Sunday, 3 May 2026

Blog

కామారెడ్డి

మాజీ జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, 2 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : రామారెడ్డి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమి టీ (డిసిసి) అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ జన్మదిన వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడు కలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాత్రి సమయంలో సమావేశమై, తమ ప్రియతమ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్‌ కట్ చేసి, రెండు కొవ్వొత్తులు వెలిగించి, అభిమానంగా ఆయ నకు జయస్మరణ చేశారు.ఈ కార్యక్రమానికి హాజ రైన కాంగ్రెస్ నేతలు కండువాలు ధరించి పార్టీ సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడు కల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ నాయ కుడిపై ఉన్న మద్దతును, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ఈ జన్మదినోత్సవాన్ని విజయవంతం చేశారు.

కామారెడ్డి

మాజీ జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, 2 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : రామారెడ్డి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమి టీ (డిసిసి) అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ జన్మదిన వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడు కలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాత్రి సమయంలో సమావేశమై, తమ ప్రియతమ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్‌ కట్ చేసి, రెండు కొవ్వొత్తులు వెలిగించి, అభిమానంగా ఆయ నకు జయస్మరణ చేశారు.ఈ కార్యక్రమానికి హాజ రైన కాంగ్రెస్ నేతలు కండువాలు ధరించి పార్టీ సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడు కల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ నాయ కుడిపై ఉన్న మద్దతును, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ఈ జన్మదినోత్సవాన్ని విజయవంతం చేశారు.

Blog

నంద్యాల RTC డిపో మేనేజర్ గా జంకుల మాధవి లత

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ నంద్యాల RTC డిపో మేనేజర్ గా జంకుల మాధవి లత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత డిపో మేనేజర్ గంగాధర్ రావు పదోన్నతి మీద వెల్లడంతో ఆయన స్థానంలో డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీసీ సిబ్బంది పూలబుకే లతో స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

Blog

వీల్ చైర్ అందచేసిన నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం పేద దివ్యాంగులకు నిరంతర సహకారం: డాక్టర్ రవి కృష్ణ

పక్షవాతంతో మంచానికే పరిమితమైన రామయ్య అనే వృద్ధునికి చక్రాల కుర్చీ అవసరం వున్నదని తెలపడంతో,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున అతని సోదరుడు లక్ష్మయ్య గురుస్వామికి చక్రాల కుర్చీ అందచేశారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.పీ.వి. రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నిరుపేద దివ్యాంగులకు సహకారం సంఘం తరపున, లయన్స్ క్లబ్, ఐఎంఏ, మరియు ఇతర దాతల సహకారంతో నిరంతరం కొనసాగిస్తామన్నారు. అవసరమున్న దివ్యాంగులు సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్యతో పాటు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పీవీ సుధాకర్ రెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వెంకటరావు, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ ఎస్ ప్రసాద్, కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు తోట శ్రీనివాస్, రామయ్య, మురళీధర్ పాల్గొన్నారు.

హైదరాబాద్

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత

పున్నమి ప్రతి నిధి సీనియర్ కాంగ్రెస్ నేత మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా దామోదర్ రెడ్డి ప్రజలకి సేవా చేశారు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన దామోదర్ రెడ్డి మరణం పార్టీ కి తీవ్ర నష్టం అని సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్ అదృశ్యం – ఆందోళనలో కుటుంబం

తాటిచెట్లపాలెం తారకరామనగర్-2 వాసి సిరిశెట్టి ఈశ్వరరావు (40), పద్మశాలి కులం చెందిన ఆటో డ్రైవర్ అదృశ్యమయ్యారు. వివరాల్లోకి వెళ్తే… ఫైనాన్స్ విషయమై ఇంటిలో చిన్న గొడవ కారణంగా సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఈశ్వరరావు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఆయన ఆటో, ఆటో తాళాలు, ఖాకీ షర్ట్ ను ఇంటి వద్దే వదిలిపెట్టి వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆయన ఎక్కడా కనబడలేదు. దీంతో ఆయన భార్య సిరిశెట్టి సంతోష్ కుమారి సెప్టెంబర్ 22న IV టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు CI కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను హెడ్ కానిస్టేబుల్ ఎం.ఎస్‌.ఎస్‌. శ్రీనివాస్ కి అప్పగించారు. ఈశ్వరరావు గమ్యం గురించి సమాచారం తెలిసినవారు వెంటనే IV టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణలో డిగ్రీ అతిథిఅధ్యాపకులకు అందని వేతనాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి 152 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రిమిన కమిటీ ఆధారంగా పీజీ చదివిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఎన్నుకోవడం జరిగింది ఆ క్రమంలోనే తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ నుండి ఆమోదం పొందినటువంటి 1940 అధ్యాపకులను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం కేవలం 1200 మందిని డిగ్రీ అదితి అధ్యాపకులుగా నియమించడం జరిగింది . ప్రతి డిగ్రీ కళాశాలలో పొందినటువంటి విద్యార్థుల ప్రవేశాలను దృష్టిలో ఉంచుకొని వివిధ విభాగాలలో అతిథి అధ్యాపకులను నియమించడం జరిగింది . కానీ వివిధ యూనివర్సిటీల హాల్మానికి ప్రకారం కేవలం ఒక నెలలో 18 రోజులకు గాను 72 పీరియడ్లు వచ్చేటట్టుగా నియమావళిని రూపొందించి వారిని 28080 రూపాయలను మాత్రమే అందిస్తున్నారు. యూజీసీ ప్రకారం ఒక పీరియడ్ గాను 700 రూపాయలు చెల్లించవలసింది పోను 390 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది వివరాల్లోకి వెళితే సెమిస్టర్ విధానంలో 90 రోజులకు మొదటి విడత మరో 90 రోజులకు గాను రెండో విడతగా వేతనాలను చెల్లిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం . ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కానీ 220 పని దినాలు కాకుండా కేవలం 180 రోజులకు వేతనం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యయపాకులకు అందించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు 500 చొప్పున పిరియడుకుగాను వేతనం చెల్లిస్తూ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులకు 390 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు యూజీసీ చెప్పినప్పటికీ నిర్లక్ష్య ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడవడం డిగ్రీ అతిథి అధ్యాపకులకు తీరని నష్టం ఏర్పరిచింది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి వేతనాలు చెల్లించకుండా జాప్యం చేయడం చాలా దారుణం. మేనిఫెస్టోలో సూచించిన విధంగా నెలకు 50 వేల రూపాయలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ అతిథి అధ్యాపకుల జీవితాలతో చెలగాటమాడుకుంటుంది అంతేకాకుండా కన్సల్డేటెడ్ పే 12 నెలలకు ఇవ్వకుండా కేవలం 6 నెలలకు వేదనం కట్టించి సంవత్సరం పొడవునా వారి శ్రమను దోచుకుంటున్నారు. తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కోరినప్పటికీ ఎటువంటి లాభాపేక్షమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా తెలంగాణ సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి డిగ్రీ అతిథి అధ్యాపకులను ఆదుకోవాలని రాష్ట్ర యూనియన్ కోరుతుంది

నిర్మల్

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశం : ఎన్నికల నియమావళి అమలు

నిర్మల్ల్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై కలెక్టర్ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీనివాస్, సిపిఓ జీవరత్నం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సాహితీ

రూపారాధన (కథ) – డాక్టర్ బద్రి. పీర్ కుమార్

‘చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నావుగా… ఎందుకు సిగ్గు పడుతూ.. ఓరకంటిలో చూస్తున్నావ్!..’ పెళ్ళి పీటల మీద వరుడుగ వధువు రూపతో అన్నాడు విజయ్ సిగ్గుపడుతూనే.. ‘ఆ.. అవును నీ ముఖం చూస్తేనే సిగ్గేస్తుంది. సరెసరే… ముందు పంతులు చెప్పే మంత్రాలు పలుకుదాం… మిస్ చేసామంటే… మంత్రాల పవర్ తగ్గి లైఫ్లాంగ్ ఫైటింగ్స్ తోనే కాలం గడపాల్సి వస్తుంది’ అందిరూప. ‘అవునవును’ అంటూ విజయ్ కళ్ళు తెరచి చూడగానే ఎదురుగా ఉన్న బెడ్ పై బెడ్షీట్ మడతేస్తున్న అమ్మ రుక్మిణిని చూసి ‘అమ్మా… అప్పుడే తెల్లారిందా!… ‘ఆc.. తెల్లారక నీవు కలలు కంటూ ఉండమని పొద్దు ఆగుతుంది మరీ!.. అయినా ఆ రూప నీకు ఎంత అపురూపమైతే మాత్రం మరీ.. ఆ కలవరింపులు ఏంట్రా… ఇదో.. నీ ఆరాటం చూడలేక నీ కోరిక మేరకు నేను మీనాన్న ఆ రూప ఇంటికెళ్లి… మా అబ్బాయి.. మీ అమ్మాయి.. చిన్నప్పటి నుండి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని మా అబ్బాయి ఇష్ట పడుతున్నాడు.. ఆస్థి అంతస్తుల్లో మీకన్నా ఏమాత్రం తీసిపోము.. అని బ్రతిమాలుకొని మొన్ననే నీపెళ్ళి ఆ రూపతో ఫిక్స్ చేసకున్నాంకదా.. నిజం చెప్పాలంటే ఈ సంబంధం మాకిష్టం లేదు.. ఆ రఘరాం ఉన్నాడే.. అదే నీకు కాబొయె మామగారు.. మహాగర్విష్టి.. ఎదుటివారిని గౌరవించటం తెలియదా!… కనీసం కూర్చొమనికూడా చెప్పడు… మేమేం తుక్కువా?.. ఆయనగారు చెప్పేదేముందని మేమే దర్జాగా కూర్చొని మాట్లాడాం.. అంది రుక్మిణి కాస్త అసహనంగా. ‘అమ్మా… నా కోసం నా ఆనందం కోసమేకదా.. మీ శ్రమంతా.. అయితే ఇప్పుడేమైంది అన్నాడు విజయ్. ‘అసలు విషయం నీకు తెలియదురా.. ఆ రూపావాళ్ల అమ్మా నాన్న ఒక కండీషన్ పెట్టారు’ అంది రుక్మిణి. ‘పెళ్లికి ఓకే అన్నాక కండీషన్ ఏంటి?… ఇంతకు ఎంటంట… అయినా అవన్ని మీరు చూసుకోండి.. రూపతో నాకు పెళ్లి అయితే చాలు… రూప ఒప్పుకుందిగా అదే నాకు భాగ్యం. అన్నాడు విజయ్. ‘ఆc.. భాగ్యమే.. పెళ్ళికి ముందు నీవు ఏ-టు-జెడ్ ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలట… మనది రెస్టారెంట్ మరియు బార్ నడిపే ఫ్యామిలీఅట.. నికార్స్ గా ఉండడానికి అవకాశాలు తక్కువట.. అన్నిటెస్ట్లు నెగెటివ్ వస్తేనే నీపెళ్ళి జరుగుతుందట. ఆ.. అన్నట్లు చెప్పటం మరచిపోయా.. ఈరోజే చేయించుకోవాలట.. వాళ్ళఫ్యామిలీ డాక్టర్ని 11గంటలకు నిన్ను కలవమన్నారు… ఇదెక్కడ విడ్డూరం.. ఇటువంటివి మన వంశం లోనే ఎప్పుడయినా జరిగాయా..?’ అంది రుక్మిణి విచారంగా. ‘అమ్మా దీనికే ఇంతలా డీలా పడిపోతే ఎలా.. అయినా నాకేంటీ.. ఆరోగ్యంగానే ఉన్నా కదా.. అన్ని టెస్టుల్లో నెగటివే వస్తుంది… నీవేం కంగారు పడకు … రాబోయే అందమైన కోడలికి హ్యాపీగా వెల్కమ్ చెప్తువుగాని..’ అంటూ చకచక రెడీ అయ్యి రూప వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సుకుమార్ని కలిసాడు విజయ్. రూప దగ్గరుండి అన్ని టెస్టులు చేయించింది. ‘రిపోర్ట్స్ రావడానికి మరో రెండు గంటలు పడుతుంది’ అన్నాడు డాక్టర్. ‘ఓకే డాక్టర్’ అని చెప్పి రూపతో అలా షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చి ఫుడ్కోర్ట్ లో కూర్చొని కాఫీ ఆర్డర్ చెప్పి ‘నీవు చెప్పినట్లుగానే అన్ని టెస్ట్లు చేయించుకున్నాను… మరినీవు చేయించుకోవా’ అన్నాడు విజయ్ వినయంగా రూపతో. వెంటనే తను చేయించుకున్న వివిధ రకాల టెస్టులు మరియు రిపోర్ట్లు చుపించింది రూప. అందులో అన్నీ నెగిటివ్ గానే ఉన్నాయి. ‘హెల్త్ టెస్ట్ చేయించుకోవటం మనిషిని అనుమానించటానికో.. అవమానించటానికో కాదు. ఆరోగ్యకరమైన సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన నిబంధన మరియు మన సామాజిక బాధ్యత’ అంది రూప. ‘యస్ వందశాతం నీవు చెప్పింది కరెక్ట్ రూప… ఆరోగ్యంగా లేని వారికి మరొకరికి జన్మనిచ్చే అర్హత లేదు. మన గవర్నమెంట్ దీన్ని చట్టం చేస్తే చాలా బాగుంటుంది. సరేసరే… మాటల్లో పడి రెండుగంటలు దాటిపోయింది. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి వెళ్దాంపదా..’ అంటూ విజయ్ ఉత్సాహంగా రూప చేయి పట్టుకొని నడుచుకుంటూ రిపోర్ట్ డిస్పాచ్ సెంటర్ సమీపానికి వచ్చేలోపల రఘరామ్ కారు సర్రునవచ్చి వీరికి ఎదురుగా ఆగింది. ‘నాన్నా… విజయ్ కి అన్ని టెస్టులు చేయించాను. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి తీసుకుని వచ్చేస్తాను.’ విజయ్ సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు అనే నమ్మకంతో ఆనందంగా చెప్పింది రూప. ‘అక్కర్లేదు… ఇప్పుడే మన డాక్టర్ సుకుమార్ ఫోన్ చేశాడు.. బార్లు, పబ్బులు.. నడిపే వారి సంబంధం… నేను ముందే వూహించా… ఆయినా మనకెందుకులే… ఇతనితో నీ పెళ్లి జరగదు. ముందు నీవు కారెక్కు.. అన్ని విషయాలు చెబుతాను’ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోర్సుగా రూప చేయి పట్టుకుని కారెక్కించి తీసుకెళ్ళాడు రఘరాం. జరుగుతున్న ఈ హఠాత్పరిణామం చూస్తున్న విజయ్కు షాక్ తగిలినట్లు నోటి నుండి మాట రాలేదు. రెండు నిమిషాల తర్వాత తనను తాను సముదాయించుకొని, అసలు రిపోర్ట్లో విషయం ఏముందో తెలుసుకుందామని కంగారు పడుతూ డాక్టర్ సుకుమార్ని కలిసాడు విజయ్. ‘హెచ్.ఐ.వి. పాజిటివ్ వచ్చింది.. నాకు తెలిసి ఈ సంవత్సరానికి నీది రెండవ కేసు… డోంట్ వర్రీ…. ఈ ప్రిస్కిప్సన్ ఫాలో అయితే లైఫ్ టైమ్ పెంచుకోవచ్చు!.. జాలిగా అన్నాడు డాక్టర్ సుకుమార్. విజయ్ నిర్ఘాంత పోయాడు. ‘నన్ను ఇష్టపడ్డ సంబంధాలను అశ్రద్ధచేసి, నాకు ఇష్టమైన రూప కోసం తపించాను… నా కోసం మా అమ్మానాన్నలు వారి ఆత్మాభిమానం కూడా పక్కన పెట్టి రఘురాంను ప్రాదేయపడి ఒప్పించారు… ఇప్పుడు ఈ విషయం వారికి తెలిస్తే తట్టుకోలేరు..’ అనుకుంటూ తీవ్ర మనస్తాపంతో రోడ్డు దాటుతూ అటుగా వస్తున్న కార్ ను ఢీకొన్నాడు. # ### అది మహిమ కలిగిన ఆంజనేయస్వామి దేవాలయం. ఓ రోజు మంగళవారం ఉదయం ఏడు గంటలకు పూజలు చేయుస్తూ ఉంది డాక్టర్ వనజ. ‘వనజా!… నీవు పూజలు చేయించటం చూస్తుంటే!.. ఆశ్చర్యంగా ఉంది.. ఏంటీ బెంగళూరులో హాస్పిటల్ పెట్టావంటగా.. బాగా మారిపోయావు.. సారీ..వే.. నేనప్పుడు.. కొన్ని అనివార్య కారణాల వల్ల అమెరికా వెళ్లడంతో నీ పెళ్ళికి రాలేకపోయాను. ఆ గిల్టీ ఫీలింగ్తోనే.. తర్వాత.. నేను నీకు ఫోన్ కూడా చేయలేక పోయాను.. నన్ను క్షమించు..’ అంది దైవారాధనకు వచ్చిన రూప వనజతో. ‘సరే సరేలేవే.. దానికి ఇప్పడు క్షమాపణలు ఎందుకు.. నేనుకూడా అంతేగా.. బై.పి.సి ఇద్దరం ఒకే క్లాస్లో చదువుకున్నాం.. తర్వాత నేను యమ్బిబియస్. చేరాను.. అందులో పడి సరిగా నీకు ఫోన్ చేయడం కూడా మానేశాను. ఏది ఏమైనా మనం బాగుండటం కావాలి… ఎలా ఉన్నావు? రూప.. అంతా హ్యాపీనేగా..’ అంది వనజ తన ఇంటర్ కాలేజ్ ని గుర్తు చేసుకుంటూ. ‘ఆ… అన్హ్యాపీ ఆన్ ది వే.. నా లైఫ్ లో.. నాన్న చూస్తే ఏమో షుగర్ పేషెంట్.. ఈ మధ్య బాగా డల్ అయ్యాడు.. ఇక మా ఆయన చూస్తే తనకి కిడ్నీ ప్రాబ్లం.. డాక్టర్ కొడుకుకదా.. ఆరోగ్యం విషయంలో చాలా పద్దతిగా ఉంటాడనుకుంటే.. పార్టీలని.. ఫంక్షన్లని.. మందలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు తనతోపాటు నేను అనుభవిస్తున్నాను.. అది సరేగాని.. నీ..విషయం చెప్పు… అప్పట్లో నీవు దైవాన్ని నమ్మేదానివికాదు కదా!.. మరిప్పుడు బెంగుళూరు నుండి వచ్చి ఇక్కడ పూజలు చేయిస్తున్నావ్…. ఈ మార్పుకు కారణం తెలుసుకోవచ్చా..’ అంది రూప ఆత్రుతగా. ‘అదో అక్కడ పూజారితో మాట్లాడుతున్నాడే.. విజయ్.. ఆయనే.. మా ఆయన. నన్ను దైవం వైపు మళ్లించాడు’ అంది వనజ పూజా సామాగ్రి వివరాలు తెలుసుకుంటున్న విజయ్ ని చూపిస్తూ. విజయ్ ని చూసిన రూపకు గతం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది. ‘ఏంటే.. మా ఆయన్ను చూపిస్తే మాట్లాడటం మానేసి.. మౌనంగా ఉండిపోయావు… నా మార్పుకు కారణం చెబుతా విను… సరిగ్గా మూడేళ్ల క్రితం.. ఈ ఆలయం ముందు.. లెఫ్ట్ సైడ్ నుండి నేను కార్లో వెళుతున్నాను… రైట్ సైడ్ నుండి ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ వేగంగా డివైడర్ను ఢీకొని లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. దానికి.. నాకు.. పది అడుగులే దూరం.. విజయ్ సరిగ్గా అదే సమయంలో రోడ్డు దాటుతూ.. నా కారు ముందు పడిపోవడంతో.. నేను సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ ఘటన గుర్తు చేసుకుంటేనే ఇప్పటికీ.. నా ఒళ్ళు వణికి పోద్ది.. విజయ్ నా కారుకు అడ్డురాకుంటే.. నేను ఆ ట్రక్కుకు బలైపోయేదాన్ని… ఈ దైవమే విజయ్ రూపంలో నాకు పునర్జన్మ ఇచ్చాడని గట్టి నమ్మకం అప్పుడే ఏర్పడింది. తర్వాత.. ఆ సంఘటన నుండి తేరుకున్నాక “ఎందుకు అలా నా కారు ముందు పడ్డావు” అని అడిగాను “నా కల కల్లగా మిగలడంతో జీర్ణించుకోలేక మనోవేదనకు గురై స్పృహ తప్పి పడిపోయా” అని తనకు జరిగిన విషయం అంతా వివరించాడు విజయ్. ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టిన నేను, ఇలాంటి వ్యక్తికి ప్రస్తుత రోజుల్లో హెచ్ఐవి ఉండే అవకాశమే లేదనిపించి మరొకసారి అన్ని టెస్టులు దగ్గరుండి చేయించాను. అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి.. విజయ్ గురించి అంతా తెలుసుకున్న నాకు.. ఆ అమ్మాయి ఎవరో దురదృష్టవంతురాలనిపించింది.. విజయ్ పై నాకు సానుభూతి, ప్రేమ కలిగాయి.. ఆ తర్వాత.. మా డాడీ విజయ్ అమ్మా నాన్నతో మాట్లాడి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నా లైఫ్ లో జరిగిన మరువలేని ఘటన.. విధి నిర్ణయం విజయ్ నా జీవిత భాగస్వామి అయ్యాడు.’ అంది వనజ దైవానికి నమస్కరిస్తూ.. ‘ఏమైనా నీవు అదృష్టవంతురాలివి… ఇప్పుడే నీవన్న ఆ దురదృష్టవంతురాలు ఎవరో కాదు నేనే వనజ.. అవును… మా ఫ్యామిలీ డాక్టర్ సుకుమార్ తన స్వార్థంతో నన్ను అతని కోడల్నిచేసుకోవాలని, మా అమ్మా నాన్నకు ఉన్న ఆరోగ్య జాగ్రత్తలను అవకాశం గా తీసుకుని.. విజయ్ కి బ్లడ్ టెస్ట్ లో హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిందని మా నాన్నను నమ్మించాడు. ఈ మధ్య.. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న తన కొడుకుని.. అంటే మా ఆయన్ని చూసి పశ్చాతాపంతో తను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని నాకు తనే చెప్పాడు’ అని బోరున విలపించింది రూప. ‘ఊరుకోవే…

నిర్మల్

డిగ్రీ అతిథి అధ్యాపకులకు 12 నెలల కన్సల్దేటెడ్ పే ఇవ్వండి.

నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులు మేనిఫెస్టోలో సూచించిన విధంగా 50 వేల రూపాయలు వేతన మందివ్వాలని అలాగే కన్సాల్డేటెడ్ పే చేయాలని అది 12 నెలలు ఇవ్వాలని వినతి పత్రాలను ఈరోజు రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, హైయర్ ఎడ్యుకేషన్ కమీషనర్ కు, చైర్మన్ కు ప్రిన్సిపాల్ సెక్రటరీ కి కూడా వినతి పత్రాలను అందించామని గెస్టు ప్యాకల్టీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుండి జీతాలు కూడా లేవని వెంటనే అందివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1940 మందిని డిగ్రీ అతిథి అధ్యాపకులుగా తెలంగాణ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 180 రోజులకు మాత్రమే జీతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు అర్గుల నరేందర్ డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మురహరి రాథోడ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.