Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా నేర్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొల్లప నాయుడుపల్లి 1 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో తల్లులందరినీ హాజరుపరచి, గర్భవతులు,బాలింతలు మరియు పిల్లలకు అందించవలసిన పోషకాహారం గురించి తెలియపరుస్తూ,చిరుధాన్యాలు, ఆకుకూరలు పాలు, గుడ్లు , అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాల సంజీవిని కిట్టు, పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు పోషక విలువలు పోకుండా తయారు చేసుకొని తినవచ్చునని,…
  • ఈ కార్యక్రమం నందు సిడిపిఓ పి సునీలత, సూపర్వైజర్ ఎం పద్మ, ఎమ్ ఎల్ హెచ్ పి మాధురి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)

స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా నేర్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొల్లప నాయుడుపల్లి 1 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులందరినీ హాజరుపరచి, గర్భవతులు,బాలింతలు మరియు పిల్లలకు అందించవలసిన పోషకాహారం గురించి తెలియపరుస్తూ,చిరుధాన్యాలు, ఆకుకూరలు పాలు, గుడ్లు , అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాల సంజీవిని కిట్టు, పిల్లలకి ఇచ్చేటువంటి బాలామృతం ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు పోషక విలువలు పోకుండా తయారు చేసుకొని తినవచ్చునని, వీడియోల రూపంలో తయారు చేసుకునే విధానాన్ని తల్లులందరికీ తెలియజేస్తూ ప్రతి తల్లి రక్తహీనత లేకుండా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.అంగన్వాడీ కేంద్రంలో 3 నుండి6 సంవత్సరాల పిల్లలకు ఆట పాటల ద్వారా విద్య నేర్పిస్తూ పూర్తి విద్య అవగాహనతో ప్రాథమిక పాఠశాలకు వెళ్లేటట్లు పిల్లలందరి పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని అలాగే అంగన్వాడీ సర్వే పరిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా అంగన్వాడీ కేంద్రానికి పంపించవలెనని సీడీపీఓ సునీలత తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు సిడిపిఓ పి సునీలత, సూపర్వైజర్ ఎం పద్మ, ఎమ్ ఎల్ హెచ్ పి మాధురి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *