Sunday, 3 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముంచుకొస్తున్న మరో తుఫాన్

ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుపాను “సైక్లోన్ శక్తి” ముంచుకొస్తోంది. ఈ తుపాను ప్రస్తుతం ద్వారకకు 240 కిమీ, పోర్బందర్‌కు 270 కిమీ దూరంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది గంటకు 12 కిమీ వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. త్వరలోనే తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీన్ని అధికారికంగా ‘సైక్లోన్ శక్తి’గా పేరుపెట్టి గుర్తించారు. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

తాడివలస గిరిజనుల జలదీక్ష

రోడ్లు, బ్రిడ్జీల కోసం వందలాది మంది ఆందోళన వీ. మాడుగుల మండలం శంకరం పంచాయతీకి చెందిన తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాల వందలాది గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు.వర్షాకాలంలో రోడ్ల లేమితో గర్భిణీలు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం హామీలు నెరవరలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.వందలాది మంది మహిళలు, పురుషులు “గెడ్డలపై బ్రిడ్జులు, రోడ్ల సౌకర్యం కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు.సర్పంచ్ వై. రమేష్, స్థానిక నేతలు కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల ఆందోళనను స్వీకరించారు.

కర్నూలు

గాంధీ జయంతిని మరచిన సచివాలయ సిబ్బంది.. ఎంపీడీవో ఆగ్రహం

మద్దికేర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడానికి సచివాలయ సిబ్బంది గైరాజరు అవ్వడంతో ఎంపీడీవో కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేసి, నోటీసులు జారీ చేయమని పంచాయతీ అధికారులకు తెలిపారు. గ్రామంలో నాలుగు సచివాలయాలలో 30కి పైగా సిబ్బంది ఉన్న ఒక్కరు మాత్రమే రావడం జరిగిందని సీనియర్ అసిస్టెంట్ వలి తెలిపారు.

అన్నమయ్య

కడు పేదరిక ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రత్యక్ష దైవ స్వరూపం – పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి

చిట్వేల్, అక్టోబర్ 3: (మీ స్పందన) ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండల పరిధిలోని పెద్దఓరంపాడు గ్రామ పంచాయతీ పాపిరెడ్డి పల్లె సమీపంలోని అప్పారావు సర్కిల్, కాశీనగరం జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.చిట్వేలి మండలానికి చెందిన కడు పేదరికంలో జీవిస్తున్న, రెండు చేతులు లేని దివ్యాంగులు మల్లికా, కార్తీక్ లకు స్వయంగా జీవనజ్యోతి జీవన పెన్షన్ అందజేసి నిరుపేదలకు అండగా నిలిచారు.ఈ సందర్భంలో పలు గ్రామాల ప్రజలు మాట్లాడుతూ “ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అన్నదానం చేయడమే కాకుండా, మీ స్వంత సొమ్ముతో దివ్యాంగులకు పెన్షన్ అందించడం చూస్తే మీరు దేవుడి రూపంలో మా కోసం పుట్టిన వాడివని అనిపిస్తుంది. ఇంతటి మానవతా దృక్పథం అందరికీ ఆదర్శం”అని ప్రశంసించారు. కార్యక్రమంలో జీవనజ్యోతి ఆనంద నిలయం వర్కింగ్ మేనేజర్ దట్టం రఘురామయ్య, కోవూరి సావిత్రి (తిరుపతి), కోవూరి జయలక్ష్మి / లక్ష్మీదేవి (కడప), పాపిరెడ్డి పల్లి పెద్దలు జెట్టి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పాణ్యం లోకేష్ బాబు, పెయిలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్మన్ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ “కడుపేదరికంతో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసే వరకు జీవనజ్యోతి జీవన పెన్షన్ అందించడం నా ధర్మం, నా కర్తవ్యం. దేవుడు ఇచ్చిన వరమిదే. మానవసేవే మాధవసేవ అన్న నినాదంతో నేను ఎల్లప్పుడూ అర్హులైన నిరుపేదలకు అండగా ఉంటాను. అర్హులైన వారు ఆశ్రమాన్ని సంప్రదించి జీవన పెన్షన్ పొందవచ్చు” అని తెలిపారు.ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ, సేవలో దైవస్వరూపంగా నిలుస్తున్న సుబ్రహ్మణ్యం స్వామి పట్ల గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అన్నమయ్య

చిట్వేల్ మండలంలో రైతుల కోసం జి.ఎస్.టి. అవగాహన కార్యక్రమం

చిట్వేల్, అక్టోబర్ 3,(పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలం నక్కలపల్లి గ్రామ పంచాయతీలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో “సూపర్ జి.ఎస్.టి – సూపర్ సేవింగ్స్” పై రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీ జి. సుధాకర్ మాట్లాడుతూ, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్ పరికరాలు, హార్వెస్టర్లు, డ్రోన్లు, డ్రిప్ పరికరాలు వంటి యంత్రాలపై జి.ఎస్.టి.ని 5%కి తగ్గించారని తెలిపారు. దీని వల్ల రైతుల ఖర్చులు తగ్గి, ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని చెప్పారు. అలాగే సుష్మపోషకాలు, బయో-పెస్టిసైడ్స్పై కూడా జి.ఎస్.టి.ని 5%కి తగ్గించినట్లు తెలిపారు.కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చాయని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే 1915 నెంబర్‌కి కాల్ చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్టాల్స్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి శ్రీ లోకేష్, టిడిపి నాయకులు చంద్రమోహన్, గ్రామ ఉద్యాన సహాయకుడు తిమ్మాయాగారిపల్లి ఓబయ్య, గ్రామ రెవెన్యూ అధికారి భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి జయలత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖలో బవేరియా గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్

విశాఖపట్నం, అక్టోబర్ 3:విశాఖపట్నం సిటీ పోలీసులు దేశవ్యాప్తంగా నేరాలకెక్కిన బవేరియా గ్యాంగ్ ప్రధాన సభ్యుడు ధర్మేంద్ర కుమార్ (34)ను అరెస్ట్ చేశారు. అతడి అరెస్టుతో 9 చైన్ స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించారు. పోలీసుల ప్రకారం, నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. దేశంలోని జమ్మూ & కాశ్మీర్, ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కలిపి 24 కేసులు అతడి పై నమోదయ్యాయి. వీటిలో 147, 148, 149, 307, 392, 379, 394, 411 వంటి IPC సెక్షన్లు ఉన్నాయి. వైజాగ్‌లో నేరాలు (17-09-2025): 7 చైన్ స్నాచింగ్‌లు – 1టౌన్, కంచరపాలెం, షీలానగర్ పరిధిలో 2 బైక్ దొంగతనాలు – 1టౌన్, ఎంఆర్పేట ప్రాంతాల్లో పోలీసుల ఆపరేషన్:వెస్ట్ ఇన్స్పెక్టర్ మీసాల చంద్ర మౌళి, కంచరపాలెం ఎస్‌ఐ షైక్ అబ్దుల్ మారూఫ్ నేతృత్వంలోని టీమ్ నిందితుడితో మమేకమై ట్రాప్ వేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుండి నగదు, బంగారు ఆభరణాలు, దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు హెచ్చరిక:విలువైన ఆభరణాలు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త పడాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నెంబర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

వారాహి ఫంక్షన్ హాల్ ప్రారంభం

విశాఖపట్నం, అక్టోబర్ 3:51వ వార్డ్ మాధవధార వుడా కాలనీ విజేత పక్కన నిర్మితమైన వారాహి ఫంక్షన్ హాల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ హాజరయ్యారు. అనంతరం అశోక్ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణని సన్మానించి, సాలువ కప్పి బొకే అందజేశారు. ప్రాంత ప్రజలు ఫంక్షన్ హాల్ ప్రారంభాన్ని ఆనందంగా స్వాగతించారు.

రంగారెడ్డి

దుర్గామాత లడ్డు వేలంపాటలో దక్కించుకున్న అకరపు స్వప్న

అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ తట్టిఅన్నారం శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మ దేవస్థానం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి చీరెలు, లడ్డు, వేలం వేయగా గురువారం రోజు భక్తులు పోటీ పడ్డారు. ఈ పోటీలో భాగంగా అకరపు మల్లయ్య వారి సతీమణి సాహకుటుంబ సభ్యులు స్వప్న ఆమె లడ్డూ వేలం పాటలో 7100 రూపాయలకు పాట పాడి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. అనంతరం మహిళా భక్తులు కోలాటం దాండియా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మ దేవస్థానం కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.,

కడప

వీధి కుక్కల బేధత

గ్రామాలు మరియు పట్టణాల్లోని ప్రజలు వీధి కుక్కల నుండి గణనీయమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు, వాటిలో కుక్క కాటు, రాబిస్ మరియు ఇతర వ్యాధులు, భయం, ఆస్తి నష్టం మరియు ప్రమాదాలు ఉన్నాయి. ఈ సమస్యలు అధిక జనాభా కారణంగా ఉత్పన్నమవుతాయి సమస్యలు: 1. కుక్క కాటుతో గాయాలు – ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధపడుతున్నారు. 2. రాబీస్ వ్యాధి ప్రమాదం – ఇది ఒక జీవనాంతక వైరస్. బహుశా చికిత్స పొందకపోతే 100% మరణం. 3. భయం మరియు మానసిక ఒత్తిడి – వీధుల్లో ప్రయాణించే ప్రజలు భయంతో ఉండడం. 4. ఆస్తి నష్టం – కుక్కలు రాత్రిళ్ళు పశువులపై దాడులు చేయడం లేదా వ్యర్థాలను చిందించడంవల్ల. 5. రోడ్డు ప్రమాదాలు – రాత్రిళ్ళు కుక్కలు అడ్డంగా వచ్చి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అధిక జనాభా వల్ల ప్రభావం: జనాభా పెరిగితే వ్యర్థాలు పెరుగుతాయి, ఇది వీధి కుక్కలకు ఆహారంగా మారుతుంది. ప్రజలు నివసించే ప్రాంతాలు విస్తరించటంతో వన్యప్రాణుల నివాస ప్రాంతాలమీద దెబ్బ, వీధి కుక్కల ఉనికి పెరుగుతుంది. తగిన జంతు నియంత్రణ చర్యలు లేకపోవడం వల్ల వాళ్ల రీప్రొడక్షన్ అదుపులో ఉండదు. పరిష్కార మార్గాలు: 1. పిల్లకుక్కలకు నిర్బంధం లేకుండా స్టెరిలైజేషన్ (Animal Birth Control – ABC) కార్యక్రమాలు అమలు చేయడం. 2. రాబీస్ టీకాలు వేయించడం – వీధి కుక్కలకు పకడ్బందీగా వ్యాక్సినేషన్ చేయడం. 3. వ్యర్థాల నిర్వహణ మెరుగుపరచడం – వీధుల్లో తినదగిన చెత్త తగ్గించడం. 4. ప్రజల అవగాహన పెంపు – జంతువుల ప్రవర్తన, తగిన చర్యలు, నివారణ గురించి ప్రజలకు తెలియజేయడం. 5. పాటించవలసిన విధానాలు/చట్టాలు అమలు చేయడం – మున్సిపల్ శాఖలు జవాబుదారీగా వ్యవహరించా లి బేధత వల్ల కలిగే సమస్యలు: కుక్క కాటు ప్రమాదం రాబీస్ వ్యాధి వ్యాప్తి రాత్రివేళలో భయం, మానసిక ఒత్తిడి పశువులపై దాడులు, ఆస్తి నష్టం రోడ్డు ప్రమాదాలు పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బలవుతారు వీధి కుక్కల బేధత అనేది మనం నిర్లక్ష్యం చేయలేని సమస్య. మానవతా దృక్పథంతో, శాస్త్రీయంగా మరియు సమర్థంగా చర్యలు తీసుకుంటేనే దీనిని నియంత్రించవచ్చు. ప్రజలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి.

జాతీయ అంతర్జాతీయ

మధ్యప్రదేశ్‌లో టమోటా వైరస్ కలకలం

మధ్యప్రదేశ్‌లో టమోటా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా భోపాల్‌లో ఈ వైరస్ 6 నుండి 13 ఏళ్ల చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ సోకిన పిల్లల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద భాగం, నోటిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్కరినుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌తో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై, schools‌లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. టమోటా వైరస్ సోకిన పిల్లలకు తాత్కాలికంగా జ్వరంతో పాటు చర్మ రుగ్మతలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. వైరస్‌ నిరోధానికి జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.