Sunday, 3 May 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

మధ్యప్రదేశ్‌లో టమోటా వైరస్ కలకలం

మధ్యప్రదేశ్‌లో టమోటా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా భోపాల్‌లో ఈ వైరస్ 6 నుండి 13 ఏళ్ల చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద భాగం, నోటిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్కరినుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌తో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై, schools‌లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. టమోటా వైరస్ సోకిన పిల్లలకు తాత్కాలికంగా జ్వరంతో పాటు చర్మ రుగ్మతలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. వైరస్‌ నిరోధానికి జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా వేడుకలు – జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం

విశాఖపట్నంలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాక్చి, ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయ దశమి పర్వదినం అనేది విజయాలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి సాధించిన చారిత్రక పర్వదినమని పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి” అన్నారు. బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ, పాండవులు, శ్రీరాముడు వంటి అనేక దేవతామూర్తులు విజయదశమి రోజున జమ్మి చెట్టు ఆరాధన చేసి అనేక విజయాలను సాధించారని చెప్పారు. మహిషాసురుని వధించి రాక్షస సంహారం చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం నిర్వహిస్తున్నామని వివరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామలింగాపురంలో అండర్ బ్రిడ్జి ప్రారంభం

నెల్లూరు జిల్లాలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తై ఈరోజు శుక్రవారం ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. రూ.1.17 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్ బ్రిడ్జిని స్థానిక MLA కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు రాకపోకలు సులభంగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల హామీల మేరకు సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి రవాణా మరింత సులభతరం కానున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని MLA నమ్మకం వ్యక్తం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రహదారి-నిర్మాణానికి-భూమి పూజ

రహదారి నిర్మాణానికి భూమి పూజ పున్నమి ప్రతినిధి అంబాజీపేట  అంబాజీపేట మండలం మాచవరం పరిధిలో వున్న శ్రీనివాసనగర్ విజయభేతాళ స్వామి ఆలయం వద్ద నుండి పోతాయిలంక ప్రధాన రహదారి వరకు సుమారు రూ. 1.10 కోట్ల mnregs నిధులు తో నిర్మించనున్న సిసి, బిటి రోడ్లకు నియోజకవర్గం శాససభ్యుడు గిడ్డి సత్యనారాయణ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమం లో మాచవరం గ్రామ సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు, రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు, అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటి చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, యంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు మైపాల తాతాజీ, కొర్లపాటి గోపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

పాముకాటుకు గురైన రైతు

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన కుమ్మరి గోపాల్ పాము కాటేయడంతో ఆదివారం రోజున, గద్వాల్ ప్రభుత్వ హాస్పిటలకు వెళ్లారు. గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్లో సరైన చికిత్స అందక, కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటలకు తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతి చెందిన కుమ్మరి గోపాల్ కి ముగ్గురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులు పెద్దదిక్కు మృతి చెందడంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి అయ్యింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

రహదారి నిర్మాణానికి భూమి పూజ

పున్నమి ప్రతినిధి అంబాజీపేట అంబాజీపేట మండలం మాచవరం పరిధిలో వున్న శ్రీనివాసనగర్ విజయభేతాళ స్వామి ఆలయం వద్ద నుండి పోతాయిలంక ప్రధాన రహదారి వరకు సుమారు రూ. 1.10 కోట్ల mnregs నిధులు తో నిర్మించనున్న సిసి, బిటి రోడ్లకు నియోజకవర్గం శాససభ్యుడు గిడ్డి సత్యనారాయణ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమం లో మాచవరం గ్రామ సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు, రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు, అంబాజీపేట మార్కెట్ యార్డ్ కమిటి చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, యంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు మైపాల తాతాజీ, కొర్లపాటి గోపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు

Blog

ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆయుధ పూజ…

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు , సిబ్బంది, మీడియా ప్రతినిధులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపినజిల్లా ఎస్పీ రాహుల్ మీనా.. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ ను ఆయన నిర్వహించారు. దుర్గా దేవికి , పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు ఎస్పీ చేశారు. పోలీసు ఆయుధాగారంలో పోలీసులు వినియోగించే ప్రతీ ఆయుధాన్ని అలంకరించారు. దుర్గాదేవి చిత్రపటానికి, పోలీసు ఉపయోగించే ఆయుధాలు , వాహనాలకు ఆయన పూజలు చేశారు. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి అందరికి విజయం చేకూర్చాలని ,సుఖ సంతో షాలతో ఆనందంగా దసరా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్, అమలాపురం డి ఎస్ పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ , అమలాపురం పట్టణ సీఐ శ్రీ వీరబాబు , అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, సి సి ఎస్ సీఐ శ్రీ గజేంద్ర కుమార్, ,ఎస్ బి సీఐ పుల్లారావు,సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ ఉత్సవ్ లో సిద్ధార్థ మహిళాకళాశాల కల్చరల్ ఆద రహో……..పున్నమి ప్రతినిధి.. M G రోడ్ విజయవాడ

దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.10 2025న కార్ నివాలు నిర్వహించినది. ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కల్చరల్ టీం పాల్గొని పలు వినోద కార్యక్రమాలతో విజయవాడ ను అలరింప చేసినది. ఈ కార్నివా్లను పురస్కరించుకొని విద్యార్థినులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వివిధ జానపద వాయిద్యాలను మ్రోగిస్తూ అత్యుత్సాహంగా పాల్గొని వన్నె తెచ్చారు…. కల్చరల్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీమతి పి రత్నశ్రీ ని….. కల్చరల్ టీంను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి వి సుబ్రహ్మణ్య కుమార్ గారు అభినందించారు.

Blog

అతిరధులు కత్తి పట్టిన వేళ… దశమి సంబరాల్లో ఆనంద హేళ..

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దశమి ఉత్సవాలకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రాక తో సంబరాలకు కొత్త ఊపు వచ్చింది. రాజకీయ నేతలు అందరూ కలసి ఏడు ఉత్సవ ఊరేగింపులను సందర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఆనందరావు, మెట్రో కెమ్ అధినేత నందేపు బాలాజీ, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, టిఫిపి నాయకులు గంధం పల్లంరాజు, వాసంశెట్టి సత్యం తదితరులు ఈ ఉత్సవాల లో పాల్గొన్నారు.

తిరుపతి

లారీ డ్రైవర్ల వద్ద అక్రమ వసూళ్ళు చేస్తున్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది

శ్రీకాళహస్తి: తొట్టంబేడు అటవీశాఖ పరిధిలో బసవయ్య పాలెం వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ పూతలపట్టు మరియు నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో ఉన్నది.అయితే ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది తీరు దారుణంగా ఉందని పలువురు విమర్శలు చేస్తున్నారు.ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ పరిధిలో ఎర్రచందనం,కలప,అటవీ సంపద అక్రమ రవాణా జరగకుండా తనిఖీ చేయాల్సిన చెక్ పోస్ట్ సిబ్బంది తమ అధికారాన్ని అండగా చేసుకుని అన్ని అనుమతులు ఉండి కూడా రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ల వద్ద బెదిరించి,వాగ్వాదానికి దిగుతూ అక్రమ వసూలు చేయడం పరిపాటిగా మారిపోయింది.శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న చెక్ పోస్ట్ అధికారి పట్టపగలు లారీ డ్రైవర్ వద్ద డబ్బులు ఇవ్వు లేక ఫోన్ పే చెయ్ అంటూ వసూలు మొదలుపెట్టాడు.ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్న అక్రమ వసూళ్లపై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.