Sunday, 3 May 2026

Blog

E-పేపర్

టీడీపీ తరుపున ఎన్నికైన మహిళా సభ్యులు

నంద్యాల పట్టణం రైతు మార్కెట్,పద్మావతి నగర్ సమీపంలోని జగన్ హాస్పిటల్ అధినేత Dr.జగన్ మోహన్ రెడ్డి సతీమణి Dr. సింధు శ్రీ కి శ్రీశైలం బోర్డు మెంబర్ గా స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వం*

E-పేపర్

విజయదశమి సందర్భంగా నూతన చిత్రం బంగారు తల్లి రికార్డింగ్ స్టూడియో లో పూజ కార్యక్రమం

బీబీ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నo. 1 గా మహేష్ రాజబోయిన హీరోగా నూతన చిత్రం పూజ కార్యక్రమం విజయదశమి సందర్బంగా జూబ్లీహిల్స్ లోని బంగారుతల్లి రికార్డింగ్ స్టూడియో లో పూజ కార్యక్రమం జరిగింది. ఒక కొత్త రకమైన కథ తో వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని స్టార్ మీడియా ప్రొడక్షన్ హౌస్ లో తెర కెక్కిస్తున్నారు..రచయిత రమేష్ తాళ్లపల్లి మరియు స్క్రీన్ ప్లే దర్శకత్వం సూర్య ప్రకాష్ పోతుల మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ కన్నం ఎడిటింగ్ ఎంబీఏ మేకర్స్ స్టూడియో డి ఓ పి : అరవింద్ మంజుల మేకప్ రమేష్ నాయుడు ఫైట్స్ మహేష్ వీరబోయినానటి నటులు మహేష్ రాజబోయిన పటాస్ జ్ఞానేశ్వర్ సౌమ్య రఘు ఢిల్లీ స్వప్న, సాయి బాబా తదితరులు.. ఈరోజు కార్యక్రమానికి చలనచిత్ర రంగంలోని ప్రముఖులు విచ్చేసి చిత్ర యూనిట్ ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా టీం అందరు ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసారు..

ఆంధ్రప్రదేశ్

అండమాన్ చూద్దాం రండి” పుస్తకావిష్కరణ

విశాఖపట్నం, అక్టోబర్ 3:ప్రజ్ఞశ్రీ డా. బండి సత్యనారాయణ రచించిన “అండమాన్ చూద్దాం రండి” (యాత్రా కథనం) పుస్తకాన్ని పద్మభూషణ్, గౌరవ రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం సెమినార్ హాల్‌లో ఆవిష్కరించారు. యమ్. శశిరాణి పాడిన దేశభక్తి గీతం “జయ జయ ప్రియ భారత”తో సభ ప్రారంభమైంది. మేడా మస్తాన్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. పుస్తకావిష్కర్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ – 1996లో పోర్ట్‌బ్లెయిర్ సందర్శించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. కవి అయిన బండి సత్యనారాయణ యాత్రా కథనం రచించడం విశేషమని ప్రశంసించారు. రచనల్లోని శక్తివైభవాన్ని, పుస్తక ముద్రణలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు పుస్తకాన్ని సమీక్షిస్తూ – అండమాన్ చరిత్ర, సంస్కృతి, కాలాపాని జైలు, సునామీ నష్టం వంటి అంశాలను వివరించారని, రచయిత పరిశీలనా శక్తి ప్రతిబింబించిందని అభినందించారు. గౌరవ అతిథి నల్లా అపర్ణ (సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణి) తన భర్త అండమాన్‌లో పనిచేస్తున్నందున ఈ పుస్తకం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని తెలిపారు. తొలి ప్రతిని సి. సుబ్బారావు (డెప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ & ఆకాశవాణి) స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ – బండి రచనలు ఎల్లప్పుడూ సరళంగా, ఉపయోగకరంగా ఉంటాయని అభినందించారు. రచయిత డా. బండి సత్యనారాయణ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్టూరు శ్రీనివాసరావు, ఉప్పల అప్పలరాజు, డా. కె.వి.యస్. హనుమంతరావు, సిహెచ్. చిన సూర్యనారాయణ, మరడాన సుబ్బారావు, స్వర్ణ శైలజ, పి.యల్.వి. ప్రసాద్, శీరేల సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రకటన

శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించి 16 మంది తో కూడిన ట్రస్ట్ బోర్డ్ సభ్యులను,ఒకరు ప్రత్యేక ఆహ్వానితులు గా ధర్మకర్తల మండలిని ప్రకటించిన దేవాదాయ శాఖ. సభ్యుల వివరాలు: బేలా స్రవంతి యలమంచి(టిడిపి),చిన్నపోల్ల లక్ష్మీనారాయణ-పుట్టపర్తి(టిడిపి),డి లక్ష్మమ్మ- శ్రీకాళహస్తి(టిడిపి),జి గోపీనాథ్- శ్రీకాళహస్తి(టిడిపి),కే.కుసుమ కుమారి-ఒంగోలు-(టిడిపి),కొమ్మ బోమ్మబోయిన రజని-చీరాల(టిడిపి),నాగరాజు కొప్పెర్ల- చింతలపూడి(టిడిపి),పెనగలూరు హేమావతి-కడప(టిడిపి),కొమ్మరి విజయమ్మ-నెల్లూరు(టిడిపి),రుద్రాక్షల కౌసల్యమ్మ- వెంకటగిరి(టిడిపి),దండి రాఘవయ్య-శ్రీకాళహస్తి(జనసేన),పగడాలమురళి-తిరుపతి(జనసేన),శ్రీ గుర్రప్ప శెట్టి- శ్రీకాళహస్తి(టిడిపి),కోలా వైశాలి-శ్రీకాళహస్తి(బిజెపి),ప్రకాష్ రెడ్డి తెలంగాణ,పల్లె సావిత్రి-రాజంపేట(టిడిపి),ప్రత్యేక ఆహ్వానితులుగా చాగణం శైలజ-శ్రీకాళహస్తి

తిరుపతి

స్కూటీని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఒకరి మృతి

శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో పట్టణ సిఐ గోపి తెలియజేశారు.

పల్నాడు

పల్నాడు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆప్ జిల్లా కన్వీనర్ రూబెన్ పులిమల.

పల్నాడు జిల్లా కలెక్టర్ ను మర్యాపూర్వజకంగా కలిసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు. ఆప్ రాష్ట్ర కమిటీ పల్నాడు జిల్లా కన్వీనర్ గా రూబెన్ కు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నియామక పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించి కొన్ని అభ్యర్థనలు తెలియజేశారు. తమకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు అప్ ఆప్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామం తండా ఖాసీంపిరా, (ఆమ్ ఆద్మీ పార్టీ బొల్లాపల్లి మండల కోఆర్డినేటర్) గుంటూరు లింకన్, వినుకొండలు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేద మధ్య తరగతి వర్గాలకు ఎన్డీయే ప్రభుత్వం సూపర్‌ గిఫ్ట్‌ -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

జిఎస్టీ 2.ఓ ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సూపర్‌ జిఎస్టీ ` సూపర్‌ సేవింగ్స్‌ నినాదంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక 25వ డివిజన్‌లోని వ్యాపారులు, ప్రజలకు అందించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గారు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్ని కృష్ణ గారు, యర్రా వేణు గోపాల రాయుడు గారు, కాశీ నవీన్‌ కుమార్‌ గారు, దొండపాటి సత్యంబాబు గారు, అత్తి సత్యనారాయణ గారు, మజ్జి రాంబాబు గారు, బుడ్డిగ రాధా గారు, వర్రే శ్రీనివాసరావు గారు, వై శ్రీను గారు, రెడ్డి మణేశ్వరరావు గారు, కురగంటి సతీష్‌ గారు, అడబాల రామకృష్ణ గారు తదితర నాయకులు సదరు డివిజన్‌లోని షాపులు, ప్రజల వద్దకు వెళ్లి సూపర్‌ జిఎస్టీ ` సూపర్‌ సేవింగ్స్‌ కర పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గారు మాట్లాడుతూ జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్‌ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి, దిగు మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. కిరాణా సామాగ్రి ఏదైతే గతంలో ఉన్న శ్లాబ్‌ను తగ్గించడం జరిగిందని, కొన్నింటిపై జిఎస్టీ తీసివేయడం జరిగిందన్నారు. అలాగే ఇళ్లల్లో పిల్లలు వాడే ఎరేజర్స్‌ గాని పెన్సిల్స్‌ కానీ టాక్సే లేదన్నారు. జిఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలసరి రూ. 15,000 ఆదా కానుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మల సీతారామన్‌ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజానీకం అందరు కూడా హర్షిస్తా ఉన్నారని అన్నారు. వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో డ్రైవర్‌ కి రూ. 15000 అందనున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పధంలో నడుస్తుందన్నారు, అందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ తవ్వా రాజా పర్యవేక్షణలో, డివిజన్‌ ప్రెసిడెంట్‌ ముద్రగడ జయరామ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందు, అర్లపల్లి బబ్లు, శెట్టి జగదీష్‌, కడలి రామకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్‌, అక్కిరెడ్డి ప్రసాద్‌, దుర్గ, చాపల చిన్నరాజు, గౌతమి, కురగంటి త్రినాధ్‌,అమీర్‌ రాజా, గుత్తుల సత్యనారాయణ, ఆడారి లక్ష్మీ నారాయణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

వరంగల్

అంగరంగ వైభవంగా అమ్మవారి నిమజ్జనం

ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామ పెద్దమ్మ గడ్డ సెంటర్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు.9 రోజులు పూజల అనంతరం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 2 వందల మందికి పైగా మహిళలు అమ్మవారిని కోలాటాలు వేస్తూ గ్రామ పురవీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో అమ్మవారి నిత్య పూజ పూజారి కోల సమ్మయ్య, నిర్వాహకులు,అమ్మవారి మాలధారులు,గుంటుపల్లి అరుణకుమారి,జినుకల హాసిని,కీర్తి పద్మ,నంచర్ల రజిని,గర్నెపెల్లి మౌనిక, గర్నిపెళ్లి రాధిక,వరంగంటి కవిత,మర్రి సుజాత,బోనగిరి ఐలమ్మ, నిమ్మల పద్మ,యాట పద్మ, కాశబోయిన మహేంద్రలతోపాటు కొత్త రఘు,నంచర్ల లక్ష్మణ్ చారి,లింగాపురం రాజు, రాచకొండ యాదగిరి,కీర్తి సురేష్,బుర్ర సతీష్,చాట్ల సారంగం గురుస్వామి,వరంగంటి అఖిల్,సాయి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన చీరెలుఇతర అలంకరణ వస్తువులు, లడ్డు ను వేలం వేయగా 1 లక్ష 50 వేల రూపాయలు వెచ్చించి భక్తులు కైవసం చేసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.

తూర్పు గోదావరి

విజయ్‌కు షాక్ : కేసు సీబీఐకి ఇవ్వకపోగా.. రివర్స్‌లో సిట్ దర్యాప్తు !

టీవీకే విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్ర అంటూ ఆయన పార్టీ తరపున దాఖలు చేసిసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తోసిపుచ్చింది. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంటే ఎలా నిర్ణయం తీసుకుంటామని ప్రశ్నిచింది. ఈ సందర్భంగా కనీస ఏర్పాట్లు లేకుండా సభను నిర్వహించడం ఏమిటని ప్రశ్నించింది. విజయ్‌కు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. అలా ఎలా అనుమతులు ఇచ్చారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. సరైన విధి విధానాలు రూపొందించే వరకూ అన్ని భారీ యాత్రలకు అనుమతులు ఇవ్వవొద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో తమపై కేసులు పెడుతున్నారని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీవీకే నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో ధర్మాసనం మరింత తీవ్రంగా స్పందించింది. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత టీవీకే నాయకులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించిది. ఇంత భారీ విషాదం జరిగిన తర్వాత బాధితుల్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. విజయ్ వాహనాన్ని అధికారులు ఎందుకు సీజ్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ముందస్తు బెయిల్స్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరూర్ ఘటన విషయాన్ని రాజకీయ కుట్రగా చేయాలనుకుంటున్న విజయ్ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విచారణ చేస్తే..తప్పిదం అంతా టీవీకేపై నెట్టివేస్తారన్న అభిప్రాయంతో.. సీబీఐ విచారణ అడిగారు. కానీ అలాంటి అవకాశం లేకపోగా ఇప్పుడు తప్పిదం జరిగిన తర్వాత టీవీకే నేతలు కనిపించకుండా పోవడంపై ఇప్పుడు విచారణ ప్రారంభమవుతోంది.

జోగులాంబ గద్వాల

అల్లంపూర్ నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం

*అల్లంపూర్ నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన* *మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు* ఈరోజు అల్లంపూర్ నియోజకవర్గం లోని ఎర్రవల్లి మండలం మరియు ఇటిక్యాల మండలలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తో సమీక్షించారు రాబోయే ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా అందరూ కూడా సమిష్టిగా కృషిచేసి విజయ డంక మోగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మానందరెడ్డి అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దొడ్డప్ప జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ జోగులా రవి సోమనాద్రి మధు నాయుడు లక్ష్మీనారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.