Sunday, 3 May 2026

Blog

ఖమ్మం

ఘనంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్ లక్ష్మి నర్సింహా స్వామి టెంపుల్ రోడ్డు నందు విజయ దుర్గ అమ్మవారి ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీ కనక దుర్గ అమ్మ వారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమం శనివారం నాడు అంగరంగా వైభవం గా జరిగింది. 11 రోజులుగా భక్తులు పూజలు అందుకున్న అమ్మ వారు నిమజ్జనం కొరకు తరలి వెళ్ళింది. భక్తులని చల్లగా చూడాలని, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సం దర్భముగా కమిటీ వారు అమ్మ వారిని కోరుకున్నారు. భక్తుల కోలాటం డిజే వెంట రాగ పుర వీధిల్లో ఊరేగింపు చేసి నిమజ్జనం కొరకు ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా వేదాద్రి పుణ్య క్షేత్రం లో ని కృష్ణ నదిలో అమ్మ వారి ని నిమజ్జనం చేశారు. కార్యక్రమం లో విజయదుర్గ ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మ వారి భక్తులు పాల్గొన్నారు.

E-పేపర్

గాంధీ జయంతి సందర్భంగా జనసేన ఘన నివాళులు

నంద్యాల టౌన్ గాంధీ చౌక్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు & సుందర్ నేతృత్వం వహించారు. వీరిద్దరూ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీ స్ఫూర్తి దేశానికే మార్గదర్శకమని అన్నారు. ఈ సందర్బంగా రాచమడుగు చందు మాట్లాడుతూ గాంధీజీ చూపించిన సత్యం, అహింస మార్గాలు ఈ రోజుకి మరింత అవసరం. ఆయన స్ఫూర్తి మాకు ప్రేరణ” అని పేర్కొన్నారు.అలాగే సుందర్ మాట్లాడుతూ గాంధీ జయంతి కేవలం జ్ఞాపకార్థం కాదు, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టుకోవాల్సిన రోజు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, శివశేఖర్, వెంకటరమణ, ఫయాజ్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Blog

గాంధీ జయంతి సందర్భంగా జనసేన ఘన నివాళులు

నంద్యాల టౌన్ గాంధీ చౌక్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు & సుందర్ నేతృత్వం వహించారు. వీరిద్దరూ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీ స్ఫూర్తి దేశానికే మార్గదర్శకమని అన్నారు. ఈ సందర్బంగా రాచమడుగు చందు మాట్లాడుతూ గాంధీజీ చూపించిన సత్యం, అహింస మార్గాలు ఈ రోజుకి మరింత అవసరం. ఆయన స్ఫూర్తి మాకు ప్రేరణ” అని పేర్కొన్నారు.అలాగే సుందర్ మాట్లాడుతూ గాంధీ జయంతి కేవలం జ్ఞాపకార్థం కాదు, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టుకోవాల్సిన రోజు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, శివశేఖర్, వెంకటరమణ, ఫయాజ్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్

గ్రీన్ క్లైమేట్ టీంకు స్వచ్ఛ భారత్ దివస్ సేవా సత్కారం

విశాఖపట్నం, అక్టోబర్ 2: స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నంను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీలా శ్రీనివాసరావు సత్కరించారు. గాంధీ జయంతి వేడుకల అనంతరం జివిఎంసి సుమా సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు. స్వచ్చతా హి సేవా – 2025లో భాగంగా విద్యా సంస్థల్లో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు, ఇంటి వద్ద కూరగాయలు – పండ్ల సాగు ప్రోత్సాహం, వంటింటి వ్యర్థాల నుంచి ఎరువు తయారీ, కోరమాండల్ ఫర్టిలైజర్స్ అందించిన గుడ్డ సంచుల పంపిణీ, ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ గౌరవం లభించింది. ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు రమణమూర్తి, వర్మ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ గారి విగ్రహాల జోలికొస్తే ఖబడ్దార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియైన దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పుంటిచ్చి తగలబెట్టడం సిగ్గుచేటని, దుండగులను వెంటనే అరెస్ట్ చేసి ఈయొక్క రాష్ట్రం లో ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడినటువంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టి 1989 వచ్చినటువంటి అట్రాసిటీ యాక్ట్ ఫైల్ చేసి కఠినంగా శిక్షించాలి అని, అలా శిక్షించని ఎడల రాష్ట్రవ్యాప్తంగా అన్ని మాల ఉద్యోగుల సంఘం లు,మాల సంఘాలు ఉద్యమం చేస్తాం అని అశోక్ బాబు హెచ్చరించారు , రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అని, మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకి ప్రొటెక్షన్ కల్పించాలని , సామాజిక న్యాయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దళితుల మీద జరుగుతున్న దాడుల మీద స్పందించకపోవడం ఇది ఎక్కడ సామాజిక న్యాయమని అశోక్ బాబు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాలల జేఏసీ అధ్యక్షులు కొప్పోలు ఏడుకొండలు గారు, గౌరవ సలహాదారులు మేడిది రవి, ప్రకాశం జిల్లా మీడియా కోఆర్డినేటర్ శాంతారావు, ఉపాధ్యక్షులు మేడికొండ లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం నాయకులు టి శ్రీకాంత్ మరియు ప్రకాశం జిల్లా మాలల జేఏసీ, ఉద్యోగ సంఘ నాయకులు ..కూటమి ప్రభుత్వాన్ని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం, మాలల జేఏసీ డిమాండ్ చేశారు.

క్రైమ్

మరో యూట్యూబర్ అరెస్టు

హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలో ఒక యూట్యూబర్‌ను పోలీసులు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని వసీం అక్రమ్‌గా గుర్తించారు. మేవాట్ చరిత్రపై యూట్యూబ్ వీడియోలు చేసే అక్రమ్ గత మూడేళ్లుగా పాకిస్థాన్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని ఫోన్‌లో దేశ భద్రతకు ముప్పుగా మారే సమాచారం, నేరపూరిత సందేశాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని వెల్లడించారు. ప్రస్తుతం అక్రమ్‌పై జాతీయ భద్రతా చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వం జీఓ నెం. 291 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు కపుల్ కేటగిరీలో 134 మంది ఉపాధ్యాయులు, పరస్పర అవగాహన (మ్యూచువల్ ట్రాన్స్ఫర్) ఆధారంగా 248 మందిని బదిలీ చేస్తూ లిస్ట్‌ను విడుదల చేశారు. ఇక గ్రేడ్-2 భాషా పండితుల పదోన్నతులకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని దీర్ఘకాలంగా కోరుతూ ఆందోళన చేసిన వారికి ఇది ఊరట కలిగించే పరిణామంగా మారింది.

క్రైమ్

18 కేసులు, రూ.లక్ష రివార్డు కలిగిన నేరస్తుడిని ఎన్కౌంటర్లో చంపిన యూపీ పోలీసులు

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో జరిగిన ఎన్కౌంటర్‌లో ఒక ప్రముఖ నేరస్తుడు హతమయ్యాడు. లక్ష రూపాయల రివార్డు ఉన్న మెహతాబ్‌ అనే ఈ నేరస్తుడు షామ్లీకి చెందినవాడు. అతని పై దోపిడీ, చోరీలు తదితర ఘన నేరాలతో కూడిన పదమూడు కేసులు నమోదు కాగా, మొత్తం పదెనిమిది కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు ఆయన ఉన్నట్లు సమాచారం రావడంతో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో పోలీసులు అతన్ని హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికంగా భద్రతను బలోపేతం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

యామిని శ్రీవల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్ హెచ్ యమ్ నైనాల రఘురామయ్య గారు, ఉపాధ్యాయులు పెద్దిరాజు, రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, అనంత లక్ష్మీ దేవి గారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థిని యామిని శ్రీవల్లి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం, విజయం చేకూరాలని కోరుతూ ప్రేమతో ఆశీర్వచనాలు అందించారు. శ్రీవల్లి చదువులో మెరుగైన ప్రగతి సాధించాలని, మంచి పౌరురాలిగా ఎదగాలని ఆశించారు. స్కూల్ తరఫున ఆమెకు పుట్టినరోజు సందర్భంగా చిన్న వేడుక ఏర్పాటు చేయగా, ఆమె మిత్రులతో కలిసి మిఠాయిలు పంచుకుంటూ ఈ ప్రత్యేక రోజును సంతోషంగా జరుపుకుంది. ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు విద్యార్థిని లో మరింత ఆత్మవిశ్వాసం (self-confidence) నింపాయి.

E-పేపర్

టీడీపీ తరుపున ఎన్నికైన మహిళా సభ్యులు

నంద్యాల పట్టణం రైతు మార్కెట్,పద్మావతి నగర్ సమీపంలోని జగన్ హాస్పిటల్ అధినేత Dr.జగన్ మోహన్ రెడ్డి సతీమణి Dr. సింధు శ్రీ కి శ్రీశైలం బోర్డు మెంబర్ గా స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వం*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.