Sunday, 3 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

అనకాపల్లి, అక్టోబర్ 3:సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్ పై గ్రామ, మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ నుండి నెహ్రూ చౌక్ వరకు నిర్వహించిన జీఎస్టీ అవగాహన ట్రాక్టర్ ర్యాలీని కలెక్టర్, ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని 12-18% నుండి 5%కు తగ్గించడంతో రైతులకు భారీగా లాభం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు, జున్నుపై పన్ను పూర్తిగా మినహాయించగా, వెన్న, నెయ్యి, బయో పురుగుమందులు, నీటి పారుదల పరికరాలపై 5% పన్ను మాత్రమే ఉంటుందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రైతుల ఆదాయం పెరగడానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

మద్దికేర లో విద్యుత్ అధికారులకు వస్త్రాలు పంపిణీ

మద్దికేర మండలంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ శుక్రవారం నాడు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి, షష్టి ఉత్సవాలలో భాగంగా వస్త్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే ఈ దేవాలయం నుండి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ భారత్ వాటర్ మ్యాన్ సిబ్బందికి, వస్త్రాలు స్వామి వారి ఫోటోలు అందజేయడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బరోడా బ్యాంక్ ఆధ్వర్యంలో పూల మొక్కల వితరణ

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా అమలాపురం శాఖవారి ఆర్థిక సహాయంతో పదివేల రూపాయల విలువగల పూల మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న బ్యాంకు మేనేజర్ వారి సిబ్బందిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వరరావు , మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేరేడి మిల్లి సత్యనారాయణ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యడ్ల లక్ష్మీ దుర్గ, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

జాతీయ అంతర్జాతీయ

ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు

ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ప్రకటించబోతున్నట్టు, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసి వాటిని ధ్వంసిస్తామని వెల్లడించారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని రద్దు చేయకపోతే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. గత ఆపరేషన్‌లో పాటించిన సంయమనం ఈ సారి ఉండదని, అవసరమైనదంతా చేస్తామని హెచ్చరించారు. సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని, భూభాగాల్లో స్థిరత్వం కల్పించాలంటే పాక్ అనుకూల చర్యలు తీసుకోవలసి ఉందని అన్నారు. వీటివల్ల ప్రాంతీయ భద్రత్వంపై గట్టి ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రసిద్ధ రాజకీయ నేతలు, డిప్లొమాటిక్ వర్గాలు, సామాజిక సంస్థలు దీనిపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొంతమంది తీవ్ర సాంకేతిక చర్యలపై మద్దతు తెలుపగా, మరోవైపు శాంతించుకునే మార్గాలపై దృష్టిపెడితే మంచిది అని, పరిస్థితి మరింత ఉద్రిక్తత చెందకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ వర్గాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం మాధ్యమాల్లో సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాయి.

తూర్పు గోదావరి

కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశంపార్టీ భరోసా…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు చిన్నం రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున భరోసా కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు పంపిన ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాల పార్టీ ఆసరాగా ఉంటుంది అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రేయస్సు కోసం పార్టీ క్రియశిలక సభ్యులకు ప్రమాద భీమా సౌకర్యం కలిపించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దసరా – చెడి తాలింఖానా కమిటీలకు 70 వేల విరాళం _ పవన్ ఫాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ వినూత్న ఆలోచన

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ క్రమంలో అమలాపురం పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు ఆర్డిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓజి సినిమా తొలి టిక్కెట్ను వేలం పెట్టగా 60 వేల రూపాయలు పలికింది. దానికి అభిమాన సంఘం తరఫున ఆర్డీఎస్ ప్రసాద్ మరో 10 వేలు జతచేసి అమలాపురంలో వందల ఏళ్ళుగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, చెడితాలింఖానా యుద్ధకళను దసరా ఉత్సవాల్లో సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తూ వస్తున్న ఏడు ఉత్సవ కమిటీలైనా చెడితాలింఖాన కొంకాపల్లి, శ్రీ అబ్బిరెడ్డి రామదాసు చెడితాలింఖాన మహిపాలవీధి, శ్రీ శేషశయన మైనర్స్ పార్టీ గండు వీధి, మైనర్స్ పార్టీ రవణం మల్లయ్య వీధి, శ్రీ మహిషాసుర మర్దిని యువజన సంఘం రవణం వీధి, శ్రీ విజయదుర్గ యువజన సంఘం నల్లా వీధి, చెడితాలింఖాన మైనర్స్ పార్టీ శ్రీరాంపురం వార్లకు 10 వేల రూపాయల చొప్పున విరాళంగా అందించారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి స్పూర్తిగా ఈరోజు ఈ 70 వేల రూపాయలను దసరా ఉత్సవ కమిటీలకు ఇస్తున్నట్టు ఆర్డిఎస్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపురం ఉత్సవ కమిటీకి దశాబ్ధాల కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖా మాత్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ “సమస్యలపై ప్రశ్నించడం, సాయం కోరిన వారికి చేయి అందించడం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు అని, ఆ ఆశయాలను కొనసాగిస్తూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం, ఇలా ఆర్డీఎస్ ప్రసాద్ నాయకత్వంలో సంప్రదాయానికి ప్రోత్సహంగా 70 వేలు తాలింఖానా కమిటీలకు అందచేయడం చాలా మంచి విషయం” అని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్డీఎస్ ప్రసాద్ తో తొలి టికెట్ దక్కించుకున్న గుర్రం కృష్ణతో పాటు మెగా అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు, కార్యదర్శి వుద్దిశ చిన్న, ట్రెజరర్ ముద్రగడ దొరబాబు, గుబ్బల శేఖర్, సంసాని రవి, మామిళ్ళపల్లి పండు మరియు అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

భారతీయ సినిమాలంటే చాలా ఇష్టం.. పుతిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌కు మరింత చేరువవుతోన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇండియాపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారతదేశంపై తన అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, అవి విశేషంగా భావోద్వేగాలను కలిగించేవని అన్నారు. బాలీవుడ్‌ సినిమాలు వినోదంతో పాటు సాంస్కృతిక విలువల్ని ప్రదర్శించాయని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని పుతిన్‌ పలు సందర్భాల్లో తెలిపారు. భారత్‌-రష్యా సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయని, మిత్రపూరితంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు. భారత్‌ సినీ రంగం ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని ప్రశంసించారు. ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని చిత్రాలు మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. పుతిన్‌ వ్యాఖ్యలు భారత అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Blog

దసరా – చెడి తాలింఖానా కమిటీలకు 70 వేల విరాళం _ పవన్ ఫాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ వినూత్న ఆలోచన

*దసరా – చెడి తాలింఖానా కమిటీలకు 70 వేల విరాళం* _ పవన్ ఫాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ వినూత్న ఆలోచన అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఈ క్రమంలో అమలాపురం పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు ఆర్డిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓజి సినిమా తొలి టిక్కెట్ను వేలం పెట్టగా 60 వేల రూపాయలు పలికింది. దానికి అభిమాన సంఘం తరఫున ఆర్డీఎస్ ప్రసాద్ మరో 10 వేలు జతచేసి అమలాపురంలో వందల ఏళ్ళుగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, చెడితాలింఖానా యుద్ధకళను దసరా ఉత్సవాల్లో సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తూ వస్తున్న ఏడు ఉత్సవ కమిటీలైనా చెడితాలింఖాన కొంకాపల్లి, శ్రీ అబ్బిరెడ్డి రామదాసు చెడితాలింఖాన మహిపాలవీధి, శ్రీ శేషశయన మైనర్స్ పార్టీ గండు వీధి, మైనర్స్ పార్టీ రవణం మల్లయ్య వీధి, శ్రీ మహిషాసుర మర్దిని యువజన సంఘం రవణం వీధి, శ్రీ విజయదుర్గ యువజన సంఘం నల్లా వీధి, చెడితాలింఖాన మైనర్స్ పార్టీ శ్రీరాంపురం వార్లకు 10 వేల రూపాయల చొప్పున విరాళంగా అందించారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి స్పూర్తిగా ఈరోజు ఈ 70 వేల రూపాయలను దసరా ఉత్సవ కమిటీలకు ఇస్తున్నట్టు ఆర్డిఎస్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపురం ఉత్సవ కమిటీకి దశాబ్ధాల కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖా మాత్యులు వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ “సమస్యలపై ప్రశ్నించడం, సాయం కోరిన వారికి చేయి అందించడం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు అని, ఆ ఆశయాలను కొనసాగిస్తూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు క్షేత్ర స్థాయిలో పనిచేయడం, ఇలా ఆర్డీఎస్ ప్రసాద్ నాయకత్వంలో సంప్రదాయానికి ప్రోత్సహంగా 70 వేలు తాలింఖానా కమిటీలకు అందచేయడం చాలా మంచి విషయం” అని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్డీఎస్ ప్రసాద్ తో తొలి టికెట్ దక్కించుకున్న గుర్రం కృష్ణతో పాటు మెగా అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు, కార్యదర్శి వుద్దిశ చిన్న, ట్రెజరర్ ముద్రగడ దొరబాబు, గుబ్బల శేఖర్, సంసాని రవి, మామిళ్ళపల్లి పండు మరియు అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌.. విండీస్‌పై సెంచరీ

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టెస్టు కెరీర్‌లో 11వ శతకం సాధించాడు. ఇంగ్లాండ్ పర్యటనలోనే ఫామ్‌లోకి వచ్చిన రాహుల్, విండీస్‌పై 190 బంతుల్లో సెంచరీ కొట్టాడు. మునుపు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధ శతకం (50) చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటవగా, భారత్ ప్రస్తుతం 50 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాహుల్ స్థిరంగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ సెంచరీతో అతడు తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. భారత్‌పై విండీస్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ఆటతీరు అవసరం.

Blog

వైసిపి ఎంపి మిధున రెడ్డిని కలసిన అమలాపురం వైసిపి ఇన్చార్జి పినిపే శ్రీకాంత్

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : వైసిపి పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున రెడ్డిని విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిసిన అమలాపురం నియోజకవర్గ వైసిపి పార్టీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్. జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతా రామకృష్ణ. ఉండ్రు బాబ్జి. కాశి రామకృష్ణ. తోరం గౌతం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.