెక్ పోస్ట్ సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంది. తమకున్న విధులను పక్కనపెట్టి తమ అధికారాన్ని అండగా చేసుకుని అన్ని అనుమతులు ఉండి కూడా రవాణా చేస్తున్న వాహనదారుల డ్రైవర్లను బెదిరించడం అక్రమ వసూలు చేయడం పరిపాటిగా మారిపోయింది. తమ వద్ద డబ్బులు లేవని డ్రైవర్లు చెప్పినప్పటికీ ఫోన్ పే లో పంపించమని డిమాండ్ కూడా చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ అధికారి పట్టపగలు లారీ డ్రైవర్ వద్ద లంచం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్లపై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

E-పేపర్

ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలాలలొ మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ ఈరోజు చాగల్లు-కొవ్వూరు మండలం మానవత ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తదనంతరం ఒకరైతుకూలీ పురుగుమందు పిచికారీ నలుగురు రైతుల పొలాల్లో నాలుగు రోజులు వరుసగా చేయడంతో రియాక్షిన్ ఇచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఈరోజు ఆకుటుబాన్ని పరామర్శించి మానవత కుటుంబ సభ్యుల చేతులమీదుగా రు.10,000/- ల చెక్కును మరియు కాకినాడ నగరానికి చెందిన మానవతావాది రాజు గారు మానవతా దృక్పథంతో రు.1000/- లు ఇవ్వడం జరిగింది, తదనంతరం ఆశ్రయ ఫౌండేషన్ లో సుమారు 20 మంది బెడ్ పేషెంట్లకు పండ్లు ప్రధానం చేయడం జరిగిందని వినమ్రంగా తెలిపిన మానవత సబ్యులు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.