Sunday, 3 May 2026

Blog

తూర్పు గోదావరి

స్వర్ణాంధ్రకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు. -గుబ్బల రాంబాబుకు నగరపు ప్రముఖుల అభినందనలు .

గత 27 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ సామాజిక సేవలు అందిస్తూ నగర ప్రజల, దాతల ఆదరాభిమానాలు పొందింది. స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ చేపట్టిన కార్యక్రమాలను స్వర్ణాంధ్ర ప్రజలకు చేరువ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డుకి ఎంపికైనట్లు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ ఆరవ తేదీన గుబ్బల రాంబాబు ఈ అవార్డును అందుకోనున్నారు.స్వర్ణాంధ్ర సేవా సంస్థకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని రాంబాబు తెలిపారు.1998లో ప్రారంభించబడిన స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి నగరాన్ని సుందర రాజమండ్రి గా మార్చడానికి దోమల నిర్మూలనకు ఇంటింటా లేవటరి గొట్టాలకు నెట్టలు కట్టింది. నగరంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్లడానికి వేలాది కరపత్రాలను పంపిణీ చేసింది. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలని చెప్పే కార్యక్రమం ద్వారా డస్ట్ బిన్లను పంపిణీ చేసింది. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. స్వర్ణాంధ్ర ప్రాంగణం నిత్యం ఎంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్ర కృషి చేస్తుంది.ఇంటింటికి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు స్టిక్కర్లను అంటించడం ద్వారా ప్రజలకు వారి బాధ్యతను నిత్యం గుర్తు చేసేందుకు స్వర్ణాంధ్ర కృషి చేస్తుంది. స్వర్ణాంధ్ర కుట్టు శిక్షణ విద్యార్థినుల చేత గుడ్డ సంచులు కుట్టించి వేలాదిగా ప్రజలకు, రైతు బజార్లో షాపుల వద్ద పంపిణీ చేసింది.స్వర్ణాంధ్ర సేవా సంస్థ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు గత రెండున్నర దశాబ్దాలుగా నిర్మాణాత్మక కృషి చేసినందుకు ఈ అవార్డు కు ఎంపిక చేయడం పట్ల పట్ల స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర బాధ్యతగల స్వచ్ఛంద సంస్థగా మరింత ఉత్సాహంతో స్వచ్ఛ్ ఆంధ్ర కోసం పనిచేస్తామని రాంబాబు తెలిపారు.స్వర్ణాంధ్రకు స్వచ్ఛ ఎన్జీవో అవార్డు రావడం పట్ల స్వర్ణాంధ్ర గౌరవ సలహాదారు సినీ హీరో సుమన్, అధ్యక్షులు రంకాని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సి పి రెడ్డి, వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి పలువురు నగర ప్రముఖులు రాంబాబుకు అభినందనలు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఫ్యాప్టో రాజోలు తాలూకా – అక్టోబర్ 7 “ఛలో విజయవాడ” పోరుబాట విజయవంతం చేయుటకు సన్నాహక సమావేశం

ఫ్యాప్టో రాజోలు తాలూకా ఆధ్వర్యంలో అక్టోబర్ 7న జరగనున్న “ఛలో విజయవాడ” పోరుబాటను విజయవంతం చేయడానికి తాలూకా స్థాయి సన్నాహక సమావేశం గంభీరంగా జరిగింది. ఉపాధ్యాయ నేతలు, యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 🔥 గత 15 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నో వినతులు, వేడుకున్న మాటలు, వినాయక చతుర్ధుల్లాంటి వేడుకలు చేసినా, అధికారుల నుంచి ఏ స్పందన రాలేదు. ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ముఖ్యమైన సమస్యలు: 1. CPS రద్దు – సర్వేపల్లి వేదికగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నేటివరకు అమలు చేయకపోవడం ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. 2. బదిలీలపై స్పష్టత లేకపోవడం – బదిలీల అమలులో ప్రామాణికత లేకపోవడం వల్ల అనేకమంది ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. 3. పదోన్నతుల జాప్యం – పదోన్నతులు కాల పరిమితి ముగిసినా ఇప్పటికీ ఆలస్యం కావడంతో అభ్యర్థులు బాధపడుతున్నారు. 4. పింఛన్ సమస్యలు – పింఛన్ మంజూరు ప్రక్రియలో జాప్యం, అనేక మంది సేవావిధులు నిరీక్షణలో ఉండటం. 5. వేతనాల కోతలు, భత్యాలు – DA, IR, PRC వంటి అంశాలలో అపరిష్కృతత కొనసాగుతోంది. 6. సేవా నిబంధనల సమస్యలు – ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, కాలిక్రమిత నియామకాలు అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో “ఛలో విజయవాడ” అనేది సాధారణ సమావేశం కాదు – ఇది ఉద్యోగుల ఆత్మగౌరవానికి నిదర్శనం. ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగి ఈ పోరుబాటలో భాగం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

అల్లూరి సీతారామరాజు

వినతుల పరిష్కారానికి అధికారుల చొరవ అవసరం : కలెక్టర్

పాడేరు, అక్టోబర్ 3 : సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS) కు మొత్తం 67 వినతులు స్వీకరించబడ్డాయి. జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహిత్, డిఆర్ఓ కె. పద్మలతలు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలు, Meekosam.ap.gov.in వెబ్సైట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. స్వీకరించిన కొన్ని వినతులు: హుకుంపేట మండలం మత్స్యపురం గ్రామానికి సి.సి రోడ్డు మంజూరు. ముంచింగిపుట్టు ఏనుగురాయి గ్రామంలో శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ భవనానికి బదులుగా కొత్త భవనం నిర్మాణం. కొయ్యూరు మండలం రామ్‌నగర్‌లో త్రీ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు. దుంబ్రిగుడ మండలం వయ్య సిరసగుడ–చిమిలిగుడ మధ్య తారు రోడ్డు నిర్మాణం. పెదగుడ గ్రామంలో సికిల్ సెల్ అనేమియా బాధితునికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖాతాలో జమ చేయడం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమ విభాగ అధికారులు, పలు శాఖాధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

నిస్వార్థ సమాజ సేవకులు పూర్ణ చంద్రారెడ్డి, పేదల గుండెల్లో ఆయన స్థాయి చిరస్మరణీయం

నిస్వార్ధ సమాజ సేవకులు పూర్ణ చంద్రారెడ్డి – పేదల గుండెల్లో ఆయన స్థాయి చిరస్మరణీయం – ‘‘నాన్న ఆశయ సాధనే నా లక్ష్యం!’’ – ఆయన తనయుడు గొందేశి శ్రీనివాసులు రెడ్డి – పూర్ణ చంద్రారెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు – పేదలకు ఆర్ధిక సహాయం… 400 మందికి జ్యుట్ బ్యాగ్ లు పంపిణీ – వివిధ సంస్థల్లోని పేదలకు అన్నదానం జీవించి ఉన్నంత కాలంగా పేదలకు నిస్వార్ధంగా సేవ చేసిన తమ తండ్రి గొందేశి పూర్ణ చంద్రారెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రముఖ న్యాయవాది, గొందేశి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు గొందేశి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన తండ్రి 85వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బాలాజీపేటలోని తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తన తండ్రి ఆశయసాధనే తన లక్ష్యమన్నారు. తన తండ్రి కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, సేవకుడిగా, నిస్వార్థపరుడిగా, సామాన్య ప్రజల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. పదవుల కోసం, అధికారాల కోసం వెంపర్లాడకుండా… చివరి శ్వాస వరకు ఆయన ప్రజల మధ్యే జీవించారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలకు ఆయన అందించిన చేయూత ఎప్పటికీ మరువలేనివన్నారు. నేటి యువత, రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా, కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టేవారని, ఆయన చూపిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన జీవిత ధ్యేయమన్నారు. అనంతరం శ్రీనివాసులురెడ్డి ఒక పేద విద్యార్ధినికి చదువు నిమిత్తం అలాగే ఇద్దరు పేదలకు ఆర్ధిక సహాయం అందించారు. 400 మందికి జ్యుట్ బ్యాగ్ లు పంపిణీ, వివిధ సంస్థల్లో అన్నదానం నిర్వహించారు. కాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆయన అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గొందేశి పూర్ణ చంద్రారెడ్డి తనయుడు, గొందేశి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముందుగా, పూర్ణ చంద్రారెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన సేవలను, నిస్వార్థ రాజకీయ జీవితాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువ నేత జక్కంపూడి గణేష్‌, రాయుడు ప్రసాద్‌, ఎన్‌ సుధాకర్‌, సూరంపూడి ప్రకాష్‌, పూడి ప్రకాష్‌, రెడ్డి ప్రసాద్‌, నగేష్‌, విజయానంద్‌, మురళి, సీతారాం చరణ్‌, కైఫ్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, రూపేష్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, ఓంప్రకాష్‌ ఫ్రెండ్‌ సర్కిల్‌, నాగేంద్ర, మరిడాపు శేఖర్‌, కాకులపార్టీ కుమార్‌, తడాలవిష్ణు చక్రవర్తి, తాటికొండ విష్ణు, ముత్యాల పోసి కుమార్‌, ఖాన్‌ భాయ్‌, నర్సింగ్‌ శ్రీను, సురేంద్ర, వంశీ, భీమశంకర్‌, మురళి, ముద్దాల తిరుపతిరావు (అను), నూకరాజు, కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, రూరల్‌ రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, కార్మిక నేతలు బాక్స్‌ ప్రసాద్‌, ఆటో యూనియన్‌ నాయకులు, కన్నా రెడ్డి, పెయింటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, వడ్రంగి అసోసియేషన్‌ సభ్యులు, ఆటో యూనియన్‌ నాయకులు, టెక్క హౌసెస్‌ యూనియన్‌ నాయకులు బాలాజీ పేట కనకదుర్గమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు, వెంకటేశ్వర నగర్‌ వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ సభ్యులు, బాలాజీ పేట వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, సమీరా ఎస్కే సత్తార్‌, జి ఎస్‌ ఆర్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కేత నాగేశ్వరరావు, గిరిబాబు, న్యాయవాదుల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, నర్సింగ్‌ శ్రీను, ఆనంద్‌, మరక శ్రీను, శిల్పి శివ, అహ్మద్‌, దొంగ శ్రీను, ఎర్రం శెట్టి సునీల్‌, ఎంకన్న, పిలకపండు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఖాయం

వైసీపీ అడ్డంకులు చేసినా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలతో విశాఖలో రూ.55 వేల కోట్ల వ్యయంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీసీఎస్, కాగ్నిజెంట్, అదానీ, యాక్సెంచర్ వంటి ఐటీ సంస్థలు కూడా కార్యకలాపాలకు సిద్ధమవుతుండగా, విశాఖ త్వరలోనే ఐటీ హబ్‌గా అవతరించనుంది.

ఆంధ్రప్రదేశ్

పార్టనర్ షిప్ సమ్మిట్ కు సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి.

విశాఖపట్నం ,అక్టోబర్ 3: విశాఖపట్నంలో జరుగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ కు విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ అధికారులను జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రధాన ఇంజనీర్ పి వి వి సత్యనారాయణ రాజు, ఇతర జీవీఎంసీ అధికారులతో కలిసి ఆర్కే బీచ్ ,పార్క్ హోటల్, సిరిపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా కమిషనర్ ఆర్కే బీచ్ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా పలు ప్రాంతాలను పరిశీలించి ప్రధాన ఇంజనీర్ కు పలు అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. పార్టనర్ షిప్ సమ్మిట్ కు దేశ విదేశాల నుండి విశాఖకు అధిక సంఖ్యలో అతిధులు రానున్నందున విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీసి దిద్దాలన్నారు. నగరంలో అవసరమైన చోట ,అలాగే ముఖ్యంగా బీచ్ రోడ్లో ఫుట్ పాత్ కర్బ్ వాల్స్ మరమ్మతులు, పెయింటింగులు, రోడ్ల మార్జిన్లో వైట్ మార్క్ పెయింటింగ్స్ , స్టడ్స్ ఏర్పాట్లు, ఫుట్పాత్ టైల్స్ మరమ్మతులు,ఎలక్ట్రికల్ పోల్స్ పెయింటింగ్,సమీపంలో ఉన్న టాయిలెట్లు మరమ్మత్తులు ,పెయింటింగులు, రోడ్లు మరమ్మతులు, బస్ స్టాప్ లను అందంగా తీర్చిదిద్దడం, సెంటర్ మీడియన్ల అభివృద్ధి, గ్రిల్స్ పెయింటింగ్ ,అందమైన మొక్కలు ఏర్పాటు, విద్యుత్ అలంకరణ, వీధిలైట్లు మరమ్మతులు, అవసరమగు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసే చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజనీర్ కు కమిషనర్ ఆదేశించారు. అలాగే పార్టనర్ షిప్ సమ్మిట్ పూర్తయ్యే వరకు జీవీఎంసీ అధికారులు, సంబంధిత విభాగాలు సమన్వయంతో అభివృద్ధి ,సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ విషయమై సంబంధిత విభాగాలతో అధికారులతో, సమన్వయ సమావేశం తరచూ నిర్వహిస్తూ సంబంధిత పనులను పూర్తిచేసే చర్యలు చేపట్టాలని ప్రధాన ఇంజనీర్ కు కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు కె .శివప్రసాద్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్ కుమార్, కె.శ్రీనివాసరావు ,రాయల్ బాబు , డి డి హెచ్ ఎం .దామోదర్ రావు ,కార్యనిర్వాహక ఇంజనీర్లు గంగాధర్ ,నర్సింగరావు, మురళీకృష్ణ, సహాయక వైద్యాధికారులు కృష్ణంరాజు, బి.ప్రసాద్ రావు, ఏపీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారి, డిఈలు వేయిలు తదితరులు పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అక్రమాలు

కొండపల్లి మున్సిపాలిటీలో మూకుమ్మడి దోపిడీ…? ప్రొసీజర్ ప్రకారం పనులు చేయడం లేదంటూ ఆరోపణలు..? ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 03 పున్నమి న్యూస్. మున్సిపాలిటీలోనైనా , గ్రామ పంచాయితీలో నైనా ఏదైనా పని చేయాలంటే ముందుగా పాలక వర్గంలో సదరు పని గురించి చర్చించి ఆ పని తప్పని సరిగా అవసరం అనుకుంటే పాలక వర్గం ఆ పని చేయించడానికి ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత ఆ పని అంచనా విలువ కోసం డివిజనల్ ఇంజనీర్ కు పంపుతారు. ఈ ప్రక్రియను సిఆర్ 1 అంటారని తెలుస్తోంది. డివిజనల్ ఇంజనీరు అంచనా వేసి అనుమతులు ఇచ్చాక ఆ పనిని చేయించడానికి టెండర్ ద్వారా లేదా నామినేషన్ ద్వారా గుత్తేదారుకు పని అప్పగిస్తారు. దీనిని సిఆర్ 2 అని అంటారని తెలుస్తోంది. గుత్తేదారు పని పూర్తి చేశాక బిల్లులు చెల్లిస్తారు. కానీ కొండపల్లి మున్సిపాలిటిలో అందుకు విరుద్దంగా జరుగుతుందని సమాచారం. మున్సిపాలిటీలో చైర్మన్ దోపిడీ కోసం నిర్మాణం చేసిన చైర్మన్ చాంబర్ భవనానికి పాలక వర్గం ఆమోదం లేకుండానే, డివిజనల్ ఇంజనీరు అంచనాలు వేయకుండానే, అనుమతులు ఇవ్వకుండానే, టెండర్ పిలువకుండానే చైర్మన్ ఏక పక్ష నిర్ణయంతో కొండపల్లి మున్సిపాలిటీ అధికారులు పనులు చేయించారనే ఆరోపణలను అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో మున్సిపాలిటీ అధికారులను నిలదీయడం సంచలనం కలిగిస్తుంది. పూర్తయ్యాక, ఆ నిర్మాణాన్ని వాడుకలోకి తీసుకువచ్చాక కూడా ఇంకా పాలక వర్గం ఆమోదం తెలుపక పోవడం ఒక వింత అయితే , డివిజనల్ ఇంజనీరు ఇంకా అంచనాలు వేయక పోవడం , నియోజకవర్గం ఎమ్మెల్యే చేతనే ప్రారంభోత్సవం చేయించడం విడ్డూరంగా ఉందంటూ స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క మున్సిపాలిటీ లో ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా గానీ విపక్ష సభ్యులు పట్టించుకోకపోవడంతో పాటు స్వపక్షం లోని కౌన్సిలర్ లే జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడం కొసమెరుపు. ఇదే తరహాలో 2009 లో మైలవరం గ్రామ పంచాయితీ పరిదిలో సర్పంచి పాలక వర్గం అనుమతి లేకుండా పంచాయితీ నిధులతో గ్రావెల్ తోలించారనే ఆరోపణల నేపద్యంలో జిల్లా కలెక్టర్ సదరు గ్రామ పంచాయితీ సర్పంచిని పదవి నుండి తొలగించారని సమాచారం. అయితే కొండపల్లి మున్సిపాలిటీ పరిదిలో జరిగిన పలు అభివృద్ది పనులకు పాలక వర్గం అనుమతులు లేకుండానే నిధులను ఖర్చు చేయడాన్ని లేదా గుత్తే దారుతో పనులు చేయించడాన్ని పాలక వర్గం సభ్యులు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. చైర్మన్ మాత్రమే మున్సిపాలిటీలో అన్ని నిర్ణయాలను ఏక పక్షదోరణిలో తీసుకుంటున్నారని మిగిలిన సభ్యులను సంతకాలు మాత్రమే చేస్తే చాలు అనే విధంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మరో పక్క చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. నెలల తరబడి విద్యుత్ స్థంభాలకు లైట్లు వేయకుండానే వేసినట్లుగా గ్రామంలో ఒకరు ఇద్దరు గ్రామస్తులతో సంతకాలు చేయించుకుని కొనని విడి భాగాలను కొనుగోలు చేసినట్లు గా చూపుతూ దొంగ బిల్లులను పెడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా పనులను నామినేషన్ ల పేరుతో లక్షలాది రూపాలయలను పక్కదారి పట్టిస్తున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో స్టాక్ రిజిస్టర్ లో కూడా చాలా తేడాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో వీది దీపాలు, బ్లీచింగ్, సున్నం, కుళాయిలకు చెందిన విడిభాగాలను కొనుగోలు చేయకుండానే కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 15 నెలలుగా తారు పనులు చేసినట్లుగా లెక్కల్లో చూపుతూ తారు కంపెనీకి చెందిన వ్యక్తి పేరుతో బిల్లులు పెట్టుకుని మున్సిపాలిటీ నిధులు కాజేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. స్థానిక సంస్థల నియమ నిబంధనల ప్రకారం అధికారంలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు లాభసాటి వ్యాపారాలు చేసినట్లు రుజువైతే వారిపైన అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అయితే మున్సిపాలిటీలో చైర్మన్ కుమారుడు, వార్డు కౌన్సిలర్ కుమారుడు మున్సిపాలిటీలో పనులను చేయిస్తామంటూ నామినేషన్ పనులను తీసుకుంటున్నారని దీంతో వారు సరిగా చేసినా, చేయక పోయినా వారిని అధికారులు గట్టిగా నిలదీయలేక పోతున్నారనే వాధనలు లేకపోలేదు. *మున్సిపాలిటీ అధికారుల చేతివాటం…?* కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలం ప్రభుత్వ కార్యాలయాలకు నిలయమైన భారీ బహుళ అంతస్థుల భవనానికి పన్నులు విధించే విషయంలో మున్సిపాలిటీలోని ఇద్దరు కీలక మహిళా అధికారులు చేతివాటం ప్రదర్శించి భారీ మొత్తంలో పన్ను మినహాయించారనీ, అందుకు నజరానా గా భవనం యజమానికి చెందిన విజయవాడ లోని ఓ నగల దుఖాణం నుండి బంగారు కానుకలను మహిళా అధికారులకు సమర్పించుకున్నారని సమాచారం. దీనిపైన ఎసిబి అధికారులు విచారణ చేపడితే కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భవనాలకు మినహాయింపు ఇస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడిన వారవతారని స్థానికులు కోరుతున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న గోల్ మాల్ పైన జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు, కౌన్సిలర్లు కోరుతున్నారు.

కరీంనగర్

బినవెన రాములు కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత ,చర్లపల్లి

కరీంనగర్ జిల్లా, (జమ్మికుంట) ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బిననేన మహిపాల్ తండ్రి రాములు ఇటీవల మరణించాడు మృతుని కుమారుడు భీననేన మహిపాల్, రాజ కొమురు శుక్రవారం రోజున యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ , కీర్తిశేషులు, రాములు బంధుమిత్రులను ఆ కుటుంబాన్ని పరామర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆత్మ శాంతి చేకూర్చాలని మృతుని కోడళ్ళు మనవళ్లు మనవరాళ్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆర్టిఐ మొగుళ్ళపల్లిమండల కన్వీనర్ బండారు కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో గిరబోయిన ఐలయ్య, కుమ్మరి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు*

తిరుపతి

శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్

శ్రీకాళహస్తిలో ఓ మందు బాబు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.స్థానిక బేరివారిమండపం వద్ద నడిరోడ్డుపై పడుకొని వచ్చి పోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ తనకేమీ పట్టనట్టు ప్రశాంతంగా పడుకున్నాడు.దీనితో అక్కడ కొద్ది మేర ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడకు వచ్చి అతని అడ్డు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.ప్రముఖ పుణ్యక్షేత్రం లో నడి రోడ్డు పై మందు బాబులు ఇలా చేయడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఎలూరు

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి (అక్టోబర్ 3) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శుక్రవారం భవానిలు దీక్ష విరమణ కోసం తరలి వెళ్లారు. ఆగిరిపల్లి రుద్రభూమి వద్ద వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు భవాని నక్కనబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 30 మంది భవానీ దీక్షాదారులకు ఇరుముడి కట్టారు. అనంతరం అమ్మవారి ఇరుముడి సమర్పణకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.