Sunday, 3 May 2026

Blog

E-పేపర్

వరద లోనూ ఆగని పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం

కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.

జోగులాంబ గద్వాల

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.

ఆలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, శ్రీ కర్రెమ్మ దేవాలయం, దుర్గమ్మ మండపం దగ్గర, విజయదశమి ఉత్సవ సందర్బంగా శ్రీ కట్టా ప్రభాకర్ జీ ( విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ ) ముఖ్య అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి బాయికాటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హనుమాన్ చాలీసా భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి

అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో గొప్పది

భీమవరం : అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో 3వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మంగళవారం రాయలం గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మహా నివేదనకు హారతులు ఇచ్చారు. వందలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, యూత్ సభ్యులు రామదుర్గ, పవన్, కేశవ, నందు, గౌతమ్, సాయి, వీర భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవన నిర్మాణానికి డిజైన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి

అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ భవనం ఆధునిక శైలిలో రూపకల్పన చేయబడుతుంది మరియు రాష్ట్రానికి అనుగుణంగా నిర్మాణం సాగనుంది. ఇది ప్రభుత్వ, కార్పొరేట్, ప్రజా సేవలకు కేంద్రబిందువుగా మారే అవకాశముంది. భవనంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అనుసరించి శాశ్వత శక్తి వనరుల వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. ఉద్యోగులకు మెరుగైన వాతావరణం, కస్టమర్లకు ఉత్తమ సేవలందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయి. అమరావతిలో ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది. భవన నిర్మాణానికి సంబంధించి డిజైన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. SBI విస్తరణలో ఇది కీలకమైన ముందడుగు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అక్టోబర్ వచ్చేసింది! కొత్తగా అమలులోకి వస్తున్న మార్పులు!

అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) మరో కొత్త నెల ప్రారంభమైంది. అక్టోబర్ వచ్చేసింది. ప్రతి నెలా కొన్ని నిబంధనలు మారుతూ ఉంటాయి. కొత్తగా అమలులోకి వస్తున్న మార్పులు మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడం తప్పదు. ఈ రోజు, అక్టోబర్ 1, 2025 నుండి కొన్ని ముఖ్యమైన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మొదటిగా, రైల్వే శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, జనరల్ టికెట్‌ల బుకింగ్ కోసం మొదటి 15 నిమిషాల్లో కేవలం “ఆధార్” ధృవీకరణ ఉన్న ఖాతాల నుంచే టికెట్లు బుక్ చేయగలుగుతారు. ఇది టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్య. రెండవది, ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో మార్పులు. డబ్బుతో ఆడే గేమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త నియంత్రణలు తీసుకొచ్చింది. గేమింగ్ సంస్థలు, ప్రచారదారులు మరియు చెల్లింపుల వ్యవస్థలపై కఠిన నిబంధనలు అమలవుతాయి. మూడవది, పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ (PFRDA) NPS పథకంలో కొత్త ఎంపికలు అందిస్తోంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 100% వరకు వెళ్ళే అవకాశం, స్కీమ్‌ల మధ్య మార్పులు చేసే సౌలభ్యం లభించనుంది. నాలుగోవది: గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలు చాలా కాలం నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ నెలలో కూడా వాటి ధరల విషయంలో మార్పు లేదు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్‌లపై మాత్రం చమురు కంపెనీలు రూ.15 పెంచాయి. అదేవిధంగా, ఇండియా పోస్టల్ శాఖ “స్పీడ్ పోస్ట్” సేవల్లో OTP ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రారంభిస్తోంది. ఈ మార్పులు మన ఆర్థిక, ప్రయాణ, డిజిటల్ జీవన విధానంలో ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో మహిళా పోలీసులకు బంపర్ ఆఫర్! తమకు నచ్చిన శాఖను ఎంచుకోవచ్చు

అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌లో మహిళా పోలీసులకు ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. వారు తమకు నచ్చిన శాఖను ఎంచుకోవచ్చు.. హోం శాఖలో పనిచేయాలనుకుంటున్నారా, లేక మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలనుకుంటున్నారా అని వారే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం మహిళా పోలీసుల ఇష్టానికే ఈ అవకాశం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 13,500 మంది మహిళా పోలీసులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. రెండు రోజుల్లో ఈ వివరాలు వస్తాయి.. ఆ తర్వాత పదోన్నతుల మార్గాన్ని ఖరారు చేస్తారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు విధులు ఎలా కేటాయించాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే ఈ అంశంపై చర్చించింది. ముఖ్యంగా, మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారికి పదోన్నతులు ఎలా కల్పించాలి అనే అంశంపై అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఈ మేరకు దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపారు. త్వరలోనే ఈ అంశాలపై క్లారిటీ రానుంది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీసుల్ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే మహిళా పోలీసుల అంశంపై చాలాకాలం వివాదం నడిచింది. మహిళా పోలీసుల్ని హోంశాఖ పరిధిలోకి తీసుకెళ్లి వారికి కూడా పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో మహిళా పోలీసులకు ఎలాంటి విధులు అప్పగించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. మహిళా పోలీసుల్ని హోంశాఖలో కానీ, మహిళా శిశు సంక్షేమ శాఖలో కానీ పనిచేసేలా ఆప్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సర్కార్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. మరి ప్రభుత్వం మహిళా పోలీసులకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకున్న వారికి పదోన్నతులు ఎలా అన్నది చూడాలి.

సత్యసాయి

రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.

అమడగూరు: విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే నేడు (బుధవారం) శ్రీ మహాచండి సింహాసనం రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడిన చిన్నారులు

బతుకమ్మ సందర్భంగా, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ గౌరమ్మను కొలుస్తుంది. ప్రకృతిని పూజించే ఈ పండుగలో చిన్నపిల్లలు పెద్దలతో కలిసి ఆటపాటల్లో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.

తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ కూలీలు!

పున్నమి,తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి పథకం కింద 90 రోజులపాటు పనులు నిర్వహించేందుకు అనుమతిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం ఇస్తున్నారు. 90 రోజులకు గాను వారికి రూ.27,630 వరకు ప్రయోజనం కలగనుంది. బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు, స్లాబ్ నిర్మాణం వరకు 50 పని దినాల్లో నిబంధనల మేరకు పని చేయవచ్చు.

జాతీయ అంతర్జాతీయ

రైల్వేలో 2,570 ఉద్యోగాలు.. అక్టోబర్‌లో దరఖాస్తులు ప్రారంభం

పున్నమి ప్రతినిధి: రైల్వేలో 2,570 ఉద్యోగాలు.. అక్టోబర్‌లో దరఖాస్తులు ప్రారంభం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీలను భర్తీ చేయనుంది. అక్టోబర్ 31న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, IT లేదా సంబంధిత రంగంలో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. CMA పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నేపథ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు అర్హులు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. పూర్తి వివరాలకు RRB అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.