Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం చేయిస్తున్న సుంకర సత్తిబాబు

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పిల్లలకు అక్షరాబ్యాసం కార్యక్రమంలో అక్షరాబ్యాసం చేయిస్తున్న కొవ్వూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు సుంకర సత్తిబాబు,మరియూ అంగన్వాడీ సిబ్బంది.

తిరుపతి

దగ్గుబాటి పురందేశ్వరి దంపతులకు వీడ్కోలు పలికిన తిరుపతి బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప .

భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు మరియు మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమల కి విచ్చేసి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు పురందేశ్వరి దంపతులకు తిరుపతి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప వారి తనయుడు తరుణ్ లు కలిసి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి కలంకారి వస్త్రముతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

కుమురం, కుమురం సూరు వర్ధంతి కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే

తేది:03/10/2025 కుమూరం భీం ఆసిఫాబాద్ జిల్లా: అమరజీవి కుమురం భీం 85వ వర్ధంతి, కోలాం ఆదివాసీ క్రాంతి వీర్ కుమురం సూరు 28వ వర్ధంతి సందర్బంగా నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ను గౌరవ ఆసిఫాబాద్ శ్రీమతి ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు తమ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ వీరుల వర్ధంతి కార్యక్రమాన్ని 07-10-2025 తేదీన కేరిమెరి మండలం, జోడేఘాట్ గ్రామంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీల హక్కుల కోసం, జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కుమురం సొనేరావు, కుమురం లాల్ సావ్ ఉత్సవ కమిటీ చైర్మన్ పెందొర్ మొతిరాం,మాజీ ఎంపీపీ తొడసం జగన్నాథ్,కమిటీ సభ్యులు భుత బాపురావు, మడవి రాజు, సూరు కమిటీ చైర్మన్ కుంరం మారుతీ,కన్వీనర్ సిడం ద్రాము పాల్గొన్నారు

అల్లూరి సీతారామరాజు

కూనవరం పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని త్వరగా బయట పెట్టండి

కూనవరం పంచాయతీ నిధులు దుర్వినియోగాన్ని త్వరగా బయటపెట్టి ఆ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెరపాటి రవీంద్ర చింతూరు ఐటీడీఏ పీవో కి వినతిపత్రం అందజేయడం జరిగింది.అదేవిధంగా నిధుల దుర్వినియోగం జరిగిందని అంత స్పష్టంగా కనిపిస్తున్న వారిపై విచారణ పేరుతో కాలయాపన చేయడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకాలం ఉప సర్పంచ్ని సర్పంచ్ గా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టకుండా సర్పంచ్ గా ఎలా కొనసాగించారని, వెంటనే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పూర్తి సమాచారం కావాలని ఆ చట్టం ద్వారా అధికారులను కోరడమైనది. ఈ విచారణలో విచారణ అధికారులపై అనేక అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఐటీడిఏ పి ఓ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో త్వరగా ఎంక్వయిరీ చేయించి అవినీతిపై సమగ్ర విచారణ జరిస్తున్నానని, వారు నిజంగా అవినీతికి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చేసిన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్

కడు పేదరిక ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రత్యక్ష దైవ స్వరూపం – పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి

చిట్వేల్, అక్టోబర్ 3: (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లె సమీపం అప్పారావు సర్కిల్‌లోని జీవనజ్యోతి ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్వేల్‌కు చెందిన చేతులులేని దివ్యాంగులు మల్లికా, కార్తీక్‌కు జీవన పెన్షన్ అందజేశారు. కడుపేదరికంతో పెన్షన్ పొందలేని వారికి ప్రభుత్వ మంజూరు వరకు స్వయంగా సహాయం చేయడం తన ధర్మమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన సేవలను ప్రశంసిస్తూ, దేవుడి రూపంగా చూస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో దట్టం రఘురామయ్య, కోవూరి సావిత్రి, జెట్టి సుబ్రహ్మణ్యం, పాణ్యం లోకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మానవసేవే మాధవసేవ అన్న నినాదంతో ఆయన నిరుపేదలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

అనకాపల్లి, అక్టోబర్ 3:సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్ పై గ్రామ, మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ నుండి నెహ్రూ చౌక్ వరకు నిర్వహించిన జీఎస్టీ అవగాహన ట్రాక్టర్ ర్యాలీని కలెక్టర్, ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీని 12-18% నుండి 5%కు తగ్గించడంతో రైతులకు భారీగా లాభం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు, జున్నుపై పన్ను పూర్తిగా మినహాయించగా, వెన్న, నెయ్యి, బయో పురుగుమందులు, నీటి పారుదల పరికరాలపై 5% పన్ను మాత్రమే ఉంటుందని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు రైతుల ఆదాయం పెరగడానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

మద్దికేర లో విద్యుత్ అధికారులకు వస్త్రాలు పంపిణీ

మద్దికేర మండలంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ శుక్రవారం నాడు విద్యుత్ అధికారులకు, సిబ్బందికి, షష్టి ఉత్సవాలలో భాగంగా వస్త్రాలు పంపిణీ చేశారు. ఇప్పటికే ఈ దేవాలయం నుండి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ భారత్ వాటర్ మ్యాన్ సిబ్బందికి, వస్త్రాలు స్వామి వారి ఫోటోలు అందజేయడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బరోడా బ్యాంక్ ఆధ్వర్యంలో పూల మొక్కల వితరణ

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా అమలాపురం శాఖవారి ఆర్థిక సహాయంతో పదివేల రూపాయల విలువగల పూల మొక్కలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న బ్యాంకు మేనేజర్ వారి సిబ్బందిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వరరావు , మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేరేడి మిల్లి సత్యనారాయణ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ యడ్ల లక్ష్మీ దుర్గ, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

జాతీయ అంతర్జాతీయ

ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు

ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ప్రకటించబోతున్నట్టు, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసి వాటిని ధ్వంసిస్తామని వెల్లడించారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని రద్దు చేయకపోతే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. గత ఆపరేషన్‌లో పాటించిన సంయమనం ఈ సారి ఉండదని, అవసరమైనదంతా చేస్తామని హెచ్చరించారు. సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని, భూభాగాల్లో స్థిరత్వం కల్పించాలంటే పాక్ అనుకూల చర్యలు తీసుకోవలసి ఉందని అన్నారు. వీటివల్ల ప్రాంతీయ భద్రత్వంపై గట్టి ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రసిద్ధ రాజకీయ నేతలు, డిప్లొమాటిక్ వర్గాలు, సామాజిక సంస్థలు దీనిపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొంతమంది తీవ్ర సాంకేతిక చర్యలపై మద్దతు తెలుపగా, మరోవైపు శాంతించుకునే మార్గాలపై దృష్టిపెడితే మంచిది అని, పరిస్థితి మరింత ఉద్రిక్తత చెందకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ వర్గాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం మాధ్యమాల్లో సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాయి.

తూర్పు గోదావరి

కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశంపార్టీ భరోసా…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు చిన్నం రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున భరోసా కల్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు పంపిన ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ ను కొవ్వూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాల పార్టీ ఆసరాగా ఉంటుంది అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రేయస్సు కోసం పార్టీ క్రియశిలక సభ్యులకు ప్రమాద భీమా సౌకర్యం కలిపించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు,ఎన్.డి.ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.