Sunday, 3 May 2026

Blog

ఖమ్మం

ఖమ్మం లో భారీ వర్షం.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరం లో శనివారం భారీ వర్షం కురసింది. తెలంగాణ లో భారీ వర్షాలు అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఖమ్మం నగరం తో పాటు చుట్టూ ప్రక్కల భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం నాడు అమ్మ వారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఖమ్మం

ఉప ముఖ్య మంత్రి బట్టి ని కలిసి న కే కే సి నేతలు

పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి ఖమ్మం జిల్లా స్థాఫ్ రిపోర్టర్ అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల సంఘం (కేకేసి) జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ మధిర క్యాంప్ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు , ఈ సం దర్భముగా ఉప ముఖ్య మంత్రి బట్టి కి కార్మికుల సమస్యలను వివరించారు. ఈ సమస్య ల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క ని కోరారు ఉప ముఖ్య మంత్రి మల్లు బట్టి విక్ర మార్క ని కలిసిన వారిలో కేకేసి ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిద్దల నగేష్ ,పార్లమెంటు అధ్యక్షులు బొడ్డు సైదులు, నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్ నగర ప్రధాన కార్యదర్శి పగిళ్లపల్లి రవి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ రాజు కోశాధికారి బి సతీష్ పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతగా తిరువూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతగా తిరువూరులో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ తిరువూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకానికి కృతజ్ఞతగా, తిరువూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సాయం అందించి ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలాభిషేకం, కృతజ్ఞతా ప్రకటన: ర్యాలీ అనంతరం, ఆటో డ్రైవర్లు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తిరువూరు టౌన్ మండల కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కృతజ్ఞతా కార్యక్రమాలలో టౌన్ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆటో వాలాల్లో పార్టీ రాజకీయం..

కార్యక్రమానికి అంతంత మాత్రమే హాజరు… గండి కొట్టిన ఉచిత బస్సు… ఫిట్నెస్ ఉండాలన్న ప్రభుత్వ నిబంధనపై అసంతృప్తి… అమలాపురం, అక్టోబరు 04 (పున్నమి ప్రతినిధి) : ప్రభుత్వ పథకంలో కూడా రాజకీయాలు తొంగి చూస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అమలాపురంలో ఆటో వాలాల సంఖ్య వందల్లో ఉన్నాయి. అయితే వారికి ఉద్దేశించిన లబ్ధి కార్యక్రమంలో కుడా వారు దూరంగా ఉండటం పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కూటమి నేతలు ఆటోలు ముందు పార్టీ జెండాలు పట్టుకుని నిలబడి ఫోటోలు తీసుకుంటుంటే కుదరదన్న ఆటో నేతల తీరు దేశ నేతల్లో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే కొంతమంది ఆటో నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఉచిత బస్సు తమకడుపును కొట్టిందని ఆవేదన వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిట్నెస్ ఉన్న వాహనాలకే 15 వేల లబ్ది అందించడం పట్ల కూడా వీరిలో ఆగ్రహం కలిగించింది. ఏమయినప్పటికి ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం లో రాజకీయ నీడలు కనిపించడం 100 లోపు ఆటోలు ఈ కార్యక్రమం లో పాల్గొనడం ఆటో వాలా ల ఉద్దేశ్యాన్ని తెలియచేస్తున్నాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

తిరువూరు, రాజుపేటలో వైభవంగా దేవీ నవరాత్రులు

పున్నమి ప్రతినిధి గోపీ పామర్తి తిరువూరు. తిరువూరు పట్టణంలోని రాజుపేట ప్రాంతంలో జరిగిన దేవీ నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన అమ్మవారి విగ్రహ ఊరేగింపు మరియు నిమజ్జనం కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. రాజుపేటలో వైభవంగా దేవీ నవరాత్రులు: అశేష జనవాహిని మధ్య అమ్మవారి నిమజ్జనం తిరువూరు పట్టణం, రాజుపేట వాసులు నిర్వహించిన దేవీ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దశమి రోజున అమ్మవారి నిమజ్జనం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శోభాయాత్ర (ఊరేగింపు): అమ్మవారి విగ్రహాన్ని రాజుపేటలోని ప్రధాన వీధుల గుండా అత్యంత వైభవంగా ఊరేగించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై అమ్మవారిని ఉంచి, భజనలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ శోభాయాత్ర సాగింది. యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని కీర్తించారు. జై బోలో దుర్గామాతా కి జై అంటూ నినాదాలు చేస్తూ భక్తులు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఊరేగింపును తిలకించేందుకు రాజుపేట ప్రాంతంలో అశేష జనవాహిని పోటెత్తింది. నిమజ్జనం: ఊరేగింపు అనంతరం అమ్మవారి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జనం చేసే సమయంలో భక్తులు మరోసారి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుపేటలో నిర్వహించిన ఈ దేవీ నవరాత్రుల వేడుకలు, ముఖ్యంగా అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమం స్థానికుల్లో భక్తి భావాన్ని, ఉత్సాహాన్ని నింపింది. రాజుపేట ప్రజలంతా కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు.

నిర్మల్

నిర్మల్ లో వర్షపాతం

నిర్మల్ 10/04/25 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో శుక్రవారం 82.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మామడ మండలంలో 6.2, పెంబి మండలంలో 12.4, పెండి మండలంలో ఖానాపూర్ మండలంలో అత్యధికంగా 29.6, కడం పెద్దూర్ లో 26.2, దస్తురాబాద్ మండలంలో 8.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా 4.3 మిల్లీమీటర్ ల సగటు వర్షపాతం నమోదయింది. కాగా శనివారం కడెం ఖానాపూర్ ప్రాంతాలలో వర్షం కురువగా నిర్మల్ ప్రాంతంలో వాతావరణం చల్లబడింది.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ

ఏపీలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందుతుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ చేశారు. వారిలో – ఆటో డ్రైవర్లు : 2,64,197 మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు : 20,072 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు : 6,400 మంది అంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది డ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా నేర్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొల్లప నాయుడుపల్లి 1 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులందరినీ హాజరుపరచి, గర్భవతులు,బాలింతలు మరియు పిల్లలకు అందించవలసిన పోషకాహారం గురించి తెలియపరుస్తూ,చిరుధాన్యాలు, ఆకుకూరలు పాలు, గుడ్లు , అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాల సంజీవిని కిట్టు, పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు పోషక విలువలు పోకుండా తయారు చేసుకొని తినవచ్చునని, వీడియోల రూపంలో తయారు చేసుకునే విధానాన్ని తల్లులందరికీ తెలియజేస్తూ ప్రతి తల్లి రక్తహీనత లేకుండా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రంలో 3 నుండి6 సంవత్సరాల పిల్లలకు ఆట పాటల ద్వారా విద్య నేర్పిస్తూ పూర్తి విద్య అవగాహనతో ప్రాథమిక పాఠశాలకు వెళ్లేటట్లు పిల్లలందరి పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని అలాగే అంగన్వాడీ సర్వే పరిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించవలెనని సీడీపీఓ సునీలత తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు సిడిపిఓ పి సునీలత, సూపర్వైజర్ ఎం పద్మ, ఎమ్ ఎల్ హెచ్ పి మాధురి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు ఈనెల 25 వరకు

వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు ప్రకటించిన ప్రకారం, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ-పంట నమోదు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారు. రైతులు తమ పంట వివరాలను నమోదు చేసుకోవడానికి ఇది చివరి అవకాశం. అలాగే సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పుచేర్పులకు ఈ నెల 30 వరకు సమయం ఇవ్వబడింది. తుది జాబితా ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. ఈసారి ఈ-కేవైసీని కేవలం నోటిఫైడ్ పంటలకే పరిమితం చేసినట్లు స్పష్టం చేశారు. రైతులు సమయానికి నమోదు చేసుకుని పంటలపై లభించే అన్ని సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్.

అనకాపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : రాంబిల్లి మండలం మురకాడ గ్రామానికి చెందిన ఈరిగిల సూరిబాబు షుగర్ కారణంగా ఒక కాలు కోల్పోయి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందకపోవడంతో, శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ తన సొంత నిధులతో నెలవారీ పెన్షన్ అందిస్తున్నారు. ఈ హృదయపూర్వక సహాయం ద్వారా సూరిబాబుకు జీవితంలో కొంత ఊరట లభించింది. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్, నూకన్న దొర, సన్యాసినాయుడు, ప్రగడ శివ, తాతాజీ, శ్రీను, శేషగిరి, నరసింహమూర్తి, బద్ది సత్యరావు, వెంకటరమణ, కామేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా విజయకుమార్ అందిస్తున్న ఈ మానవీయ సహాయం స్థానికుల ప్రశంసలందుకుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.