Monday, 4 May 2026

Blog

E-పేపర్

*గన్నవరంలో భవానీలకు పులిహోర,మజ్జిగ పంపిణీ*

గన్నవరం, సెప్టెంబర్ 30 ( పున్నమి ప్రతినిధి సురేష్ ) కృష్ణాజిల్లా, గన్నవరం పట్టణంలో జాతీయ ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటున్న పైడి పవన్ బాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం భవానీ దీక్షాపరులకు, భక్తులకు పులిహోర, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గన్నవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు దండమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ., రాష్ట్రంలోని నలుమూలల, ఎక్కడెక్కడ నుంచో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీక్ష పూనుకొని,కాలినడకన ప్రయాణించి అమ్మవారి మొక్కులు చెల్లించే భక్తులకు దాహార్తిని తీర్చడం చాలా తృప్తిగా ఉందని, రానున్న రోజుల్లో అమ్మవారి దయ ఉంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా,భక్తితో నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎలక్ట్రీషియన్ తిరుక్కవళ్ళూర్ హరికృష్ణ, భవానీ దీక్షాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

భక్తి

విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనక దుర్గ అమ్మ వారి పురాణం.

పున్నమి ప్రతినిధి శ్రీ అమ్మవారి స్ధల పురాణం విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి, పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, శ్రీ కృష్ణ రూపిణి అయిన కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్ఫాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధాలైనాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందటం చేత జయవాడ అని పేరున్నదని ఒక ఇతిహాసమున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్నిచోట్ల చెప్పబడినది. పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరీ! కలియుగమ్లో జనులు అనేక పాప చింతనలతో ధర్మమార్గం తప్పి చరిస్తారు. కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పుమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువ బడుతున్నది. కొంతకాలనికి కలియుగం పాప భూయిష్టం కాగా ఆ పాప పరిహారార్ధం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ వుంచాలని ఇంద్రాది దేవతలను హారి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి సహ్యమునీ నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విఘ్ణవే భూమిని ఉద్భవించటానికి విఘ్ణరూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్ట ప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విఘ్ణవును విఘ్ణ స్వరూపిణి అయిన కృష్ణను షోఢశోపచారాలతో పూజించాడు. దేవతలారా! నేను శ్రీ మహా విఘ్ణవు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతోపాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకొని వచ్చారు. నా జన్మతరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్జానాలను పొందుతాను. హే విష్ణూ! కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్ధుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునీంద్రా నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివశిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపకారం అయింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరమిచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో వున్న నీమీద (సహ్యాద్రి మీద) నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్ఫాలతోనూ అర్చించాడు. శ్రీ మహ విష్ణువు శ్వేతాశ్వత్ధ వృక్షంగా (తెల్ల రావి చెట్టుగా) సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావిచెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవళాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మ గిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావిచెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల(ఉసిరి) చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం (నారాయణుడు) కృష్ణ గానూ ఆమలక వృక్షం (ఈశ్వరుడు) వేణి గానూ ఒకదానితో ఒకటి కలసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విఘ్ణ పురాణంలో చెప్పబడినది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకూ గంగతో సమానమనీ, భగవత్ నిలయమైన శస్య శ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమనీ ప్రసిద్ధి చెందినది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది. సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైనది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణీ నది తనకు దారి ఇమ్మని కీలుని కోరినది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహా వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలచినది. ఈ రెండు క్రోసులదూరమును ఫల్గున తీర్ధమనీ, ఆ కొండ ముక్కకు తేలుకొండ (తేలిన కొండ) అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమలకుదురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము (మంగళగిరి) వరకు వ్యాపించివున్నది. దుర్గా దేవి కుడికన్ను సూర్యుడు. ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింబవళ్ళకు నడిమీ సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మహాత్యము, అనుగ్రహము మనకు తెలుస్తున్నవి. విజయవాడ మాధవ శర్మ పాలనలో వున్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షణా నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలురిద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మొనరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగ రాజుల పాలనలో ఉన్నది. కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీ పతి పండితయ్య. ఆయన తాను కాంశీపుర వాసిననీ అయిననూ విజయవాడ మల్లిఖార్జున పాదపద్మారాధకుడననీ చెప్పుకున్నావాడు. శివ తత్వసారమనే మహా గ్రంధకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమ భక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవటం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు. అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను ( త్రినేత్రుడైన శివుని) ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వ్రేలాడ కట్టి, నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకొంటూనే ఉన్నాడు. ఆ కాలంలో వేంగీ రాజు అనంతపాలుని పాలనలో ఉన్నది నగరం. అంతట ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువుమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈ నాటికీ జమ్మిదొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆ నాడు పండితయ్య నిప్పును వ్రేలాడదీసిన శమీ వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది. వేప చెట్టు మహాలక్ష్మీ. రావి చెట్టు విఘ్ణవు. శమీ వృక్షం (జమ్మిచెట్టు) శివ శకైక్య స్వరూపం. ఆ శమీ వృక్షం ఆదిపారాశక్తి అంశ వనదుర్గ. ఆమే రూపుదాల్చిన కుండలీని శక్తి. వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగ (సర్ప)రూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాల స్వరూపం. శమీ వృక్షం వనదేవత. శుభకర తరువు. సంతాన ప్రదాయిని. సర్వశత్రు వినాశిని. పుత్రదం సర్వ పాపఘ్నం సర్వ శత్రు వినాశకం అని శమీ వృక్షం చెప్పబడినది. బ్రహ్మ విఘ్ణవు మొదలైన దేవతల చేత ఆవరించబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే రక్షించబడుతూ ఉంటుంది. వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం మహా మాయా సంపద కలది. అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీ వృక్షం మీద దాచిపెట్టి వనదేవతారూపిణి అయిన వనదుర్గనిలా ప్రార్థించాడు. విషస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనుపింప చేయమని కోరాడు. చిత్త క్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశక్తి. శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీ తరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాత వాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకొనే విధంగా శాశించు తల్లీ అని వన దేవతా రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని దాటి రాకుండా చూడుమని అర్థించాడు. శమీ వృక్షం శివ శకైక స్వరూపం కనుకనే మహా దేవ శక్తి పాశు పతాస్త్రాన్ని ధరించి భరించింది. నాటికీ, నేటికీ శమీ పూజ పార్వేట వాడ వాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే వున్నది. ఎందుకనగా గ్రామ దేవతా మూర్తులు లేని మరుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమీ వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగయుగాలుగా చాటిన సత్యం. దేవీ దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు

తూర్పు గోదావరి

*అక్టోబర్ 4, 5 తేదీల్లో బ్రెజిల్ ప్రతినిధుల బృందం తూర్పు గోదావరి పర్యటన

*అక్టోబర్ 4, 5 తేదీల్లో బ్రెజిల్ ప్రతినిధుల బృందం తూర్పు గోదావరి పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చి పెడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు . బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారత్దేశం లో జరుగుతున్న G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంతో ఈ పర్యటన ప్రత్యేకంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు. బ్రెజిల్ నుండి వచ్చిన ఈ బృందానికి Mrs. వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహించగా, Mr. సాండ్రో స్కూజా డ సిల్వా (UNICAFES), Mrs. జాయిస్ అపరెసిడా లోప్స్ (UNICRAB) ముఖ్య ప్రతినిధులుగా వ్యవసాయ విధానాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్నారనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పర్యటనలో 27 మంది సభ్యులు పాల్గొననున్నట్లు తెలియ చేశారు. *మొదటి బృందం పర్యటన వివరాలు:* అక్టోబర్ 4: పెరవలి మండలం, ముక్కామల గ్రామం అక్టోబర్ 5: కొవ్వూరు మండలం కాపవరం, దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామాలు → ఈ బృందానికి సమన్వయ అధికారులు జకీర్ మరియు మధు మోహన్, వీరితో పాటు ఇతర సాంకేతిక, కమ్యూనికేషన్ విభాగాల సిబ్బంది ఉంటారు. *రెండవ బృందం పర్యటన వివరాలు:* అక్టోబర్ 4: కొవ్వూరు మండలం కాపవరం అక్టోబర్ 5: దేవరపల్లి మండలం కూరుకురు, పల్లంట్ల, యర్నగూడెం గ్రామాలు → ఈ బృందానికి సమన్వయ అధికారులు సుధాకర్ మరియు హుమాయూన్, అనుబంధ సాంకేతిక బృందం, కమ్యూనికేషన్ విభాగం అధికారులు కూడా తోడ్పడతారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్ని విభాగాధికారులు పరస్పర సమన్వయం చేసుకుని ఈ పర్యటన విజయవంతం అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా బృందాలు 4, 6 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించనున్నట్లు తెలిపారు.

తూర్పు గోదావరి

వీధి కుక్కలకు ఆపరేషన్ల కోసం ఒక సౌకర్యాలు పెంచాం

వీధి కుక్కలకు ఆపరేషన్ల కోసం అదనపు సౌకర్యాలు పెంచాం – కూటమి వచ్చిన 14నెలల్లోనే 10,293 ఆపరేషన్లు అయ్యాయి – వైసిపి నాలుగేళ్లలో 12,100 ఆపరేషన్లే చేసారు – వైసిపి హయాంలో కెపాసిటీ ఎందుకు పెంచలేదు – ప్రజల ఆరోగ్యం, సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు – వీధి కుక్కలు గురించి కామెంట్లు తప్ప పరిష్కారం ఎందుకు చూపలేదు – కూటమి అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో – స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో వ్యాక్సినేషన్ – వచ్చే ఏడాదిలోగా కెపాసిటీ మరింత పెంచి వ్యాక్సినేషన్, ఆపరేషన్లు పూర్తిచేస్తాం – ఊరిపట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లే మూగజీవాల పట్ల నాకు బాధ్యత ఉంది – ఏబీసీ సెంటర్ పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడి కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్కతేల్చి , వాటికి ఆపరేషన్లు చేయడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్ర వరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రాజమహేంద్ర వరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ లో వసతులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు. ఏబీసీ సెంటర్ లో సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం వలన కుక్కలు బయటకు వెళ్ళిపోవడం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వాసు అన్నారు. పనిచేసే అధికారులున్నా సరే, సరిగ్గా వినియోగించు కోలేదని ఆయన వాపోయారు. ఏబీసీ సెంటర్ లో వైసిపి హయాం నాలుగేళ్లలో 12,100 ఆపరేషన్లు జరిగితే, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాంతాలవారీగా అధికారులకు బాధ్యతలు ఇచ్చి లెక్కలు తేల్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. సిటీలోని 50వార్డుల్లో మొత్తం 29వేల 91కుక్కలు ఉన్నాయని తేల్చి, సౌకర్యాలు పెంచి, వేగంగా ఆపరేషన్లు చేసినట్లు ఆయన వివరించారు. ఫలితంగా ఈ 14నెలల్లో మొత్తం 10,293 ఆపరేషన్లు అయ్యాయని ఆయన తెలిపారు. గతంలో నెలకు సగటున 300ఆపరేషన్లు అయితే ఇప్పుడు నెలకు 850అవుతున్నాయని ఆయన తెలిపారు. ఇంకా 18,860కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని తెలిపారు. మరి వైసిపి హయాంలో ఎందుకు శ్రద్ధ వహించలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఊహించుకుంటే అర్ధం అవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇప్పుడు వైసిపి వాళ్ళు అవిగో కుక్కలు, అదిగో పిల్లల మీదికి పోతున్నాయి, అదిగో రోడ్లమీదికి వెళ్లిపోతున్నాయి అని చెబుతున్నారే గానీ పరిష్కారం చూపించగలిగారా అని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. ఈజీవుల అంశం కేంద్ర పరిధిలో ఉన్న అంశమని, వీటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం మన చేతుల్లో ఉన్నపని అని గుర్తించి అధికారంలోకి వచ్చినవెంటనే చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. అధికారుల సహకారంలో కెన్నెల్స్ పెంచి, ఆపరేషనలు పెంచామని ఆయన తెలిపారు. స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ వేస్తున్నారని ఎమ్మెల్యే వాసు చెప్పారు. కొవ్వూరు , నిడదవోలు ప్రాంతాల్లో కూడా కుక్కలను ఇక్కడికి తీసుకొస్తున్నారని, ప్రతీ కెన్నెల్ కి ఎక్కడి నుంచి తెచ్చారో బోర్డు కూడా పెట్టారని ఆయన చూపించారు. ప్రస్తుతం రోజుకి 30,40అవుతున్నాయని, వచ్చే ఏడాదిలో కెపాసిటీ 50కి పెంచి , నగరంలో ఉన్న కుక్కలన్నింటికీ వ్యాక్సినేషన్, ఆపరేషన్లు పూర్తిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అవగాహనతో కమిట్మెంట్ తో చేస్తామన్నారు. ఊరు పట్ల, ప్రజల పట్ల బాధ్యత ఉన్నట్లే మూగజీవాల పట్ల కూడా తనకు బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేసారు. రాత్రికి రాత్రి అద్భుతాలు చేయలేమని చెప్పానని, రెండేళ్లలో కంట్రోల్ చేస్తామని అన్నానని, 14నెలల స్టాటిస్టిక్స్ చూస్తే ఎంతమేరకు చిత్తశుద్ధితో పనిచేశామో తెలుస్తుందని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏబీసీ సెంటర్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్

దుర్గాదేవిగా విజయదుర్గ అమ్మవారు

సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ సాయినగరు లోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా 9వ రోజు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.విగ్రహ దాత పుత్తా రామభద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.అర్చకులు అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పి ఆర్ బి హ్యాండ్లూమ్ అధినేత పుత్త రామభద్రయ్య కుమారులు,పుత్తా బాబు,నాగభూషణం ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి ఉత్సవాలు వై బోవహితంగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక కోలాటాలు వచ్చిన భక్తులకు ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు.దసరా వేడుకల్లో అమ్మవారిని కొలిచిన భక్తులకు,సకల భోగ్యాలు అనుగ్రహం ఉంటుందని అమర్నాథ్ శర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

E-పేపర్

**ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రైవేటు పరం చేయవద్దు: మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిరసన.**

మచిలీపట్నం : సెప్టెంబర్ 30 పున్నమి ప్రతినిధి సురేష్ మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ మచిలీపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలను మరియు హాస్పిటల్‌ ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ పిలుపు మేరకు నేడు (తేదీ) మచిలీపట్నం పట్టణంలో ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. లక్ష్మీపురం సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటు పరం అయితే పేద ప్రజలకు వైద్యం భారమవుతుందని, విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను, ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

యాదాద్రి భువనగిరి

*లక్కీ డ్రా 500 రూపాయలకే సింగిల్ రూమ్ ఉన్న ఫ్లాట్*

వ్యక్తి తన ఇంటి స్థలం విక్రయానికి చేసిన యోచనను చూసి.. ఔరా! అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో రేకుల గదితో సహా 66 గజాల ఇంటి స్థలం అమ్మకానికి లక్కీడ్రా పద్ధతి పెట్టారు ఆ యజమాని.కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీ డ్రా లో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన, ఆ ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టారు.అయితే స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం,గది విలువ రూ.16 లక్షలు ఉందని 3,000 కూపన్లు ముద్రించానని వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని కోరారు.నవంబర్ 2న లక్కీడ్రా తీస్తా అని తెలిపారు.ఏడాదిన్నర క్రితం ఈ ఇంటిని అమ్మకానికి పెట్టానని సరైన ధర రాలేదని తెలిపారు.నేను కట్టుకున్న మరో ఇంటికి నవంబర్ లో డబ్బులు చెల్లించాలని దీంతో తప్పక ఈ మార్గాన్ని ఎంచుకున్నా అని చెబుతున్నారు. అది చట్టబద్ధం కాకున్నా..ఆలోచన కొత్తగా ఉందని స్థానికులు అంటున్నారు.

తూర్పు గోదావరి

గండిపోచమ్మ ఆలయం వద్ద దాతలసహకారంతో అన్నసమారాదన

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్30) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో వేంచేసిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయ ట్రస్టీ చైర్మన్ సుంకవల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల మొదలు కొని దాతల సహకారంతో ప్రతీరోజూ సుమారు 400 మందికి అన్నసంతర్పణ చేస్తున్నారు, ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధిచెందారు,కోర్కెలు తీరిన భక్తులు మ్రొక్కుబడులు తీర్చుకొనేందుకు ఆదివారం, మంగళవారాల్లో ఎక్కువగా వస్తూ ఉంటారని,ఈ ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు.

జోగులాంబ గద్వాల

ఏపీ ప్రభుత్వం తరఫున జోగులాంబకు పట్టు వస్త్రాల సమర్పణ.

అలంపూర్ : అక్టోబర్ 30 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఐదో శక్తిపీఠం జోగులాంబ దేవికి మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల్లో జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కలెక్టర్ తెలిపారు.

అన్నమయ్య

బుడిగుంటపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

కోడూరు మండలం బుడిగుంటపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, తన సతీమణి ముక్కా వరలక్ష్మితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వేదపండితులు ముక్కా దంపతులను పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముక్కా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలి” అని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.