Sunday, 3 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా నేర్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొల్లప నాయుడుపల్లి 1 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులందరినీ హాజరుపరచి, గర్భవతులు,బాలింతలు మరియు పిల్లలకు అందించవలసిన పోషకాహారం గురించి తెలియపరుస్తూ,చిరుధాన్యాలు, ఆకుకూరలు పాలు, గుడ్లు , అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాల సంజీవిని కిట్టు, పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు పోషక విలువలు పోకుండా తయారు చేసుకొని తినవచ్చునని, వీడియోల రూపంలో తయారు చేసుకునే విధానాన్ని తల్లులందరికీ తెలియజేస్తూ ప్రతి తల్లి రక్తహీనత లేకుండా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రంలో 3 నుండి6 సంవత్సరాల పిల్లలకు ఆట పాటల ద్వారా విద్య నేర్పిస్తూ పూర్తి విద్య అవగాహనతో ప్రాథమిక పాఠశాలకు వెళ్లేటట్లు పిల్లలందరి పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని అలాగే అంగన్వాడీ సర్వే పరిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించవలెనని సీడీపీఓ సునీలత తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు సిడిపిఓ పి సునీలత, సూపర్వైజర్ ఎం పద్మ, ఎమ్ ఎల్ హెచ్ పి మాధురి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు ఈనెల 25 వరకు

వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు ప్రకటించిన ప్రకారం, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ-పంట నమోదు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. రైతులు తమ పంట వివరాలను నమోదు చేసుకోవడానికి ఇది చివరి అవకాశం. అలాగే సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పుచేర్పులకు ఈ నెల 30 వరకు సమయం ఇవ్వబడింది. తుది జాబితా ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. ఈసారి ఈ-కేవైసీని కేవలం నోటిఫైడ్ పంటలకే పరిమితం చేసినట్లు స్పష్టం చేశారు. రైతులు సమయానికి నమోదు చేసుకుని పంటలపై లభించే అన్ని సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.

అనకాపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : రాంబిల్లి మండలం మురకాడ గ్రామానికి చెందిన ఈరిగిల సూరిబాబు షుగర్ కారణంగా ఒక కాలు కోల్పోయి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందకపోవడంతో, శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ తన సొంత నిధులతో నెలవారీ పెన్షన్ అందిస్తున్నారు. ఈ హృదయపూర్వక సహాయం ద్వారా సూరిబాబుకు జీవితంలో కొంత ఊరట లభించింది. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్, నూకన్న దొర, సన్యాసినాయుడు, ప్రగడ శివ, తాతాజీ, శ్రీను, శేషగిరి, నరసింహమూర్తి, బద్ది సత్యరావు, వెంకటరమణ, కామేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా విజయకుమార్ అందిస్తున్న ఈ మానవీయ సహాయం స్థానికుల ప్రశంసలందుకుంది.

ఖమ్మం

సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ప్రెస్ మీట్ కామెంట్స్……….

పున్నమి డైలీ న్యూస్ ప్రతినిధి టి రవీందర్ ఖమ్మం ఖమ్మం….. సీపీఐ జిల్లా కార్యాలయం గిరి ప్రసాద్ భవన్లో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ప్రెస్ మీట్ కామెంట్స్………. చండిఘడ్ లో సీపీఐ మహాసభలు విజయవంతగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం లౌకిక, ప్రజాస్వామ్యంకి వ్యతిరేకి. అన్నారు యువత మా పోరాట విధానలు నచ్చి మా పార్టీలో చేరుతున్నారు అని సిపిఐ లో మహిళలకు సమూచిత స్థానం కలిపిస్తున్నా మన్నారు. రాష్ట్రంలో కూడా పార్టీని భలోపేతం చేస్తా మనీ. సీపీఐ శతజయంతి ఉత్సవాల సభ ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నా మన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ కీ మంచి పట్టు ఉందని. సీపీఐ ప్రజా,రైతు సమస్యలపై ఈ 100 ఏండ్లలోఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించామని కమ్యూనిస్ట్ పోరాటాల వళ్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ను సీపీఐ వెలుగులోకి తెచ్చిందన్నారు ఎన్నో త్యాగాలతో ఏర్పడ్డ సీపీఐ వందేళ్ల శతబ్ది ఉత్సవాల సభ ఖమ్మంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆ సభకు కమ్యూనిస్ట్ పోరాట యోధులు ఖమ్మం రానున్నారు. సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో రైతులు, ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలి. బీసీ రిజర్వేషన్ అంతా కావాలనే అంటున్నారు కానీ తల ఒక మాట అంటున్నారు. సిపిఐ మాత్రం బిసి రిజర్వేషన్ కు అనుకూలం బిసి రిజర్వేషన్ కు అన్ని పార్టీలు సహకరించలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్ని స్థానాల్లో పోటీ చేస్తా అని తెలిపారు సీపీఐ తో కలసివచ్చే పార్టీలతో పొత్తు ఉంటుంది. ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉన్నప్పుడే ఏర్పాటు చెయ్యడం జరిగింది. చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉంటేనే పేద ప్రజలకి మేలు జరుగుతుందన్నారు సీపీఐ శత జయంతి ఉత్సవాల సభను ప్రజలందరూ విజయవంతం చెయ్యాలి.

జాతీయ అంతర్జాతీయ

ఢిల్లీలో కెన్యా, జపాన్ దేశాల కోచ్లపై వీధి కుక్కల దాడి

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ సమయంలో రెండు దేశాల కోచులు వీధి కుక్కల దాడికి గురయ్యారు. కెన్యా కోచ్ డెన్నిస్ మరాగియా మ్యాన్జోపై కుక్క దాడి చేసి, ఆయన కుడి కాలి పిక్క భాగాన్ని తీవ్రంగా గాయపరిచింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా జపాన్ కోచ్ మెయికో ఓకుమాట్సు కూడా కుక్కల దాడికి గురైనట్లు సమాచారం. ఈ సంఘటనలతో భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (MCD) అత్యవసర చర్యలు తీసుకుంటూ, స్టేడియం పరిసరాల్లోని వీధి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో రియల్ రంగానికి ప్రభుత్వ నిర్ణయాల బూస్ట్ !

ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి గాడిలో పడటానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. భవన నిర్మాణ , లేఅవుట్ ఆమోదాల సరళీకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ, అమరావతి అభివృద్ధికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, భూ వివాదాల తగ్గింపు వంటి అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భవన నియమాలు-2017 , ఏపీ భూమి అభివృద్ధి నియమాలు-2017లో మార్పులు తీసుకుని, రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది. లేఅవుట్‌లలో కనీస రోడ్డు వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించారు. గేటెడ్ కమ్యూనిటీలకు , హై-రైజ్ భవనాలకు ఆమోదాలు సరళీకరించారు. 30 మీటర్లకు పైబడిన భవనాలకు మాత్రమే పర్యావరణ డెక్ అనుమతులు అవసరం, ఐదు అంతస్తులకు దిగువ భవనాలకు ఆమోదాలు అవసరం లేదు. 500 చదరపు మీటర్లు మించిన ప్లాట్లలో సెల్లార్లు నిర్మించవచ్చు. టీడీఆర్ బాండ్ కమిటీలో రెవెన్యూ అధికారులు, సబ్-రిజిస్ట్రార్లను తొలగించి, ప్రక్రియలను వేగవంతం చేశారు. దేశంలో మొదటిసారిగా భవన, లేఅవుట్ ఆమోదాలకు ఏకీకృత సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఇది బిల్డర్లకు సమయాన్ని ఆదా చేస్తుంది. హై-రైజ్ భవనాలకు సడలింపులు, నాన్-హై-రైజ్ భవనాల ఎత్తును 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం, రెపో రేట్ కట్‌తో హౌసింగ్ లోన్లు చౌకగా దొరకడం మరింత మేలు చేస్తోంది. నాలా చట్టాన్ని రద్దు చేసి, వ్యవసాయ భూములను నాన్-అగ్రికల్చరల్ ఉపయోగాలకు మార్చడానికి సౌలభ్యం కల్పించారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, హైవేల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలు కూడా రియల్ ఎస్టేట్‌ రంగానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ నిర్ణయాలతో రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం 2025లో 15-20 శాతం వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనాలు మార్కెట్ వర్గాలు వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్ విరాళం

శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్ విరాళం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలు అందజేత ఉండవల్లిః భక్తుల సౌకర్యార్యం శ్రీశైలం దేవస్థానానికి విజయవాడకు చెందిన సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ రూ.23 లక్షల విలువచేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్ ను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సూర్య కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావుతో పాటు 20 ళ్లసూత్రాల కమిటీ మాజీ ఛైర్మన్ వై.సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అంతర్జాతీయ

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. బందీలను విడుదల చేసేందుకు సిద్ధం

ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. బందీలను విడుదల చేసేందుకు సిద్ధం గాజాపై యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఫార్ములాపై హమాస్ స్పందించింది. ప్రతిపాదనలోని కొంత భాగాన్ని అంగీకరించిన హమాస్, ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. మిగిలిన అంశాలపై చర్చకు సిద్ధమని కూడా తెలిపింది. ఇదే సమయంలో ట్రంప్, గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్ 72 గంటల్లో బందీల విడుదల చేయాల్సి ఉంది.

సక్సెస్ స్టోరీస్

పాలు తాగే వయసులోనే రిచెస్ట్‌ కిడ్‌గా హీరోయిన్‌ కూతురు

బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ తన కూతురు రాహాపై అపారమైన ప్రేమను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఒక పనితో రాహా భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ధనిక చిన్నారిగా గుర్తింపు పొందింది. రాహా పాలు తాగే వయసులోనే రూ. 250 కోట్ల విలువైన బంగ్లాను తన పేరిట రాసిచ్చినట్లు అలియా తెలిపింది. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలియా మాట్లాడుతూ – “తల్లిగా నేను ఆమె కోసం ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాను. రాహా టీనేజ్‌లోకి వచ్చేసరికి, నేను ఆమెకు ఊహించని ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఇవ్వబోతున్నాను,” అని చెప్పింది. ఈ విధంగా అలియా భట్ తన కూతురి భవిష్యత్తును ముందుగానే భద్రపరిచేలా తీసుకుంటున్న చర్యలు, ఆమెపై చూపుతున్న ప్రేమను తెలియజేస్తున్నాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు

జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఆయా రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వచ్చే సమాచారం: జాతీయ రహదారి నంబర్ హైవే ఛైనేజ్ (హైవే ప్రారంభం నుండి ఆ లొకేషన్ దాకా గల దూరం) ప్రాజెక్ట్ పొడవు హైవే గస్తీ (పెట్రోలింగ్) బృంద వివరాలు టోల్ మేనేజర్ కాంటాక్ట్ నంబర్ రెసిడెంట్ ఇంజినీర్ వివరాలు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033 సమీప పెట్రోల్ బంకులు ఆసుపత్రులు, అత్యవసర వైద్య సౌకర్యాలు ఈ విధంగా, ప్రయాణికులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా చేస్తూ, రహదారి భద్రత, సేవల వినియోగాన్ని మెరుగుపరచడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.