Sunday, 3 May 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్

శ్రీకాళహస్తిలో ఓ మందు బాబు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.స్థానిక బేరివారిమండపం వద్ద నడిరోడ్డుపై పడుకొని వచ్చి పోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ తనకేమీ పట్టనట్టు ప్రశాంతంగా పడుకున్నాడు.దీనితో అక్కడ కొద్ది మేర ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడకు వచ్చి అతని అడ్డు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.ప్రముఖ పుణ్యక్షేత్రం లో నడి రోడ్డు పై మందు బాబులు ఇలా చేయడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఎలూరు

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి (అక్టోబర్ 3) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శుక్రవారం భవానిలు దీక్ష విరమణ కోసం తరలి వెళ్లారు. ఆగిరిపల్లి రుద్రభూమి వద్ద వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు భవాని నక్కనబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 30 మంది భవానీ దీక్షాదారులకు ఇరుముడి కట్టారు. అనంతరం అమ్మవారి ఇరుముడి సమర్పణకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు.

Blog

డ్వాక్రా సంఘం మహిళలతో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు…

గాజువాక సెప్టెంబర్ 3(పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో వడ్లపూడి బూత్ నెంబర్ 60 , కణితి అంబేద్కర్ కాలనీ బూత్ నంబర్ 70 మరియు డ్వాక్రా సంగం మహిళలతో రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్) ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహనా సదస్సు ఎర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్కార్ జీఎస్టీ తగ్గించడంతో.. దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వలన దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందన్నారు , ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు విజయరామరాజు, పొలరావు, ఆదినారాయణ,వాసు, పద్మ,సురేష్, సీఈవో భాను, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో రాజస్థాన్ షెడ్లకేనా నగదు లోన్లు..

తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో రాజస్థాన్ షెడ్లకేనా నగదు లోన్లు.. రైతులకు లేదా..? అధికారులను నిలదీస్తున్న రైతన్న లు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ఉన్న బంగారమ్మ గుడి దాటగానే తంగేళ్లపాలెం పిఎసిఎస్ కేంద్రం లో రైతులు సబ్సిడీ కోసం బంగారు నగలు కానీ, తన పొలం పట్టా పాస్ బుక్ తీసుకుని వస్తే నగదు ఇవ్వకుండా.. రాజస్థాన్ షెడ్లకు మాత్రం ఒక గ్రాము కు 7,000 ఇస్తారంట… రైతన్న అడిగితే గ్రాము కు 6100 అంట, అది కూడా అడిగితే.. డబ్బులు లేవు ని,రైతుల చెప్పుతున్న సమాచారం, పిఎసిఎస్ కేంద్రంలో రాజస్థాన్ షెడ్లకు అధిక మొత్తంలో నగదు విస్తున్న వైనం… కమిషన్కు కక్కుర్తి పడి అధికారులు రైతులకు లోన్లు ఇవ్వకుండా రాజస్థాన్ షెడ్యూల్ ఇవ్వడం ఆంతర్యం ఏమిటి ని రైతన్నలు ఆవేదనా.. ఎమ్మెల్యే సారూ తంగేళ్లపాలెం పిఎసిఎస్ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టండి… రైతన్నలు వేడుకుంటున్న వైనం .

తెలంగాణ

విజయదశమి సందర్భంగా సూర్యాపేటలో వినూత్న కార్యక్రమం – “ప్లాస్టిక్ భూత సంహారం”*

* సూర్యాపేట, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విజయదశమి సందర్భంగా సూర్యాపేటలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు ముప్పారపు నరేందర్ గారి నేతృత్వంలో “ప్లాస్టిక్ భూత సంహారం” చేపట్టారు. 15 అడుగుల ఎత్తైన ప్లాస్టిక్ భూతాన్ని దహనం చేసి, ప్లాస్టిక్ ముప్పు గురించి అవగాహన కలిపించారు. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను మానేందుకు ప్రతిజ్ఞ చేశారు. చెత్త సేకరణకు 3 గంటలు, నిర్మాణానికి 18 గంటలు పట్టింది. ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం, గ్రీన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించాయి. చేతి సంచి వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఈ వినూత్న కార్యాచరణ ప్రశంసలు అందుకుంది.

E-పేపర్

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దసరా సంబరాలు…

గాజువాక సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి) స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్* ( గాజువాక ) విశాఖ జిల్లా వారి ఆధ్వర్యంలో దసరా వేడుకలు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్, విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి అయిన మొల్లి పెంటిరాజు మాట్లాడుతూ జర్నలిస్టు సోదరీ సోదరీమణులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజకీయరంగంలో జర్నలిస్టులు ఎంతో సహకారం అందించారని,జర్నలిజం వృత్తి ఒక బాధ్యత, సమాజంలో చాలా గౌరవం కల్పించేలా, ప్రజా సమస్యలపై సమాజాన్ని చైతన్య పరచాలి అని, యువత జర్నలిజని కూడా ఒక వృత్తిలో భాగంగా ఎంచుకోవాలని తెలిపారు. గాజువాక జర్నలిస్టుల సమస్యలపై గాజువాక MLA, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి వారికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శిరీష, గౌతమ్,వసంత్,tv5 శ్రీను ,శ్రీను, జాన్ వరబాబు,గోవింద్,శివ,జోగారావు, క్రిష్ణ, సునీల్ సత్యనారాయణ,ఎల్లాజీ, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సౌదీ అరేబియాలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : భారత రాయబార కార్యాలయం తరఫున ఫస్ట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్, కల్చర్ ఎడ్యుకేషన్, విపుల్ బావా, కౌన్సెలర్ కమ్యూనిటీ వెల్ఫేర్ వై సాబీర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, రియాద్ ప్రాంతంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. రాయబార కార్యాలయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా సంఘం చేస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఎడారిలో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడం, ఆపదలో ఉన్న మహిళలకు తోడ్పాటు అందించడం, సౌదీలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యుల ఆఖరి చూపుల కోసం స్వదేశానికి పంపడం వంటి సేవలను ప్రస్తావిస్తూ భారత రాయబార కార్యాలయం ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ హాజరై సంఘం సేవలను కొనియాడారు. కమిటీ చైర్మన్ శ్రీ జైగమ్ ఖాన్ మాట్లాడుతూ, ఈ సంఘం గత నాలుగేళ్లుగా దేశం కానీ దేశంలో చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశానికి పంపడంలోనూ, సామాజిక సేవల్లోనూ ఇతర సంఘాలకు మార్గదర్శకంగా నిలిచిందని అభినందించారు.వేడుకకు సౌదీ అరేబియా నలుమూలల నుండి అభా, తాయిఫ్, జిజాన్ వంటి ప్రాంతాల నుండి వైద్యులు, ఇంజినీర్లు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖోబర్, జుబైల్ పారిశ్రామిక నగరాల నుండి కూడా తెలుగు ప్రజలు విస్తృతంగా విచ్చేశారు. ధమ్మాంలోని తెలుగు సంఘం కుటుంబాల సమేతంగా పాల్గొన్నారు. సభ్యుల నిరంతర కృషి ఫలితంగా 2,000 మందికి పైగా తెలుగు ప్రజలు తెలుగు భాష దినోత్సవానికి హాజరై, సంప్రదాయ దుస్తులలో, తెలుగు వంటకాలతో తెలుగుదనం ఉట్టిపడుతూ చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోంగూరా, పూతరేకులు, మామిడి చారు, ఆవకాయ, రాజుగారి పులావ్ వంటి రుచికర వంటకాలతో తెలుగు సంప్రదాయ రుచులను అందించారు.వేదిక అలంకరణల నుండి కార్యక్రమ ముగింపు వరకు ప్రతి అంశం అద్భుతంగా సాగింది. చిన్నారుల నృత్యాలు, యువతీయువకుల ఉత్సాహభరిత ప్రదర్శనలు, “భారత వధూవరులు” అనే వివాహ సంప్రదాయాల ప్రదర్శన, “మిస్ తెలుగమ్మాయి” వంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సందర్భంగా మాట్లాడిన వివిధ రాష్ట్రాల ప్రవాసీ భారతీయ ప్రముఖులు, హైదరాబాద్ నగర ప్రవాసీ ప్రముఖులందరు కూడా సాటా సెంట్రల్ తెలుగు భాష అభిమానంతో తోటి తెలుగువారితో పాటు భారతీయులకు అందిస్తున్న ఆపన్న హస్తం గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. సాటా సెంట్రల్ నిరంతర సేవానిరతిని కొనియాడారు.సంఘ అధ్యక్షులు ఆనందరాజు, సుచరిత గారు ప్రసంగిస్తూ, తెలుగు భాష దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి ధన్యవాదాలు తెలిపారు.వారి సహకారం లేకపోతే ఈ స్థాయి వైభవం సాధ్యపడేది కాదని స్పష్టం చేశారు. కుల మతాలకు, వాణిజ్య వ్యాపారాలకు అతీతంగా శాత సెంట్రల్ సామాజిక సేవే పరమార్ధంగా ముందుకు సాగుతుందని తెలిపారు.ఈ వేడుకను ఘనవిజయం చేసిన సంఘ ప్రధాన సభ్యులు: ముజ్జమిల్ షేక్, రంజిత్ చిత్తులూరి, యెర్రన్న దుగ్గపు, షేక్ జాని బాషా, చొల్లంగి సత్తి బాబు, యాకూబ్ ఖాన్, పోకూరి ఆనంద్, వెంకటరావు, నాగార్జున, నరేంద్ర, ముసైబ్, వంశీ, వినయ్, షౌకత్, నజీముద్దీన్, గోవింద్, చంద్ర, అక్షిత, భారతి, గీత, మాధవి, లక్ష్మి కాకుమాని, ఉష దుగ్గపు, మానస, శిల్ప, సింధూర, గుండుబొగుల రమ్య, గోదా శ్రీ, గీత శ్రీనివాస్, లక్ష్మి మాధవి, శ్రీదేవి మల్లికార్జున, మాధవి బాలు, అర్చన శ్రీపాద, కవిత కఱ్ఱి, ప్రియాంక, చేతన, పావని శర్మ, రజని, ముబీనా, మానస కనిగిరి, సంధ్య బబ్బూరి తదితరులు తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలియచేసారు.

తిరుపతి

అంజూరు శ్రీనివాసులు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి నాయకులు

శ్రీకాళహస్తీశ్వర మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా పగడాల రాజు,మొగరాల గణేష్, కొల్లూరు హరి,పత్తి మణి, సెన్నేరు కుప్పం శేఖర్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ కళాకారుడు మైనంపాటి బాబు చే పంచ్ నీడిల్స్ త్రెడ్ తో శ్రీనివాసులు చిత్రపటాన్ని అద్భుతంగా తయారుచేసి ఆయన జన్మదినం సందర్భంగా బహుకరించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని దుశ్శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్

చమురు సంస్థల ద్వారా నిరుద్యోగ భృతి ఇవ్వాలి… ఎమ్మెల్సీ కుడిపూడి డిమాండ్

అమలాపురం, అక్టోబరు 03 (పున్నమి ప్రతినిధి) : గోదావరి బేసిన్ పరిధిలో ఓఎన్జిసి. గెయిల్. రిలయన్స్ చమురు సంస్థలు కోనసీమ ప్రాంతంలో వేలాది కోట్లు విలువగల నిక్షేపాలను వేలాది కోట్లు విలువగల నిక్షేపాలను తరలించకపోతున్నారని ఎమ్మెల్సీ కుడిపుడు సూర్యనారాయణరావు అన్నారు. ఆయన కార్యాలయంలో అమలాపురంలో మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ ఆయన కార్యాలయంలో మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ1989 లో నూతన గ్యాస్ పాలసీ అమల్లోకి వచ్చిందని అన్నారు ఎమ్మెల్సీ కుడిపూడి అన్నారు.అయినప్పటికీ కోనసీమ ప్రాంతంలో నిక్షేపాలను తరలించకపోతున్న రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని అన్నారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి చమురు సంస్థలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల నిధులు విడుదల కావడం లేదని అన్నారు.2016 సంవత్సరంలో అనకాపల్లి జిల్లా పంగిలి గ్రామంలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ. ఆనాటి పాలకుల నిర్లక్ష్యం యూనివర్సిటీ నిర్మాణం కారణంగా ఉత్తర ప్రదేశ్ తరలిపోయిందని అన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ చంద్ర చూడ్ ఆధ్వర్యంలో ఐదుగురు న్యాయమూర్తుల కమిటీ నిక్షేపాల తవ్వకాల ప్రాంతానికి రాయల్టీ చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కాదని పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ బీసీ సెల్ మట్టపర్తి నాగేంద్ర. టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు ముంగర ప్రసాద్. లీగల్ సెల్ నాయకులు కుడుపూడి త్రినాథ్. దండుమేను రూపేష్. బాబి గాబ్రియల్ పాల్గొన్నారు.

ఆదిలాబాదు

ఏక్ నాథ్ మహారాజ్ ను దర్శించుకున్న మాజీ ఎంపీ బాపూరావు

మహారాష్ట్ర రాష్టం నాందేడ్ జిల్లా కందర్ తాలూకా లోని ఉంరాజ్ దాక్రె పండర్ పూర్ లోని ఏక్ నాథ్ మహరాజ్ ను మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీ ను ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, మహరాజ్ జ్ఞాపిక ను అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట గుడిహత్నూర్ మండల పెద్దలు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.