Monday, 4 May 2026

Blog

కాకినాడ

సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు అందజేసిన జ్యోతుల నవీన్.

గండేపల్లి మండలం జెడ్ రాగంపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఫ్యాన్లు జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉండే పేషెంట్లకు అందించే భోజనాన్ని పరిశీలించి పేషంట్ల సహాయకులను ఆహార పదార్ధాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న నవీన్. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మన ప్రాంతంలో సామాజిక అవసరాలను గుర్తించి వాటిని అందించేకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్లు అందించడం జరిగిందని అదేవిధంగా తొందరలోనే ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకుల కు ఉచిత భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, ఆసుపత్రి వైద్యులు ప్రణీత్, పీలా మహేష్, బో దిరెడ్ల సుబ్బారావు, రాయి సాయి, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అష్టాదశ శక్తి పీఠాల నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, 30 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో 18వ వార్షికోత్స వమును పురస్కరించుకొని ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తి పీఠాల వద్ద అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క అవతార అలంకరణతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా,తొమ్మిదో రోజున దుర్గామాత అలంకారం సందర్భంగా సామూహిక సత్యనారా యణ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పూజల అనంతరం భజన కార్యక్రమం, దాండియా, కోలాటాలు వంటి ఆటపాటలతో భక్తులు భక్తిశ్రద్ధ లతో ఉత్సవాలలో పాలుపంచుకుంటున్నారు.ఈ కార్యక్రమాలలో మహిళలు, మాల స్వాములు, కండువా స్వాములు, బాల స్వాములు, కంకణం స్వాములతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటు న్నారు. ఇట్టి కార్యక్రమం గాంధీ యువజన సమా ఖ్య పాలకమండలి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది.

తిరుపతి

బంగారు పతకం అందుకున్న జీవిత ఖైదు యుగంధర్

శ్రీకాళహస్తి:ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన యుగంధర్ కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి.శిక్ష అనుభవిస్తూనే చదువు మీద ధ్యాసతో యుగంధర్ పోలీసుల సహకారంతో 4 డిగ్రీలు, 3PGలు చేశారు.BA పరీక్షల్లో 8.2 పాయింట్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం పొందడం జరిగింది.అందుకు గాను మంగళవారం హైదరాబాదులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరవిద్య యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవంలో యుగంధర్ బంగారు పతకం మరియు బుక్ ప్రైజ్ అవార్డును అందుకోవడం విశేషం.కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనడానికి ఇదొక నిదర్శనం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విలస ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి

డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, సెప్టెంబర్ 30 అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన విషాదకర బాణాసంచా పేలుడు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఓ కిరాణా షాపులో జరిగిన పేలుడులో కంచర్ల శ్రీనివాసరావు, సీత దంపతులు మృతి చెందిన విషయం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ విషాద ఘటన బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. పేలుడులో గాయపడిన వారి కుమారుడు ప్రదీప్‌కు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తాను హైదరాబాదులో ఉన్నప్పటికీ, ప్రమాద వార్త తెలియగానే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్

అంతర్గత శత్రువులపై విజయం సాధించడమే దుర్గా పూజ పరమార్థం – ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు

మనలో నిగూఢంగా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలపై విజయం సాధించి, దైవత్వాన్ని మేల్కొలపడమే దసరా నవరాత్రి ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని, దుర్గా పూజ పరమార్థమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు ఉద్ఘాటించారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సత్సంగంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ, “శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంత అవసరమో, మానసిక వికాసానికి, అంతర్గత పరివర్తనకు యోగా, ధ్యానం, సుదర్శన క్రియ అంతే ముఖ్యం. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను జయించడానికి సుదర్శన క్రియ ఒక దివ్యమైన సాధనం. ప్రతిరోజూ యోగా, క్రియను అభ్యసించడం ద్వారా ఒత్తిడి లేని జీవితం, మానసిక ప్రశాంతత, మెరుగైన పనితీరు సాధించవచ్చు. తద్వారా మన జీవనశైలిలోనే ఒక సానుకూల మార్పు వస్తుంది” అని వివరించారు. చెడుపై దేవి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ నాడు, మనలోని ప్రతికూల గుణాలపై మనం విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో సాగింది. చౌదరి శ్రీనివాస్, గేదెల ఉమా దేవి, రామ్మోహనరావు, ఠాగూర్ దాస్, దార్లపూడి రవి బృందం సభ్యులు ఆలపించిన భజన గీతాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరికి తబలాపై లక్ష్మణ్ రావు అందించిన వాద్య సహకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సత్సంగంలో డిడిసి సభ్యులు శిల్లా రమేష్, బి.వి. రవిశంకర్, వరదా వెంకట ఆనంద్, మాధవి, ఉమారాణి , సురంగి మోహన రావు, ఉపాధ్యాయులు, ప్రముఖ న్యాయవాది వి. సుధారాణి , నంబళ్ళ కల్పన, వారణాసి సందీప్, దేసూళ సురేంద్ర, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు పూడి శ్రీనివాస్ రెడ్డి, దేసూళ కాత్యాయని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రెండో ప్రమాద హెచ్చరిక జారీ! సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు

సెప్టెంబర్ 30 పున్నమి ప్రతినిధి భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (సెప్టెంబర్ 30) నది నీటిమట్టం 48 అడుగులు దాటి 48.7 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం సుమారు 11 లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. రెస్క్యూ బృందాలు మోహరించాయి. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఖమ్మం

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం… T.Ravinder పున్నమి:ప్రతినిథి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన జిల్లా కలెక్టర్.. 29.09.2025 నుండి ఎన్నికల ప్రక్రియ మొదలైంది.. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో రెండు దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి. 5214 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం… 593 పోలింగ్ లోకేషన్లు గుర్తించాము… ZPTC స్తానాలు మొత్తం ..20 MPTC స్తానాలు మొత్తం…283 MPP స్తానాలు మొత్తం…….20 మొత్తం పురుషుల ఓటర్లు 388243. మహళా ఓటర్లు మొత్తం..414425 థర్డ్ జెండర్ ఓటర్లు..22 జిల్లాలో ఎనిమిది లక్షల రెండు వేల ఆరు వందల తొంబై మంది ఓటర్లు ఉన్నారు… మొదటి ఫేజ్ ఎన్నికల వివరాలు.. 9.10.2025.నుండి 11.10.2025 సాయింత్రం 5గంటల లోపు నామనేషన్ దాఖలు చేయాలు.. నామినేషన్ స్రూటిని ,12.10.2025 ఉపసంహరణ 15.10.025 మద్యహ్నాం 3 గంటల వరకు.. 23.10.2025 సాయింత్రం 5 గంటల వరకు పోలింగ్.. 11.11.2025 తేదీన ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులు

*ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులు.. అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం సీపీ సునీల్ దత్ కు వినతి పత్రం అందజేసిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ గారు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య గారు, కందాళ ఉపేందర్ రెడ్డి గారు, బానోత్ చంద్రావతి గారు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు తదితరులు…*

క్రైమ్

ఐబొమ్మ’ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటాం: హైదరాబాద్ పోలీసులు

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) కొత్త సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేసే ‘IBOMMA’ వెబ్సైట్ నిర్వాహకుడిని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. “అతడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు, విదేశాల్లో ఉండి ఉండొచ్చు,” అని పోలీసులు చెప్పారు. ‘IBOMMA’ చెందిన నలుగురిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వీరు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అంతర్రాష్ట్ర పైరసీ ముఠాను పట్టుకున్నారు.

ఖమ్మం

ఎమ్మెల్సీ తాత మధు కామెంట్స్

ఖమ్మం జిల్లా… ఎమ్మెల్సీ తాత మధు కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం లో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమలయపాలెం మండలం లో వేదింపులు మితిమీరాయన్నారు… వేధింపులు తట్టుకోలేక తిరుమలయపాలెం మండల బిఅరెస్ నాయకుడు రవి ఆత్మహత్య యత్నం చేసాడన్నారు.. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు ఉండేదన్నారు… కానీ నేడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డర్ లో కొట్టుకున్నట్లు కొట్టే పరిస్థితి.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నాకు ఫోన్ చేస్తే చెప్పాను ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని చెప్పా, లేకుంటే లా అండ్ ఆర్డర్ తప్పుతుందని అయిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు… స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు మీద దాడి చేస్తే ఫిర్యాదు చేస్తేనే వారి పై కేసులు నమోదు చేయలేదు.. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ తీరు ఇలానే ఉంది, అభివృద్ధి నీ పక్కన పెట్టీ బిఆర్ఎస్ కార్యకర్తల పై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.